• English
  • Login / Register

వోక్స్వాగన్ పోలో GT TSI నిపుణల సమీక్ష

Published On మే 10, 2019 By rahul for వోక్స్వాగన్ పోలో 2015-2019

  • 1 View
  • Write a comment

Volkswagen Polo GT

ఇటీవల మేము టొయోటా ఎతియాస్ లీవా TRD స్పోర్టీవో ని డ్రైవ్ చేసాము. ఇది ఒక కొత్త బాగా పనితీరు చూపించే హ్యాచ్‌బ్యాక్ లలో ఒకటి. అయితే, ఇప్పుడు మనము వోక్స్వేగన్ పోలో GT TSI మీద చేతులు వెయ్యబోతున్నాము.  

ఈ వోక్స్వాగన్ పోలో కారు అనేది భారతదేశంలో అమ్ముడుపోయే వోక్స్వాగన్ కార్లలో అతి చిన్నది మరియు ఇప్పటిదాకా ఇది 1.2 లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఇప్పుడు వోక్స్వాగన్ సంస్థ మంచి పనితీరు కోసం పోలో లో 1.6 లీటర్ పెట్రోల్ ని పరిచయం చేసింది. అయితే, ఇది చాలా పెద్ద ఇంజన్ అయి ఉండడం వలన మరియు పనితీరు కూడా బాగుండడం వలన ధర కూడా పెరిగింది.

Volkswagen Polo GT

ఎవరైతే బాగా ఔత్సాహికులు మరియు సమర్థవంతమైన ఆటోమేటిక్ హాచ్బాక్ కోసం ఎదురు చూస్తున్నారో వారి కోసం వోక్స్వాగన్ సంస్థ పోలో GT TSI ని పరిచయం చేసింది. ఇప్పుడు మేము పోలో TSI యొక్క కొత్త వెర్షన్ తో మా మొట్టమొదటి అనుభవాన్ని పంచుకుంటాము.

Volkswagen Polo GT

డిజైన్:

Volkswagen Polo GT

వోక్స్వాగన్ పోలో  ఇటీవలే కొన్ని చిన్న నవీకరణలను వెలుపల వైపు అందుకుంది మరియు ఈ వెర్షన్ ని మిగిలిన వాటికంటే భిన్నంగా ఉండేలా చేయడానికి సంస్థ దీనికి కొన్ని మార్పులు చేసింది. GT TSI అనేది పోలో శ్రేణి యొక్క ప్రధాన వెర్షన్ మరియు ఇది ముందు గ్రిల్ పై GT బ్యాడ్జింగ్ పొందుతుంది.  

Volkswagen Polo GT

పోలో GT TSI యొక్క ప్రక్కభాగంలో C-పిల్లర్ లో GT TSI వినైల్ తప్ప ఇంక ఏదీ విభిన్నంగా లేదు. కారు కి వెనుకవైపు కూడా GT మరియు TSI బ్యాడ్జింగ్ వస్తుంది మరియు ఎక్కడా కూడా కారులో వోక్స్వ్యాగన్ మరియు పోలో బాడ్జింగ్లు ఉండవు. కారుకి ముందు మరియు వెనుక మాత్రమే VW లోగో  ఉంది. వెనకాతల స్పాయిలర్ కూడా ఉంది మరియి అది మరింత స్పోర్టీ లుక్ ని ఇస్తుంది.

Volkswagen Polo GT

లోపల భాగాలు:

Volkswagen Polo GT

పోలో GT TSI మాత్రమే టాప్ ట్రిమ్ గా వస్తుంది మరియు అందుచేత దీనిలో ప్రజలచే మెప్పు పొందేందుకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. ఈ GT TSI సాధారణ పోలో యొక్క నవీకరణలను పొందుతుంది, ఇది SD కార్డు, బ్లూటూత్, USB మరియు ఆక్స్ కనెక్టివిటీతో కొత్త మ్యూజిక్ సిస్టమ్ ను కలిగి ఉంది. మ్యూజిక్ సిష్టం ని సులభంగా ఉపయోగించుకొనేందుకు స్టీరింగ్ మీద వాటి కంట్రోల్స్ అమర్చడం జరిగింది.

