ఆలోచనలతో కారు డ్రైవింగ్? ఇది నిజం !
డిసెంబర్ 09, 2015 06:58 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
నాంకై యూనివర్సిటీకి చెందిన చైనీస్ పరిశోధకులు "బ్రెయిన్ ఆధారిత కారును"విజయవంతంగా తయారుచేశారు. ఈ కారు పూర్తిగా ఆలోచనలతో నియంత్రించబడుతుంది. పరిశోధకులు ఈ కారును తీసుకురావడంలో దాదాపు రెండు సంవత్సరాలు టియాంజిన్ నగరంలోనే గడిపారు.
కేవలం కారు డ్రైవర్ ఆలోచనలతో ముందుకు, వెనక్కు వెళ్ళవచ్చు, వెళ్ళి ఆగవచ్చు, కారు లాక్ మరియు అన్-లాక్ చేయవచ్చు. పరిశోధకులు జాంగ్ జావో చెప్పినట్టు," ఈ కారులో ఉపయోగించిన బ్రెయిన్ సిగ్నల్-రీడింగ్ పరికరం 16 సెన్సార్లు కలిగి ఉండి డ్రైవర్ యొక్క మెదడు నుండి వివిధ ఈఈజి (ఎలక్ట్రోఎన్సుఫలోగ్రం) సిగ్నల్స్ ను బంధించే లక్షణం కలిగి ఉంటుంది. ఈ సంకేతాలను గ్రహించి ఒక అభివృద్ధి పరిచిన కంప్యూటర్ ప్రోగ్రామ్ తో కలిపినపుడు, ఇది తిరిగి క్రమంగా కారును నియంత్రించే పని చేస్తుంది. టెస్టర్ యొక్క ఈఈజి సిగ్నల్స్ ను ఈ పరికరం (బ్రెయిన్ సిగ్నల్-రీడింగ్) గ్రహించి వైర్-లెస్ ట్రాన్స్మిషన్ ద్వారా కంప్యూటర్ కు చేరవేస్తుంది. కంప్యూటర్ సంకేతాలను ప్రోసెస్ చేసి డ్రైవర్ లేదా ప్రజల ఉద్దేశాలను గుర్తించి, అప్పుడు కారును కంట్రోల్ చేసే కమాండ్ రూపం లోకి మారుస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో ప్రధాన భాగం ఈగ్ సిగ్నల్స్ ని ప్రాసెస్ చేయడం కంప్యూటర్ లో జరుగుతుంది."
ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని నడిపించిన అసోసియేట్ ప్రొఫెసర్ డువాన్ ఫెంగ్,దీనిని వివరిస్తూ, "టెక్నాలజీ మానవుల అభివృద్దికోసం చేయబడినది. మెదడును కంట్రోల్ చేసే, డ్రైవర్ లేకుండా వెళ్లే కార్లను తయారుచేసే సామర్ధ్యం మానవులకి ఉంది. డ్రైవర్ లేని కార్లను ఇంకా అభివృద్డిలోకి తేవడం వలన చాలా ప్రయోజనలున్నాయి. దీనివలన బ్రెయిన్ కంట్రోలింగ్ కి సంభంధించిన విధులను చాలావరకు తెలుసుకోవచ్చు. " చివరికి ఏదో ఒక విధంగా కార్లు ( డ్రైవర్ లేదా డ్రైవర్ లెస్) మరియు యంత్రాలు ప్రజలకు పనికొస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో ప్రజల కోరికలను తప్పక గుర్తించాల్సి ఉంటుంది. మా ప్రాజెక్ట్ వలన కార్లు మానవులకి ఇంకా బాగా పనికొస్తాయి".
ప్రాజెక్టు వెనుక కారణాలని జాంగ్ వ్యక్తం చేస్తూ," ఈ ప్రాజెక్టుకు రెండు ప్రారంభ దశలు ఉన్నాయి. మొదటిది చేతులు లేదా కాళ్ళు సరిగా ఉపయోగించలేని వికలాంగులకు వాటి అవసరం లేకుండా డ్రైవింగ్ అందించడం: రెండోది ఆరోగ్యవంతమైన ఒక కొత్త మరియు మరింత ఇంటెలెక్చ్యూవలైస్డ్ డ్రైవింగ్ మోడ్ ని ప్రజల్‌కి అందించడం ".
ప్రస్తుతానికి,ఈ కారు ఆలోచనలపై తిన్నగా మాత్రమే వెళ్లేలా చేయగలం మరియు ఈ బ్రెయిన్ ఆధారిత కారును ఉత్పత్తి చేసే ప్రణాళికలు ఏమీ లేవు.
ఇది కూడా చదవండి: