• English
    • లాగిన్ / నమోదు

    నిలిపివేసిన అశోక్ లేలాండ్ స్టైల్ ఎంపివి ఉత్పత్తి: కమర్షియల్స్ సెగ్మెంట్లపై ఎక్కువ దృష్టి

    జూలై 01, 2015 04:07 pm sourabh ద్వారా ప్రచురించబడింది

    24 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    జైపూర్: ప్రముఖ వాణిజ్య తయారీదారుడైన అషోక్ లేలాండ్స్, ఎంపివి స్టైల్ వేరియంట్ ను నిలిపివేసింది. కంపెనీ ఇప్పుడు వాణిజ్య వాహనాల తయారీ దాని కోర్ వ్యాపారంలో దృష్ట్టి కేంద్రీకరించింది. ఈ ఎంపివి స్టైల్ అనేది నిస్సాన్ ఎవాలియా యొక్క రెబేడ్జెడ్ వెర్షన్. ఈ నిస్సాన్ ఎవాలియా, హిందూజా గ్రూప్ సొంతమైన అశోక్ లేలాండ్ మరియు జపనీస్ నిస్సాన్ మోటార్ కంపెనీ యొక్క జాయింట్ వెంచర్ చే అభివృద్ధి చేయబడింది. 


    అశోక్ లేలాండ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన వినోద్ కె దాసరి ఈ విధంగా మాట్లాడారు "మేము స్టైల్ ఉత్పత్తి నిలిపివేశాము. ఇది ఊహించినంత అమ్మకాలను కలిగి లేదు, ఒకవేళ అవకాశాలు ఉంటే ఇదే విభాగంలో తిరిగి ప్రవేశపెడతాము అని వ్యాఖ్యానించారు. 

    నిస్సాన్ ఎవాలియా ఆధారంగా రూపొందించిన ఈ స్టైల్ వాహనం 1.5 లీటర్ కె9కె డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఇదే ఇంజన్ ను రెనాల్ట్ డస్టర్ మరియు ఇటీవలే విడుదల లాడ్జీ ఎంపివి లలో మనం చూడవచ్చు. 

    ఈ జాయింట్ వెంచర్ కోసం, కంపెనీ 224 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఉమ్మడి వెంచర్ లో ఈక్విటీ హోల్డింగ్ నమూనాలో ఎటువంటి మార్పులు రావు అని మిస్టర్ దాసరి అన్నారు. 

    అంతేకాక మేము దీని బస్సు వ్యాపారాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో ఉన్నాము. మధ్య తూర్పు ఆఫ్రికా లో బస్సు అసెంబ్లీ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని కంపనీ నిర్ణయించుకుంది. ప్రధానమంత్రి మొదలుపెట్టిన " మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం ద్వారా అశోక్ లేలాండ్ త్వరలోనే భారతదేశం లో దాని బస్సు అసెంబ్లీ ప్లాంట్ ను ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది.

    ప్రతి ప్లాంట్ కి కావలసిన పెట్టుబడి దాదాపు 20 కోట్ల రూపాయలు మరియు అశోక్ లేలాండ్ అన్ని ప్లాంట్స్ యొక్క మొత్తం మూలధన వ్యయం సుమారు 100 కోట్లు ఉంటుంది.

    కంపెనీ తన మార్కెట్ వాటాను నిలబెట్టుకోవటానికి ఆశ పడుతుంది మరియు రాబోయే కొన్ని నెలల్లో ఎల్సీవి అనుకూల ఫలితాలను ఇస్తుందని ఆశిస్తున్నారు. 

    was this article helpful ?

    Write your Comment on Ashok Leyland స్టైల్

    కార్ వార్తలు

    సంబంధిత వార్తలు

      ట్రెండింగ్‌లో ఉంది ఎమ్యూవి కార్లు

      • లేటెస్ట్
      • రాబోయేవి
      • పాపులర్
      *న్యూ ఢిల్లీ లో ఎక్స్-షోరూమ్ ధర
      ×
      మీ అనుభవాన్ని అనుకూలీకరించడానికి మాకు మీ నగరం అవసరం