Volkswagen Polo GT

ముందు వరుస సీట్లు పెద్దవిగా ఉంటాయి మరియు కూర్చొనే వారికి వెనక భాగానికి మరియు తొడకు మంచి మద్దతును అందిస్తాయి. ఈ కారులో ముందు వరుస ఒక పెద్ద కారు వలె భావన కలిగిస్తుంది.

Volkswagen Polo GT

ఈ పోలో లో రెండవ వరుస సీట్లు ఇరుకుగా ఉంటాయి, కానీ ఇంజనీర్లు ముందు సీట్లను చాలా తెలివిగా అమర్చడం జరిగింది తద్వారా వెనకాతల ప్యాసింజర్లకు నీ(మోకాలు) రూం పెరుగుతుంది.  

Volkswagen Polo GT

ఈ పోలో కారులో బూట్ స్పేస్ చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ కొత్త పోలో కూడా నవీకరణలు ఉన్నాయి. ఇవి కాకుండా మిగిలినవన్నీ కూడా ఒకేలా ఉంటాయి.

Volkswagen Polo GT

ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్:

పోలో కారులో ఉన్న అతిపెద్ద నవీకరణ ఇంజిన్. ఇప్పుడు కొత్త 1.2 లీటర్ నాలుగు సిలిండర్ ఇంజిన్ వచ్చింది మరియు ఇది సాధారణ 1.2 లీటర్ పెట్రోల్ మూడు పాట్ మిల్ నుండి వేరుగా ఉంటుంది. ఇది అల్యూమినియం ఇంజిన్ మరియు టర్బో చార్జ్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్ 104bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది, ఇది ముందు పోలో లో నడిచిన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కు సమానమైనది. ఈ ఇంజిన్ తో డిస్ప్లేస్మెంట్ 1.2 లీటర్ క్రింద ఉన్నందున వోక్స్వ్యాగన్ టాక్స్ డ్యూటీ-కట్ ను పొందుతుంది.

Volkswagen Polo GT

ఈ ఇంజిన్ కూడా 1.6 లీటర్ లాగానే శక్తి అందిస్తున్నప్పటికీ, ఈ కొత్త ఇంజిన్ లో టార్క్ మాత్రం చాలా మెరుగ్గా ఉంటుంది. ఈ ఇంజిన్ తేలికగా ఉంటుంది మరియు తక్కువ డిస్ప్లేస్మెంట్ కలిగివుండటంతో మంచి ఇంధన-సమర్థవంతమైనదిగా ఉంటుంది. దీనిలో NVH లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, కానీ వాతావరణం చలిగా ఉన్నప్పుడు మాత్రం ఇంజన్ స్టార్ట్ చేసేటపుడు శబ్ధం వస్తుంది. ఇది 4000rpm దాటిన తరువాత నుండి ఇంజన్ శబ్ధం చేస్తుంది.  

Volkswagen Polo GT

ఈ పవర్‌ట్రైన్ లో ఇతర మంచి లక్షణం ఏమిటంటే ట్రాన్స్మిషన్. డ్యుయల్ క్లచ్ బాక్స్ తో అందించబడిన దేశంలో మొట్టమొదటి హాచ్బ్యాక్ ఇది. ఇంకా ఇది విభాగంలో మూదటిసారిగా 7-స్పీడ్ తో వస్తుంది. డైరెక్ట్-షిఫ్ట్ గేర్బాక్స్ (DSG) ఎల్లప్పుడూ మనల్ని ఆకట్టుకుంది మరియు ఇది దానికి మినహాయింపు ఏమీ కాదు. దీనిలో  గేర్ రేషియోస్ అనేవి గరిష్ట వినియోగ శక్తికి భారతీయ డ్రైవింగ్ సైకిల్ కి తగ్గట్టుగా ఉంటాయి. యాక్సిలరేషన్ ని తొక్కిన వెంటనే ట్రాన్స్మిషన్ స్పందిస్తుంది మరియు స్పీడ్ గా వెళుతున్నప్పుడు  దానంతట అదే షిఫ్ట్ అయిపోయి  సజావుగా వెళిపోతుంది.  మీరు మాన్యువల్ షిఫ్ట్లను చేయాలనుకుంటే ట్రిప్ టానిక్ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. మేము దీనిలో పాడిల్ షిఫ్ట్స్ ని మేము బాగా మిస్ అవుతున్నాము. మేము నేర్చుకున్నదాని నుండి తెలుసుకున్నది ఏమిటంటే వోక్స్వ్యాగన్ తరువాత దశలో పాడిల్ షిఫ్ట్లను పరిచయం చేయగలదు.  

డ్రైవింగ్ డైనమిక్స్:

Volkswagen Polo GT

పోలో యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ ఎల్లప్పుడూ బాగుంటాయి, కానీ ఈ ఇంజిన్ కోసం కంపెనీ సస్పెన్షన్ యొక్క దృఢత్వం పెంచింది. ఈ ఇంజిన్ మరింత శక్తివంతమైనది కాబట్టి దీనిని బాగా హ్యాండిలింగ్ చేసేందుకు ఆ విధంగా సస్పెన్షన్ దృఢత్వం పెంచడం జరిగింది.  

Volkswagen Polo GT

పోలో TSI ఖచ్చితంగా ఉత్తమ హ్యాండ్లింగ్ చేసే హ్యాచ్బ్యాక్లలో ఒకటిగా ఉంటుంది. పొలో లో కూడా అదే ఇంజనే ఉపయోగించడం జరుగుతుంది మరియు చాలా శక్తివంతమైన ఇంజిన్ల చేత ముందుకు వచ్చింది. పోలో కారు ఎలా తిప్పినా సరే ఇది మీ స్టీరింగ్ కమాండ్ లను పాటిస్తుంది. ఇది ఒక ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉండటంతో, ఇది స్టీర్ కింద ఒక సూచనను కలిగి ఉంది.

Volkswagen Polo GT

పోలో మీద రైడ్ చాలా బాగుంటుంది మరియు బంప్స్ వస్తే సస్పెన్షన్ బాగా పనితీరు చూపిస్తుంది. ఈ చెడు రహదారులపై, మరియు అధిక వేగంలో కూడా కారు నీట్ గానే వెళుతుంది. అయితే టైర్ నుంచి వచ్చే శబ్ధం కొంచెం గట్టిగా ఉంటుంది.

Volkswagen Polo GT

Volkswagen Polo GT

అపోలో ఆకిసిలరిస్ రహదారిపై చాలా శబ్ధాన్ని ఇస్తాయి. దీని గ్రిప్ చాలా బాగుంటుంది, ఓవేళ స్కిడ్ ఆయ్యే అవకాశం ఉన్నా కూడా దీని గ్రిప్ బాగుంటుంది. దీనిలో మాకు నచ్చని ఒకేఒక్క విషయం ఏమిటంటే, అధిక వేగాలలో వెళ్ళినపుడు దీని యొక్క స్టీరింగ్ బరువు ఎక్కువగా ఉంటుంది.    

Volkswagen Polo GT

తీర్పు:

Volkswagen Polo GT

కొనుగోలు చేసుకొనేందుకు పోలో GT TSI శక్తివంతమైనది మరియు సమర్థవంతమైన పెట్రోల్ హాచ్బాక్. ఇక్కడ అంతా ఏ ధరలో ఇది ప్రారంభించబడుతుంది అనే దాని మీద ఆధరపడి ఉంటుంది. లోవర్ ట్రిం వేరియంట్ ని మనం చూస్తే ఈ టెక్నాలజీ గనుక దీనిలో పెట్టినట్టు అయితే తక్కువ ఖరీదులో కూడా అటువంటి అద్భుతమైన టెక్నాలజీని అందిస్తుంది.

Published by
rahul

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience