డాట్సన్ గో క్రాస్ కాన్సెప్ట్ ను 2016 ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు
డాట్సన్ గో క్రాస్ కోసం saad ద్వారా ఫిబ్రవరి 04, 2016 03:22 pm ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
డాట్సన్ వారి మొదటి క్రాసోవర్ గో క్రాస్ ను ఆటో ఎక్స్పో లో ప్రదర్శించారు. ఈ వాహనం జపాన్ లోని టోక్యో ఇంటర్నేషనల్ మోటార్ షోలో తొలిసారి ప్రదర్శితం అయ్యింది. సంస్థ యొక్కMPV గో ప్లస్ విధానం మీద ఈ కాన్సెప్ట్ ఆధారపడి ఉంది.
ఈ డాట్సన్ వాహనన్ని సమగ్రంగా చూసినప్పుడు కారు రూపు రేకలు మీద ఎక్కువ శ్రద్ధ ఉంచినట్లు తెలుస్తుంది. కారు ముందరి భాగంలో యాంగులర్ గా అమర్చిన హెడ్ల్యాంప్ లు మరియు గుండ్రంగా ఉన్న ఫాగ్ ల్యాంప్ లు స్కోడా ఏతి ఫేస్లిఫ్ట్ ని తలపిస్తాయి. అయితే ఇది కేవలం కాన్సెప్ట్ అవ్వడం చేత నిజమైన రూపు రేఖలు కొద్దికొద్దిగా బహిర్గతం అవ్వవచ్చు. పూర్తిగా బ్లాక్ బాడీ ని కలిగిన తీరు ద్వారా ముందర మరియు వెనుక భాగం ఉండబోతుంది.
కారు అంతర్భాగం ఒక స్పోర్టీరిర్ లుక్ తో ఉండబోతుంది. అంతేకాకుండా ఇందులో టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ, క్లైమేట్ కంట్రోల్ మరియు డిజిటల్ డ్రైవర్ సమాచారవ్యవస్థ ఇందులో ఉంటాయి. ప్రవేశపెట్టినప్పుడు ఈ కారు 5 సీట్లు మరియు 7 సీట్ల ఎంపికలో ఉంటాయి.
సామర్ధ్యం విషయానికి వస్తే ఒక 3 సిలెండర్ 1.2 లీటర్ పెట్రోల్ ను కలిగి ఉంటుంది. డీజిల్ వాహనంలో ఇది 1.5 లీటర్ dCi మోటార్ ను కలిగి రెనో డస్టర్ లో అమర్చిన ఎంపికలతో ఇది ఉండబోతుంది.
ఈ కారు రూ. 7 నుండి 11 లక్షల మధ్య ఉండవచ్చని ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ వాహనం ధర పరంగా, లక్షణాల పరంగా సమగ్రంగా అందినట్లైతే హ్యుందాయి క్రెటా, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మహీంద్రా టియువి 300 లకు ధీటుగా రాణించబోతుంది.