• English
  • Login / Register

వోక్స్వాగన్ పోలో 1.5 టిడిఐ నిపుణుల సమీక్ష

Published On మే 10, 2019 By abhishek for వోక్స్వాగన్ పోలో 2015-2019

  • 1 View
  • Write a comment

Volkswagen Polo 1.5 TDI

వోక్స్వాగన్ యొక్క ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ హాచ్ నవీకరణలను కలిగి ఉంది మరియు ముఖ్యంగా ఇది ఎల్లప్పుడూ అర్హత కలిగిన ఒక శక్తివంతమైన డీజిల్ ఇంజన్. ఈ మెరుగుపెట్టిన హ్యాచ్బ్యాక్ ఎలా ఉందో మీతో చెప్పడానికి మేము దానిని ఇక్కడ క్లుప్తంగా పొందుపరిచాము.  

పరిచయం:

ఇది ప్రారంభించే ముందు ఇంగ్లీష్ లో ఒక కొటేషన్ గుర్తుకు తెచ్చుకుందాము. " ద హోల్ ఈజ్ ఓన్లీ యేసే గుడ్ యేస్ ద సం ఆఫ్ ఇట్స్ పార్ట్స్"దీని అర్ధం ఏదైనా ఒక మొత్తం వస్తువు బాగుంది అంటే దాని యొక్క చిన్న పార్ట్స్ అన్నీ కూడా బాగుండడం వలన అని అర్ధం. ఇది అద్భుతమైన స్టైలింగ్,అంతర్గత నాణ్యత మరియు మంచి రైడ్-హ్యాండ్లింగ్ ప్యాకేజీ వంటి మంచి లక్షణాలు ఇస్తానని ప్రామిస్ చేసింది. దీనిలో అండర్ పవరెడ్ త్రీ సిలెండర్ ఇంజన్స్ కారణంగా పవర్ ట్రయిన్ కొంచెం స్లో గా ఉంటుంది మరియు ఇది అత్యధికంగా అమ్ముడుపోయే డీజిల్ వేరియంట్లలో మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ మొత్తం ప్యాకేజ్ చాలా బాగుంది, కానీ ఇంజన్ వలన వెనకబడింది. వోక్స్వాగన్ సంస్థ దీనిని గ్రహించి ఇంజన్ లో కొన్ని మార్పులు చేయడానికి GT వెర్షన్ మొదటిసారిగా తీసుకొచ్చింది, తరువాత దానిని కొంచెం మార్చి వెంటో లో పెట్టింది మరియు మనల్ని ఇంకా ఆనందింపచేయడానికి ఈ 1.2 TDI యూనిట్ మొత్తాన్ని 1.5 లీటర్ ఫోర్ బ్యాంగర్ తో మార్చేసింది. మంచి రోజులు వచ్చాయా? పదండి కనుక్కుందాం.

డిజైన్:

Volkswagen Polo 1.5 TDI

ఈ కొత్త పోలో చూడడానికి చాలా బాగుండడం వలన వోక్స్వాగన్ డిజైన్ పరంగా పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం కలగలేదు. ఈ కారు కి కొత్త రస్టీ ఆరెంజ్ షేడ్ ఇవ్వడం జర్గింది ఈ కలర్ పోలో కి బాగా నప్పింది అని మేము భావిస్తున్నాము.

Volkswagen Polo 1.5 TDI

మార్పులు గురించి మాట్లాడుకుంటే, మొట్టమొదట కొత్త ఫ్రంట్ గ్రిల్, ఫాగ్‌ల్యాంప్స్ తో  అమర్చబడిన కొత్త బంపర్ మరియు ఏవైతే రోడ్డు ఎడ్జ్ దగ్గర కూడా బాగా లైటింగ్ అందిస్తాయో అటువంటి  కార్నరింగ్ లైట్స్ తో కనపడతాయి. ప్రక్కభాగానికి వస్తే, కొత్త 10-స్పోక్ అలాయ్ వీల్స్ ని మనం గమనించవచ్చు, ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి.

Volkswagen Polo 1.5 TDI

Volkswagen Polo 1.5 TDI

చివరగా కారు వెనకాతల భాగానికి వస్తే, మీకు కొత్తగా డిజైన్ చేయబడిన బంపర్ ఉంటుంది మరియు దాని యొక్క రెండు వైపులా లైసెన్స్ ప్లేట్ కారియర్స్ తో అమర్చబడిన రిఫ్లెక్టర్స్ ఉంటాయి. దీని బయట వైపు అంత  విస్తృతంగా మార్పులు ఉండకపోయినా, చిన్న చిన్న అంశాలు పోలోకు దాని అందమైన సరళిని ప్రభావితం చేయకుండానే ఒక తాజా లుక్ ని అందించాయి.   

