బొలెరో మళ్ళీ 'అత్యధికంగా అమ్ముడుపోయే ఎస్‌యూవీ'గా కేవలం రెండు నెలలలో ఆధిపత్యం చేజిక్కించుకుంది
నవంబర్ 05, 2015 12:00 pm sumit ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మహింద్రా & మహింద్రా వారి బొలెరో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే ఎస్‌యూవీ గా స్థానం సంపాదించుకుంది. తాజాగా హ్యుండై క్రేటా విడుదల కారణంగా ఏర్పడినా పోటీని సైతం తట్టుకుంది ఈ బొలెరో.
గత నెల క్రేటా వి 7,225 యూనిట్లు అమ్ముడుపోగా, బొలెరోవి దాదాపు 7,754 యూనిట్లు అమ్మూకాలను నమోదు చేసింది. టాప్ 10 అత్యధిక అమ్మకాలు అయ్యే ఎస్‌యూవీల జాబితాలో మహింద్రా వారి ఉత్పత్తులు ఇంకా 4 ఉన్నాయి. వీరు పండగ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగారు మరియూ 29% ఎదుగుదలని అక్టోబర్ అమ్మకాలకి సెప్టెంబర్ అమ్మకాలతో పఒలిస్తే నమోదు చేయగలిగారు.
మహింద్రా లో ఆటోమోటివ్ విభాగానికి ప్రెసిడెంట్ మరియూ చీఫ్ ఎగ్జెక్యూటివ్ అయిన ప్రవీన్ షా గారు 20% ఎదుగుదల ప్రధానంగా కొత్త విడుదలల కారణంగా సంభవించింది అని వివరించారు. ప్రత్యేకించి వడ్డీ రేట్లతో పాటుగా ఇంధన ధరలు తగ్గటం కారణంగా, ఇండస్ట్రీకి ఈ శుభ సమయం కొనసాగుతుంది అని తెలిపారు.
ఇంకో వైపున, హ్యుండై మోటర్ ఇండియా లో సేల్స్ మరియూ మార్కెటింగ్ విభాగానికి సీనియర్ వైస్-ప్రెసిడెంట్ అయిన రాకేష్ శ్రీవాస్తవ గారు, కంపెనీ వారు ఉత్పత్తిని పెంచి కస్టమర్ల వెయిటింగ్ పీరియడ్ ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నము అని తెలిపారు.