ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోకు ముందుగానే 2016 ఎక్స్1ను ఆవిష్కరించిన బీఎండబ్ల్యూ
modified on జూన్ 05, 2015 02:19 pm by అభిజీత్ కోసం బిఎండబ్ల్యూ ఎక్స్1 2015-2020
- 8 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: జర్మన్ కారు దిగ్గజం అయిన బీఎండబ్ల్యూ, రాబోయే అంతర్జాతీయ ఆటోమొబైల్-ఆస్స్టిలాంగ్ అలియాస్ ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో 2016 ఎక్స్ 1 యొక్క విడుదలకు ముందే దానిని అధికారికంగా ఆవిష్కరించింది. ఈ సరి కొత్త ఎక్స్ 1 యొక్క రూపం, ప్రస్తుతం వున్న ఎక్స్ 1 ఎస్యూవీకి చాలా పోలి వుంటుంది. ఇది తయారీదారుని యొక్క తాజా, ఫ్రంట్ వీల్ డ్రైవ్ యూకేఎల్ వేదిక మీద ఆధారపడి ఉంటుంది.
బాహ్య స్వరూపాన్ని చూస్తే, 2016 ఎక్స్1 యొక్క ముందు బంపర్ ప్రవహించే రేఖలు కలిగి వుంటుంది. అయితే కిడ్నీ ఆకారంలో ఉన్న గ్రిల్ ఇరువైపుల వున్న ఎల్ఈడీ హెడ్లైట్ల మధ్య సన్నద్ధమైవున్నది. ఈ హెడ్లైట్లు కాంతివలయ రింగులతో ఉన్న డీఆర్ఎల్‌లతో ఉన్నది. దీని పక్క వైపుని గమనిస్తే, కొద్దిగా పదునైన అంచుగల విండ్స్క్రీన్ యొక్క చుట్టుకొలత మరియు మిశ్రమ లోహ చక్రాల కొత్త సెట్ వున్నాయి. మరో వైపు, సొగసైన ఎల్ఈడి టైల్ లైట్లు, చదునైన టైల్ గేట్ మరియు స్కిడ్ ప్లేట్లు బిగించబడి ఉన్న కొత్త బంపర్ వంటి అంశాలు దీని యొక్క వెనుక ప్రొఫైల్ను ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది.
ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆధారితం కనుక, ఇందులో మోటార్ను పొడవుగా కాకుండా అడ్డంగా అమర్చారు. అయితే ఇది, దీని అమరికను అనువుగా చేయడమే కాకుండా లోపల మరింత స్థలాన్ని పెంచేందుకు తొడ్పడుతుంది. ప్రవేశ స్థాయి వేరియంట్లలో వున్న బట్ట ఆధారిత సీట్లు,వెండి మరియు నలుపు వివరణతో ఉన్న అలంకారాలు ఇంకా 6.5-అంగుళాల స్క్రీన్ కలిగిన వున్న మ్యూజిక్ సిస్టమ్ ఇందులోని ఇతర లోపలి ముఖ్యాంశాలు. ఇంతే కాకుండా, ఇది మరెన్నో ఆప్షనల్ ఫీచర్లతో లభ్యమవుతుంది. అందులోని కొన్ని అంశాలు హెడ్స్-అప్ డిస్ప్లే, యాక్టివ్ క్రూజ్ నియంత్రణతో ఉన్న డ్రైవర్ అసిస్టెన్స్ ప్లస్ ప్యాకేజీ, లేన్ మార్పు హెచ్చరిక, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ప్రమాదం హెచ్చరిక మరియు సిటీ బ్రేకింగ్ తో వున్న పాదచారుల హెచ్చరిక.
బీఎండబ్ల్యూ 2.0 లీటర్ ఇన్లైన్ 4-సిలిండర్ పెట్రోల్ మోటార్ను రెండు విధాలుగా ట్యూన్ చేసింది. ఇందులో ఒకటి 189.4 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేయగా మరొకటి, 227.9 బీహెచ్పీని అందిస్తుంది. మరోవైపు, ఇది 3 వివిధ శక్తిని ఉత్పత్తి సామర్థ్యం గల 2.0-లీటర్ ఇన్లైన్ 4-సిలిండర్ గల టర్బో డీజిల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇదులో ఒకటి 330 ఎన్ఎమ్, మరొక 400 ఎన్ఎమ్, ఇంకా చివరిది అధికంగా 450 ఎన్ఎమ్ టార్క్ ను అందిస్తుంది. అంతేకాకుండా, డీజిల్ మరియూ పెట్రోలు ఆప్షన్లకు అదనంగా మరో రెండు 1.5 లీటర్ 3-సిలిండర్ల మోటార్ ప్రవేశ స్థాయి ఎంపికలతో దీనిని అందిచవచ్చని అంచనా.
అయితే, భారతీయ మార్కెట్ దేనిని పొందుతుందని ఈ కంపెనీ ఇంకా ఏమి వెల్లడించలేదు. కాని ఎక్స్1 ఎస్‌డ్రైవ్16డీ (114.4 బిహెచ్పి) మరియు ఎక్స్1 ఎస్‌డ్రైవ్ 18ఐ (134.2 బిహెచ్పి) పేర్లతో ఉన్న ప్రవేశ స్థాయి వేరియంట్లు ఒక మంచి అవకాశాన్ని నిలదొక్కుకుంటాయని భావిస్తున్నారు. దీని యొక్క ఫలితం? ఇంకా తక్కువ ధరలు.
దాని విడుదల గురించి మాట్లాడితే, ఇది 2016 భారత ఆటో ఎక్స్పోలో ఈ సంవత్సరం ముగింపున లేదా వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో ప్రవేశిస్తుంది.
మరింత చదవండి: ఎక్స్1 సమీక్ష
- Renew BMW X1 2015-2020 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful