• English
  • Login / Register

ఎక్స్3 ఎక్స్ డ్రైవ్30డి ఎం స్పోర్ట్ ని రూ. 59.90 లక్షల వద్ద ప్రారంభించిన బిఎండబ్లూ ఇండియా

బిఎండబ్ల్యూ ఎక్స్3 2014-2022 కోసం raunak ద్వారా జూలై 07, 2015 05:43 pm సవరించబడింది

  • 15 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: బిఎండబ్లూ ఇండియా ఎక్స్3 ఎస్ యు వి శ్రేణిలో, ఎంస్పోర్ట్ ప్యాకేజీ- ఎక్స్ డ్రైవ్ 30డిఎం స్పోర్ట్ లక్షణం కలిగిన ఒక కొత్త వేరియంట్ ని జోడించారు. ఈ వేరియంట్ ఇతర ఎక్స్3 వేరియంట్స్ లానే రూ .59,90,000 (ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ) ధరకే లభిస్తుంది. ఇది స్థానికంగా చెన్నై వద్ద తయారు చేయబడింది మరియు భారతదేశం అంతటా బిఎండబ్లూ డీలర్షిప్ల వద్ద అందుబాటులో ఉంది.

ఏమిటి కొత్త?

దీనిలో ముందర బంపర్ కి మరియు వెనుక బంపర్ కి ఎం ఏరోడైనమిక్ ప్యాకేజ్ అందించబడుతుంది. అలానే డార్క్ షాడో మెటాలిక్ రంగు డిఫ్యూజర్లచే మరియు వీల్ ఆర్చ్లు, డోర్లు బాడీ రంగులో అందించబడ్డాయి. ఈ వాహనం కార్బన్ బ్లాక్ మెటాలిక్ తో పాటూ 6 కలర్ షేడ్స్ లో అందుబాటులో ఉన్నాయి. అంతేకాక, ఇది ఎం లైట్ అల్లాయ్ వీల్స్ మరియు పక్క భాగంలో 'ఎం' లోగో కలిగి ఉంటుంది. దీని లోపల భాగానికి వస్తే, సాధారణ X3 డాష్బోర్డ్ లా కాకుండా ఇది ఎం లెదర్ స్టీరింగ్ వీల్ మరియు బిఎండబ్లు ఇండివిజువల్ అంత్రాసైట్ హెడ్లైనర్ ని అందిస్తుంది. 

బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా అధ్యక్షుడు మిస్టర్ ఫిలిఫ్ వోన్ సహర్ మాట్లాడుతూ" బీఎండబ్ల్యూ ఎక్స్3 ని చిన్న మరియు పెద్ద సవాళ్ల ను ప్రతిరోజు ఎదురుకునేలా దానిని రూపొందించాము. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్ ఒక ఖచ్చితమైన క్రీడా పాత్ర ను, ఆకట్టుకునే ప్రదర్శనను ఇస్తుంది. దీని ఆకర్షణీయమైన డిజైన్ వలన ప్రతి ప్రయాణం మరపురాని అనుభవాన్ని అందిస్తుంది, అది మామూలు రోజైన సరే లేదా వారాంతరంలో అయినా సరే కుటుంభ సభ్యులతో అయినా లేదా ఒంటరిగా అయినా సరే ఇది మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. కొత్త బీఎండబ్ల్యూ ఎక్స్3 ఎక్స్ డ్రైవ్ 30డి ఎం స్పోర్ట్ కారుతో మీ జీవితాన్ని ప్రతిరోజూ ఒక అడ్వెంచర్ లాగా మలుచుకోవచ్చు. దీనిలో 3.0 లీటర్ ఎన్ లైన్ 6-సిలిండర్ డీజిల్ తో పవర్ బయటకు వస్తుంది. ఆయిల్ బర్నర్ 258 bhp శక్తిని ఉత్పత్తి చేయగలదు అలాగే గరిష్టంగా 560 Nm టార్క్ ను కూడా అందించగలదు. ఈ ఎక్స్3 లో ఇంజిన్ 5.9 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగం వరకూ వెళ్ళగలదు మరియు 232 కిలోమీటర్ల గరిష్ట వేగం వరకూ చేరుకోగలదు. ఈ 6 సిలిండర్ ఇంజిన్ 8 స్పీడ్ స్టెప్ట్రోనిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను కలిగి ఉండి నాలుగు డ్రైవింగ్ మోడ్లను అందిస్తుంది. అవేమిటంటే కంఫర్ట్, ఎకో ప్రో, స్పోర్ట్ మరియు స్పోర్ట్ +. 

was this article helpful ?

Write your Comment on BMW ఎక్స్3 2014-2022

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience