అద్భుతమైన డిస్కౌంట్ లతో ఈ దీపావళి ని జరుపుకోండి
నవంబర్ 16, 2015 05:27 pm nabeel ద్వారా ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
CarDekho.com, వారి వినియోగదారులు సుఖంగా మరియు సిరిసంపదలతో ఉండాలని దీపావళి శుభాకాంక్షలు తెలుపుతుంది!
దీపావళి అనేది, భారతదేశం యొక్క గొప్ప పండుగలలో ఒకటి. దీనిని అందరూ అత్యంత ఆనందంతో మరియు ఉత్సాహంతో జరుపుకుంటారు. అంతేకాకుండా, ఈ వేడుకలో మరింత ఉత్సాహాన్ని జోడించడానికి, ఆటోమేటివ్ బ్రాండ్లు అనేక ఆఫర్లతో మోడళ్ళను అందిస్తున్నాయి. మీ కోసం మరియు మీ ప్రియమైన వారికి ఒక కారు ను బహుమతి గా ఇవ్వదలచుకుంటే ఇది ఒక ఖచ్చితమైన అవకాశం అని చెప్పవచ్చు మరియు క్రింది డిస్కౌంట్ మరియు ఆఫర్లతో 4 వీల్ అద్భుతాలను ఇప్పుడు చాలా ఉత్సాహంగా పొందండి.
ఫియాట్
ఫియట్ సంస్థ, రూ 1,20,000 వరకు డిస్కౌంట్ ను మరియు ప్రయోజనాలను అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని ఎంపిక చేయబడ్డ మోడళ్ళకు ప్రత్యేక నిర్వహణ ప్యాకేజీ ను కూడా అందిస్తోంది.
న్యూ లీనియా: రూ. 1,10,000 వరకు ప్రయోజనం
లీనియా క్లాసిక్: రూ. 40,000 వరకు ప్రయోజనం
పుంటో ఈవో: రూ . 70,000 వరకు ప్రయోజనం
అవెంచురా : రూ .80,000 వరకు ప్రయోజనం
చెవ్రోలెట్
చెవ్రోలెట్, 3 గ్రాముల బంగారు నాణెం తో పాటు కొన్ని అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది.
బీట్: 3 గ్రాముల బంగారు నాణెం, 1 వ సంవత్సరం బీమా, 3 సంవత్సరాల నిర్వహణ ప్యాకేజీ మరియు 3 + 2 సంవత్సరాల వారంటీ
సెయిల్: 3 గ్రాముల బంగారు నాణెం, 3 సంవత్సరాల నిర్వహణ ప్యాకేజీ మరియు 3 + 2 సంవత్సరాల వారంటీ
ఎంజాయ్: 3 గ్రాముల బంగారు నాణెం మరియు 3 + 2 సంవత్సరాల వారంటీ
క్రూయిజ్ : 3 గ్రాముల బంగారు నాణెం, 1 వ సంవత్సరం బీమా, 3 సంవత్సరాల నిర్వహణ ప్యాకేజీ, 9.9% ఫైనాన్స్ పథకం మరియు 3 + 2 సంవత్సరాల వారంటీ
రెనాల్ట్
రెనాల్ట్ ప్రత్యేక వడ్డీ రేట్లు, నగదు ప్రయోజనాలు మరియు డిస్కౌంట్ లతో సహా దాని మోడళ్ళకు విస్తృత డిస్కౌంట్లను అందిస్తోంది.
డస్టర్: ఎంచుకున్న రాష్ట్రాల్లో 4.99% ప్రత్యేక వడ్డీ రేటు, రూ 45,000 వరకు ప్రయోజనం మరియు రూ 25,000 వరకు అదనపు ప్రయోజనం. ఇది కూడా ఎంపిక చేయబడ్డ స్టాక్ వరకు మాత్రమే.
లాడ్జీ: ఎంచుకున్న రాష్ట్రాల్లో 4.99% ప్రత్యేక వడ్డీ రేటు, రూ 70,000 డిస్కౌంట్. 2 సంవత్సరాలు / 30,000 కి.మీ. అదనపు వారెంటీ మరియు అదనపు కార్పొరేట్ బోనస్
పల్స్: ఎంచుకున్న రాష్ట్రాలలో, 6.99% ప్రత్యేక వడ్డీ రేటు మరియు రూ 55,000 వరకు ప్రయోజనం
ఫ్లూయెన్స్: రూ .4,50,000 వరకు ప్రయోజనం
కొలియోస్: రూ .6,00,000 వరకు ప్రయోజనం
స్కాలా: ఎంచుకున్న రాష్ట్రాలలో 6.99% ఆకర్షణీయమైన వడ్డీ రేటు మరియు రూ 35,000 ప్రయోజనం
హ్యుందాయ్
హ్యుందాయ్, ప్రతి 1,00,000 రూపాయిల కొనుగోలు పై ఒక బంగారు నాణాన్ని మరియు క్రింది డిస్కౌంట్ ను అందిస్తోంది.
ఇయాన్: 40,000 రూపాయల వరకు ఆదా చేయవచ్చు మరియు సున్నా డౌన్ చెల్లింపు
గ్రాండ్ ఐ 10: రూ .70,000 వరకు ఆదా
ఎక్సెంట్: రూ .70,000 వరకు ఆదా
ఐ 10: రూ .50,000 వరకు ఆదా
వెర్నా: రూ .83,000 వరకు ఆదా
ఎలంట్రా: రూ. 40,000 వరకు ఆదా
సాంట ఫీ: రూ .50,000 వరకు ఆదా
నిస్సాన్
నిస్సాన్, నగదు ప్రయోజనాలు పరంగా రూ 95,000 వరకు దాని మోడళ్ళకు ఆఫర్లను అందిస్తోంది
టెర్రినో: రూ .95,000 వరకు ప్రయోజనం
సన్నీ: రూ .75,000 వరకు ప్రయోజనం
మైక్రా: రూ. 45,000 వరకు ప్రయోజనం