సెగ్మెంట్ల మధ్య పోరు: మహీంద్రా మారాజో Vs టాటా హెక్సా - ఏ కారు కొనుగోలు చేసుకోవాలి?
మహీంద్రా మారాజ్జో కోసం dhruv attri ద్వారా జూన్ 17, 2019 12:02 pm ప్రచురించబడింది
- 37 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మహీంద్రా ఒక MPV అయినప్పటికీ, హెక్సా ఒక SUV వలె ప్రచారం చేయబడుతుంది, అయితే ఈ రెండిటిలో ఏది మనకి మంచి విలువను అందిస్తుంది?
మహీంద్రా మారాజ్జో యొక్క ప్రారంభ ధర రూ. 10 లక్షల వద్ద మొదలయ్యి, టాప్ వేరియంట్ కోసం రూ. 13.9 లక్షలు(ఎక్స్-షోరూం, డిల్లీ) వరకు పెరిగాయి. ఈ ధర పరిధిలో, కొన్ని వేరియంట్స్ టాటా హెక్సా యొక్క ధరతో దగ్గరగా ఉంటాయి. కానీ మీరు ఒక 7-సీటర్ కోసం మార్కెట్ లో ఉంటే, మీరు ఈ రెండిటిలో దేనిని ఎంచుకోవాలి? మీ డబ్బు కోసం ఉత్తమమైన విలువను ఏది అందిస్తుందో మేము సమాధానం ఇచ్చాము. కాని ఆ వివరాలలోనికి వెళ్ళే ముందు, రెండిటి మధ్య ప్రధాన వ్యత్యాసాల గురించి తెలుసుకుందాము.
మహీంద్రా మారాజ్జో |
టాటా హెక్సా |
పూర్తి MPV: మారాజ్జో దాని శరీర ఆకృతి మరియు అది పనిచేసే ఉద్దేశ్యంతో ఒక విశాలమైన MPV గా ఉంది. |
SUV లక్షణాలతో ఉన్న MPV: హెక్సా ప్రస్తుతం ఆరియా ప్లాట్ఫారమ్ పై ఆధారపడవచ్చు, కానీ టాటా దీనిని ఒక SUV గా పేర్కొంది మరియు ఇది ఎక్కువగా వాడని రోడ్డులపై కూడా సులభంగా వెళ్ళే విధంగా ఉండే కారు. |
మృదువైన రైడ్: మహీంద్రా యొక్క రైడ్ టాటా కంటే మృదువైనది మరియు ఇది చాలా బంప్స్ ని కూడా తనలో కలుపుకొని మనకి తెలియనివ్వదు. |
గట్టిగా ఉంటుంది కాని అసౌకర్యంగా లేదు: హెక్సా కారు యొక్క సస్పెన్షన్ గనుక చూసుకున్నట్లయితే గట్టిగా అమర్చబడి ఉంటుంది, కానీ అంత అసౌకర్యంగా అయితే ఉండదు. చెడు రహదారులు మీద ఉండే అనుభూతి లోనికి వినిపిస్తుంది కానీ గట్టి సస్పెన్షన్ మూలాన కార్నర్స్ లో మరింత ఆత్మవిశ్వాసంతో వెళ్ళగలదు. |
కేవలం ఒక పవర్ట్రెయిన్: మహీంద్రా మారాజ్జో 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి FWD కాన్ఫిగరేషన్ లో 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ తో మాత్రమే అందుబాటులో ఉంది. |
మల్టిపుల్ డ్రైవ్ ట్రైన్స్: హెక్సా లో 2.2 లీటర్ వెరికోర్ డీజిల్ ఇంజిన్ రెండు వివిధ ట్యూన్ లలో అందుబాటులో ఉంది, రెండూ కూడా మారాజోస్ కంటే శక్తివంతమైనవి. అదనంగా, ఇది ఆటోమేటిక్ గేర్బాక్స్ ఎంపికను కూడా పొందుతుంది. ఇది 4X4 ఆఫ్ రోడ్ సెటప్ డ్రైవ్ రీతులతో కూడా అందించబడుతుంది. |
ప్రత్యర్ధులు: ప్రత్యక్ష ప్రత్యర్థులు లేరు |
ప్రత్యర్ధులు: మహీంద్రా XUV500 |
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ
మహీంద్రా మారాజ్జో |
టాటా హెక్సా |
M2: రూ. 9.99 లక్షలు |
|
M4: రూ. 10.95 లక్షలు |
|
M6: రూ. 12.40 లక్షలు |
XE: రూ. 12.57 లక్షలు |
M8: రూ. 13.90 లక్షలు |
XM: రూ. 14.19 లక్షలు |
XMA: రూ. 15.43 లక్షలు |
|
XT: రూ. 16.64 లక్షలు |
|
XTA: రూ. 17.80 లక్షలు |
|
XT 4X4: రూ. 17.97 లక్షలు |
వేరియంట్స్
మహీంద్రా మరాజ్జో M6 Vs టాటా హెక్సా XE
సరైన పోలిక కోసం, మేము ఒకే ధరతో కూడిన వేరియంట్స్ ని ఉంచాము (ధర వ్యత్యాసం)
మహీంద్రా మార్జోజో M6 |
రూ. 12.40 లక్షలు |
టాటా హెక్సా XE |
రూ. 12.57 లక్షలు |
తేడా |
రూ. 17,000 (హెక్సా ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు:
లైట్స్: ఫాలో-మీ-హోమ్ ఫంక్షన్ తో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్
ఇంఫోటైన్మెంట్: నాలుగు స్పీకర్లు, మల్టీ-కలర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో 2-DIN ఆడియో యూనిట్
సౌకర్యాలు:
అన్ని పవర్ విండోస్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs, ముందు మరియు రెండవ వరుస రీడింగ్ ల్యాంప్స్, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, ముందు వరుసలో 12V పవర్ అవుట్లెట్, ముందు మరియు రెండవ వరుస ఆర్మ్రెస్ట్, 8-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, మాన్యువల్ A.C వంటి లక్షణాలు ఉన్నాయి.
భద్రత: EBD తో ABS, డ్యుయల్ ఎయిర్ బాగ్స్, అన్ని వీల్స్ కి డిస్క్ బ్రేక్లు మరియు వెనుక ఫాగ్ లాంప్స్
హెక్సా పై మరాజ్జో ఏమిటి పొందుతుంది: కార్నరింగ్ ఫంక్షన్ తో హెడ్ల్యాంప్స్, బాడీ కలర్ ORVM లు మరియు డోర్ హ్యాండిల్స్ మరియు అల్లాయ్ వీల్స్. లోపల భాగంలో ఇది 4 స్పీకర్స్, GPS, బ్లూటూత్, USB, 1GB అంతర్గత మెమరీ, ఆండ్రాయిడ్ ఆటో మరియు మరిన్ని కలిగిన 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ ని పొందుతుంది. హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, రెండవ వరుసలో 12V పవర్ అవుట్లెట్, సన్ గ్లాస్ హోల్డర్ మరియు టాంబర్ డోర్ స్టోరేజ్. భద్రతా లక్షణాలలో వెనుక పార్కింగ్ సెన్సార్, ఎమర్జెన్సీ కాల్, ఓవర్ స్పీడ్ వార్నింగ్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, వెనుక డిఫేజర్, ఇంపాక్ట్ మరియు స్పీడ్ సెన్సింగ్ డోర్ లాక్స్, ISOFIX, రిమోట్ కీలెస్ ఎంట్రీ మరియు మార్జోజోకు ప్రత్యేకమైన కన్వర్జేషన్ మిర్రర్ ఉంది.
మరాజ్జో పై హెక్సా ఏమిటి అందిస్తుంది:
కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఇంజిన్ డ్రాగ్ టార్క్ కంట్రోల్ ఫీచర్, LED టెయిల్ లైట్స్, క్రోమ్ పూత ఎగ్సాస్ట్ మరియు కూలెడ్ గ్లోవ్ బాక్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది.
- తీర్పు: హెక్సా పై మరాజ్జో లో చాలా అధనపు లక్షణాలు ఉండడం వలన ఇది స్పష్టంగా కొనుగోలు చేసే విధంగా ఉంటుంది.
- హెక్సా మూడు అదనపు లక్షణాలను పొందుతుంది, కానీ వాటిలో ఏవీ అంత అద్భుతంగా ఉండవు. మారాజ్జో కారు కోసం వెళ్లి, రూ.17,000 సేవ్ చేసుకోమని మేము సలహా ఇస్తాము.
మహీంద్రా మారాజ్జో M8 vs టాటా హెక్సా XM
మహీంద్రా మారాజ్జో M8 |
రూ. 13.90 లక్షలు |
టాటా హెక్సా XM |
రూ. 14.19 లక్షలు |
తేడా |
రూ. 29,000 (హెక్సా ఖరీదైనది) |
సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్స్ లో):
ఇంఫోటైన్మెంట్ : స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో మరియు టెలిఫోనీ నియంత్రణ, USB, AUX- ఇన్, బ్లూటూత్ కనెక్టివిటీతో టచ్స్క్రీన్ యూనిట్ మరియు మెసేజ్ రీడ్అవుట్ తో వాయిస్ కమాండ్.
సౌకర్యాలు: డ్రైవర్ వైపు ఎక్స్‌ప్రెస్ అప్ / డౌన్ తో అన్ని పవర్ విండోస్, వెనుక డీఫాగర్, వైపర్ మరియు వాష్, రిట్రాక్టబుల్ రెండవ వరుస సన్ బ్లైండ్స్.
భద్రత: పార్కింగ్ సెన్సార్లు
హెక్సా పై మరాజ్జో ఏమిటి అందిస్తుంది: డే టైం రన్నింగ్ ల్యాంప్స్, పవర్-ఫోల్డింగ్ అవుట్‌సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మూడవ వరుస రీడింగ్ ల్యాంప్, రెండు అదనపు కప్ హోల్డర్స్ మరియు వెనుక పార్కింగ్ కెమెరా.
మరాజ్జో మీద హెక్సా ఏమిటి పొందుతుంది: డ్రైవింగ్ మోడ్లు మరియు పరిసర లైటింగ్
తీర్పు: మరాజ్జో యొక్క టాప్ వేరియంట్ రూ. 29,000 తక్కువ మరియు మరిన్ని లక్షణాలను అందిస్తుంది. దీని టచ్స్క్రీన్ యూనిట్ కూడా చాలా అధునాతనమైనది మరియు మెరుగుపరుచుకునే అనుభవానికి లాభదాయక అభిప్రాయాన్ని కలిగి ఉంది. ఈ రెండిటిలో మాహీంద్రా అనుకూలంగా ఉంది.
ఎందుకు మహీంద్రా మరాజ్జో ని కొనుగోలు చేయాలి?
మరింతగా ఇష్టపడే క్యాబిన్: మరాజ్జో కారు దాని వాహనాల్లో ఇప్పటి వరకూ ఎక్కువగా కొనుక్కున్న వాహనాలలో ఒకటిగా ఉందని మహీంద్ర సంస్థ తెలిపింది. హెక్సా కాగితంపై పొడవైన వీల్ బేస్ ని కలిగి ఉండవచ్చు, కానీ మరాజ్జో బాగా ఉపయోగపడే క్యాబిన్ ని కలిగి ఉంటుంది, ఇది మరింత ఉపయోగపడే సీటింగ్ స్థలాన్ని అందిస్తుంది. దాని రూఫ్-ఇంటిగ్రేటెడ్ ఎయిర్-కండిషనింగ్ యూనిట్ కూడా క్యాబిన్ ని మూడవ వరుస వరకూ కూడా చల్లబరుస్తుంది.
ఎందుకు టాటా హెక్సా కొనుగోలు చేసుకోవాలి?
బహుళ డ్రైవ్ ట్రైన్ ఎంపికలు
మీరు అరుదుగా కొన్ని కఠినమైన రహదారులను అధిగమించాల్సిన అవసరం ఉంటే, హెక్సా మీ ఎంపికగా ఉండాలి. ఇది ఒక 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అలాగే ఒక 4X4 ఎంపికను పొందుతుంది. ఇది డ్రైవ్ మోడ్స్ ని కుడా పొందుతుంది మరియు అలాగే ఇది టార్క్ ఆన్ డిమాండ్ ఫీచర్ ని కూడా పొందుతుంది, దీని వలన కఠినమైన రహదారులను అధిగమించడానికి బాగా ఉపయోగపడుతుంది.
దృఢమైన లుక్స్
ఎదుర్కొందాము, మహీంద్రా మారాజ్జో కంపెనీ ప్రకారం షార్క్ స్ఫూర్తిని కలిగి ఉండవచ్చు, కానీ దీని వైఖరి హెక్సా యొక్క దృఢమైన విధంగా ఎక్కడా లేదు. కొలతలు కూడా ఖచ్చితంగా అదే విషయాన్ని చెబుతాయి.