ప్రారంభమైన రెండవ-జెన్ Lexus LM MPV బుకింగ్ؚలు
లెక్సస్ ఎలెం కోసం rohit ద్వారా ఆగష్టు 28, 2023 02:39 pm ప్రచురించబడింది
- 71 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త టయోటా వెల్ఫైర్‌పై ఆధారపడిన ఈ కొత్త లెక్సస్ LM లగ్జరీ అంశాలను కొత్త స్థాయికి తీసుకువెళ్ళింది
-
రెండవ-జెన్ LM MPVని త్వరలోనే భారతదేశంలో విడుదల చేయనున్న లెక్సస్.
-
4 మరియు 7 సీటర్ కాన్ఫిగరేషన్ؚలలో అందించనున్నాను.
-
ఎక్స్ؚటీరియర్ హైలైట్‌లలో భారీ స్పిండిల్ గ్రిల్, డాపర్ LED లైటింగ్ ఉన్నాయి.
-
ఇంటీరియర్‌లో 48-అంగుళాల TV, 23-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు హీటెడ్ ఒట్టోమాన్ సీట్ؚలు ఉన్నాయి.
-
ఇండియా-స్పెక్ మోడల్ పవర్‌ట్రెయిన్ వివరాలు ఇంకా తెలియదు.
-
ప్రపంచవ్యాప్తంగా ఇది రెండు ఎంపికలలో లభ్యమవుతుంది: 2.4-లీటర్ టర్బో మైల్డ్-హైబ్రిడ్ మరియు 2.5-లీటర్ బలమైన-హైబ్రిడ్ యూనిట్.
ప్రీమియం మరియు లగ్జరీ MPV విభాగంలోకి, కొత్త లెక్సస్ LM రూపంలో సరికొత్త పోటీదారు త్వరలో రాబోతోంది. దీని ధరలు ప్రస్తుతానికి వెల్లడించలేదు, ఈ లగ్జరీ కారు తయారీదారు తమ MPV బుకింగ్ؚలను ప్రస్తుతానికి ప్రారంభించారు. ఈ రెండవ-జనరేషన్ లెక్సస్ LM ఇటీవల విడుదలైన టయోటా వెల్ఫైర్‌పై ఆధారపడింది.
బయటి వైపు ఆకర్షణీయంగా ఉంటుంది
భారీ ఫ్రంట్ విండ్ షీల్డ్‌లు మరియు ముందు దిగువ భాగం వరకు కొనసాగే భారీ స్పిండిల్ గ్రిల్ దీని ముందు భాగాన్ని ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ట్రై-పీస్ LED ఎలిమెంట్‌లను కలిగిన డ్యాపర్ LED హెడ్‌లైట్లను లెక్సస్ ఇందులో అందిస్తోంది.
పక్క నుండి చూస్తే, మీరు గమనించే మొదటి విషయం పొడవైన వీల్ؚబేస్ కలిగిన ఈ MPV భారీ ఫుట్ؚప్రింట్. ప్రొఫైల్ ముఖ్యాంశాలలో మల్టీ-స్పోక్ అలాయ్ వీల్స్ మరియు ఎలక్ట్రానికల్లీ స్లైడింగ్ రేర్ డోర్ؚలు ఉన్నాయి.
పొడవైన రేర్ విండ్ స్క్రీన్ؚతో కనెక్టెడ్ చేయబడిన మరియు చుట్టి ఉన్నట్లు కనిపించే LED టెయిల్‌లైట్‌లు అత్యంత ప్రత్యేకమైన డిజైన్ అంశంగా వెనుక వైపు ఎంతో క్రమపద్ధతిలో ఉన్నాయి.
పూర్తి లగ్జరీ క్యాబిన్
ఇది లెక్సస్ అయినందున, డ్రైవర్ డిస్ప్లే మరియు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం రెండు భారీ స్క్రీన్ؚలు, క్రీమ్ రంగు క్యాబిన్ థీమ్ మరియు సరళమైన డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్ؚతో లోపలి వైపు ఎంతో లగ్జరీగా ఉంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ؚలోని ఆడియో మరియు క్లైమేట్ కంట్రోల్ؚలు రెండిటికీ ఇంటిగ్రేటెడ్ డయల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ MPVని 4, 6 మరియు 7-సీట్ లేఅవుట్ؚ సీటింగ్ ఎంపికలతో అందిస్తున్నారు – 4 మరియు 6-సీట్‌ల వేరియెంట్ؚలను భారత మార్కెట్ కోసం అందించే ప్రణాళికను కలిగి ఉన్నారు.
లెక్సస్ LM ముఖ్యాంశం రెండవ వరుస, ఇందులో MPV యొక్క అదనపు ఫీచర్‌లు అన్నీ ఉంటాయి. వెడల్పైన రీక్లైనింగ్ ఒట్టోమాన్ సీట్ؚలు, 23-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, పిల్లో-స్టైల్ హెడ్ؚరెస్ట్ؚలు మరియు క్యాబిన్ ముందు మరియు వెనుక సెక్షన్‌ల మధ్య పార్టిషన్‌పై అమర్చిన భారీ 48-అంగుళాల TV ఉన్నాయి. 64-రంగుల ఆంబియెంట్ లైటింగ్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ సీట్లు మరియు చురుకైన భద్రతా ఫీచర్‌లను కూడా లెక్సస్ ఇందులో అందిస్తుంది.
ఈ కొత్త-జెన్ LMలో లెక్సస్ؚలో ఈ విభాగంలోనే మొదటిసారి వస్తున్న కొన్ని ఫీచర్‌లలో హీటెడ్ ఆర్మ్ రెస్ట్ؚలు మరియు ఒట్టోమాన్ؚలు, పవర్డ్ రేర్ డోర్‌ల కోసం కొత్త హ్యాండిల్స్ మరియు రూఫ్ؚకు అనుసంధానించిన రేర్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌లు లెక్సస్‌లో ఉన్నాయి.
ఇది కూడా చూడండి: 2024 నుండి మొదలుకొని, భారత ప్రత్యేక కార్ؚల క్రాష్ టెస్టింగ్ పగ్గాలను భారత్ NCAPకు అప్పగించనున్న గ్లోబల్ NCAP
పూర్తిగా గ్రీనర్ పవర్‌ట్రెయిన్
ప్రపంచవ్యాప్తంగా, లెక్సస్ LMను రెండు పవర్‌ట్రెయిన్ؚల ఎంపికతో అందిస్తోంది: అవి 2.4-లీటర్ టర్బో మైల్డ్-హైబ్రిడ్ మరియు 2.5-లీటర్ స్ట్రాన్-హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్. ఇండియా-స్పెక్ మోడల్ؚలో వీటిలో ఏ పవర్‌ట్రెయిన్ వస్తుందో వేచి చూడాలి, అయితే తదుపరిదే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
దీని ఖరీదు ఎంత ఉంటుంది?
లెక్సస్ తన రెండవ-జెన్ LM ధరను రూ.1.20 కోట్ల నుండి రూ.1.30 కోట్ల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ధరను కలిగి ఉన్న వెల్ؚఫైర్ కంటే ఎక్కువ నిర్ణయిస్తుందని భావిస్తున్నాము. టయోటా వెల్ؚఫైర్ దీని ప్రత్యక్ష పోటీదారుగా ఉంటుంది, BMW X7 మరియు మెర్సిడెజ్-బెంజ్ GLS వంటి 3-వరుసల లగ్జరీ SUVలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. రాబోయే రోజులలో మెర్సిడెజ్-బెంజ్ V-క్లాస్ కూడా తన తాజా రూపంలో తిరిగి వస్తుందని ఆశిస్తున్నాము, ఇది లెక్సస్ LMతో పోటీ పడుతుంది.
ఇది కూడా చదవండి: భారత్ కొత్త కారు విశ్లేషణ కార్యక్రమం వచ్చేసింది!
0 out of 0 found this helpful