2015 ఫ్ర్యాంక్ఫర్ట్ మోటార్ షో లో కొత్త టిగ్వాన్ ని ప్రదర్శించనున్న ఫోక్స్వ్యాగన్

వోక్స్వాగన్ టిగువాన్ 2017-2020 కోసం nabeel ద్వారా సెప్టెంబర్ 15, 2015 03:12 pm సవరించబడింది

  • 14 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫోక్స్వ్యాగన్  కూడా రాబోయే సంవత్సరాల్లో భారతదేశం లో ఈ ఎస్యువి ప్రారంభం కానున్నదని భావిస్తున్నారు!!

జైపూర్:

ఫోక్స్వ్యాగన్   వారు 17 నుండి 27 సెప్టెంబర్ లో ప్రారంభించబోయే ఫ్రాంక్ఫర్ట్ ఐఎ ఎ వద్ద వారి కొత్త టిగ్వాన్ ని ప్రదర్శించనట్టుగా ప్రకటించారు. టిగ్వాన్ వాహనం టిగ్వాన్ ఆర్-లైన్, క్లాసిక్ ఆన్-రోడ్ మోడల్ మరియు ఆఫ్-రోడ్ వెర్షన్ అనే మూడు వెర్షన్లలో లభిస్తుంది. కాన్సెప్ట్ ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వేరియంట్ ని కూడా ప్రదర్శించనున్నది. ఆ హైబ్రిడ్ వేరియంట్ టిగ్వాన్ జిటీ ఇ గా పిలవబడి 160kW/218PS శక్తి వ్యవస్థను కలిగి ఉంటుంది.

కొత్త టిగ్వాన్ లో 8 వివిధ ఇంజిన్లు ఉండి 85 kW / 115 PS మరియు 176 kW / 240 PS మధ్య శక్తి అవుట్పుట్లను కలిగి ఉంటాయి. ఇంధన సామర్ధ్యం గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. జర్మన్లు వారి కొత్త మరియు మరింత శక్తివంతమైన టిగ్వాన్ మునుపటి నమూనాల కంటే 24 శాతం ఎక్కువగా ఇంధన సామర్థ్యం అందిస్తుందని తెలిపారు. ఎస్యువి లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న కొత్త 4-మోషన్ యాక్టీవ్ కంట్రోల్ 4-వీల్ డ్రైవ్ వ్యవస్థ అన్ని రకాల డ్రైవింగ్ పరిస్థితులు స్వీకరించడాన్ని సులువు చేస్తుంది. ఈ ఎస్యువి సిటీ ఎమెర్జెన్సీ బ్రేకింగ్ తో ముందర సహాయం మరియు పెడస్ట్రాన్ మోనిటరింగ్, లేన్ సహాయం మరియు ఆటోమెటిక్ పోస్ట్ కొలిజన్ బ్రేకింగ్ వ్యవస్థ వంటి అన్ని లక్షణాలని  ప్రామాణికంగా కలిగి ఉంది. అలాగే, ఇది ఎంక్యుబి(మాడ్యులర్ ట్రాన్స్వర్స్ మాట్రిక్స్) వేధిక ఆధారంగా వచ్చిన మొదటి ఫోక్స్వ్యాగన్   ఎస్యువి. అనగా, టిగ్వాన్ 2,500 కిలోల లోడ్ ని తట్టుకునేలా రూపొందించబడినది. ఇది కారవాన్ కుటుంబాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

టిగ్వాన్ యొక్క కొత్త మోడల్ మునుపటి మోడల్ కంటే 50 కిలోల పైగా తేలికైనది. ఇప్పుడు దీనిలో 615 లీటర్ల బూట్ సామర్ధ్యం ఉన్న కారణంగా ఎక్కువ సామాను తీసుకెళ్ళవచ్చు. ఈ బూట్ సామర్ధ్యాన్ని వెనుక సీట్లు మడవడం ద్వారా 1,655 లీటర్ల వరకూ విస్తరించవచ్చు. ఇది మునుపటి మోడల్ నుండి 145 లీటర్లు లబ్ది పొందింది. టిగ్వాన్ ఆటోమేటిక్ యాక్సిడెంట్ నోటిఫికేషన్, ఆన్లైన్ ట్రాఫిక్ మరియు పార్కింగ్ స్పేస్ సమాచారం మరియు వాహన స్థితి నివేదిక వంటి ఆన్లైన్ సహాయక లక్షణాలను కూడా కలిగి ఉంది. ఈ కారు డ్రైవింగ్ సమయంలో వినియోగదారు ఫోన్ విధులు నిర్వహించుకునేందుకు ఆండ్రాయిడ్ మరియు యాపిల్ స్మార్ట్ ఫోన్లు మరియు యాప్ కనెక్ట్ ద్వారా టాబ్లెట్లు మరియు మీడియా కంట్రోల్ యాప్ వంటి వాటితో అనుసంధానించబడి ఉంది.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన వోక్స్వాగన్ టిగువాన్ 2017-2020

Read Full News

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience