2015 బీఎండబ్ల్యూ ఎక్స్6 రూ.1.15 కోట్ల ఎక్స్-షోరూం ధర వద్ద విడుదల అయ్యింది
బిఎండబ్ల్యూ ఎక్స్6 2014-2019 కోసం raunak ద్వారా జూలై 23, 2015 02:30 pm ప్రచురించబడింది
- 13 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: బీఎండబ్ల్యూ భారతదేశం వారు 2015 ఎక్స్6 ని ఆస్చర్య పరిచే రూ.1.5 కోట్ల ధరకి విడుదల చేశారు (ఎక్స్-షోరూం). ఈ రెండో తరం కూపే స్టైల్ కలిగిన క్రాస్-ఓవర్ ఇప్పుడు ఎక్స్-రేంజ్ ఎస్యూవీలు అయిన ఎక్స్1, ఎక్స్3 మరియూ ఎక్స్5 సరసన చేరింది. ఈ 2015 వాహనం మొదటి తరం ఎక్స్6 నుండి కొన్ని లక్షణాలను ఉంచుకుని కొత్త పరిణతి చెందిన లఖ్సణాలను పునికి తెచ్చుకుంది.
యాంత్రికంగా, ఎక్స్6 రెండు పెట్రోల్ ఆప్షన్లతో ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది, అయితే, భారతదేశంలో మాత్రం కేవలం 3.0-లీటరు ఇన్లైన్ 6-సిలిండర్ల డీజిల్ తో మాత్రమే లభ్యం అవుతుంది. ఈ ఎక్స్ డ్రైవ్40డీ ఎం స్పోర్ట్ వేరియంట్ 4,400rpm వద్ద 313Ps ని మరియూ 1500-2500rpm వద్ద 630Nm ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిను 8-స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా అన్ని నలుగు వీల్స్ కి శక్తిని అందిస్తుంది. రెండో తరం ఎక్స్6 అయితే 100Kmph ని 5.8 సెకండ్లలో చేరుకోవడమే కాకుండా, 240Kmph గరిష్ట వేగాన్ని కూడా చేరుకుంటుంది.
కొత్త ఎక్స్6 గురించి మాట్లాడుతూ, దాదాపు 40 కిలోలు తగ్గి మునుపటి వాహనం లాగానే 50:50 బరువు పంపిణీ తో వస్తోంది. బీఎండబ్ల్యూ వారి ఎం వర్షన్ అయీన ఎక్స్6 ఎం ని కూడా ఈ సంవత్సరం చివరిలో విడుదల చేస్తుంది. ఈ బీఎండబ్ల్యూ ఎక్స్6 ఎం కి ఉధ్బవించిన వీ8 యూనిట్ తో ఎం ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీతో 583Ps ని మరియూ 750Nm యొక్క టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ స్టెప్ట్రానిక్ ట్రాన్స్మిషన్ డ్రైవ్ లాజిక్ తో అందుబాటులో ఉంటుంది.