సరికొత్త బిఎండబ్లు ఎక్స్1 రూ. 29.9 లక్షల ధర వద్ద ప్రవేశపెట్టబడింది
published on ఫిబ్రవరి 03, 2016 08:12 pm by nabeel కోసం బిఎండబ్ల్యూ ఎక్స్1 2015-2020
- 10 సమీక్షలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జరుగుతున్న భారత ఆటో ఎక్స్పో లో బిఎండబ్లు X1 రూ. 29.9 లక్షల వద్ద ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు ఎస్యువి ఎంపికలలో ప్రజలకు ఆసక్తికరంగా అందిస్తున్నారు. దీనితో పాటూ బిఎండబ్లు 3 సిరీస్, 3-సిరీస్ గ్రాన్ టురిస్మో, 5 సిరీస్, 7 సిరీస్, ఎక్స్3,ఎక్స్5, M4 కూప్, M6 గ్రాన్ కూప్, X6M, Z4 మరియు i8 లని బిఎండబ్లు వారు ప్రదర్శించారు.
కారు 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 190Bhp సామర్ధ్యంతో 400NM టార్క్ ని అందిస్తుంది. ఇది వాహన చోదకులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించే సామర్ధ్యం. అధనంగా ఈ వాహనం 8-స్పీడ్ ఆటో మెటిక్ ట్రాన్స్మిషన్ కలిగి ఉంటుంది. ఈ కొత్త తరం X1 మరింత ఉత్తేజకరంగా ఉండబోతుంది. దీని రూపు రేఖలు X3 నుండి తీసుకోబడి కారు ముందు భాగం మరింత పెద్దగా తయారుచేయబడింది.
ఈ వాహనం యొక్క ముందుతరం X1 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి ఉండి 4 సిలెండర్స్ తో ట్విన్ పవర్ టర్బో చార్జ్ ద్వారా 184Bhp ని 4000rpm తో అందిస్తుంది. దీని గరిష్ట టార్క్ 380Nm గా కలిగి ఉంది. ఈ శక్తిని అంతా 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ఆటోమెటిక్ ట్రాన్స్మిషం ద్వారా వెనుక చక్రాలకు అందించబడుతుంది. ఈ వాహనం రెగ్యులర్, స్పోర్ట్ మరియు లగ్జరీ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది. లగ్జరీ వాహనం గంభీరంగా స్టయిలింగ్ చెయబడి స్పోర్ట్స్ యుఇవతరాన్ని ఆకర్షించుకొనే విధంగా ఉంటుంది. ఈ విధంగా బిఎండబ్లు అన్ని శ్రేణులను సంగరంగా చేరుకోగలుగుతుంది.
- Renew BMW X1 2015-2020 Car Insurance - Save Upto 75%* with Best Insurance Plans - (InsuranceDekho.com)
- Best Health Insurance Plans - Compare & Save Big! - (InsuranceDekho.com)
0 out of 0 found this helpful