• English
  • Login / Register

లీకైన 2018 టయోటా రష్ చిత్రాలు

టయోటా రష్ కోసం cardekho ద్వారా మార్చి 19, 2019 11:38 am ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Next-gen Toyota Rush

తరువాతి తరం టయోటా రష్ నవంబరు 23న అధికారికంగా విడుదల చేయబడుతుంది. బ్రోచర్ లో చిత్రాలను అందించడం ప్రారంభించారు. కాంపాక్ట్ 7- సీటర్ ఎస్యువి, అభివృద్ధి చెందుతున్న ఆగ్నేయ ఆసియా మార్కెట్లలో విక్రయిస్తుంది మరియు దాని బంధువు డైహాత్సు టెరియోస్ తో పంచుకోనుంది.

మొదటిగా విడుదల అయిన చిత్రాలు, ఎస్యువి యొక్క బాహ్య ప్రదర్శనలను చూపిస్తాయి. అంతేకాకుండా ఇది మొదటి చూపులోనే, అవుట్గోయింగ్ మోడల్ కన్నా పొడవుగా మరియు విస్తృతమైనదిగా కనిపిస్తుంది. ముందు భాగంలో అందించబడిన ఎల్ఈడి హెడ్ల్యాంప్లలో ఒక జత ఎల్ఈడి డే టైం రన్నింగ్ లైట్లు ఉన్నాయి. ముందుభాగం సహేతుకంగా ఆధునికమైనదిగా కనిపిస్తోంది, అయితే సైడ్ మరియు వెనుక కోణాలు ప్రయోజనకరమైన ప్రకంపనాలను కలిగి ఉంటాయి. మొత్తం ప్రొఫైల్ టొయోటా ఇన్నోవా క్రైస్టాను చాలా వరకు పోలి ఉంటుంది. బూటు కు ఒక విడి చక్రం అమర్చబడి ఉంటుంది మరియు సున్నితమైన వక్రత లేకపోవడం వలన కఠినమైనదిగా కనిపిస్తుంది.

Next-gen Toyota Rush

లోపలి భాగం విషయానికి వస్తే, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ దాని ముందు 2- దిన్ మ్యూజిక్ సిస్టమ్ను భర్తీస్తుందని తాజా అంతర్గత చిత్రాలు తెలుపుతాయి. 360 డిగ్రీ కెమెరా అందించబడే ప్యాకేజీలో భాగంగా ఉంది. డాష్ బోర్డు కు రెండు రంగుల పధకం అందించబడుతుంది. కానీ సాఫ్ట్- టచ్ లేత గోధుమరంగు పలకలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. డోర్ ప్యాడ్ లు కూడా 2- రంగులతో విభిన్న షేడ్స్ తో అందించబడ్డాయి. భద్రత విషయానికి వస్తే, టయోటా రష్ ప్రస్తుత మోడల్లో కేవలం రెండు మాత్రమే ఉండగా రాబోయే మోడల్ ఆరు ఎయిర్బాగ్లను పొందుతుంది.

Dashboard: Next-gen Toyota Rush

ఇది కొత్త లేదా నవీకరించబడిన ఇంజిన్ లేదా గేర్బాక్స్ పొండిందో లేదో మేము త్వరలోనే కనుగొంటాము. మలేషియాలో ప్రస్తుతం ఉన్న రష్ 4- సిలిండర్ 1.5 లీటర్ పెట్రోల్ మోటర్ తో అందుబాటులో ఉంది, ఇది 4- స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ లేదా 5 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ యొక్క ఉత్పత్తుల విషయానికి వస్తే, ఈ ఇంజన్ గరిష్టంగా 109 పిఎస్ పవర్ ను అలాగే 141 ఎన్ఎమ్ గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

Interior - Next-gen Toyota Rush

మొదటి తరం రష్ దాని సంస్థ లో విజయం సాధించిన వాహనం మార్గంలో పది సంవత్సరాల పాటు కొనసాగించబడింది. ఇప్పటివరకు టయోటా ఇండియా ఎటువంటి సూచనలను తీసుకోని రాలేదు. అయితే ఈ రష్ వాహనం- మారుతి సుజుకి ఎర్టిగా కు ప్రత్యర్థిగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇది 7- సీట్ల వాహన విక్రయాలలో 6- 10 లక్షల ధరల శ్రేణిని కలిగి ఉంది. రష్, ఎంపివి కేటగిరిలో మరచిపోకుండా మరొక ఎంపిక ను అందించనుంది.

 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

Write your Comment on Toyota రష్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience