వోక్స్వాగన్ పోలో GT TDI నిపుణుల సమీక్ష
Published On మే 10, 2019 By rahul for వోక్స్వాగన్ పోలో 2015-2019
- 0 Views
- Write a comment
వోక్స్వాగన్ భారతదేశంలో వాల్యూమ్ గేమ్ ని పోలోతో దాని తరువాత వెంటో తో ప్రారంభించింది. ఈ ఉత్పత్తులు సంస్థ యొక్క అమ్మకాలలో ఒక ఎత్తుకి ఎదిగాయి, అయినప్పటికీ అవి ఆ జోరుని కొనసాగించలేకపోయాయి. గత కొన్ని సంవత్సరాల్లో చూసినట్లుగా అధిక వృద్ధి నుండి కొన్ని దిద్దుబాట్లు మార్కెట్లో ఉన్నందువల్ల వోక్స్వ్యాగన్ భారతదేశ ప్రణాళికలను కూడా తగ్గించింది.
అయితే, వోక్స్వాగన్ సంస్థ పోలో యొక్క అనేక వెర్షన్లను పరిచయం చేసింది. మొదట మేము GT TSI చూశాము, తరువాత క్రాస్ పోలో వచ్చింది మరియు ఇప్పుడు GT TDI వచ్చాయి. మేము పోలో యొక్క కొత్త వెర్షన్ పై చేతులు వెయ్యడం జరిగింది మరియు ఈ హ్యాచ్బ్యాక్ అనేది మంచి కారు అవుతుందా లేదా అనేది కనుక్కుందాం పదండి. అది మన పరీక్షలలో ఎలా పనిచేస్తుంది అనేది చదివి తెలుసుకోండి.
డిజైన్:
ఈ GT TDI యొక్క డిజైన్ GT TSI మాదిరీగానే ఉంటుంది. పోలో బ్యాడ్జ్లు కనిపించవు, కానీ ఇక్కడ C-పిల్లర్ మీద కూడా GT స్టిక్కర్లు ఉండవు. సాధారణ పోలో నుండి GT పరిధిని వేరు చేయటానికి వోక్స్వాగన్ సంస్థ ప్రయత్నిస్తోంది, కానీ ఆలా చేయాలి అంటే ప్రస్తుతం ఉన్న దాని కంటే వారు అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. దీని యొక్క ట్విన్ ఫైవ్-స్పోక్ అలాయ్ వీల్స్, డిజైన్ మరియు అన్నీ కూడా అదే విధంగా GT TSI లో ఉన్న మాదిరీగనే ఉంటాయి. GT TDI లో కనిపించే అదే ఫ్రంట్ గ్రిల్ కూడా అదే స్మోకెడ్ హెడ్‌ల్యాంప్స్ తో ఉంటాయి. GT TDI లో వెనుక స్పాయిలర్ కూడా అదే విధంగా ఉంటుంది.
లోపల భాగాలు:
GT TDI లో అంతర్గత స్టైలింగ్ GT TSI మరియు పోలో హైలైన్ లో ఉన్నట్టుగానే ఉంటుంది. ఇది డ్యుయల్-టోన్ షేడ్ తో స్పోర్టీ సీటు ఫాబ్రిక్ ని పొందుతుంది మరియు క్వాలిటీ బాగుంటుంది. GT TDI ఒక త్రీ స్పోక్ మల్టీ స్పోక్ స్టీరింగ్ వీల్ తో ట్విన్-డయల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కలిగి ఉంటుంది. దీనిలో ఆక్సిలరీ, USB మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో ఇన్ -డాష్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది.
GT TDI లో అంతర్గత నాణ్యత చాలా బాగుంటుంది మరియు లుక్ అండ్ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. ఇది డ్యుయల్ ఎయిర్ బాగ్స్ తో లభిస్తుంది. GT TDI లోని పరికర జాబితా కూడా చాలా బాగుంటుంది. దీని ముందు వరుస సీట్లు పెద్దవిగా ఉంటాయి మరియు చాలా సౌకర్యంగా ఉంటాయి. దీనిలో కూర్చొనే వారికి ప్రక్కభాగంలో మరియు తొడకి మంచి సపోర్ట్ లభిస్తుంది. దీనిలో వెనకాతల కూర్చొనే వారికి నీ రూం(మోకాలు) కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ తొడ భాగం దగ్గర మద్దతు ఉండి ఉంటే బాగుండేది. ఒకవేళ ముందర మరియు వెనకాతల ఒకే వైపు ఇద్దరు 6 అడుగుల మనుషులు గనుక కూర్చుంటే చాలా ఇబ్బంది పడతారు.
ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్:
GT TDI లో 1.6-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉంటుంది మరియు అది 102bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది వెంటో మరియు రాపిడ్ లో ఏదైతే ఇంజన్ ని కలిగి ఉందో అదే ఇంజన్ దీనిలో ఉంది. ఈ ఇంజిన్ వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే చాలా శబ్ధం వస్తుంది. ఈ శబ్ధం కొంచెం ఎక్కువగానే ఉంటుంది మరియు వోక్స్వాగన్ లాంటి సంస్థ నుండి వచ్చిన వాహనానికి ఎటువంటి శబ్ధం వస్తుందని ఊహించలేము. సంస్థ ఇంజిన్ కంపార్ట్మెంట్ యొక్క ఇన్సులేషన్ పెంచి శబ్ధాన్ని తగ్గిస్తే బాగుంటుంది. ఈ ఇంజిన్ ఉత్పత్తి చేసే పవర్ నగరం లేదా రహదారి డ్రైవింగ్ కోసం చక్కగా సరిపోతుంది. దీనిలో టర్బో లాగ్ ఉంది మరియు దీని ఇంజన్ 1800rpm కంటే తక్కువ ఉన్నప్పుడు అది స్పష్టంగా తెలుస్తుంది. తరువాత అలా rpm పెంచుతున్న కొలదీ టార్క్ అభివృద్ధి చెందుతూ టర్బో లాగ్ అనేది తగ్గిపోతుంది. దీనిలో కొంచెం స్పీడ్ కావాలంటే కొంచెం డౌన్ చేసి స్పీడ్ ఇస్తే గనుక స్పీడ్ బాగా పెరుగుతుంది.
దీనిలో బాగా నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే GT TDI లో ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ లేదు. ఇది వెంటో లాగానే అదే డ్రైవ్ ట్రైన్ అయినటువంటి 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. ఇది ఆటోమెటిక్ తో కూడా వస్తే బాగుంటుందని ఊహిస్తున్నాము. ఈ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి ఇంకొక ఇబ్బంది ఉంది, అది ఏమిటంటే దీనిలో క్లచ్ చాలా దూరంగా పెట్టడం జరిగింది, దీనివలన ఇది బంపర్ నుండి బంపర్ కి సిటీ లో ట్రాఫిక్ లో ఎక్కువ ఉన్నప్పుడు క్లచ్ నొక్కడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
డ్రైవింగ్ డైనమిక్స్:
వోక్స్వాగన్ కార్లు ఎల్లప్పుడూ ఆహ్లాదకరమైన డ్రైవింగ్ ని అందిస్తాయి మరియు GT TDI అందుకు మినహాయింపు ఏమీ కాదు. పోలో కప్ కోసం పోలో చాసిస్ రూపొందించబడింది, ఇది 100bhp కంటే ఎక్కువ శక్తిని తీసుకోగలదు. చాసిస్ యొక్క పనితీరు రోడ్డు మీద ట్రావెల్ చేసినపుడు చాలా బాగుంటుంది. మీరు ఒక టర్నింగ్ లు చుట్టూ తిప్పితే సులభంగా టర్న్ అవుతుంది. దీని యొక్క సస్పెన్షన్ వ్యవస్థ టైర్లు గ్రౌండ్ కి స్టిక్ అయ్యేలా చేస్తుంది. పోలోపై అపోలో వీల్స్ కాంక్రీటు రహదారులపై చాలా శబ్ధం వస్తుంది. మేము GT TDI లో ప్రస్తుతం ఉపయోగించే అపోలో టైర్లు కాకుండా కొంచెం మృదువైన టైర్లతో వస్తే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాము.
దీని యొక్క స్టీరింగ్ వీల్ ఎలక్ట్రానిక్ మరియు అందుకే అది చాలా తేలికగా ఉంటుంది, అందువలన నగరంలో దీని స్టీరింగ్ పనితీరు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. చెడు రహదారులపైన వెళుతున్నపుడు కొంచెం స్టిఫ్ గా ఉంటుంది మరియు గతకలు అవి బాగా తెలుస్తాయి. అది కాకుండా, తక్కువ మరియు అధిక వేగం వద్ద స్మూత్ గా ఉండే రోడ్డుపై వెళ్ళేటపుడు రైడ్ బాగుంటుంది.
తీర్పు:
వోక్స్వ్యాగన్ GT TDI కేవలం 8 వేల రూపాయలు మాత్రమే GT TSI ( దీని ధర 8.08 లక్షలు (ఎక్స్ -షోరూమ్, ఢిల్లీ)) కంటే ఎక్కువ ఉంది. ఇంత కంటే ఎక్కువ స్థలం కలిగి ఉండి మరియు ఇదే శక్తిని అందించే కాంపాక్ట్ సెడాన్ లు చాలా ఉన్నాయి, కావునా ఒక హ్యాచ్‌బ్యాక్ కోసం అంత డబ్బు పెట్టడం అనేది వృధా. మీరు కూడా ఒక డ్యుయల్-క్లచ్ సౌకర్యం పొందడానికి మరియు మీకు ఒక శక్తివంతమైన హాచ్బాక్ ని కావాలనుకుంటే మాత్రం మా ఎంపికగా GT TSI ఉంటుంది.