వోక్స్వాగన్ పోలో GT TSI: నిపుణుల సమీక్ష
Published On మే 10, 2019 By అభిజీత్ for వోక్స్వాగన్ పోలో 2015-2019
- 0K View
- Write a comment
దీనిలో మనం చూడాల్సిన విషయాలు:
- అద్భుతమైన ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ కలయిక
- అద్భుతమైన పనితీరు మరియు నిర్వహణ
-అద్భుతమైన మరియు క్లాస్సి నిర్మాణ నాణ్యత
మీరు రెండుసార్లు ఆలోచించేలా చేసే విషయాలు:
-ఖరీదైన సర్వీస్ మరియు విడి భాగాలు
-వెనుక క్యాబిన్ స్థలం
చాలా ఖచ్చితమైన హాచ్బ్యాక్ కి దగ్గరగా ఉంది, వోక్స్వ్యాగన్ పోలో జిటి టిఎస్ఐ దేశవ్యాప్తంగా ఔత్సాహికుల నుండి ప్రశంసలు పొందింది. చిన్న చిన్న నగరాలలో తిరగడానికి వీలుగా ఉండేలా చాలా ఆధునికమైన 1.2 లీటర్ TSI (టర్బో స్ట్రాటిఫైడ్ ఇంజెక్షన్) ఇంజిన్ తో వచ్చింది మరియు ఇది త్వరగా రెస్పాండ్ అయ్యే 7-స్పీడ్ DSG ట్రాన్స్మిషన్ ని అందిస్తుంది. వినియోగదారులు దీనిని సులభంగా ఇష్టపడతారు, ఎందుకంటే ఇది నా కారు అనే తృప్తి ని అందిస్తుంది మరియు మంచి ఇంధన సామర్ధ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అభ్యున్నతికి అనుగుణంగా, వోక్స్వ్యాగన్ ఇండియా ఈ సులభంగా వెళ్ళే హ్యాచ్‌బ్యాక్ కి ఒక నవీకరణను ఇచ్చింది. ఇది గతంలో మా సంతోషకరమైన సమయాన్ని పునరుద్ధరించిందని చెప్పనవసరం లేదు.
డిజైన్(4/5):
దీనిలో నవీకరణలు ముందర ఉన్నాయి మరియు వెనక ఉన్నాయి, కానీ అంతగా కనిపిచవు, అయినా సరే మంచి తాజా లుక్ ని అందిస్తుంది. ఒరిజినల్ కారు ఇప్పటికే చూడడానికి చాలా బాగుంది మరియు ముందు భాగంలో ఉన్న లైట్ క్రోమ్ స్ట్రిప్ మరింత స్టైల్ ని జతచేస్తుంది.
దీనిలో రేర్ వ్యూ మిర్రర్స్ ఇప్పుడు పూర్తిగా వెనుక స్పాయిలర్ తో పాటూ పూర్తి నల్లని రంగులో వస్తున్నాయి. ఈ వివరాలు చాలా చిన్నగా అనిపించినా కానీ GT మొత్తం ఆలోచనలో మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ముందు గ్రిల్ మరియు రేర్ టెయిల్గేట్ స్పోర్ట్ మీద GT బ్యాడ్జ్ అనేది ఉంటుంది మరియు రేర్ ప్యానెల్స్ మీద GT TSI డెకెల్స్ ఉంటాయి.
వెనుక భాగం వెనుక బంపర్ దిగువన ఎర్ర రిఫ్లెక్టర్లు యొక్క సూచనతో సాదా మరియు సూక్ష్మంగా ఉంటుంది. పోలో యొక్క మొత్తం డిజైన్ ఇప్పటికీ మొత్తం వర్గంలో తాజాగా ఉంటుంది. వోక్స్వ్యాగన్ సంస్థ GT కి మరిన్ని స్టయిలింగ్ అంశాలని ఇచ్చి ఉంటే బాగుంటుంది. ఇది కేవలం సాధారణ పోలో శ్రేణి వలె కనిపిస్తుంది. దీని యొక్క స్టయిలింగ్ లో ఎటువంటి సమస్యలు లేవు, కానీ ఔత్సాహికులు అధనంగా డబ్బులు చెల్లిస్తున్నారంటే అధనపు లక్షణాలను కోరుకుంటారు.
లోపల భాగాలు(4.5/5):
అద్భుతం,సాదా మరియు సాధారణ ఈ పదాలతో GT TSI యొక్క క్యాబిన్ ని వర్ణించవచ్చు. కారు లోపల భాగాలు అన్నీ కూడా ఉపయోగించుకోవడానికి వీలుగా మరియు అర్ధం అయ్యేలా అమర్చడం జరిగింది. దీని డాష్బోర్డ్ కి పియానో బ్లాక్ కలర్ చేరికలతో పాటూ ఫ్లాట్ బోటం స్టీరింగ్ మరింత బ్లాక్ రంగుతో ఉండేలా నవీకరణలు జరిగాయి.
