కెమెరాకు చిక్కిన కొత్త 2016 వోక్స్వ్యాగన్ టిగ్వాన్

వోక్స్వాగన్ టిగువాన్ 2017-2020 కోసం nabeel ద్వారా సెప్టెంబర్ 02, 2015 12:19 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: తదుపరి తరం 2016 వోక్స్వ్యాగన్ టిగ్వాన్ కెనడాలో కెమెరా లకు చిక్కింది. క్రాస్ఓవర్ రాబోయే ఫ్రాంక్ఫర్ట్ మోటార్ షోలో 2015 లో బహిర్గతంకానున్నది. మొట్టమొదటి సారిగా కారు ఒక ప్రకటన కోసం మారువేషంలో కనపడింది. 2016 టిగ్వాన్ భారత మార్కెట్లో 2016 లో ప్రవేశించనున్నది మరియు చాలా మటుకు చకన్ లో విడబ్లు కర్మాగారంలో తయారుచేయబడుతుంది. 

2016 టిగ్వాన్ వోక్స్వ్యాగన్ గ్రూప్ యొక్క ఎంక్యుబి ప్లాట్ఫారం మీద ఆధారపడి ఉంది. ఈ ఎంక్యుబి ప్లాట్ఫారం పిక్యు35 ప్లాట్ఫారం కన్నా 100 కిలోలు తేలికైనది. కొత్త ప్లాట్ఫారం కనుక కారు 1.4 టిఎస్ఐ మరియు 2.0 టిఎస్ఐ ఇంజిన్లతో అమర్చబడి ఉంటుందని ఊహిస్తున్నాము. డీజిల్ ఇంజిన్ డిపార్టుమెంట్ లో, కారు 1.6 మరియు 2.0 టిడిఐ ఇంజిన్ ని కలిగి ఉంటుందని అంచనా. ఈ ఇంజన్లను 2015 విడబ్లు గోల్ఫ్ కూడా ఉపయోగించుకుంది. ఈ గోల్ఫ్ కూడా జర్మన్ యొక్క ఎంక్యుబి ప్లాట్ఫారం మీద ఆధారపడినది. ఈ ఎస్యువి గోల్ఫ్ జిటిఇ యొక్క హైబ్రిడ్ మోటార్ మరియు ఇ-గోల్ఫ్ యొక్క ఎలక్ట్రిక్ యూనిట్ లక్షణాన్ని కూడా కలిగి ఉంది. ట్రాన్స్మిషన్ కొరకు, వోక్స్వ్యాగన్ కొత్త 10-స్పీడ్ డిఎస్ జి ఆటోమేటిక్ ని సమ్మతించవచ్చు లేదా పాత 7-స్పీడ్ డిఎస్ జి బాక్స్ ని కొనసాగించవచ్చు. 

లుక్స్ లో, క్రాస్ఓవర్ మరింత ఎస్యువి ఇష్ ఆకారం ని దాటిందనితెలుస్తోంది. ఈ కారు 2015 డెట్రాయిట్ ఆటో ప్రదర్శనలో ప్రదర్శించిన వోక్స్వ్యాగన్ క్రాస్ కూప్ జిటిఇ నుండి సూచనలు తీసుకొని మరింత సౌందర్యవంతంగా కనిపిస్తుంది. ప్రక్క మరియు టాప్ ప్రొఫైల్ కి తీసిన చిత్రాలలో చూస్తే గనుక ఆటోమొబైల్ 18 అంగుళాల, 10 స్పోక్ అల్లాయ్స్ తో ఉన్నట్టుగా తెలుస్తోంది. కారు ప్రక్క భాగం అంతటా క్రోమ్ స్ట్రిప్ ఉండి వెనుక భాగాన్ని కూడా క్రోమ్ తో కప్పి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ కారులో విండో లైనింగ్ పైన క్రోమ్ కలిగి ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కారు పై భాగంలో ఇరు ప్రక్కలా రూఫ్ రెయిల్స్ తో పెద్ద గ్లాస్ రూఫ్ ఉంది. కారు వెనుకభాగం అందమైన కొత్త సామాంతర టెయిల్ లైట్స్, పెద్ద విండ్స్క్రీన్ పైన రూఫ్ స్పాయిలర్ మరియు ట్విన్ క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్స్ తో ఆకట్టుంటుంది.

విదేశీ మార్కెట్లో టిగ్వాన్, ఫోర్డ్ ఎస్కేప్ / క్యుగా, టయోటా ఆర్ఎవి4, మజ్డా సిఎక్స్5 మరియు నిస్సాన్ ఖష్గాయ్ వంటి వాటితో పోటీ పడనున్నది. ఈ కారు 3 వేరియంట్లలో, 5-సీటర్ ప్రామాణిక వీల్బేస్, 7-సీటర్ పొడవాటి వీల్బేస్ మరియు తరువాత 2017 లో ఒక స్పోర్టియర్ ఫైవ్ సీటర్ కూప్ తో వచ్చే అవకాశం ఉంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన వోక్స్వాగన్ టిగువాన్ 2017-2020

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience