వోక్స్వాగన్ పోలో GT TDI: నిపుణుల సమీక్ష
Published On మే 10, 2019 By akshit for వోక్స్వాగన్ పోలో 2015-2019
- 0K View
- Write a comment
గత సంవత్సరం పోలో కోసం వోక్స్వ్యాగన్ మిడ్-లైఫ్ అప్డేట్ తో వచ్చింది. సౌందర్య మార్పులు చాలా సూక్ష్మంగా ఉండగా, బోనెట్ కింద ఉన్న మార్పులు అన్నీ సరైన కారణాల వల్ల వార్తలలోకి ఒక శుభవార్త లా వచ్చింది. అంతగా రిఫైన్ చేయబడిన త్రీ-సిలెండర్ డీజిల్ ఇంజిన్ స్థానంలో ఒక అదనపు సిలిండర్ కలిగి ఉన్న కొత్త ఇంజన్ భర్తీ చేయబడింది.
ఈ కొత్త 1.5 లీటర్ ఫోర్-పాట్ ఆయిల్ బర్నర్ యూనిట్ తో జర్మన్ కార్ల తయారీదారుడుకి ఒకే రాయితో రెండు పిట్టలని చంపడానికి సహాయం చేసింది. అది ఎలా అంటే మొదటది, అది 1.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ని విసరగొట్టింది, ఎందుకంటే దీనిలో ప్రామాణిక వెర్షన్ లో తగినంత పవర్ అందించడం లేదు. ఇప్పుడు రెండవది ఏమిటంటే, అది దాని బాగా పని చేసే GT వెర్షన్ ని ఇంకా పెంచడానికి ఒక తక్కువ ఖరీదు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకుంది, ఎందుకంటే పాత వెర్షన్ లో 1.6 లీటర్ ఇంజన్ కారణంగా అదనపు పన్నులు చెల్లించాల్సి వచ్చేది అందువలన దీనిని తీసుకోడం జరిగింది.
మేము కొన్ని నెలలు క్రితం నవీకరించబడిన పోలో లో తిరగడం జరిగింది మరియు మొత్తంగా అది మమ్మల్ని ఆకట్టుకుంది. మునుపటి త్రీ-పాట్ మోటారు కూడా నగరం చుట్టూ తిరిగేందుకు మంచిదని భావించినప్పటికీ మీరు రహదారి మీద వెళ్ళే అవసరం వచ్చినపుడు ఓవర్ టేక్ చేయాల్సినట్టయితే కొంచెం కష్టం అనిపించింది. అదే ఈ కొత్త ఇంజన్ తో అయితే అలాంటి సమస్య రాదు.
డిజైన్:
సాధారణ కారుల మాదిరీగానే, GT TDI మార్పులు కూడా కంటికి ఆకట్టుకునే విధంగా ఏమీ ఉండవు. దీనిలో కూడా అదే బంపర్, డబుల్ బ్యారెల్ హెడ్ల్యాంప్స్, క్రోమ్ హౌసింగ్ తో తిరిగి డిజైన్ చేయబడిన ఫాగ్ ల్యాంప్స్ మరియు లైట్ క్రోమ్ స్ట్రిప్ క్రోమ్ ఫ్రంట్ గ్రిల్ వంటి లక్షణాలు ఉన్నాయి.
అయితే 'GT మోనికర్', ఇప్పుడు ఫ్రంట్ గ్రిల్ యొక్క ఎడమ వైపు నుండి మరొక వైపుకు మార్చబడింది. దీని ప్రక్క భానికి వస్తే, బ్లాక్ గ్లోసీ వింగ్ మిర్రర్స్ తప్ప ఏమీ మార్చబడలేదు. అయితే, వెనుకవైపు రెండు మార్పులు చేయబడ్డాయి అవి ఒకటి నల్ల స్పాయిలర్ మరియు ఇంకొకటి రెండు చివరల రిఫ్లెక్టర్స్ తో ఉన్న రిఫ్రెష్ బంపర్స్ ని కలిగి ఉంది.
15-అంగుళాల ఎస్ట్రాడా అలాయ్ వీల్స్ కూడా ప్రీ-ఫేస్లిఫ్ట్ మోడల్ నుండి అలాగే ఉంచబడింది, ఇది ప్రామాణిక వెర్షన్ లో క్రొత్త వాటి కంటే స్పోర్టియర్ గా కనిపిస్తుంది.
మొత్తంమీద, పోలో చాలా మంచి కారు మరియు అత్యాధునికమైనది, కానీ ఔత్సాహికులు GT కోసం అధనపు డబ్బులు పెడితే మాత్రం కొంచెం నిరాశ చెందుతారు, ఎందుకంటే గో ఫాస్టర్ వెర్షన్ కోసం ప్రత్యేఖంగా ఉండే తత్వాన్ని ఇది కలిగి లేదు.
లోపల భాగాలు:
అన్ని ఇతర జర్మన్ కారుల వలే, GT కూడా క్యాబిన్ యొక్క సౌందర్యం కంటే కార్యాచరణపై మరింత దృష్టి పెడుతుంది. దీని నాణ్యత అద్భుతంగా ఉంటుంది. కానీ లేఅవుట్ సాధారణంగా మరియు చాలా సూటిగా ఉంటుంది. మునుపటి డ్యుయల్ టోన్ రంగు నేపథ్యానికి బదులుగా, నవీకరించబడిన మోడల్ అన్ని బ్లాక్ కలర్ ని పొందుతుంది. బ్లాక్-బీజ్ డాష్బోర్డు నుండి సిల్వర్ సెంటర్ కన్సోల్ ట్రిమ్ వరకు, ఇప్పుడు మీరు అంతా నలుపు రంగుని పొందుతారు. చాలా ఎక్కువ నలుపు కలిగి ఉంటారు, ఈ విషయం నేను తప్పకుండా చెప్పాలి.
కొత్త ఫ్లాట్-బేస్డ్ స్టీరింగ్ వీల్ అయితే, ఒక ఆనందకరమైన ఆశ్చర్యంతో వస్తుంది మరియు కారు యొక్క స్పోర్టి లుక్ ని పెంచుతుంది. స్టీరింగ్ వీల్, గేర్ నాబ్ మరియు హ్యాండ్ బ్రేక్ లివర్ పై మంచి లెథర్ ఫినిషింగ్ ఉండి పట్టుకోడానికి చాలా బాగుంటుంది మరియు మంచి నాణ్యత అనే ఫీల్ ని కలిగిస్తుంది.
GT బాడ్జెస్ తో అల్యూమినియం పెడల్స్ మరియు డోర్ సిల్ ప్లేట్స్ లోపల థీమ్ తో అనుగుణంగా ఉంది మరియు మొత్తంగా క్యాబిన్ చాలా ఖరీదైనదిగా అనిపిస్తుంది.
ఇంజిన్ మరియు పనితీరు:
ముందు పేర్కొన్న విధంగా, GT TDI కొత్త పోలో లో ఉన్న అదే ఇంజిన్ తో వస్తుంది. అయితే, GT ఒక పనితీరు ఆధారిత వెర్షన్ కాబట్టి దీనిలో మరింత పనితీరు కలిగే ఇంజన్ ఉండేందుకు అర్హత కలిగి ఉంది. అందువల్ల వోక్స్వాగన్ అధనంగా 20Nm టార్క్ తో పాటూ 15Ps పవర్ ను అందించే విధంగా ఇంజన్ ట్యూన్ చేయబడింది మరియు దాని ఫలితంగా మునుపటి 1.6 లీటర్ ఇంజిన్ ఇచ్చే ఫలితాలకు తగ్గట్టుగా ఉంది.
పవర్ డెలివరీ ఇప్పుడు చాలా సరళంగా ఉంటుంది మరియు ముందుదాని లా కుదుపులతో ఉండదు.1600Rpm వంటి అతి తక్కువ రివల్యూషన్స్ లో కూడా కావలసిన ప్రోత్సాహాన్ని అందిస్తూ మరియు 2000rpm వద్ద పవర్ ని ఇంకా పెంచుతూ,ఆ ఇంజన్ 4500rpm వరకూ సునాయాసంగా లాగుతూ 5500rpm మార్క్ ని మునుపెన్నడూ డీజిల్ ఇంజన్ లో చూడని విధంగా అందుకుంటుంది. నిజానికి ఇది ఒక వరం.
ఇంజిన్ ఒక విస్తృతమైన మరియు మంచి శక్తి బ్యాండ్ అందించడానికి ట్యూన్ చేయబడింది. సాధారణ సిటీ లో తక్కువ rpm లో డ్రైవ్ చెసేటపుడు ముందు దానిలా అంత ఇబ్బందికరంగా ఉండదు మరియు చిన్న చిన్న ఆక్సిలరేషన్ ఇస్తే స్పీడ్ కూడా అదే విధంగా సరిగ్గా పెరుగుతూ వస్తుంది. ఇంజిన్ ఐడిల్ గా ఉన్నప్పుడు కొంచెం శబ్ధం వస్తుంది, కానీ కుదులుతూ ఉంటే ఒకసారిగా స్థిరపడుతుంది.
5-స్పీడ్ గేర్బాక్స్ పాతదే ఉంచడం జరిగింది మరియు చాలా చక్కగా పని చేస్తుంది. అయినప్పటికీ, GT TSI లో ఉన్నటువంటి ఒక DSG గేర్బాక్స్ ఉండి ఉంటే ఈ కారుని మరింత కావాల్సిన విధంగా చేసేది.
అన్నింటినీ చెప్పిన తరువాత, పాత 1.6 లీటర్ యూనిట్ యొక్క వ్యక్తిత్వాన్ని ఖచ్చితంగా మిస్ అయ్యానని చెప్పవచ్చు.
హ్యాండ్లింగ్ & రైడ్ నాణ్యత:
ఎవరైనా దీనిని కొనడానికి ఎక్కువ డబ్బులు చెల్లించినప్పటికీ కారులో వెళుతున్నప్పుడు మంచి అనుభూతిని పొందుతారు మరియు GT ఈ విభాగంలో అస్సలు నిరుత్సాహపరచదు. దీని యొక్క రోడ్డు పై ఉండేటటువంటి గ్రిప్ మరియు స్థిరత్వం అనేది దృఢంగా ఉంటుంది మరియు నిజమైన జర్మన్ కారులా ఉంటుంది. వాస్తవానికి, 150 కి.మీ. మార్క్ దాటినా కూడా ఈ కారు చాలా సునాయాసంగా వెళుతుంది మరియు నేటి ఎంట్రీ-లెవల్ సెడాన్ల కంటే మెరుగైనది.
పోలో ఎల్లప్పుడూ గొప్ప నిర్వాహకునిగా పనిచేస్తుంది మరియు GT దానికి భిన్నమైనది ఏమీ కాదు. మీరు ఒక త్వరితమైన టర్న్స్ ని గానీ టార్గెట్ చెస్తే, మీకంటే కూడా కారే చాలా ఉత్సాహంగా వాటిని దాటెస్తుంది. దీని స్టీరింగ్ వీల్ అనేది మీ కామండ్ లను తీసుకొని టైర్లకు సందేశాలను బాగా అందించి ఒక సానుకూల స్పందనను అందిస్తుంది.
దీని సస్పెన్షన్ సెటప్ మృదువుగా మరియు గట్టిగా ఉండే వేరొక పోలో నుండి సస్పెన్షన్ సెటప్ తీసుకోడం జరిగింది. దీనిలో తిరిగి వర్క్ చేయబడిన సస్పెన్షన్ ఉంటే చాలా బాగుండేది కానీ మాకు దీని మీద ఎటువంటి పిర్యాదులు లేవు. ఇది బంప్స్ ని చక్కగా దాటేస్తుంది మరియు మన రోడ్డు పరిస్తుతులని దృష్టిలో పెట్టుకొని చక్కగా పనిచేస్తుంది.
తీర్పు:
ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ మార్పు తో స్టాండర్డ్ పోలో TDI లో ముందు ఉండే 3-సిలెండర్ కాకుండా ఇప్పుడు అభివృద్ధి చేయబడిన 4-సిలెండర్ అందించడం జరిగింది. దీనివలన పోలో GT TDI లో పనితీరు పెరిగింది. కానీ ఒక అర్ధ లక్ష ఎక్కువ GT TDI మీద పెట్టడమనేది ముందు దానిలా అంత మంచిది కాదేమో అని అనిపిస్తుంది. కానీ ఒకసారి కొనుక్కొని వాడడం మొదలు పెట్టిన ఇవన్నీ మీరు క్షమిస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ హ్యాచ్బ్యాక్ అనేది ఒక బ్రిలియంట్ అని చెప్పవచ్చు.