హ్యుందాయ్ క్రెటా Vs రెనాల్ట్ డస్టర్ కు మధ్య పోలిక

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం అభిజీత్ ద్వారా జూలై 14, 2015 11:40 am ప్రచురించబడింది

ఢిల్లీ: హ్యుందాయ్ క్రెటా 21 జూలై న భారతదేశంలోనికి రాబోతున్నది. ఇది డస్టర్ మరియు ఎకోస్పోర్ట్ వంటి వాటికి సమానంగా నిలవగలదు. ఈ డస్టర్ మరియు ఎకోస్పోర్ట్ రెండూ కూడా చాలా కాలం నుండి కాంపాక్ట్ ఎస్ యు వి విభాగంలో చాలా ముఖ్యమైనవి గా నిలుస్తున్నాయి. కాలం మారుతున్నకొలదీ, తయారీదారులు ఈ ప్రత్యేక విభాగంలో కార్లపై మరింత ఆసక్తి చూపిస్తూ క్రెటా వంటి కార్లను రూపొందిస్తున్నారు. అయితే ఇక్కడ డస్టర్ ని మరియు క్రెటా ని పోల్చి చూద్దాం దీని ద్వారా ఏది పైచేయి లో ఉందో తెలుసుకుందాము. 

క్రెటా: తాజా సమర్పణ! 

క్రెటా తో ప్రారంభిస్తే, క్రెటా లో అన్నీ కూడా ఆధునిక అంశాలతో కూడుకున్నవి. డస్టర్ మూడు సంవత్సరాల క్రితం నాటిది. అయితే, డస్టర్ ఇంకా ఎస్ యు వి లానే అనిపించించినా క్రెటా మాత్రం కొద్దిగా హాచ్బాక్ మాదిరిలా కనిపిస్తుంది. ఎకోస్పోర్ట్ కూడా హాచ్బాక్ లా కనిపించినా దాని వెనుక భాగంలో ఉన్న విడి చక్రం వలన కాదు అని తెలుసుతుంది. క్రెటా అనేది హాచ్బాక్ లా కనిపించినప్పటికీ ఇది సబ్ 4 మీటర్ కాదు కాబట్టి ఇది చూసేందుకు డస్టర్ లా అనిపిస్తుంది. క్రెటా హ్యుందాయి యొక్క అధునికమైన అంశాలతో కూడుకున్నటువంటి వాహనం. 

డస్టర్: విశాలమైన అంతర్గత భాగం !

అద్భుతమైన గాలి ఎక్కువగా ఉండే ఎయిరీ కాబిన్ ఉండడం అనేది డస్టర్ యొక్క ప్రయోజనంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఇది అధిక మొత్తంలో కాంతిని లోపలికి అనుమతించి ప్రయాణికులకు సౌకర్యవంతంగా చేస్తుంది. దీనిలో విశాలవంతమైన లెగ్రూం మరియు షోల్డర్ రూమ్ ఉన్నాయి. కాకపోతే కాబిన్ మాత్రం ఆఆశించినంతగా లేదు. అంతేకాకుండా స్విచ్ గేర్ కూడా మరీ యాంత్రికంగా ఉండి మృదువుతనం తక్కువగా ఉంటుంది. దీని అగ్ర శ్రేణి వేరియంట్లో కూడా ఏ.సి డయల్స్ యాంత్రికంగా ఉంటాయి. మరోవైపు, హ్యుందాయి లో కాబిన్ అద్భుతంగా ఉంటుంది. అంతేకాక, సమకాలీన క్యాబిన్ శాంటా ఫే నుండి ప్రేరణ పొంది రూపొందించబడి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

అద్భుతమైన అంశం! 

పనితీరు విషయానికి వస్తే, డస్టర్ 1.5 లీటర్ ఇంజన్ ను కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ అత్యధికంగా 110 PS పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఇది ఒక స్థిరమైన మైలేజ్ తో రహదారులపై ప్రయాణిస్తుంది. అయితే, మొదటిలో సాధారణ పనితీరు కలిగిన టర్బో విజిటి ను మనం గమనించవచ్చు. కానీ, తరువాత మంచి పవర్ ను అందిస్తుంది. వైవిధ్యత విషయానికి వస్తే, డస్టర్ లో ఉండే ఏడబ్ల్యూడి వెర్షన్ ఆఫ్ రోడ్ కెపబిలిటీస్ ను కలిగి ఉంటుంది. కానీ, క్రెటా విషయానికి వస్తే, ఎఫ్ డబ్ల్యూడి వెర్షన్ తో ప్రస్తుతం రాబోతుంది. ఇప్పటికి, క్రెటా, వెర్నా లో ఉండే 1.6 లీటర్ సి ఆర్ డి ఐ ఇంజన్ ను కలిగి ఉండబోతుంది. ఈ విభాగంలో ఉన్నా ఏ ఇతర ఇంజన్ కూడా ఇంత పవర్ ను ఉత్పత్తి చేయదు. ఇంతకీ ఈ ఇంజన్ ఎంత పవర్ ను ఉత్పత్తి చేస్తుందంటే, అత్యధికంగా 127 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2015-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience