కార్‌ప్లే, మ్యాప్ల అప్లికేషన్ కోసం అద్భుతమైన కొత్త ఫీచర్‌తో వచ్చిన యాపిల్ iOS 17
ఇది యాపిల్ కార్‌ప్లే సిస్టమ్‌కు షేర్‌ప్లేను జోడిస్తుంది, తద్వారా ప్రయాణికులు తమ సొంత యాపిల్ డివైస్ ద్వారా ప్లే లిస్ట్‌ను నియంత్రించే అవకాశం కల్పిస్తుంది.
-
WWDC 2023లో యాపిల్ ప్రకటించిన అనేక కొత్త అప్‌డేట్‌లలో, కొన్ని ప్రత్యేకించి కారులో ప్రయాణించేప్పుడు అనుభవాలను మెరుగుపరిచేవి.
-
షేర్‌ప్లే ద్వారా, వెనుక సీటులో ఉన్న ప్రయాణీకులు కూడా కార్‌ప్లే ద్వారా ప్లే అవుతున్న మ్యూజిక్‌ను నియంత్రించగలరు.
-
iOS 17 ప్రివ్యూ ద్వారా, మ్యాప్ల అప్లికేషన్ కోసం ఆఫ్‌లైన్ ఫీచర్‌లను కూడా యాపిల్ ప్రదర్శించింది.
-
ప్రయాణంలో ఛార్జింగ్ స్టేషన్ల రియల్-టైమ్ లభ్యతకు సంబందించిన సమాచారాన్ని కూడా యాపిల్ మ్యాప్ అందిస్తుంది.
-
ప్రస్తుతానికి ఈ ఫీచర్ల విడుదల గురించి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు మరియు మొదట కొన్ని కార్యచరణలు ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమే పరిమితం కావచ్చు.
WWDC 2023 ఈవెంట్‌లో, యాపిల్ అనేక ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లను, మెరుగుదలలను మరియు కొత్త ఫీచర్లను ప్రకటించింది. ఇందులో ప్రత్యేకించి డ్రైవింగ్ చేసేటప్పుడు ఉపయోగపడే మూడు సరికొత్త ఫీచర్‌లు ఉన్నాయి, వాటి వివరాలు క్రింద అందించబడ్డాయి:
కార్‌ప్లేలో షేర్‌ప్లే
యాపిల్ మ్యూజిక్ను ఉపయోగిస్తున్నప్పుడు, షేర్‌ప్లే ఫీచర్‌ను కార్‌ప్లేతో యాపిల్ అనుసంధానించడం ద్వారా ఇకపై కారులో మీకు ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేయడం సులభం. దీని ద్వారా ప్రయాణీకుల ఐఫోన్ నుండి మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను నియంత్రించవచ్చు. ఇది ఒకే పరికరంపై ఆధారపడే సమస్యను పరిష్కరించడమే కాకుండా, ప్రైవసీని కూడా మెరుగుపరుస్తుంది, మ్యూజిక్ను మార్చడానికి అన్‌లాక్ చేసిన ఫోన్‌ను ఇతరులకు ఇవ్వాల్సిన అవసరం ఉండదు.
డ్రైవర్ కార్‌ప్లేను ప్రారంభించినప్పుడు, ప్రయాణీకుల ఐఫోన్ కార్‌ప్లే సెషన్‌కు కనెక్ట్ అవ్వమని సూచిస్తుంది. సెషన్‌లో చేరిన తర్వాత, ప్రయాణికులు మ్యూజిక్ మరియు ప్లేబ్యాక్ సెట్టింగ్‌లను సులభంగా నియంత్రించగలరు.
ఇది కూడా చూడండి: I/O 2023లో మ్యాప్‌ల కోసం గూగుల్ కొత్త ఇమ్మర్సీవ్ వ్యూ ఫీచర్‌ను ప్రదర్శించింది
ఆఫ్‌లైన్ మ్యాప్స్
ప్రయాణం చేస్తున్నపుడు, మనం తరచుగా నెట్‌వర్క్ కనెక్టివిటీ సమస్యలను ఎదురుకుంటాము, ఇది మ్యాప్‌ల పనితీరును దెబ్బతీస్తుంది మరియు నావిగేషనల్ సవాలుగా మారుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, యాపిల్ తన మ్యాప్ యాప్‌కు ఆఫ్‌లైన్ ఆప్షన్‌ను అందిస్తుంది, తద్వారా యూజర్‌లు ఎంచుకున్న మార్గాన్ని ఆఫ్‌లైన్‌లో లేదా పూర్తి ప్రాంతాన్ని కూడా సేవ్ చేయగలరు. ఇందులో గంటలు మరియు ప్లేస్ కార్డ్‌లపై రేటింగ్‌లు వంటి సమాచారం కలిగి ఉంటుంది, అంతేకాకుండా డ్రైవింగ్, నడక, సైక్లింగ్ లేదా ప్రజా రవాణా కోసం టర్న్-బై-టర్న్ సూచనలను కలిగి ఉంటుంది.
రియల్ టైమ్ ఛార్జింగ్ స్టేషన్ లభ్యత
రహదారులపై ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య పెరుగుతున్నందున, సుదీర్ఘ ప్రయాణాలలో ఛార్జింగ్ స్టేషన్ల లభ్యత సమాచారం కీలకం. యాపిల్ మ్యాప్లపై త్వరలో ఈ ఇంటిగ్రేటెడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది, ఇది ప్రయాణంలో రియల్-టైమ్ ఛార్జింగ్ స్టేషన్ లభ్యతను అందించడమే కాకుండా, ఎలక్ట్రిక్ కారు కోసం ప్రత్యేకంగా సరిపోయే మార్గాలను కూడా సూచిస్తుంది.
కొత్త ఫీచర్లను ఎప్పుడు ఆశించవచ్చు
యాపిల్, ఈ ఫీచర్‌లను ఎప్పుడు విడుదల చేస్తుందో ప్రస్తుతానికి ప్రకటించలేదు మరియు కొన్ని కార్యాచరణలు మొదట కొన్ని దేశాలకు మాత్రమే పరిమితం కావచ్చని భావిస్తున్నాము. మునుపటి అప్‌డేట్ ఆధారంగా, గ్లోబల్ iOS 17 అప్‌డేట్ 2023 ఆర్ధిక సంవత్సరం Q3 చివరిలో అందుబాటులో ఉంటుందని ఆశిస్తున్నాము.