టాటా హారియర్ Vs హ్యుందాయ్ క్రెటా Vs జీప్ కంపాస్: పోలికల సమీక్ష
Published On మే 11, 2019 By arun for టాటా హారియర్ 2019-2023
- 1 View
- Write a comment
హారియర్ యొక్క ధరని క్రెటా తో పోల్చితే మెరుగైన విలువ అనేది మనకు ఆశ్చర్యానికి గురి చేస్తుంది; దీని యొక్క సత్తా మనల్ని అడుగుతుంది కంపాస్ కి అంత ప్రీమియం చెల్లించాలా అని
పందండి దీనిని మొదలు పెడదాము, హారియర్ మరియు క్రెటా ధరల విషయంలో గనుక చూస్తే రెండూ దగ్గర దగ్గరగా ఉంటాయి, కాని కంపాస్ విషయానికి వస్తే మాత్రం చాలా ఖరీదైనదిగా ఉంటుంది. మీరు కుటుంబం కోసం ఒక ఐదు సీట్ల SUV ని కొనుగోలు చేసుకొనేందుకు మార్కెట్ లో ఉంటే, మీరు నిజంగా హ్యుందాయ్ మరియు జీప్ మధ్య ఉన్న గ్యాప్ ని పూరించడానికి మీ దగ్గర ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు దానిని హారియర్ రూపంలో పూరించినవచ్చు, ఇక్కడ సమాధానాలు కోసం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు ఉన్నాయి:
- క్రెటా పోలిస్తే హారియర్ మంచి విలువైనదిగా ఉందా? ఇది ప్రామాణికమైన SUV అనుభవాన్ని అందిస్తుందా?
- కంపాస్ ఏదైతే రూ.4 లక్షల -రూ.5లక్షల ప్రీమియంను అడుగుతుందో దానికి అది న్యాయం చేస్తుందా?
ఒక ప్రతిపాదనని చేయండి
దీని కోసమే మీరు మొదటి స్థానంలో ఒక SUV ని కొనుగోలు చేసుకుందాము అనుకుటున్నారు అంతే కదా? ఒక పొడవైన, నిటారుగా, స్క్వేర్డ్-ఆఫ్ SUV రోడ్డు మీద వెళుతున్న చిన్న చిన్న సెడాన్ లు మరియు హాచ్బాక్స్ కంటే ఎత్తుగా నిలుస్తుంది మరియు అలా భిన్నంగా నిలిచే తత్వంలో మూడిటికి మూడూ ప్రత్యేకంగా నిలుస్తాయి, అలాగే మూడు వారి సొంత ప్రత్యేక మార్గాలలో నడుస్తాయి.
క్రెటా అనేది కాలంతో పాటూ పరిణితి చెందుతూ వస్తుంది, ఈ ఫేస్ లిఫ్ట్ తో, హ్యుందాయ్ డిజైన్ లో చాలా మార్పులు అయితే ఏమీ చేయబడలేదు. నారింజ లేదా నీలం వంటి కంటికి ఇంపైన షేడ్ ని ఒకదాన్ని ఎంచుకుంటే అది ఖచ్చితంగా మీ దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కలయికలో, ఇది కొంచెం డల్ గా ఉండే అవకాశం అయితే ఉంది, ముఖ్యంగా ఇది ఇతర రెండిటితో పోలిస్తే పరిమాణంలో అంత పెద్దది ఏమీ కాదు.
జీప్ కంపాస్ ప్రస్తుత రోజుల్లో ఉన్న అంశాలతో పాత SUV ని అందిస్తుంది. ఈ పొడవాటి బోనెట్ మరియు దాని యొక్క ట్రేడ్మార్క్ ఏడు-స్లాట్ గ్రిల్ తో ఈ జీప్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దాని యొక్క వైఖరిని చూసినా మరియు దాని యొక్క కలయికలు చూసినా ఒక SUV తో ఉండే అనుబంధం ని పొందవచ్చు.
అయితే క్రెటా దాని యొక్క ఆధునీకరణతో మనకి ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది మరియు కంపాస్ దాని అసాధారణమైన బాక్సింగ్ స్వభావంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది, అయితే హారియర్ పైన చెప్పిన రెండు లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ పోలికలలో చూసుకుంటే హారియర్ అనేది అతి పెద్ద SUV అని చెప్పవచ్చు మరియు ఇది చాలా పెద్దది అని కూడా చెప్పవచ్చు. దీనితో పాటూ దీని యొక్క డిజైన్ మనకి నచ్చకపోవడం అంటూ ఏమీ ఉండవు, ఎందుకంటే దీనిలో డే టైం రన్నింగ్ లైట్స్, కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ మరియు మీటీ వీల్ ఆర్చులు ఉంటాయి.
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రెటా |
జీప్ కంపాస్ |
|||
కొలతలు |
|||||
పొడవు |
4598mm |
4270mm |
4395mm |
||
వెడల్పు |
1894mm |
1780mm |
1818mm |
||
ఎత్తు |
1706mm |
1665mm |
1640mm |
||
వీల్బేస్ |
2741mm |
2590mm |
2636mm |
||
కెర్బ్ వెయిట్ |
1675kg |
1398kg |
1654kg (4x4) / 1584kg (4x2) |
||
టైర్ సైజు |
235/65 R17 |
215/60 R17 |
225/55 R18 |
హారియర్, కంపాస్ కన్నా 203 మిమీ పొడవు ఉంటుంది, మరియు క్రెటా కన్నా 328mm పొడవు ఎక్కువగా ఉంటుంది మరియు వెడల్పు లో కూడా రెండిటినీ చిత్తు చేస్తుంది. ఇది జీప్ కంటే వెడల్పు లో 80mm ఎక్కువ మరియు హ్యుందాయ్ కంటే 114mm కంటే ఎక్కువగా ఉంటుంది. వీల్స్ బేస్ కూడా 2741mm వద్ద, ఇతర రెండిటి కంటే పెద్దదిగా ఉంది.
