బీఎండబ్ల్యూ ఇండియా వారు X1 M స్పోర్ట్ ని రూ. 39.7 లక్షల ధర వద్ద విడుదల చేశారు
సెప్టెంబర్ 29, 2015 09:56 am అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
బీఎండబ్ల్యూ వారు X1 sDrive20d M స్పోర్ట్ ని భారతదేశంలో రూ. 37.9 లక్షల, ఎక్స్-షోరూం, ఢిల్లీ ధరకు విడుదల చేశారు. మౌనంగా విడుదల సింగల్ వేరియంట్ గా కేవలం ఒకే ఆప్షంగా ఉండేట్టు జరిగింది. కారు గురించి మాట్లడుతూ, ఇంతకు మునుపటి దానితో పోలిస్తే ఎటువంటి మార్పులు పొందలేదు. ఆడీ Q3 మరియూ వోల్వో V40 క్రాస్ కంట్రీ తో ఇది పోటీ పడుతుంది.
కొత్త కారుకి ధుడుకైన బంపర్ కలిగి ఉంటుంది మరియూ లే మాన్స్ బ్లూ ఇంకా ఆల్పైన్ వైట్ రంగులలో లభ్యం అవుతుంది.
లోపల, లెదర్ పరిచిన M స్టీరింగ్ వీల్ ఉంటుంది, అప్‌హోల్స్ట్రీ పై కుట్టు మరియూ ఇంకొన్ని మార్పులు కనిపిస్తాయి.
ఈ లగ్జరీ కాంపాక్ట్ ఎస్యూవీ కి 2.0-లీటరు ఇన్లైన్ 4-సిలిండర్ల బీఎండబ్ల్యూ ట్విన్ టర్బో డీజిల్ మోటరు అమర్చబడి ఉంటుంది. ఇది 184Ps శక్తి మరియూ 380Nm టార్క్ ని విడుదల చేస్తుంది. ఇదంతా రేర్ వీల్స్ కి సరఫరా అయేట్టుగా 8-స్పీడ్ స్టెప్‌ట్రానిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. పైగా, ప్రస్తుత X1 తరానికి ఇది చివరి పునరుద్దరణగా పేర్కొంటున్నారు మరియూ వచ్చే తరం కారుతో భర్తీ అవ్వనుంది.