నాణ్యత మరియు ఫిట్టింగ్-ఫినిషింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది, హెడ్లైట్ లెవెలింగ్ రోలర్ మాత్రమే దీనిలో కొంచెం చీప్ గా అనిపిస్తుంది. స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ మరియు హ్యాండ్ బ్రేక్ లివర్ పై చక్కటి లెథర్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది మరియు పట్టుకోడానికి సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, USB/ AUX / SD కార్డ్ / బ్లూటూత్ టెలిఫోనీతో 4-స్పీకర్ ఆడియో వ్యవస్థ మరియు మల్టీ ఫంక్షనల్ డ్రైవర్ డిస్ప్లే తో అన్ని లక్షణాలు ఉన్నాయి.
దీనిలో మిస్ అయిన ఒక లక్షణం ఏమిటంటే డ్రైవర్ కి హ్యాండ్ రెస్ట్ ఉండదు, ఇది ఒక ఆటోమెటిక్ కాబట్టి ఎడమ చేతికి విశ్రాంతి తీసుకోడానికి కొంచెం సపోర్ట్ ఉండాలి. అల్యూమినియం పెడల్ క్లస్టర్ ఒక మంచి టచ్ ని కలిగి ఉంటుంది మరియు ఈ హ్యాచ్బ్యాక్ కి మంచి ఆకర్షణీయతను జోడిస్తుంది. ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు మరియు రేక్ మరియు రీచ్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ చేరుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. కానీ సరైన స్థానంలో రావడానికి కొంచెం సమయం పడుతుంది.
దీనిలో కొంచెం నిరాశ పరిచే అంశం ఏమిటంటే వెనకాతల క్యాబిన్ స్పేస్, దాని యొక్క పోటీదారులతో పోల్చి చూసుకుంటే అది చాలా తక్కువ ఉంటుంది. వెనుక సీట్లలో ఇద్దరు ప్యాసింజర్లు కూర్చోడానికి స్థలం ఉంటుంది, కానీ లెగ్రూం దగ్గర ఇబ్బంది పడతారు. అయితే ఈ రాజీ పడడం వలన వాస్తవానికి చాలా పెద్ద బూట్ స్పేస్ వస్తుంది మరియు దానివలన మీరు చాలా లగేజ్ పెట్టుకోవచ్చు.
ఇంజన్ మరియు పనితీరు(4.5/5):
ఈ అద్భుతమైన కారులో ప్రధాన అంశం ఏమిటంటే దాని ఇంజన్. వాస్తవానికి ఈ ఫేస్లిఫ్ట్ లో అది మార్చబడలేదు. ఇది అదే 1,197cc 4 సిలిండర్ TSI ఇంజిన్ తో 5,000Rpm వద్ద 103.5bhp గరిష్ట శక్తిని అభివృద్ధి చేస్తుంది. 1,500Rpm నుండి 4,100Rpm వరకు తక్కువ నుండి ప్రారంభించి ఒక ఆరోగ్యకరమైన టార్క్ 175Nm ని అందిస్తుంది.
1.8 లీటర్ టయోటా కరోల్ల 173Nm గరిష్ట టార్క్ అభివృద్ధి చేస్తుంది, కానీ మనది 1.2 లీటర్ ఇంజన్ మాత్రమే. ఇంకొక అద్భుతం ఏమిటంటే, ఈ ఇంజన్ 7-స్పీడ్ DSG (డైరెక్ట్ షిఫ్ట్ గేర్బాక్స్) తో అందించబడుతుంది మరియు దీనిలో ఏడు గేర్లు మరియు రెండు క్లచ్ లు కలిగి ఉంటుంది.
దీనిలో అద్భుతమైన ట్రాన్మిషన్ ని 10 సెకెన్లలో పోలో GT TSI స్ప్రింట్ ని 0 నుండి 100Kmph వరకూ తీసుకెళుతుంది. మా టెస్ట్ రన్ లో స్పీడోమీటర్ లో ఘనంగా 190Kmph చూశాము. గేర్ షిఫ్టులు చాలా త్వరగా ఉంటాయి మరియు మీరు DSG కంటే వేగంగా మార్చలేరు. ‘S' మోడ్ లో, ఉంటే గేర్బాక్స్ అదే గేర్ లో కొనసాగుతుంది.