పరికరాల పరంగా, మూడు చాలా వేరు వేరుగా ఉండవు. ఉదాహరణకు, మూడూ కూడా ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లను కలిగి ఉంటాయి మరియు టెయిల్ లాంప్స్ లో LED మూలకాలను కూడా కలిగి ఉంటాయి. అన్నీ కూడా అలాయ్ వీల్స్ ని కలిగి ఉంటాయి, హారియర్ మరియు క్రెటా 17-ఇంచ్ వీల్స్ ని కలిగి ఉండగా, కంపాస్ దాని కొత్త టాప్-స్పెక్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్ లో లిప్-స్మాకింగ్ 18-ఇంచ్ అలాయ్ వీల్ సెట్ ని పొందుతుంది.
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రెటా |
జీప్ కంపాస్ |
|||
బాహ్య భాగాలు |
|||||
ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ |
జీనాన్ |
హాలోజన్ |
బై-జినాన్ |
||
డే టైమ్ రన్నింగ్ లాంప్స్ |
అవును |
అవును |
అవును |
||
అల్లాయ్ వీల్స్ |
17 అంగుళాల |
17-అంగుళాల (మెషీన్-ఫినిష్డ్) |
18-అంగుళాల (మెషీన్-ఫినిష్డ్) |
||
LED టెయిల్ లాంప్స్ |
అవును |
అవును |
అవును |
ఏదో ఒకటి ఎంచుకోండి మరియు మీ పార్కింగ్ లో ఒక అందమైన SUV ని కలిగి ఉంటారు. మేము గానీ ఒకటి ఎంచుకోవాల్సి వస్తే హారియర్ కే మా మద్దతు ఇస్తాము. ఎందుకంటే ఈ హారియర్ నడుస్తుంటే అందరు తలలు దాని వైపు తిప్పి మరీ చూస్తారు.
లోపల బాగా పెద్దగా ఉంటుంది?
టాటా పరిమాణం పైన బాగా శ్రద్ద పెట్టింది, అంతేకాకుండా లోపల నుండి బాగా పెద్దదిగా ఉండడం వలన బాగా బహుమతులు కూడా పొందుతోంది. హారియర్ యొక్క రెండవ వరుసలో మొత్తం స్థలం చాలా అద్భుతంగా ఉంటుంది! మీరు ఎక్కువగా కారులో తిరగడానికి లేదా మీకు బాగా దగ్గర వాళ్ళని రోడ్డు ట్రిప్ కోసం తీసుకెళ్ళాలని అనుకుంటే దానికోసం ఒక SUV ని కొనుగోలు చేసుకోడానికి చూస్తున్నారా అయితే మీకు హారియర్ అనేది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. టుషార్ అనే పొడవాటి పెద్ద జైంట్ లాంటి 6.5 అడుగుల పొడవు ఉన్న మా మనిషి తన యొక్క సౌకర్యవంతమైన డ్రైవింగ్ పొజిషన్ లో కూర్చొని అంతే పొడవు ఉన్న మనిషి వెనకాతల కూర్చుంటే కొంచమే స్థలం ఉంది. వెనుక సీటులోనికి మీరు వెళ్తున్నట్టు అయితే (గుర్తు పెట్టుకోండి, నేను కూడా లావుగానే ఉంటాను), ఒక పెద్ద వారిని కూర్చోబెడితే తగినంత స్థలం ఉంటుందని చెప్పవచ్చు. అవును, దీనిలో నేలమీద ఒక పొడవైన అంచులాగా ఉంది, కానీ అది సన్నగా ఉండడం వలన మధ్యలో ఉన్నవారికి ఇరువైపులా వారి పాదాలు ఉంచడానికి సరిపోతుంది.
మరోవైపు, హ్యుందాయి అయితే క్రెటా యొక్క లిమిటెడ్ డైమెన్షన్స్ తో ఆ స్థలాన్ని చాలా అందంగా తీర్చిదిద్దారు అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉత్తమమైన వెనుక సీట్ అనుభవాన్ని అందించడంలో రెండవ స్థానంలో ఉంటుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా, క్యాబిన్ అనేది అంత అద్భుతంగా అయితే ఉండదు, కానీ నలుగురు ఆరడుగుల మనుషులుకు కూడా సౌకర్యవంతమైనదిగా ఉంటుంది. దీనిలో వెడల్పు అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, వెనకాతల సీటులో ముగ్గురు కూర్చోడం కొంచెం ఇబ్బందికరం. అయితే, క్రెటా ఒక ఫ్లాట్ ఫ్లోర్ ని కలిగి ఉంది, దాని వలన మధ్యలో కూర్చున్న వ్యక్తికి జీప్ లో ఉన్నట్టుగా అసౌకర్యంగా ఉండదు.
కంపాస్, వెలుపల నుండి చూడడానికి పెద్ద పరిమాణంలో ఉన్నప్పటికీ లోపల క్యాబిన్ అయితే అంత విశాలంగా ఉండదు. ఆశ్చర్యంగా, వెనుక వైపు అంత ఎక్కువ వెడల్పు ఉండదు. ఈ జీప్ లో ఆ పెద్ద ఫ్లోర్ హుంప్ వలన ఫుట్‌రూం అనేది బాగా తినేస్తుంది, దీనివలన వెనకతాల కూర్చున్న ముగ్గురుకి విశాలంగా ఉండదు. నాలుగు సీట్ల వాహనంగా కంపాస్ అనేది మెరుస్తుంది, ఆ నలుగురు ఆరడుగుల మనుషులు అయినా ఇబ్బంది అయితే ఏమీ ఉండదు.
ఇక్కడ కొలతలు ఉన్నాయి, త్వరగా వీక్షించండి:
ఇంటీరియర్ కొలతలు (రేర్) |
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రెటా |
జీప్ కంపాస్ |
షోల్డర్ రూం |
1400mm |
1250mm |
1345mm |
హెడ్ రూం |
940mm |
980mm |
900mm |
నీ(మోకాలు) రూం |
720-910mm |
615mm-920mm |
640-855mm |
సీట్ బేస్ వెడల్పు |
1340mm |
1260mm |
1305mm |
సీట్ బేస్ పొడవు |
475mm |
450mm |
510mm |
సీట్ బ్యాక్ హైట్ |
625mm |
640mm |
635mm |
ఫ్లోర్ హంప్ హైట్ |
120mm |
- |
85mm |
ఫ్లోర్ హంప్ వెడల్పు |
295mm |
- |
350mm |
హారియర్ లో ముందరి భాగానికి వస్తే పైన చెప్పుకున్న కధనంలో పెద్ద తేడా ఏమీ ఉండదు. హారియర్ అత్యధిక మొత్తంలో వెడల్పు మరియు అత్యధిక సీటింగ్ స్థానం అందిస్తూ ఎగువ భాగంలో ఉన్న ఒక SUV వలె అనిపిస్తుంది. కానీ టాటా లో ఇది అంత అద్భుతమైతే కాదు. హారియర్ లో ఒక డ్రైవింగ్ స్థానం కనుగొనడం అనేది ఒక పెద్ద పని అని చెప్పుకోవచ్చు మరియు ఇది పొట్టిగా ఉండే డ్రైవర్లకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. పెడల్ బాక్స్, ఇక్కడ ఇరుకైనదిగా అనిపిస్తుంది, అలాగే డెడ్ పెడల్ మంచి స్థానంలో ఉంచబడలేదు మరియు పొడువైన యజమానులకు మోకాలు డాష్బోర్డ్ కి తగిలే అవకాశం అనేది ఉంది. మేము హారియర్ తో గడిపిన వారంలో, సీటుతో కొంచెం కష్టపడిన రోజులు అయితే బాగానే ఉన్నాయి. దీనికి మేము ఇచ్చే పరిష్కారం ఏమిటంటే సాధారణంగా కూర్చొనే దానికంటే కొంచెం క్రిందకి కూర్చొని వెనకాతలకు కూర్చుంటే బాగుంటుంది.
ఇంకో ప్రక్క హ్యుందాయి క్రెటా లో ఎర్గనామిక్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. సౌకర్యవంతమైన సీటింగ్ స్థానంలో కూర్చోవడం చాలా సులభంగా ఉంటుంది మరియు స్టీరింగ్ వీల్ కోసం టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ లేకపోయినా కూడా ఇబ్బంది ఉండదు. పొడవైన డ్రైవర్లకు చాలా ఎక్కువ రూం ఉంది మరియు వెడల్పు అనేది ఒక సమస్య కాదు. అయితే క్రెటా మనకి SUV లక్షణాలు ఉండే కారు లా అనిపిస్తుంది మరియు దీనిని S-క్రాస్ వాటితో పోలిస్తే ఈ ముందర విషయానికి వస్తే చాలా బాగుంటుందని చెప్పవచ్చు.
జీప్ అనేది ఒక ఒక జీప్ లాగానే అనిపిస్తుంది! మీరు బోనెట్ యొక్క అంచును చూడవచ్చు మరియు మీరు మీ రోజువారీ చూసే హ్యాచ్బాక్లు / సూడో-SUV ల కంటే ఎక్కువ ఎత్తులో దీనిలో కూర్చోగలుగుతారు. కానీ, హారియర్ లాగానే కంపాస్ పెడల్ బాక్స్ కొంచెం ఇరుకుగా అనిపించవచ్చు, మరీ ముఖ్యంగా మీకు పొడవాటి పాదాలు ఉంటే ఇబ్బంది అనిపిస్తుంది. అయితే డెడ్ పెడల్ పొజిషన్ అనేది దీనిలో హారియర్ కంటే బెటర్ గా ఉంటుంది, ఇది ఇప్పటికీ ఇబ్బందికరమైన కోణం వద్ద ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ పొజిషన్ కి అలవాటు పడడం అనేది చాలా సులభం.
అంతర్గత కొలతలు (ఫ్రంట్) |
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రేటా |
జీప్ కంపాస్ |
లెగ్‌రూం |
930-1110mm |
925-1120mm |
905-1090mm |
నీ(మోకాలు)రూం
|
540-780mm |
610-840mm |
600-800mm |
సీట్ బేస్ పొడవు |
460mm |
595mm |
500mm |
సీట్ బేస్ వెడల్పు |
490mm |
505mm |
490mm |
సీటు బ్యాక్ హైట్ |
660mm |
645mm |
630mm |
హెడ్ రూమ్ (మిని-మాక్స్) |
940-1040mm |
920-980mm |
860-980mm |
క్యాబిన్ వెడల్పు |
1485mm |
1400mm |
1405mm |
మీ రుపాయికి మీరే అడగాలి
ఒకవేళ ఈ మూడిటినీ ఏదైనా కట్టిపడేస్తుంది అంటే, అది ఏమిటంటే ఈ మూడూ కూడా మంచి లక్షణాలతో వచ్చాయి. వీటిలో ఏవైనా టాప్-స్పెక్స్ వేరియంట్ ని ఎంచుకోండి మరియు మీరు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంట్ చేసిన ఆడియో నియంత్రణ, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పార్కింగ్ కెమెరా (అడాప్టివ్ గైడ్ లైన్స్ తో), కీలెజ్ ఎంట్రీ అలాగే పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్ వంటి లక్షణాలను పొందుతారు.
వాస్తవానికి, ఈ SUV లు అన్నీ కూడా తమ ప్రత్యేకమైన లక్షణాలను కూడా కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, టాటాతో మీరు ఇన్స్టృమెంట్ క్లస్టర్ లో చక్కగా కనిపించే 7-అంగుళాల TFT స్క్రీన్ ను కూడా పొందుతారు, అదే విధంగా పడుల్ ల్యాంప్స్ మరియు ఆటో-ఫోల్డింగ్ మిర్రర్స్ వంటి చిన్న చిన్న అందమైన అంశాలను కలిగి ఉన్నాయి. అలాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవలసినది ఏమిటంటే హారియర్ ఇక్కడ క్రెటా యొక్క (7-అంగుళాలు) మరియు కంపాస్ (8.4-అంగుళాల) తో పోలిస్తే అతిపెద్ద టచ్స్క్రీన్(8.8-అంగుళాల) ని కలిగి ఉంది. ఇది ఒక 9 స్పీకర్ JBL ధ్వని వ్యవస్థను సబ్ వూఫర్ తో కలిగి ఉంటుంది, మిగిలిన రెండు కూడా 6 స్పీకర్ సెటప్ లను పొందుతున్నాయి. లోపాలు? మేము ఇక్కడ కొన్ని బేసిక్స్ సంరక్షణ తీసుకుంటే చూడటానికి బాగుంటుంది: ఆటో-డిమ్మింగ్ రేర్-వ్యూ మిర్రర్, హైట్-అడ్జస్టబుల్ సీటు బెల్ట్ లు, అన్ని విండోలకు ఆటో అప్ / డౌన్ ఉన్నట్లయితే హారియర్ యొక్క ఇన్-కాబిన్ అనుభవం ఇంకా చాలా బాగుండేది.
కంపాస్ ఒక పూర్తి పానరోమిక్ సన్రూఫ్, మెమరీ తో ఎలక్ట్రిక్ డ్రైవర్ యొక్క సీటు మరియు డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ రూపంలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను పొందుతుంది. కానీ, మీరు నిజంగా చెల్లిస్తున్నది దీనికోసం అయితే కాదు. జీప్ తో మీరు ఒక సూపర్ సాఫ్ట్ డాష్బోర్డ్, డోర్ పాడ్స్ మీద సాఫ్ట్-టచ్ మెటీరియల్ మరియు నిజంగా మంచి నాణ్యత గల లెథర్ అపోలిస్ట్రీ ని పొందుతారు. అదే సమయంలో, కంపాస్ లో మిస్ అయిన లక్షణాలను ఒప్పుకోవడం అంత సులభం కాదు. ధరని పరిగణనలోకి తీసుకుంటే, క్రూయిజ్ నియంత్రణ, పరిసర లైటింగ్ మరియు ముందు పార్కింగ్ సెన్సార్ల లేకపోవడం వలన నిరుత్సాహకరం.
హ్యుండాయ్ యొక్క క్రెటా నిజంగా బాగా అమర్చబడి ఉంది. ఒంటరిగా చూసినా, ఒక సమూహంలో చూసినా కూడా ఉత్తమమైనదిగా కనిపిస్తుంది. SX (O) వేరియంట్ తో, మీరు ఒక ఎలెక్ట్రిక్ సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, డ్రైవర్ సీటు మరియు వైర్లెస్ ఛార్జింగ్ వంటి లక్షణాలను పొందుతారు. SX (O) ఎగ్జిక్యూటివ్ వేరియంట్ కొరకు వెళితే మనకి వెంటిలేటెడ్ సీట్లు కూడా లభిస్తాయి మరియు ఇవి చిన్న చిన్న లోపాలని చెప్పలేము. క్రెటా లో ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్ లేదా రెయిన్ సెన్సింగ్ వైపర్స్ లేవు, అవి ఎందుకు లేవనేది మనం చెప్పలేము.
దీనిలో క్రెటా కి అతుక్కుపోయేలా ఉండే లక్షణం ఏమిటంటే, వేరియంట్ కి అనుగుణంగా ఉండే లక్షణాలను సర్దుబాటు చేయడం. అవును, క్రెటే బాగా లోడ్ అయినట్లు కనిపిస్తోంది, కానీ మీరు సంపూర్ణ టాప్-స్పెక్ ట్రిమ్స్ లో చూస్తే మాత్రమే ఇది ఉంటుంది: అవి SX (O) మరియు SX (O) ఎగ్జిక్యూటివ్. కంపాస్ మరియు హారియర్ తో పోల్చి చూస్తే మీరు ఏమి గమనించవచ్చు అంటే వాటి యొక్క బేస్ మరియు మిడ్ వేరియంట్స్ కూడా మంచి లక్షణాలతో వస్తాయి అని చెప్పవచ్చు.
నా నగరంలో ...
ఆగండి, మొదట బేసిక్స్ ని ఎదుర్కుందాము. మీరు గనుక టాటా హారియర్ కావాలనుకుంటే, మీకు డీజిల్ ఇంజిన్ తో పాటు మాన్యువల్ గేర్బాక్స్ ఆప్షన్ కాకుండా ఇతర ఆప్షన్ లేదు. క్రెటే మరియు కంపాస్ రెండూ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లను అలాగే ఆటోమేటిక్ గేర్బాక్సులను అందిస్తాయి. ముఖ్యంగా, హ్యుందాయి రెండు ఇంధన ఎంపికలతో 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ని ఆఫర్ చేస్తుండగా, జీప్ పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే 7-స్పీడ్ డ్యుయల్ క్లచ్ ఆటోమేటిక్ ని అందిస్తుంది. 2019 మధ్య భాగం నాటికి జీప్ డీజిల్-శక్తితో కూడిన కంపాస్ ని ప్రారంభించాలని భావిస్తున్నది, అయితే దీపావళి 2019 నాటికి హారియర్ ఆటోమేటిక్ ని అందిస్తుందని భావిస్తున్నాము. ఇదిలా ఉండగా ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము.
ఇంజిన్ లక్షణాలు |
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రెటా |
జీప్ కంపాస్ |
ఇంజిన్ |
2.0 లీటరు, 4 సిలిండర్ |
1.6 లీటరు, 4 సిలిండర్ |
2.0 లీటరు, 4 సిలిండర్ |
పవర్ |
140PS @ 3750rpm |
128PS @ 4000rpm |
173PS @ 3750rpm |
టార్క్ |
350Nm @1750-2500rpm |
260Nm @ 1500-3000rpm |
350Nm @1750-2500rpm |
ట్రాన్స్మిషన్ |
6- స్పీడ్ MT |
6- స్పీడ్ MT |
6- స్పీడ్ MT |
4x4 |
NA |
NA |
అవును |
మీరు నగరంలోనే మీ కొత్త SUV ను ఉపయోగించినట్లయితే, క్రెటా అనేది మీకు చాలా సులభంగా ఉంటుంది. మీరు మీ హ్యాచ్బ్యాక్ నుండి అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే, మీరు హ్యుందాయి పరిమాణానికి సులభంగా అలవాటు పడతారని చెప్పవచ్చు. కంట్రోల్స్, స్టీరింగ్ లో గానీ, క్లచ్ యాక్షన్ లో గానీ మరియు గ్రేర్ విసుర్లు గానీ మీరు సులభంగా అలవాటు పడవచ్చు. మీరు విపరీతమైన ట్రాఫిక్ లో ఇరుక్కొని కోపంగా ఉన్నప్పటికీ, క్రెటా అయితే మీ కోపాన్ని తగ్గించే విధంగా ఉంటుంది కానీ పెంచదు. క్రెటా ని భారీ సిటీ కోసమే దీనిని ఎందుకు తీసుకోవాలి అంటే, దాని సామర్ధ్యం సిటీ కి చక్కగా సరిపోతుంది. క్రెటా సిటీ లో బాగా సమర్ధవంతమైనది అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు మరియు ఇది సిటీ లో 14Kmpl మైలేజ్ ని ఇస్తుంది, ఇలా ఉన్నప్పటికీ మీరు ఉండాల్సిన గేర్ కంటే ఒక గేర్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా చాలా సౌకర్యంగా ఫీల్ అవుతారు. మీరు స్పీడ్ బ్రెకర్స్ ని కూడా సునాయాసంగా మూడవ గేర్ లో దాటేయవచ్చు మరియు స్పీడ్ బ్రేకర్ల గురించి మాట్లాడుకుంటే అవి క్యాబిన్ లోనికి అనుభూతి చెందరు. క్రెటా యొక్క సస్పెన్షన్ నిశ్శబ్దంతో పని చేస్తుంది మరియు కొన్ని అతి తక్కువ సైడ్-నుండి-సైడ్ రాకింగ్ మోషన్ కూడా మీకు ఇబ్బంది పెట్టదు.
ఇంధన సామర్ధ్యం |
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రీటా |
జీప్ కంపాస్ |
నగరం |
11.29kmpl |
13.99kmpl |
11.07kmpl |
హారియర్ యొక్క 2XL పరిమాణం ఏదైతే ఉందే అది నగరం లోపల చేదోడు వాదోడుగా ఉంటుందని చెప్పవచ్చు. మీరు బ్లైండ్ స్పాట్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రైట్ హ్యాండ్ టర్న్స్, T-జంక్షన్ లో గానీ లేదా రౌండ్అబౌట్లు తీసుకుంటున్నప్పుడు గానీ ఒక టూ- వీలర్ కనిపించకుండా వెళ్ళవచ్చు( మేము నానో ని మిస్ చేసాము) ఇది ఎలా జరుగుతుంది అంటే A-పిల్లర్ దానిని బ్లాక్ చేయడం వలన మరియు భారీ వింగ్ మిర్రర్స్ వలన జరుగుతుంది. ఇక్కడ కూడా, క్లచ్ మరియు స్టీరింగ్ సున్నితమైనదిగా, తేలికైనవిగా ఉంటూ వాడడానికి సులభంగా ఉంటాయి. అయితే ఇంకా చెప్పాలంటే గేర్బాక్స్ షిఫ్ట్స్ అనేవి ఇంకా పాజిటివ్ గా ఉంటే మాకు బాగా నచ్చేవి, ఇవి కొంచెం రబ్బరీగా అనిపిస్తున్నాయి. గతకులు మరియు చెడు రోడ్డుల విషయానికి వస్తే అవి క్యాబిన్ లోనికి అనుభూతి చెందకుండా సులభంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అవును, క్యాబిన్ కొంచెం స్థిరపడడానికి ముందుకు వెనక్కి కదులుతూ ఉంటుంది. కానీ క్యాబిన్ లోపల, మీరు వాటిని అనుభూతి చెందే కంటే గుంతలు వినడానికి అవకాశం ఉంది.
కంపాస్ విషయానికి వస్తే, క్లచ్ అనేది దాదాపుగా అనవసరంగా గట్టిగా ఉందని మేము భావిస్తున్నాము. మీరు దూరపు ప్రయాణాలు వెళుతున్నప్పుడు మరియు ఎక్కువ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు క్లచ్ అనేది గట్టిగా ఉండడం వలన మీ కారు ఎక్సరసైజ్ చేస్తుందని మేము అనుకుంటున్నాము. స్టీరింగ్ కూడా ఈ రెండిటిలో ఉన్నట్టు అంత సులువుగా ఉండదు. జీప్ సరైన వేగంతో సరైన గేర్ లో ఉండాలని కోరుకుంటుంది. స్పీడ్ గనుక తగ్గినట్లయితే, ఇంజిన్ అనేది కొంచెం త్వరగా సౌండ్స్ ని ఇస్తుంది. కంపాస్ లో ఏదైతే ఇంజన్ ఉందో హారియర్ లో కూడా అటువంటి ఇంజన్ ఏ ఉంది, కానీ దాని కంటే డ్రైవింగ్ మోడ్ల కారణంగా ఇది మెరుగ్గా ఉంటుంది. చివరగా, జీప్ యొక్క రైడ్ విషయానికి వస్తే కొంచెం స్టిఫ్ గా ఉంటుంది. ఇది ఇలా చెబుతున్నాము కాబట్టి, క్యాబిన్ లోపలకి మీరు బంప్స్ ని అనుభూతి చెందుతారు. ఈ సమస్యకు సులభమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే మీరూ బంప్స్ వచ్చేటప్పుడు స్పీడ్ గనుక పెంచినట్లయితే లోపలకి పెద్దగా ఆ బంప్స్ తెలియకుండా ఉంటాయి.
అవును, దీని బట్టి హుండాయ్ అనేది సిటీ లో ఉత్తమమైన కారుగా చెప్పుకోవచ్చు. ఇతర రెండు కార్ల మధ్య, మేము తేలికపాటి నియంత్రణల కోసం టాటా ని ఎంచుకుంటాము. జీప్ ని పరిగణలోనికి తీసుకుంటే అది ఖచ్చితంగా హైవే మీద రాక్ స్టార్ లాగా ఉంటుంది, ఇది మన చర్చ లో తరువాత పాయింట్ కి దారి తీసే అంశం.
క్రాసింగ్ స్టేట్స్
ఒక్క విషయం గురించి మేము స్పష్టంగా చెబుదాము అనుకుంటున్నాము: SUV అనేది మీ యొక్క రెండవ వాహనం అయ్యి ఉండి కేవలం రోడ్డు ట్రిప్ ల కోసమే దీనిని ప్రధానంగా తీసుకున్నట్లయితే మరియు మీకు ఇప్పటికే నగరంలో నడపడానికి ఒక హ్యాచ్‌బ్యాక్ ఉన్నట్లయితే కంపాస్ మిమంలని బాగా ఉత్తేజపరుస్తుంది. ఇప్పుడు ఒక పెద్ద రోడ్ ట్రిప్ కోసం వెళ్ళాలి అనుకుంటే మేము పరిగెట్టి మేము కంపాస్ కీ కోసం వెతుకుతాము. ఇది హైవే మీద సంపూర్ణ సౌలభ్యంతో ఉంటుంది, కంపాస్ రైడ్స్ యొక్క సస్పెన్షన్ మిమ్మల్ని స్థిరంగా వెళ్ళేలా చేస్తుంది మరియు క్లచ్ కూడా మిమ్మలని అంత ఇబ్బంది పెట్టదు. అవును, మనం దీనిలో క్రూయిజ్ నియంత్రణను తీవ్రంగా కోల్పోతాము, కాని కంపాస్ కి మంచి దృఢమైన కాళ్ళు ఉన్నయని చెప్పవచ్చు. ఇది 4X4 ఉన్నప్పటికీ, హారియర్ కంటే బాగా తేలికైనది. ఇంకా పై చెయ్యి సాధించడానికి జీప్ అదనపు 33 హార్స్పవర్ ని అందిస్తుంది. ఈ మూడిటిలోనీ 0 నుండి 100Kmph ని ఇది చాలా వేగంగా అందుకుంటుందని చెప్పవచ్చు.
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రెటా |
జీప్ కంపాస్ |
|||
పనితీరు |
|||||
0-100kmph |
12.11 సెకెండ్స్ |
10.83 సెకెండ్స్ |
10.03 సెకెండ్స్ |
||
30-80kmph (3 వ) |
7.20 సెకెండ్స్ |
7.93 సెకెండ్స్ |
7.32 సెకెండ్స్ |
||
40-100kmph (4 వ) |
11.38 సెకెండ్స్ |
13.58 సెకెండ్స్ |
11.65 సెకెండ్స్ |
||
బ్రేకింగ్ |
|||||
100-0kmph |
45.70 మీటర్స్ |
43.43 మీటర్స్ |
45.09 మీటర్స్ |
హారియర్ విషయానికి వస్తే, ఇది హైవే మీద దూసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది. దాని యొక్క పరిపూర్ణ ఉనికికి ధన్యవాదాలు, దీని యొక్క ఉనికికి చాలా మంది దీనికి దారి అనేది ఇస్తారు. కంపాస్ లనే హారీర్ కూడా మూడు అంకెలు ఉండే స్పీడ్ ని నిరంతరంగా ఇవ్వడంలో ఫలిస్తుంది అని చెప్పవచ్చు. నిజానికి మూడిటితో పోల్చుకుంటే హారియర్ కి ఇన్-గేర్ ఆక్సిలరేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పవచ్చు. ఇది ఎలా అయితే చెబుతున్నామో అలాగే దీనిలో 0-100Kmph సమయం కూడా దీనిలో బాగుంటే బాగుండేది. మేము పరీక్షించిన కారులో క్లచ్ (అది వేధింపులకు గురైనట్లు భావించారు!) అనేది అంత మంచి కండిషన్ లో ఉందని మేము అయితే భావించడం లేదు మరియు అది కొంచెం స్లిప్ అవుతుంది. అంతేకాకుండా మేము ఒక మచ్చ ని ఎంచాలి అంటే స్టీరింగ్ అనేది ఒక ట్రిపుల్ డిజిట్ స్పీడ్ లో వెళుతున్నప్పుడు కొంచెం తేలికగా మరియు వింతగా అనిపిచింది. అంతేకాకుండా ఈ రైడ్ కొంచెం గతకలలో వెళుతున్నప్పుడు వెనకాతల కూర్చునే వారికి కొంచెం ఎగురుతున్నట్టు అనిపించవచ్చు.
హ్యుందాయి క్రెటా రోడ్ ట్రిప్స్ ని కొంచెం ఎక్కువగా చేయగలదు. వేగం తోని లేదా ఇతర రెండు కార్ల యొక్క ఏకాగ్రత వలన కూడా వలన కూడా చేయగలదు. స్టీరింగ్ యొక్క బరువుతో ఎటువంటి సమస్యలూ లేవు; అది విశ్వాసాన్ని ప్రేరేపించడానికి తగిన విధంగా ఉంటుంది. కానీ మీరు ట్రిపుల్ డిజిట్ స్పీడ్ లో ఉన్నప్పుడు రైడ్ అనేది జీప్ లేదా టాటా కారులా ఉండదు. సంబంధిత నోట్లో, మేము బ్రేక్ పెడల్ నుండి మరింత సమాచారం మరియు ఫీడ్బ్యాక్ చూడడానికి ఇష్టపడుతున్నాము. మూడిటితో పోల్చి చూస్తే బ్రేక్ వేసిన తరువాత స్థిరమైన స్థానానికి ఇది చాలా త్వరగా చేరుకుంటుంది కానీ పెడల్ కి అలవాటు పడాలి అంటే కొంచెం సమయం పడుతుంది. మీరు బాగా దేనికి అలవాటు పడతారు అంటే దాని పనితీరుకి. ఇక్కడ కూడా,ఇది దాదాపు 22Kmpl మైలేజ్ తో, ఇతర రెండిటినీ గరిష్ట మార్జిన్ ద్వారా ఓడిస్తుందని చెప్పవచ్చు.
ఇంధన సామర్ధ్యం |
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రెటా |
జీప్ కంపాస్ |
హైవే |
15.39kmpl |
21.84kmpl |
16.02kmpl |
భద్రత యొక్క విషయాలు
ఈ మూడు SUV లు కూడా ప్రామాణిక కిట్ వలె EBD తో ABS మరియు డ్యుయల్ ఎయిర్ బాగ్స్ ని అందిస్తాయి. కానీ ఇక్కడా కంపాస్ నిజంగా ఉత్తమ పరికరాలు తో ప్యాకింగ్ చేయబడి ఉంది. ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు బేస్ వైవిధ్యంలో నుండి ISOFIX లక్షణం అందించబడతాయి. విచిత్రంగా, చైల్డ్ సీటు మౌంట్స్ హారియర్ యొక్క XZ వేరియంట్ లో మాత్రమే అందించబడుతుంది. ఇప్పటికీ, కూడా క్రెటా యొక్క ఆటోమేటిక్ వేరియంట్ మాత్రమే మౌంట్స్ ని పొందుతుంది. ఇంకా , జీప్ 4X4 వెర్షన్ తో మాత్రమే 6 ఎయిర్బాగ్లను అందిస్తుంది. హారియర్ మరియు క్రెటా యొక్క టాప్-స్పెక్స్ వెర్షన్ మొత్తం 6 ఎయిర్బాగ్లను పొందుతుంది.
భద్రత |
Tata Harrier |
Hyundai Creta |
Jeep Compass |
|
డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్ |
Yes |
Yes |
Yes |
|
సైడ్ & కర్టెన్ ఎయిర్బాగ్స్ |
Yes |
Yes |
4x4 variants only |
|
EBD తో ABS |
Yes |
Yes |
Yes |
|
ట్రాక్షన్ కంట్రోల్ |
Yes |
Yes |
Yes |
|
ESP/ESC |
Yes |
Yes |
Yes |
|
హిల్- హోల్డ్ |
Yes |
Yes |
Yes |
|
హిల్ డీసెంట్ కంట్రోల్ |
Yes |
No |
Yes |
|
వెనుక పార్కింగ్ సెన్సార్స్ |
అవును |
అవును |
అవును |
|
వెనుక కెమెరా |
అవును |
అవును |
అవును |
|
ISOFIX |
అవును |
AT మాత్రమే |
అవును |
మీరు ఏది కొనుగోలు చేసుకోవాలి?
ఇది కొంచెం వినడానికి కష్టంగా ఉంటుంది, కానీ అది మీ ఉద్దేశించిన వినియోగంపై చాలా ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా కారును ఎంచుకునేందుకు ప్రతి SUV గురించి ఏది మంచిది మరియు ఏది కాదు అనేది తెలుసుకుందాము.
డీజిల్ |
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రెటా 1.6 |
జీప్ కంపాస్ |
ఎక్స్-షోరూం ఢిల్లీ ధరలు |
రూ. 12.69 లక్షలు - రూ. 16.25 లక్షలు |
రూ. 13.36 లక్షలు - రూ. 15.63 లక్షలు |
రూ. 16.60 లక్షలు - రూ. 22.90 లక్షలు |
హ్యుందాయ్ క్రెటా
మీరు సిటీ వాడకానికి ప్రధానంగా ఒక SUV కావలనుకుంటే మాత్రం క్రెటా ని ఎంచుకోండి. అలాగే, మీరు ఒక చిన్న కుటుంబం కలిగి ఉంటే లేదా 2-3 ప్రజలు మాత్రమే ఎక్కువ శాతం కారుని ఉపయోగిస్తున్నారా, అటువంటప్పుడు హ్యుందాయ్ చాలా మంచి అనుభవాన్ని అందిస్తుంది. దీని యొక్క సులభంగా డ్రైవ్ చేయబడే స్వభావం మరియు అందంగా తీర్చిదిద్దబడిన అతర్భాగాలు కలగలుపుకొని ఒక శక్తివంతమైన ప్యాకేజీగా ఉంది. మీరు ఎక్కువ హైవే వాడకం కోసం లేదా లుక్స్ కోసమో పెద్ద SUV ని కొనుక్కోవాలనుకుంటే మిగిలిన రెండు SUV ల కోసం వెళ్ళవచ్చు. అలాగే, క్రెటా యొక్క ధర కూడా కొంచెం పోటీతత్వంతో ఉంటే, అలాగే దాని యొక్క లోవర్ వేరియంట్స్ లో కూడా మంచి లక్షణాలు ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
జీప్ కంపాస్
మీకు 4X4 ఒక సంపూర్ణమైన కంపాస్ కావాలనుకుంటే మాత్రం అప్పుడు మీరు కంపాస్ ని ఎంచుకోండి. అదేవిధంగా, రహదారి వాడకం నగర వినియోగం కన్నా ఎక్కువ ఉంటే, అప్పుడు జీప్ అత్యుత్తమంగా పని చేస్తుంది. మేము ప్రారంభంలో అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాము - 'కంపాస్ రూపాయలు 4 లక్షల, రూ .5 లక్షల ప్రీమియంను న్యాయం చేయగలదా? అందువల్ల అది చాలా నమ్మకంగా ఉండి ఆ డబ్బుని కోరుతుందా?' - దీనికి రెండు భాగాలలో సమాధానం చెప్పవచ్చు. అవును, కంపాస్ అన్ని లక్షణాలతో మెరుగైన, ప్రీమియం ఉత్పత్తి వలె భావిస్తుంది. మీరు జీప్ బ్యాడ్జ్ యొక్క నాణ్యత మరియు ఆ బ్రాండ్ విలువ కోసం చెల్లిస్తున్నారు. కానీ మనం ఒక ప్రీమియం ని సమర్థిస్తూ ఉండలేము. హారియర్ ఒక విస్తృత సన్రూఫ్ మరియు 4X4 కలిగి ఉంది అనుకోండి, ఇది ఇప్పటికీ (ఊహాజనితంగా) కంపాస్ కన్నా దాదాపు రూ. 2.5 లక్షల చవకగా ఉంటుంది.
టాటా హారియర్
మనకి హారియర్ ని ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ మాకు బాగా నచ్చింది ఏమిటంటే అది తెచ్చే విలువ. ఇది క్రెటాతో పోల్చితే ఖచ్చితంగా డబ్బుకు మరింత విలువని అందిస్తుంది మరియు అలాగే సరైన SUV లాంటి అనుభవాన్ని అందిస్తుంది. ఇది ఆకట్టుకోవడానికి డిజైన్ వచ్చింది మరియు కొన్ని చిన్న చిన్న లోపాలను కలిగి ఉన్నా కూడా అవి మరిపించే మంచి లక్షణాలను కూడా కలిగి ఉన్నాయి. ఇది మీరు పెద్ద SUVఅనుభవాన్ని కావాలని అనుకుంటే లేదా మీరు పని కోసం మీరు ఎక్కువగా తిరగడానికి కావాలి అనుకున్నా ఇది ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అవును, అది నగరంలోకి వెళ్ళటానికి సులభమైనది కాదు (మరియు అది దాని పెద్ద పరిమాణంలో ఎక్కువగా ఉంటుంది), కానీ సులువుగా దీనికి అలవాటు పడవచ్చు. ఇది ప్రస్తుతం నగరం మరియు హైవే మీద డ్రైవబిలిటీ మధ్య ఉత్తమ సమ్మేళనంగా ఉంది.
మొత్తం మీద, ఈ మూడు SUV లు తమ తమ లక్షణాలతో భిన్నంగా నిలుస్తాయి. కానీ ఒక చిన్న SUV అనేది మీరు కోరుకున్న ప్రతీదీ చేయాలనుకుంటే టాటా షోరూమ్ కి అయితే వెళ్ళండి. హారియర్ అనేది యొక్క ఆరోగ్యకరమైన బాలెన్స్ ని అందిస్తుంది మరియు మిమ్మల్ని ఒప్పించే విధంగా ఉంటుంది
Also Read