చూడండి : రాబోయే రెనాల్ట్ డస్టర్ కంటపడింది!
రెనాల్ట్ డస్టర్ 2016-2019 కోసం manish ద్వారా సెప్టెంబర్ 21, 2015 04:11 pm సవరించబడింది
- 15 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: కొత్త రెనాల్ట్ డస్టర్ యొక్క చిత్రాలు ఆన్లైన్ లో కంటపడ్డాయి మరియూ ఇది చెన్నై వీధులలో తిరుగుతూ కనపడింది. రెనాల్ట్ డస్టర్ ఫేస్ లిఫ్ట్ పరీక్ష పెద్దగా పరదా లేకుండానే జరుగుతోంది. ఈ కారు జీఎస్టీ రోడ్డు పై డైమండ్ కట్ ఉన్నట్టుగా కనపడే కొత్త అల్లోయ్ వీల్స్ తో కనపడింది.
ఇతర సౌందర్య నవీకరణల విషయానికి వస్తే, ఈ వాహనం షాట్స్ లో మల్టీ స్లాట్ క్రోమ్ గ్రిల్ లేకుండా కనిపించింది. చూస్తుంటే, ఈ వాహనం రెనాల్ట్ యొక్క డైమండ్ లోగో తో పొందుపరచబడియున్న ఒకే స్లాట్ డిజైన్ ని కలిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది. దీని హెడ్ల్యాంప్స్ కూడా నవీకరణను పొంది ఉంది మరియు ప్రస్తుతం బ్రెజిల్లో రౌండ్ గా తయారు చేసే మోడల్ యొక్క స్మృతిగా ఉంటుంది. దీని ముందు భాగంలో అలానే వెనుక భాగంలో కూడా క్లస్టర్ నవీకరణను పొంది ఉంటాయి. 2016 డస్టర్ నవీకరించబడిన టెయిల్ ల్యాంప్స్ తో కూడా అందుబాటులో ఉంటుంది. రెనాల్ట్ సంస్థ అతర్భాగాలలో పరికరాలు చొప్పించడానికి సిగ్గుపడదు దీనికి ఉదాహరణగా మనం రనాల్ట్ క్విడ్ ని తీసుకోవచ్చు. కొత్త డస్టర్ 7 అంగుళాల మీడియా నావిగేషన్ సమాచార వ్యవస్థ, క్రూయిజ్ కంట్రోల్ మరియు బ్లూటూత్ టెలిఫోనీ వంటి లక్షణాలను కలిగి ఉంటుందని ఊహిస్తున్నాము.
ఇంజిన్ల విషయంలో కారులో 1.5-లీటర్ డీసీఐ డీజిలు ఇంజిను కొనసాగుతుంది. దీనికి 85Ps మరియూ 110Ps ఎంపికలు గలవు. ఈ మోటరు 5-స్పీడ్ మరియూ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనుతో జత చేయబడుతుంది. కొన్ని వేదికల ప్రకారం రెనాల్ట్ వారు 6-స్పీడ్ డ్యువల్ క్లచ్ ఈడీసీ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ని ఈ కొత్త మోడలులో అందిస్తున్నారు. ఒక ఇండిపెండంట్ సస్పెన్షన్ ఏడబ్ల్యూడీ సిస్టముని ఉన్నత శ్రేని మోడల్స్ లో అందించే అవకాశం ఉంది.