2024లో మీ ముందుకు రానున్న 3 కొత్త Maruti కార్లు

మారుతి ఈవిఎక్స్ కోసం shreyash ద్వారా డిసెంబర్ 21, 2023 11:25 am ప్రచురించబడింది

  • 138 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2024లో, ఈ భారతీయ కారు తయారీదారు, రెండు కొత్త-జనరేషన్ మోడల్ؚలను, అంతేకాకుండా తమ మొట్టమొదటి EVను కూడా విడుదల చేయనుంది

భారతదేశపు అతి పెద్ద కార్ కంపెనీ, మారుతి సుజుకి తన విస్తృతమైన వాహనాల లైన్అప్ؚకు మారుతి జిమ్నీ, మారుతి ఫ్రాంక్స్ మరియు మారుతి ఇన్విక్టో అనే మూడు పూర్తిగా సరికొత్త మోడల్ؚలను పరిచయం చేయడం ద్వారా 2023 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించనుంది. రానున్న 2024లో, ఈ కారు తయారీదారు మూడు కొత్త కార్ల విడుదల ప్రణాళికతో మరింత వృద్ధిని సాధించబోతోంది, ఇందులో ఒకటి దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మొదటి ఎలక్ట్రిక్ వాహనం (EV) కూడా ఉంది.

కొత్త-జనరేషన్ మారుతి స్విఫ్ట్

అంచనా విడుదల: మార్చి 2024

అంచనా ధర: రూ 6 లక్షల నుండి

2024 Suzuki Swift

నాలుగవ-జనరేషన్ సుజుకి స్విఫ్ట్ ఇప్పటికే తన సొంత దేశం జపాన్ؚలో ప్రదర్శించబడింది, దీని అనేక స్పెసిఫికేషన్ؚలు కూడా వెల్లడించబడ్డాయి. కొత్త-జెన్ హ్యాచ్ؚబ్యాక్, రీడిజైన్ చేసిన ఇంటీరియర్ؚను కలిగి ఉంటుంది, బయటి వైపు చేసిన డిజైన్ మార్పులు కూడా ప్రగతిశీలమైనవి, వీటి వలన ఎక్స్ؚటీరియర్ మరింత షార్ప్ؚగా, అయితే గుర్తించగలిగినదిగా ఉండనుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా CVTకు జోడించబడే కొత్త 1.2-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ؚతో (82PS/108Nm) వస్తుందని నివేదించబడింది. జపాన్ؚలో స్విఫ్ట్ పెట్రోల్ మరియు హైబ్రిడ్ రెండు వర్షన్ؚలలో, ఆల్-వీల్-డ్రైవ్ (AWD) ఎంపికతో లభిస్తుంది. అయితే, భారతదేశంలో, ఈ స్పెసిఫికేషన్ؚలు మారవచ్చు మరియు హైబ్రిడ్ మరియు AWD వర్షన్ؚలు పరిగణించబడలేదు.

దీనిని కూడా చూడండి: రాబోయే మహీంద్రా థార్ 5-డోర్ కోసం ట్రేడ్ؚమార్క్ చేసిన 7 పేర్లలో ఒకటి “ఆర్మడా”    

మారుతి eVX

అంచనా విడుదల: ఏప్రిల్ 2024

అంచనా ధర: రూ 22 లక్షల నుండి ప్రారంభం

Maruti eVX

2024లో, భారతీయ కారు తయారీదారు నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం మారుతి eVX విడుదల కావడాన్ని చూడవచ్చు. ప్రొడక్షన్ؚకు సిద్ధంగా ఉన్న ఈ ఎలక్ట్రిక్ SUV మోడల్ؚను ఇటీవల జపాన్ మొబిలిటీ షో 2023లో ప్రదర్శించారు. ఈ EV, తుది డిజైన్ؚను దాచిపెట్టేందుకు తాత్కాలిక హెడ్ؚలైట్ؚలు మరియు టెయిల్ లైట్ؚలతో, భారతీయ రోడ్ల పైన టెస్ట్ చేయబడుతూ అనేకసార్లు కనిపించింది. ఫీచర్ల విషయంలో,  ఇంటిగ్రేటెడ్ డిస్ప్లే సెట్అప్ (ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్), 360-డిగ్రీల కెమెరా కూడా ఉంటాయని అంచనా. ఈ eVX, డ్యూయల్-మోటార్ సెట్అప్ؚతో జోడించిన 60kWh బ్యాటరీ ప్యాక్ؚను ఉపయోగిస్తుంది, 550 km పరిధిని అందించనుంది.

ఇది కూడా చూడండి:  2024లో ఏడు కార్లను విడుదల చేస్తున్నట్లు నిర్ధారించిన టాటా

కొత్త-జెన్ మారుతి డిజైర్

అంచనా విడుదల: 2024 మధ్య కాలంలో

అంచనా ధర: రూ 6.5 లక్షల నుండి ప్రారంభం

మారుతి డిజైర్ ప్రస్తుత జనరేషన్ మోడల్ؚ 2017లో పరిచయం చేయబడింది మరియు 2020లో చివరిగా అప్ؚడేట్ؚను అందుకుంది. ప్రస్తుతం, స్విఫ్ట్-ఆధారిత సబ్-4m సెడాన్ జనరేషనల్ అప్ؚడేట్ؚకు సిద్ధంగా ఉంది. కొత్త-జనరేషన్ స్విఫ్ట్ పై ఆధారపడిన, డిజైర్ సమగ్రమైన అప్ؚడేట్ؚను అందుకుంటుందని అంచనా, దీనిలో కొత్త డిజైన్ మరియు భారీ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ మరియు 6 ఎయిర్ బ్యాగ్ؚలు వంటి సరికొత్త ఫీచర్ల సెట్ ఉంటాయని అంచనా. కొత్త స్విఫ్ట్ؚలో ఉన్న అదే పవర్ؚట్రెయిన్ అప్ؚడేట్ؚను కూడా పొందుతుంది.

2024లో ఫీచర్ జోడింపుల విషయంలో ఇతర మారుతి మోడల్ؚలకు తేలికపాటి సవరణలు కూడా ఉంటాయని అంచనా. ఈ కొత్త మారుతి కార్లలో దేని కోసం మీకు ఎక్కువగా వేచి చూస్తున్నాను? క్రింద కామెంట్ సెక్షన్ؚలో మాకు తెలియజేయండి.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మారుతి ఈవిఎక్స్

Read Full News

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience