బ్రిడ్జ్ స్టోన్ వారు ఇకోపియా రేంజ్ టైర్లను విడుదల చేశారు
అక్టోబర్ 08, 2015 10:52 am konark ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ముంబై: బ్రిడ్జ్ స్టోన్ ఇండియా వారు కొత్త రేంజ్ టైర్లు ఇకోపియా పేరిట విడుదల చేశారు. ఈ టైర్లు ప్యాసెంజర్ వాహనాలకి వేరుగా ఎస్యూవీ లకు వేరుగా వర్గీకరించారు. ఇకోపియాEP150 ప్యాసెంజర్ వాహనాలకు అయితే, ఇకోపియాEP850 వి ఎస్‌యూవీలకు మరియూ సీయూవీ లకి. కంపెనీ వారు ఈ ఈకోపియా టైర్లు 7-10% ఎక్కువ మైలేజీ ని అందించడంలో తోడ్పడతాయి అని ఇంకా తక్కువ కార్బన్ ఎమిషన్ ని కూడా విడుదల చేస్తాయి అని తెలుపుతున్నారు.
బ్రిడ్జ్‌స్టోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెద్ కి మ్యానేజింగ్ డైరెక్టర్ అయిన మిస్టర్ కజుహికో మిమురా గారు మీడియా ని ఉద్దేశిస్తూ," ప్రస్తుత మరియూ రాబోయే తరాలకి చక్కని పర్యావరణం అందించాలి అనే సంకల్పంతో మా కంపెనీ ఈ ఈకోపియా టైర్లను భారతదేశంలో విడుదల చేసింది.ఈకోపియా యొక్క ఇంధన సామర్ధ్యం ద్వారా బ్రిడ్జ్‌స్టోన్ వారు కార్బన్ ఎమిషన్ ని భారతదేశంలో తగ్గించి తద్వారా భారతీయ డ్రైవర్లు ఇంధనాన్ని ఆదా చేసేలా సహకరిస్తుంది. ఇది కాకుండా, ఇవి రోడ్ హ్యాండ్లింగ్ లో కూడా సహాయం చేస్తాయి," అని తెలిపారు.
ఇకోపియా అనే పదం "ఇకాలజీ" ఇంకా "యుతోపియా" నుండి ఉత్పాదించబడింది. ఇది బ్రిడ్జ్‌స్టోన్ వారు పర్యావరణ సమ్రక్షణ కార్యక్రమాలపై దృష్టి సారించారు అని, 2050 సంవత్సరానికి కార్బన్ ఎమిషన్ ని సగానికి సగం తగ్గించాలి అన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నట్టూ అనిపిస్తుంది. మొదట్లో 13" నుండి 18" రిం వ్యాసం గల 26 రకాల సైజుల్లో ఇకోపియా టైర్లు అందుబాటులో ఉండి దాదాపు అన్ని కాంపాక్ట్ వాహనాలకు సరిపోతాయి.