నిర్ధారణ: ఫోర్డ్ ఈకోస్పోర్ట్ విడుదల క్రిస్మస్ కి ముందే
ఫోర్డ్ ఎకోస్పోర్ట్ 2015-2021 కోసం manish ద్వారా సెప్టెంబర్ 28, 2015 02:39 pm ప్రచురించబడింది
- 14 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
అమెరికన్ కారు తయారీదారి అయిన ఫోర్డ్ వారు భారతదేశంలో వారి ఈకోస్పోర్ట్ ఎస్యూవీ యొక్క వాయిదాని విడుదల చేయడానికి సిద్దం అయ్యారు. ఈ క్రిస్మస్ కి విడుదల ఉండగా, తాజా వార్తల ప్రకారం ఇంకా ముందుగానే విడుదల అవుతుంది అని అంచనా. సాంకేతికతలతో పాటుగా ఇతర లక్షణాల పునరుద్దరణ కూడా ఉండవచ్చును.
కొత్త పునరుద్దరణ చెందిన మోడలు యొక్క ముఖ్యాంశాలలో 100 PS 1.5-లీటర్ TDCi డీజిల్ యొక్క వేరియంట్ ప్రవేశం ఒకటి. ఫోర్డ్ ఆస్పైర్ మరియూ ఫోర్డ్ ఫీగో లోని ఇంజిను ఇతర మోడల్స్ కి కూడా అందించనున్నారు. ఈ ఇంజిను ARAI ఇంధన సామర్ధ్యం 25.83 Kmpl గా ఉంది కానీ మా ఉద్దేశం ప్రకారం, బరువు పెరిగిన కారణంగా సామర్ధ్యంపై ప్రభావం ఉంటుంది అని. ఈ 1.0-లీటర్, 3-సిలిండర్ టర్బో చార్జ్‌డ్ ఈకో బూస్ట్ ఇంజిను ని 6-స్పీడ్ పవర్ షిఫ్ట్ డ్యువల్-క్లచ్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడింది.
రక్షణ విషయంలో, ఫోర్డ్ కి డ్యువల్-ఫ్రంట్ ఎయిర్-బ్యాగ్స్ ప్రామాణికంగా దిగువ శ్రేని వేరియంట్ కి కూడా వస్తాయి. ఇదే విధంగా ఆస్పైర్ కి కూడా వస్తాయి. ఆస్పైర్ కి మరియూ ఫీగో కి ఉన్నట్టుగా ఇందులో కూడా ఉండే ఇతర లక్షణాలు ఏమనగా, 4 అంగుళాల కలర్ డిస్ప్లే మరియూ సింక్ ఇంఫొటెయిన్మెంట్ సిస్టము. రివర్స్ పార్కింగ్ క్యామెరా తో పాటు శాటిలైట్ నావిగేషన్ సిస్టం. ఈ లక్షణం ప్రస్తుతం ఆస్పైర్ లో ఎంపిక గా అందుబాటులో ఉంది మరియూ కొత్త ఈకోస్పోర్ట్ లో కూడా అందించనున్నారు. ఇతర లక్షణాలు పవర్ విండో కంట్రోల్స్, హ్యాండ్ బ్రేక్ లెవర్ మరియూ క్రోము గార్నిష్ గా ఉన్నాయి.