టాటా నెక్సాన్ డీజిల్ ఏఎంటి : ఎక్స్పర్ట్ రివ్యూ

Published On మే 10, 2019 By nabeel for టాటా నెక్సన్ 2017-2020

టాటా, నెక్సాన్ డీజిల్ ఏఎంటి కోసం మాన్యువల్ మీద భారీ ప్రీమియం కోసం అడుగుతోంది. అదనంగా చెల్లించే డబ్బుకు తగిన సౌలభ్యం ఉందా?

Tata Nexon AMT

ఆటోమేటిక్స్ కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా, టాటా ఒక ఏఎంటి తో నెక్సాన్ ను 2018లోనే విడుదల చేసింది. కానీ, ఈ సౌలభ్యం చాలా ఖర్చుతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. నెక్సాన్ యొక్క ఏఎంటి వేరియంట్లు, రూ. 70,000 అదనపు ప్రీమియం ఖర్చు తో మాన్యువల్ కు సమానంగా ఉంది మరియు ఎటువంటి అదనపు ఫీచర్లను అందించబడవు. మీరు నగదును మరియు మాన్యువల్ షిఫ్ట్ను సేవ్ చేయాల్సిన అవసరం ఉందా లేదా వారు అడిగిన ధరకు సౌలభ్యంగా ఉంటుందా?

 • కారు పరీక్షించబడింది: టాటా నెక్సాన్ ఏఎంటి

 • వేరియంట్: ఎక్స్జెడ్ఏ + తో డ్యూయల్ టోన్ రూఫ్

 • ఇంజిన్: 1.5 లీటర్ డీజిల్

 • ధర: రూ. 10.59 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

లుక్స్

Tata Nexon

 • నెక్సాన్ ఒక కాన్వెన్షినల్ ఎస్యువి వలె కనిపించడం లేదు, కానీ విలాసవంతమైన వాహనంలా ఇది ఒక మంచి రహదారి ఉనికిని ఇస్తుంది.

 • ముందు భాగం అందరి కంటిని ఆకర్షించే విధంగా ఉంటుంది, పెద్ద హెడ్ల్యాంప్లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ లు గ్రిల్ లో విలీనమవుతాయి.

 • ఆరెంజ్ కారు రంగు పై భాగంలో బూడిద రంగులో ఉన్న రూఫ్ అందించబడుతుంది, ఈ కలయిక ఉత్తమ ద్వంద్వ టోన్ పెయింట్ స్కీమ్ గా ఉంది.

​​​​​​​Tata Nexon

 • సైడ్ నుండి, నెక్సాన్ యొక్క స్లొపింగ్ రూఫ్ లైన్, దాదాపు కూపే వంటి వైఖరిని ఇస్తుంది.

 • పెద్ద 215/60, ఆర్16 చక్రాలు మరియు బ్లాక్ క్లాడింగ్ వంటివి దృగ్గోచర దృఢత్వానికి జోడించబడ్డాయి.

​​​​​​​Tata Nexon

 • ఆటోమేటిక్ మరియు మాన్యువల్ మధ్య వ్యత్యాసంగా ఉన్న అంశం ఏమిటంటే, ముందు టైల్ గేట్ పై "ఎక్స్జెడ్ఏ +" బ్యాడ్జ్.

 • నెక్సాన్, ముఖ్యంగా వెనుక నుండి ఆకర్షణీయంగా కనిపించడం లేదు కానీ, 209 మీ మీ అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు ఎక్పోజ్డ్ ఎగ్సాస్ట్ మఫ్లర్ కు కృతజ్ఞతలు.​​​​​​​

ఇంటీరియర్స్

Tata Nexon

 • మూడు లేయర్ల డాష్బోర్డ్ లేఅవుట్ చక్కగా ఉంటుంది మరియు అధిక నాణ్యత గల ప్లాస్టిక్ ను అందించినందుకు కృతజ్ఞతలు, ఇది చాలా ప్రీమియం అనిపిస్తుంది. ముఖ్యంగా, ఇది పోటీ కంటే ఉత్తమంగా కనిపిస్తుంది.

​​​​​​​Tata Nexon

 • 6.5- అంగుళాల టచ్స్క్రీన్ సెగ్మెంట్లో అత్యుత్తమమైనది కాదు, బ్రెజ్జాలో మరియు ఎకోస్పోర్ట్లో అందించబడినవి చాలా మంచివి. అయితే ఇది ఆండ్రాయిడ్ ఆటో మద్దతుతో వస్తాయి, ఆపిల్ కార్ ప్లే మిస్ అవుతుంది.

 • స్క్రీన్ లో డ్రైవ్ మోడ్ ను మార్చినప్పుడు దానిని సూచించే రంగు విభిన్నంగా ఉంటుంది.

 • ఈ వాహన శ్రేణిలో అందించబడిన 8 స్పీకర్ హర్మాన్ సౌండ్ సిస్టం శ్రేణిలోనే శ్రేష్ఠమైనది.

​​​​​​​Tata Nexon

 • ఇక్కడ పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, సెంట్రల్ కన్సోల్ లో ఉన్న ఏఎంటి గేర్ లివర్ తో డ్రైవ్- మోడ్ సెలెక్టర్ దాని వెనుక ఉంచబడుతుంది.

​​​​​​​Tata Nexon

 • నెక్సాన్ కాబిన్లో విశాలమైన క్యాబిన్ స్థలం పుష్కలంగా ఇవ్వబడింది. దీనిలో, పుష్కలమైన షోల్డర్ రూమ్, లెగ్ రూమ్ మరియు నీ రూమ్ (వరుసగా 1385 మీమీ, 970 మీమీ, 715- 905 మీమీ) లతో అందించబడ్డాయి.

 • క్యాబిన్ బాగుంది అయితే, ఇది వాస్తవికతను కలిగి లేదు. ఉదాహరణకు, నిల్వ స్థలాలు ఇరుకైనవి మరియు పెద్ద స్మార్ట్ఫోన్లను పెట్టుకునేందుకు సరైన స్థలాన్ని కలిగి ఉండవు.

​​​​​​​Tata Nexon Diesel AMT: Expert Review

 • సెంటర్ కన్సోల్ లో ఉన్న టాంబర్ డోర్ పాకెట్ ఇరుకైనది మరియు లోతైనది. అంతేకాకుండా, దీనిలో ఏ వస్తువునైనా పెట్టదలిస్తే ఆ వస్తువు పాడయ్యే అవకాశం ఉంది.

 • హాంకింగ్ తో ఒక సమస్య ఉంది. హార్న్ ప్యాడ్ తో కూడా సమస్య ఉంది మరియు అది హార్న్ బ్లేర్ చేయడానికి నిజంగా భారీ పుష్ అవసరం.

 • వెనుక డోర్ -లాక్ అతుకులు లేనప్పటికీ ఇప్పటికే తుప్పు పట్టడం మొదలుపెట్టబడిందని మేము గమనించిన మరొక విషయం.

 • ప్రారంభం తర్వాత మేము పరీక్షించిన మాన్యువల్ కార్లు కొన్ని విద్యుత్ సమస్యలను కలిగి ఉన్నాయి, మీరు ఇక్కడ చూడవచ్చు.

పెర్ఫామెన్స్

Tata Nexon Diesel AMT: Expert Review

 • టాటా 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ బాగా ఆకట్టుకుంటుంది. 1500 ఆర్పిఎమ్ వద్ద అత్యధికంగా 260ఎం ఎం గల టార్క్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది, అది నగరంలో అప్రయత్నంగా మారడానికి సహాయపడుతుంది.

 • ఏఎంటి ఒక మంచి అనుభవాన్ని అందిస్తుంది. ఇది అధిక గేర్ లో కూడా, మూడవ గేర్ వద్ద 30 కెఎంపిహెచ్ తో, ఈ ఎస్యువి ఎటువంటి డౌన్ షిఫ్టులు లేకుండా మంచి పికప్ తో అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

​​​​​​​Tata Nexon Diesel AMT: Expert Review

 • దీని అర్థం గేర్ షిఫ్ట్ లను తగ్గించినప్పుడు, త్వరణం హార్డ్ గా ఉన్నప్పుడు మరియు టర్బో కిక్కింగ్ ను 1600 ఆర్పిఎమ్ దగ్గరకు తీసుకురావడంతో పవర్ డెలివరీలో ఎటువంటి స్పష్టమైన లాగ్ లేదు ఇది ఏఎంటి యొక్క లక్షణం.

 • డౌన్ సైడ్ లో, మొదటి గేర్ కొద్దిగా కఠినంగా నిమగ్నమై ఉంటుంది మరియు బంపర్ నుండి బంపర్ ట్రాఫిక్ సమయంలో చిన్న జర్కులు బాధించవచ్చు

Tata Nexon Diesel AMT: Expert Review

 • మాన్యువల్ వలె, మీరు ఎంచుకోవడానికి మూడు డ్రైవ్ రీతులు ఉన్నాయి - అవి వరుసగా సిటీ, స్పోర్ట్ మరియు ఎకో. ఇవి ఇంజిన్ మ్యాప్ను మార్చివేస్తాయి మరియు ప్రతి వ్యత్యాసం స్పష్టంగా ఉంటుంది.

 • స్పోర్ట్ రీతిలో, థొరెటల్ స్పందన మరింత దూకుడుగా మారి, అధిక ఆర్పిఎమ్ వరకు ట్రాన్స్మిషన్ రివర్స్ కలిగి ఉంటుంది.

 • మీరు సాధారణ స్థితిలో ఉంటే ఇది మంచి ఆహ్లాదకరాన్ని ఇస్తుంది, కానీ రైడ్ కొద్దిగా జెర్కీగా  ఉంటుంది.

​​​​​​​Tata Nexon Diesel AMT: Expert Review

 • ఈ మోడ్లో, నెక్సాన్ ఏఎంటి 0- 100 కెఎంపిహెచ్ వేగాన్ని చేరడానికి 16.62 సెకన్ల సమయం పడుతుంది, ఇది దాని మాన్యువల్ కౌంటర్ కంటే 3 సెకన్లు ఎక్కువగా ఉంటుంది.

 • 20- 80 కెఎంపిహెచ్ వేగాన్ని చేరడానికి 9.96 సెకన్ల సమయం పట్టింది.

 • అలాగే, మీరు మాన్యువల్ కు మారాలి అనుకుంటే మోడ్ డిఫాల్ట్గా స్పోర్ట్కు సెట్ చేయబడుతుంది. ఇది కొద్దిగా దూకుడుగా ఉంటుంది మరియు ప్రయాణాలకు తగినది కాదు.

​​​​​​​Tata Nexon

 • సిటీ మోడ్లో, థొరెటల్ స్పందన బాగా ట్యూన్ చేయబడుతుంది మరియు షిఫ్ట్లు మృదువైనవి.

 • ఎకో మోడ్కు మారండి మరియు థొరెటల్ ప్రతిస్పందన మరింత తగ్గిపోతుంది, ఇది సడలించిన డ్రైవింగ్ కోసం ఆదర్శంగా ఉంటుంది. ఈ మోడ్లో ఈ ఎస్యూవి వాహనం నగరంలో, 17.13 కెఎంపిఎల్ మైలేజ్ ను మరియు రహదారిపై 23.60 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తుంది. మాన్యువల్ కంటే 1 కెఎంపిఎల్ తక్కువ.​​​​​​​

రైడ్ అండ్ హ్యాండ్లింగ్

Tata Nexon Diesel AMT: Expert Review

 • నెక్సాన్ యొక్క రైడ్, ఒక సాధారణ ఎస్యువి మాదిరిగా ఉంటుంది - దాని రైడ్ కూడా మృదువుగా ఉంటుంది.
 •  మీరు నగరాలలో ప్రయాణిస్తున్నప్పుడు చిన్న గుంతలు లేదా వేగవంతమైన బ్రేకర్లు అనుభూతి పొందనప్పటికీ, క్యాబిన్లో కొద్దిగా కదలిక ఉంటుంది.
 •  ఎస్యువి, దాని బాడీని చూసి బాధపడుతుంటుంది, కానీ ఏ విషయంలో ఇబ్బందికి గురి అవుతూ ఉంటుందంటే ఇరుకైన మూలల్లో టర్నింగ్ తిప్పడానికి, వాహనం ముందుకు వెళ్ళేందుకు ఇబ్బందిగా ఉంటుంది.

Tata Nexon Diesel AMT: Expert Review

 • ఎత్తు పల్లాలు తర్వాత సస్పెన్షన్ త్వరగా స్థిరపడిపోతుంది మరియు రహదారులపై మూడు అంకెల వేగంతో కూడా ఈ ఎస్యువి స్థిరంగా ఉంటుంది.
 •  సీట్లు మెత్తగా ఉండటమే కాకుండా చాలా మృదువైనవి కూడా మరియు ఇవి మీకు మరింత సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తాయి.
 •  బ్రెజ్జా మరియు ఎకోస్పోర్ట్లతో పోలిస్తే, నెక్సాన్ యొక్క రైడ్ నాణ్యత భారతీయ రహదారులకు బాగా సరిపోతుంది.​​​​​​​

వేరియంట్లు

Tata Nexon Diesel AMT: Expert Review

 • నెక్సాన్ ఏఎంటి ఎక్స్ఎంఏ, ఎక్స్జెడ్ఏ + మరియు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ల రెండింటితో నెక్సాన్ ఎక్స్జెడ్ఏ + డ్యూయల్ టోన్ రూఫ్ లు అందుబాటులో ఉన్నాయి.

 • మీరు ఎక్స్జెడ్ఏ + కోసం బడ్జెట్ను కలిగి ఉండకపోతే మరియు ఇప్పటికీ ఒక ఆటోమేటిక్ కావాలనుకుంటే, మీరు ఇప్పుడు ఎక్స్ఎంఏ వేరియంట్ ను కూడా ఎంపిక చేసుకోవచ్చు, దీని ధర రూ 8.53 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

 • మీరు దీనిని ఎంపిక చేసుకోవడం వల్ల, మీరు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, డిఆర్ఎల్ లు, రూఫ్ రైల్స్, అల్లాయ్ చక్రాలు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, నాలుగు స్పీకర్లు, డ్రైవర్ సీట్ల ఎత్తు సర్దుబాటు, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ మరియు టాంబర్ డోర్ స్టోరేజ్, వెనుక డిఫోగ్గర్ మరియు ఐసోఫిక్స్ మౌంట్ వంటి అంశాలను కోల్పోతాము.

​​​​​​​

తీర్పు

Tata Nexon Diesel AMT: Expert Review

ఏఎంటి, రోజువారీ డ్రైవ్ కోసం అలుపెరుగని సౌకర్యవంతమైన అనుభూతిని అందిస్తుంది. మీరు ఇబ్బంది పడే అంశం ఒకే ఒకటి ఏమిటంటే ట్రాఫిక్ సమయంలో కారును ఆపడానికి, వెళ్ళడానికి శుద్ధీకరణ లేకపోవడాన్ని అసౌకర్య అనుభూతిని అనుభచించాల్సి ఉంది. మీరు కొత్త డ్రైవర్, లేదా మెట్రో నగరాల్లో రోజువారీ ట్రాఫిక్ అలసిపోయి ఉంటే, అప్పుడు మాత్రమే నెక్సాన్ ఏఎంటి అర్ధవంతం చేస్తుంది. అయితే, మీ ప్రాంతంలో ట్రాఫిక్ పరిస్థితి బాగానే ఉంటే, మీ డబ్బు ఆదా అయినట్టే.

సిఫార్సు చేయబడినవి చదవండి

టాటా జూలై ఆఫర్స్: అద్భుతమైన ప్రయోజనాలను పొందుతున్న నెక్సాన్, టియాగో, టిగార్

మారుతి విటారా బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ఫో వర్సెస్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ - ఏ కారు అద్భుతమైన అంశాలను అందిస్తుంది

తాజా ఎస్యూవి కార్లు

రాబోయే కార్లు

తాజా ఎస్యూవి కార్లు

×
We need your సిటీ to customize your experience