దీనిలో ఉండే టిప్ ట్రానిక్ గేర్ లివర్ ద్వారా మాన్యువల్ ట్రాన్స్మిషన్ లో కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఓపెన్ రోడ్లు పై ఇంధన సామర్ధ్యం 14kmpl ఉంటుంది మరియు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో అయితే సామర్ధ్యం 11.3kmpl కు పడిపోతుంది. అయినప్పటికీ, అధిక వేగంతో హైవే మీద వెళితే 7 నుంచి 8 కిలోమీటర్ల వరకు సామర్థ్యాన్ని తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, పోలో ని లాగే ఇంజన్ 1.2 లీటర్ ఇంజన్ మాత్రమే కావున ఆ మైలేజ్ ని అందించడం సమంజసమే. హై స్పీడ్ లో ఉన్నప్పుడు ఇంజన్ కొంచెం వీక్ అవుతుంది కానీ దానిని ఎవరూ గమనించలేరు.
రైడ్ మరియు హ్యాండిలింగ్:
మళ్ళీ, పోలో GT TSI యొక్క స్వభావం మరియు ఎంత బాగా డ్రైవ్ ఉంటుందో తెలియాలంటే బాగా టైట్ కార్నర్స్ లో కానీ మరియు బాగా టర్నింగ్స్ ఉండే ప్రదేశాలలో తిప్పితే బాగా తెలుస్తుంది. దీని యొక్క చాసిస్ త్వరిత టర్న్స్ మరియు ఖచ్చితమైన నిర్వహణ కోసం సెటప్ చేయడం జరిగింది. కార్నర్స్ లో దీనిని ఎంత సులభంగా తిప్పగలమో తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు. దీని స్టీరింగ్ అనేది మంచి బరువుని కలిగి ఉంది, దాని వలన కార్నర్స్ లో సులభంగా తీయగలము.
మేము ఆశ్చర్యానికి గురి అయినట్టు స్టాక్ టైర్లు బాగా పనిచేస్తాయి. దీని ఉన్నత బ్రేకింగ్ మరియు సంతృప్తికరమైన గ్రిప్ ఉన్న టైర్లు వలన మనం ఆపాలి అన్న చోట కారు ఆగిపోతుంది. టైర్లు లో బాగా అతుక్కొనే శక్తి ఉండడం వలన సందులలో సులభంగా తిప్పే అవకాశం కలిగి ఉంది మరియు సమయాన్ని మిగిలిస్తుంది. ఇది ఒక స్పోర్టీ డ్రైవింగ్ లో మాత్రమే కాదు, ఇది ఈ సంస్థ యొక్క మెరుపు అని చెప్పవచ్చు.
ప్రతీరోజు వెళ్ళే రోడ్ మీద వేగంగా వెళ్ళలేము, అందువలన ఈ GT TSI సౌకర్యవంతమైన రిలాక్సింగ్ కారులో ప్రశాంతంగా మిమ్మల్ని ఇంటికి చేరుస్తుంది. దీనిలో సౌండ్ ఇన్సులేషన్ అనేది చాలా బాగుంటుంది, బయట నుండి వచ్చే శబ్ధాలు లోపలకి రానివ్వదు మరియు ఇంజన్ నోట్ మీరు ఫీల్ చేయవచ్చు. EBD మరియు ABS లు GT TSI లో ప్రామాణిక అమరికగా ఉంటాయి మరియు డ్రైవర్ మరియు ముందు ప్రయాణీకుల కోసం ఎయిర్బాగ్స్ ఉంటాయి.
తీర్పు:
GT TSI పూర్తిగా మీ హృదయాలని దోచుకుంటుంది. ఇది పోటీలో కొన్ని సంవత్సరాల కంటే ముందు ఉండి ప్రముఖమైన పనితీరు మరియు సాంకేతికతను అందిస్తుంది. ఈ చిన్న హాచ్బ్యాక్ డ్రైవ్ చేయడానికి చాలా చురుకైనది. ఈ కారు యొక్క ధర ని వినియోగదారులకి ఎవరూ పట్టించుకోరు, కానీ వోక్స్వ్యాగన్ యొక్క సేవ మరియు నిర్వహణ కి భయపడతారు.
దీని విడిభాగాలు చాలా ఖరీదైనవి మరియు సర్వీస్ నాణ్యత అంత బాగోదు. అమ్మకాల తర్వాత అలాంటి సమస్యలు రావడం అనేది చాలా బాధాకరం. వోక్స్వ్యాగన్ అనేది ఉత్తమమైన ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ టెక్నాలజీలు ఉన్న కారుని అందించింది అంటే, వారు దేశంలో మరింత మంచి సేవను కూడా అందించగలదు అని అనుకుంటున్నాము. కారు గురించి చెప్పాలంటే ఇది దేశంలో మచ్చ లేని కారుగా నిలిచిపోతుంది.