లోపల భాగాలు మరియు సౌకర్యాలు:

Volkswagen Polo 1.5 TDI

ఇప్పుడు పోలో అంత ఆకర్షణీయమైన ఇంటీరియర్లను ఏమీ అందించలేదు. చాలా జర్మన్ వాహనాలు వలె, ఇది కూడా సౌందర్య పరమైన అంశాలను పక్కన పెట్టి నాణ్యత మీద దృష్టి పెట్టింది. కొత్త మోడల్ కి ఇప్పుడు కొత్తగా మార్చబడిన ఇంటీరియర్స్ అందించడం జరిగింది. దీని వలన క్యాబిన్ మరింత ఆహ్లాదకరంగా మరియు క్లాసీగా ఉంది.

Volkswagen Polo 1.5 TDI

డాష్ బోర్డ్ ఇప్పుడు సిల్వర్ చేరికలతో బీజ్ మరియు బ్లాక్ కాంబో తో కలిగి ఉంది, కావున లే అవుట్ కి మరింత అందం చేకూరింది మరియు మిగిలిన భాగంలో మార్పులు ఏమీ లేవు. మీకు దీనిలో మీ దృష్టిని వెంటనే ఆకట్టుకొనేది ఏదైనా  ఉంది అంటే అది స్టీరింగ్ వీల్. దీనిలో ఫ్లాట్ బోటం వీల్స్ అద్భుతంగా కనిపించడం మాత్రమే కాదు, మంచి గ్రిప్ ని కూడా అందిస్తాయి. స్టీరింగ్ వీల్స్ మీద ఆడియో కంట్రోల్స్ అందించడం జరిగుతుంది, తద్వారా ఆడియో, వాయిస్ కాలింగ్, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మరియు ఆపై కొన్నింటిని నియంత్రించగలరు.

Volkswagen Polo 1.5 TDI

దీని సీట్లలో ఎటివంటి మార్పులు లేవు, అయితే ఫాబ్రిక్ కూడా కొత్తది. నిజానికి  ఫాబ్రిక్ చాలా మంచిదనిపిస్తుంది, కానీ లేత గోధుమ రంగులో సీట్లు ఉండడం వలన దాని మీద మరకలు పడితే స్పష్టంగా కనిపిస్తాయి. మేము ఇక్కడ ఫొటోలను గమనిస్తే గనుక మీకు సీట్ల మీద మరకలు స్పష్టంగా కనిపిస్తాయి. అదికాకుండా ఈ సీట్ల సౌకర్యం గురించి ఎటువంటి ఫిర్యాదు లేదు.  

Volkswagen Polo 1.5 TDI

Volkswagen Polo 1.5 TDI

దీనిలో వెనక వరస సీట్లు చాలా సౌకర్యంగా ఉంటాయి, కానీ ఒక సగటు ఎత్తు గల మనుషులు ముందు కూర్చుంటే మాత్రమే ఆ సౌకర్యం వెనకాతల వాళ్ళకి ఉంటుంది. ముందు సీట్లలో 6 అడుగుల మునుషులు కూర్చుంటే మాత్రం వెనకాతల లెగ్రూం కొంచెం ఇరుకుగా ఉంటుంది. చాలా వరకూ లెగ్రూం సరిపోతుంది కానీ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుంది. అయితే బూట్ స్పేస్ 294 లీటర్లు ఉంటుంది మరియు ఇప్పుడు ఉన్న పోటీ కి మెరుగైనది.

పరికర విషయానికి వస్తే, పోలో చాలా దూరం వచ్చింది. ఆటో రోల్-అప్ మిర్రర్స్ లేవు, కానీ మీరు ఇప్పుడు అన్ని రకాల వేరియంట్లలో వాతావరణ నియంత్రణ, బ్లూటూత్ మరియు వాయిస్ కమాండ్, పార్కింగ్ సెన్సార్లు మరియు కొన్నింటిలో ప్రామాణికంగా ఎయిర్ బాగ్లను పొందుతారు. ఈ కొత్త పోలో అన్ని మంచి లక్షణాలతో చాలా అద్భుతంగా వస్తుంది మరియు దీనిలో సీట్లు కవర్స్ మాత్రమే మీకు కావాలి అని మేము అనుకుంటున్నాము.

ఇంజన్ మరియు పనితీరు:

Volkswagen Polo 1.5 TDI

నాకు ఇంకా గుర్తుంది ఏమిటంటే, మూడు సిలిండర్ల డీజిల్ తో క్రాస్ పోలోను నడుపుతున్నపుడు కారు నగర ప్రాంతాల చుట్టూ బాగుంటుందని భావించాను, కానీ హైవే లోకి వెళ్ళినపుడు ఓవర్ టేక్ చేయాల్సిన అవసరం వచ్చినపుడు చాలా బాగా దూసుకెళ్ళింది. డ్రైవబిలిటీ సగటుగా ఉన్నా కూడా మొత్తం పనితీరు పరంగా చూసుకుంటే పోలో యొక్క మార్క్ లేదు. అందువలన నేను కొత్త పోలో ని చూసినపుడు ఇదే అంశాన్ని ప్రయత్నిద్దామనుకున్నాను. ఒక అధనపు బలమైన సిలెండర్, 90Ps పవర్ మరియు 230Nm టార్క్ ని (పాత డీజిల్ 75Ps పవర్ మరియు 180Nm టార్క్ ఇచ్చేది),డౌన్ షిఫ్ట్ అందించే అధనపు పవర్ మంచి ఓవర్ టేకింగ్ సౌకర్యాన్ని అందిస్తుంది. డ్రైవింగ్ సామర్ధ్యం కూడా బాగా పెరిగింది మరియు నేను కూడా ఈ కొత్త ఇంజిన్ లో  నేరుగా 1 నుండి 4 లోకి షిఫ్ట్ మార్చడానికి ప్రయత్నం చేసాను కానీ ఎటువంటి ఇబ్బందిని ఎదుర్కోలేదు.

Volkswagen Polo 1.5 TDI

మీరు నోటీస్ చేసిన గేర్లు ద్వారా డ్రైవింగ్ చేస్తే పవర్ డెలివరీ చాలా సరళంగా ఉంటుంది మరియు టర్బో అంత హార్డ్ గా ఏమీ అనిపించదు, కానీ స్పీడోమీటర్ చూస్తే మటుకు కారు చాలా వేగంగా పరిగెడుతుందని తెలుస్తుంది. 5-స్పీడ్ గేర్బాక్స్ మారుస్తుంటే అంత ఆనందాన్ని ఇవ్వదు, కానీ దానికి ఉన్న టార్క్ వలన అంత షిఫ్ట్ చేయాల్సిన అవసరం కూడా రాదు. కారు విసరడమనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు లాంగ్ ట్రావెల్ క్లచ్ పెడల్ అంత ఔత్సాహికంగా ఉండదు. కానీ రోజీ వారి వాడకంలో ఇవి అంత ప్రభావం చూపించదు. ఇంజన్ స్థిరంగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు శబ్ధం చేయొచ్చు, కానీ కారు నడుస్తూ ఉన్నపుడు ఆ శబ్ధం తగ్గుతూ వస్తుంది. మొత్తంగా చెప్పలాంటే ఇంజన్ పోలో కి బాగా న్యయం చేసింది మరియు బాగా నచ్చింది.  

హ్యాండ్లింగ్ అండ్ రైడ్ క్వాలిటీ:

Volkswagen Polo 1.5 TDI

పోలో అనేది ఎప్పుడు కూడా మంచి సస్పెన్షన్ ని కలిగి ఉంది మరియు ఈ కొత్తది దానికి మినహాయింపు ఏమీ కాదు. ఇది అడ్డంకులని సులభంగా ఛేదించుకొని వెళిపోతుంది మరియు అక్రమంగా కట్టిన స్పీడ్ బ్రేకులను కూడా అవలీలగా దాటెస్తుంది. బాగా గతకలు మరియు అడ్డ దిడ్డంగా ఉండే కాంక్రీట్ జాయింట్స్ ని దాటుతున్నప్పుడు కొద్దిగా తెలుస్తుంది. యూరోపియన్ పోలో ఇండియన్ పోలో కంటే రైడింగ్ కొంచెం ష్టిఫ్ గా ఉంటుంది,ఎందుకంటే సస్పెన్షన్ సెటప్ అనేది మన మనసులో ఉన్న సౌకర్యం అనే అలోచనకి అనుగుణంగా తయారుచేయబడింది.

Volkswagen Polo 1.5 TDI

ఈ కారు టర్నింగ్ లో తిప్పుదాము అనుకున్నపుడు, షార్ప్ ఎడ్జెస్ లో కొంచెం మెల్లగా తిరిగి కారు బాడీ కంట్రోల్ లో ఉంటుంది. 185 సెక్షన్ అపోలో టైర్లు ఒకే మార్గంలో వెళ్ళే విధంగా ట్రాక్షన్ ని చెక్ చేసుకుంటూ మంచి పనితీరు అందిస్తుంది. దీనిలో బ్రేకింగ్ కూడా చాలా బాగుంటుంది మరియు హార్డ్ పెడల్ నొక్కగానే ఆభ్శ్ పనిచేస్తుంది. పెద్ద వర్షాలలో కూడా బ్రేకులు వేసినట్టు అయితే పోలో అనేది స్టిగ్ గా ఆగుతుంది కానీ స్కిడ్ అవ్వదు.  

ఇంధన సామర్ధ్యం:   

ఇది పనితీరు అంతగా బాగా లేనప్పటికీ, మూడు సిలిండర్ల యూనిట్ వలన మంచి ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ శుభవార్త ఏమిటంటే, కొత్త ఇంజన్ కూడా అంత పవర్ మరియు టార్క్ పెరిగినప్పటికీ అంతే ఇంధన సామర్ధ్యాని కలిగి ఉంది. 1.5 TDI యూనిట్ పోలో లో హైవే మీద 13.4 Kmpl మైలేజ్ ని ఇచ్చేది, అది 16.1Kmpl కి పెంచడం జరిగింది. ఈ సంఖ్యలు చూసుకున్నట్లయితే పోలో మంచి పనితీరుని అందిస్తుంది.

తీర్పు:

Volkswagen Polo 1.5 TDI

పోలో చివరకు మంచి అర్హత కలిగిన ఇంజిన్ ని కలిగి ఉంది మరియు అద్భుతమైన లక్షణాలను పుష్కలంగా కలిగి ఉందని ప్రత్యేఖంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇది అంత పరిపూర్ణమైనది ఏమీ కాదు, దీనిలో ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే వెనకాతల భాగంలో ఏవరేజ్ లెగ్‌రూం, హెడ్‌లైట్స్ అంత బాగా లేకపోవడం మరియు మరకలు కనిపించేలా సీట్లు ఉన్నాయి. కానీ చాలా అంశాలు కూడా బాగున్నాయి అవి స్టైలింగ్, మంచి దృఢమైన నిర్మాణ క్వాలిటీ,పుష్కలమైన లక్షణాలు మరియు మంచి బాలెన్సెడ్ పనితీరు మరియు ఎకనమిక్ గా ఉంటుంది. ధర విషయానికి వస్తే, కొత్త పోలో 1.5 TDI ట్రెండ్ లైన్ వేరియంట్ రూ.6.27 లక్షల వద్ద ప్రారంభమవుతుంది మరియు హైలైన్ వేరియంట్ రూ.7.37 లక్షలు(ఎక్స్-షోరూం డిల్లీ) వద్ద ఉంటుంది. ఈ ధరలు అవుట్ గోయింగ్ వెర్షన్ కి సమానంగా ఉన్నాయి మరియు చివరకు కారుకు చాలా విలువను జోడించడం జరిగింది. పోలో మొదటి నుండి కూడా మంచి కారు మరియు ఇప్పుడు  ఒక మంచి ఇంజిన్ మరియు అవసరానికి కావలసిన అన్ని లక్షణాలని కలిగి ఉంది.  

స్పెక్ పోలిక: డీజిల్

Spec comparison: Diesel

 

వేరియంట్స్

* ఎక్స్ షోరూమ్ ధర న్యూఢిల్లీ

1.5 TDI ట్రెండ్లైన్ (డీజిల్)

రూ. 7.22 లక్షలు *

1.5 TDI కంఫర్ట్లైన్ (డీజిల్)

రూ. 8.14 లక్షలు *

1.5 TDI హైలైన్ ప్లస్ (డీజిల్)

రూ. 9.14 లక్షలు *

1.5 TDI హై లైన్ (డీజిల్)

రూ. 8.67 లక్షలు *

GT 1.5 టిడిఐ (డీజిల్)

రూ. 9.71 లక్షలు *

1.0 MPI ట్రెండ్లైన్ (పెట్రోల్)

రూ. 5.7 లక్షలు *

1.0 MPI కంఫర్ట్లైన్ (పెట్రోల్)

రూ. 6.4 లక్షలు *

1.0 MPI హైలైన్ (పెట్రోల్)

రూ. 7.14 లక్షలు *

1.0 MPI హైలైన్ ప్లస్ (పెట్రోల్)

రూ. 7.59 లక్షలు *

GT TSI (పెట్రోల్)

రూ. 9.58 లక్షలు *

 

Published by
abhishek

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience