• English
  • Login / Register

# 2015FrankfurtMotorShow: శాంటా-ఫే ఫేస్ లిఫ్ట్ బహిర్గతం

హ్యుందాయ్ శాంటా ఫి కోసం manish ద్వారా సెప్టెంబర్ 15, 2015 04:06 pm ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కారు వచ్చే ఏడాది భారతదేశం లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

జైపూర్: ఈ సంవత్సరం క్రిస్మస్ తొందరగా వస్తునట్టు కనిపిస్తుంది. హ్యుందాయ్ 2015 ఫ్రాంక్ఫర్డ్ ఇంటర్నేషనల్ మోటార్ షో లో భారతదేశం ఆదరించిన శాంటా-ఫే ను బహిర్గతం చేసింది. కారు కొరియన్ వాహనతయారీదారులు అందించే అత్యంత గుర్తింపు పొందిన లగ్జరీ బ్యాడ్జులలో ఒకటి. బాహ్య భాగంలో హ్యుందాయి క్రోం చేరికలు కలిగియున్న హెక్సాగొనల్ ముందరి గ్రిల్ ని కలిగి ఉంది. అలానే కారు పునఃరూపకల్పన చేయబడిన ముందు మరియు వెనుక బంపర్స్ తో అమర్చబడి ఉంది. హెడ్ల్యాంప్స్ కొత్త వెండి చేరికలతో ఎల్ ఇడి పగటి పూట నడిచే లైట్లను కలిగి ఉంది. హెడ్ల్యాంప్స్ ఒక కొత్త నమూనాలో జినాన్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ తో వస్తాయి మరియు వెనుక టెయిల్ లైట్స్ స్వచ్చమైన ఎల్ ఇడి గ్రాఫిక్ ని అందుకుటుంది.

ఈ కారు అత్యుత్తమమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది. ఇది హ్యుందాయ్ మోటార్స్ గ్లోబల్ భద్రత తత్వశాస్త్రం తో కూడి ఉంది. ఇది ఊహించని అత్యవసర పరిస్థితులలో అవసరమైతే అటానమస్ అత్యవసర బ్రేకింగ్ అలర్ట్స్ వంటి లక్షణాన్ని కలిగి ఉంది. ఇంకా కారులో అధిక ప్రమాణం గల రాడార్ మరియు కెమెరా సెన్సార్లు వంటి పరికరాలు అందించబడుతున్నవి. ఈ పరికరం సమీపించే వాహనాలను గుర్తించేందుకు 360 వీక్షణ అందిస్తుంది మరియు బ్లైండ్ స్పాట్ మరియు సూచన తొలగించడానికి మరియు ఒక ఆసన్న ప్రమాదం నివారించడానికి సహాయపడుతుంది.

హ్యుందాయ్ శాంటా-ఫే యొక్క లోపల డి ఎబి డిజిటల్ రేడియో మరియు ఇన్ఫినిటీ ప్రీమియం సౌండ్ తో కలిసియున్న కొరియన్ వాహనతయారీసంస్థ ఆడియో విజువల్ నావిగేషన్ వ్యవస్థతో ఉంది. దీని ద్వారా హ్యుందాయ్ సంస్థ ప్రయాణికులకు అధిక నాణ్యత ఇంటర్ఫేస్ ని అందిస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఇన్ఫినిటీ ప్రీమియం సరౌండ్ ఆడియో సిస్టమ్ 12 స్పీకర్లతో 630 వాట్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. కారు బహుళ పరిమాణాల సరౌండ్ సౌండ్ అనుభూతిని అందించే క్వ్వంటం లాజిక్ సరౌండ్ ని కూడా కలిగి ఉంది. ప్రయాణీకుల సౌకర్యం మరియు సౌలభ్యం విస్తరింపజేసేందుకు ప్రయాణికులు రెండవ వరుసలో సీట్లు స్లయిడింగ్ సర్దుబాటును కలిగి ఉన్నారు. ఇది 15mm అదనపు ప్రయాణానికి సహాయపడుతుంది మరియు 270mm మొత్తం సర్దుబాటుకు జతచేస్తుంది.

కొత్త శాంటా ఫే కొత్త 2.2 లీటర్ సీఅర్ డి ఐ డీజిల్ ఇంజిన్ తో వస్తుంది. ఇది హ్యుందాయ్ యొక్క మరింత శక్తివంతమైన యూనిట్. ఈ ప్రామాణిక ఇంజిన్ 200bhp శక్తిని మరియు 440Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ వేరియంట్ లో, మెరుగైన థెటా ఈఈ 2.4 లీటర్ ఇంజన్ 187bhp శక్తిని మరియు 241Nm టార్క్ ని అందిస్తుంది. ఈ పవర్ప్లాంట్స్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో ఒక ప్రామాణిక ఆరు స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ తో జతచేయబడి ఉంటుంది.

was this article helpful ?

Write your Comment on Hyundai శాంటా ఫి

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience