Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

100,000 కార్లను మెక్సికో కి రవాణా చేసిన ఫోక్స్వ్యాగన్ ఇండియా

ఆగష్టు 21, 2015 01:57 pm manish ద్వారా ప్రచురించబడింది

పూనే సమీపంలో ఉన్న చకన్ ప్లాంట్ 100,000 ' మేడ్ ఇన్ ఇండియా' ఫోక్స్వ్యాగన్ కార్లను మెక్సికన్ మార్కెట్ కి రవాణా నిర్వహించేదని ఫోక్స్వ్యాగన్ ఇండియా సంస్థ వెల్లడించింది. భారతదేశం నుండి మెక్సికో కారు ఎగుమతులు ప్రారంభం అయిన రెండు సంవత్సరాలలో పే చాలా ఎగుమతులు చేసి పూనే సౌకర్యం ద్వారా మైలురాయిని చేరుకుంది. మెక్సికన్ మార్కెట్ లో అందుబాటులో ఉన్న జెట్టా క్లాసికో మోడల్ పూనే లో నిర్మించిన వెంటో ద్వారా భర్తీ చేయబడింది. 2015 మొదటి భాగంలో మెక్సికో లో ప్రముఖంగా అమ్ముడుపోయిన కార్లలో మొదటి మూడిటిలో ' మేడ్ ఇన్ ఇండియా' వెంటో మధ్య స్థానంలో ఉంది.అని సంస్థ వెల్లడించింది.

చివరి 2014లో చకన్ లో నిర్మించబడిన ఫోక్స్వ్యాగన్ పోలో కూడా ఫోక్స్వ్యాగన్ ద్వారా మెక్సికో కి దాని ఎగుమతి ప్రారంభించింది. 2014 పూనే ప్లాంట్ లో ఉత్పత్తి అయిన ప్రతీ కారు మెక్సికో కి ఎగుమతి చేయబడింది. వెంటో మరియు పోలో రెండూ కూడా ప్రస్తుతం ఆసియా,ఆఫ్రికా మరియు ఉత్తర అమెరికాలో 32 దేశాలకు ఎగుమతి చేయబడుతున్నాయి. ఆయా దేశాలలో కార్లు ఫోక్స్వ్యాగన్ ఇండియా ద్వారా ఎడమ చేతి మరియు కుడి చేతివైపు డ్రైవింగ్ ఆకృతీకరణలతో అందుబాటులో ఉన్నాయి.

ఫోక్స్వ్యాగన్ ఇండియా, లాజిస్టిక్స్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్స్టేన్ గొరాన్ష్ మాట్లాడుతూ" సంస్థ యొక్క ప్రాధమిక దృష్టి భారతదేశం లో దేశీయ మార్కెట్లో ఉంది. అయితే,ఎగుమతి మార్కెట్లలో అడుగు పెట్టాలనే నిర్ణయంతో మేము మా చర్యలను భారతదేశంలో విస్తారంగా మరియు ఆర్థికపరంగా స్థిరంగా నిలబెట్టాలి. మెక్సికో వంటి కీలక మార్కెట్ లో మా కార్లు అత్యధిక విజయం సాధించడంతో మేము మా కార్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి మంచి ఆస్కారం లభించింది." అని తెలిపారు.

m
ద్వారా ప్రచురించబడినది

manish

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర