రెనాల్ట్ క్విడ్ 1.0: ఫస్ట్ డ్రైవ్ సమీక్ష

Published On మే 13, 2019 By abhay for రెనాల్ట్ క్విడ్ 2015-2019

సరసమైన, ఆకర్షణీయమైన మరియు వినూత్నమైనది రెనాల్ట్ ఇండియా ఈ క్విడ్ ని ఈ ముఖ్యమైన పదాలతో వివరిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ చిన్న కారు తయారుచేయడంలో ఈ విభాగంలోనే ఇది ఒక భిన్నమైన కారుగా నిలిచింది అని చెప్పవచ్చు. ఇది కూడా చాలా తక్కువ సంవత్సరం కాలంలోనే ఇది ఇలా నిలవడం అనేది చాలా ప్రశంశనీయం, ముఖ్యంగా దీని యొక్క SUV ప్రేరేపిత డిజైన్ కి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఇంకా చెప్పాలంటే దీని యొక్క విభాగంలోనే అద్భుతమైన లక్షణాలు వారు మొట్టమొదటిసారి కొనుగోలుదారులు లేదా అనే దానితో సంబంధం లేకుండా చిన్న కార్ల వినియోగదారులను బాగా ఆకర్షిస్తుందని చెప్పవచ్చు.

Renault Kwid 1.0: First Drive Review

800CC మోటార్ కి అదనంగా 1.0 లీటర్ ఇంజిన్ తో క్విడ్ ని విడుదల చేయడానికి రెనాల్ట్ ప్రణాళిక వేస్తుందనే వార్త ఒక మంచి వార్త అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక పెద్ద ఇంజిన్ మరింత శక్తిని కలిగి ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు! దానికి తోడు  యొక్క ఆకర్షణీయమైన డిజైన్, విస్తృతమైన లక్షణాల జాబితా మరియు మీరు మరింత ఇష్టపడే ప్యాకేజీ ని మరింత ఆకర్షణీయంగా చేసిందని చెప్పవచ్చు. కొత్త ఇంజిన్ తో కారును నడపడానికి రెనాల్ట్ మాకు ఆహ్వానించింది, ఇది మేము అనుకున్నది.

Renault Kwid 1.0: First Drive Review

ఈ కారులో మనం చూస్తే గనుక,సిల్వర్ రంగు వెలుపల వెనుక అద్దాలు, ప్రక్క భాగాలలో చెక్ స్టికరింగ్ వంటివి తప్ప పెద్ద మార్పులు ఏమీ లేవు. ఈ స్టిక్కరింగ్ మీదనే  1.0 అని ఉంటుంది ఇంక ఎక్కడా కూడా ఉండదు. మంచిగా కనిపించే హెడ్లైట్స్ మరియు బలమైన గ్రిల్ మరియు SUV- లాంటి అనుభూతి కోసం ఎక్కువగా బ్లాక్ క్లాడింగ్ SUV అనుభూతిని మరింత పెంచుతుంది. ఈ కధ లోపల కూడా అదే విధంగా ఉంటుంది, లోపల భాగాలు 800cc లో ఎలా అయితే ఉంటాయో అలానే ఉంటాయి. మీకు అటువంటి లక్షణాలే వస్తాయి, మంచి క్వాలిటీ ప్లాస్టిక్స్ తో ఒక మంచి క్యాబిన్, స్టీరింగ్ వీల్ వెనుక పెద్ద డిజిటల్ స్పీడోమీటర్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ మరియు నావిగేషన్ తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ మనకి అధనంగా లభిస్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా సెగ్మెంట్ మొదటి లక్షణాలుగా ఉన్నాయి.  

 Renault Kwid 1.0: First Drive Review

1000cc క్విడ్ లోపల మిగిలిన కార్ల కంటే చాలా రిచ్ గా కనిపిస్తాయి. ఈ అంశం అనేది ప్రాధానంశంగా నిలుస్తుంది. క్యాబిన్ లోపల చాలా బాగుంటుంది, పెద్ద శరీరం కలిగినవారికి అంత షోల్డర్ రూం లేనప్పటికీ కూర్చోడానికి బాగుంటుంది. ఆసక్తికరంగా, క్విడ్ ఇప్పుడు సీటు బెల్ట్ ప్రీ-టెన్షనర్లను అందుకుంటుంది, ఇది రెనాల్ట్ యొక్క విభాగంలో మొదటి లక్షణం అని చెప్పవచ్చు. బాదాకరమైన విషయం ఏమిటంటే దీనిలో మనకి డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS లాంటి లక్షణాలు లేవు. రెనాల్ట్ ఇండియా ఏం చెబుతుంది అంటే కస్టమర్స్ ఈ భద్రతా లక్షణాల కోసం మరింత చెల్లించటానికి సిద్ధంగా లేదు. ఇది చెబుతున్నప్పటికీ రెనాల్ట్ ఏం చెబుతుంది అంటే క్విడ్ త్వరలోనే ఇతర మార్కెట్లకు ఎగుమతి అవుతుందని పేర్కొంది, మరియు పైన పేర్కొన్న భద్రతా లక్షణాలతో కారు సిద్ధంగా ఉంటుందని పేర్కొంది.

Renault Kwid 1.0: First Drive Review

దీనిలో అతి పెద్ద మార్పు కోసం వెళ్ళినట్లయితే అది హుడ్ క్రింద ఇంజన్ అని చెప్పాలి. మూడు-సిలిండర్ యొక్క బోర్ మరియు స్ట్రోక్, 800cc ఇంజిన్ అధిక స్థానచలనం సాధించటానికి పెరిగింది, అంటే ప్రాధమిక ఇంజిన్ ఆర్కిటెక్చర్ ఒకేలా ఉంటుంది. 54Ps పవర్ మరియు 72Nm టార్క్ ముందు అందించే వాటితో పోలిస్తే, ఇప్పుడు 68Ps శక్తిని మరియు 91Nm టార్క్ ని అందిస్తుంది, దీని వలన ఇంజన్ మంచి గణాంకాలు ఇస్తుందని అర్ధం అవుతుంది. ఇంజిన్ అదే ఐదు-స్పీడ్ గేర్బాక్స్ తో ముందు దాని మాదిరీగానే ఉంటుంది, మరియు నిష్పత్తులు ఒకే విధంగా ఉంటాయి,  ఒకేఒక్క తేడా ఏమిటంటే అదనపు టార్క్ ని నిర్వహించడానికి డ్రైవ్ షాఫ్ట్ ని బలపరిచే విధంగా ఉంటుంది. 800CC వెర్షన్ కోసం 25.17Kmpl మైలేజ్ కి వ్యతిరేకంగా, రెనాల్ట్ 1.0 లీటర్ కి  23Kmpl మైలేజ్ ని అందిస్తుంది. అంటే వాస్తవిక ప్రపంచంలో మీరు ఇలాంటి సంఖ్యలను మీరు ఎలా డ్రైవ్ చేస్తున్నారు అనే విధానంపై ఆధారపడి ఉంటుందని ఆశించవచ్చు.

ఇంజన్ ప్రారంభించిన తరువాత జీవనంలోనికి మూడు-సిలెండర్ ఇంజన్ ఎలా అయితే వస్తుందో అలానే వస్తుంది. దీని యొక్క అధనపు పవర్ అనేది అంతగా మీకు అనిపించదు కానీ డ్రైవ్ చేసినపుడు తొందరగా ఆ తేడాని కనుక్కొగలుగుతారు. అయినప్పటికీ, 1.0 లీటర్ క్వైడ్ 800cc వెర్షన్ కంటే 40 కిలోల బరువుగా ఉంది, దీనివలన అధనపు 14 హార్సెస్ పవర్ ని అందించడం జరుగుతుంది. ఈ కారు యాక్సిలరేషన్ కూడా చాలా వేగంగా ఉంటుంది, గేర్స్ ద్వారా మరియు 800cc ఇంజిన్ కంటే కొంచెం ఎక్కువ టార్క్ ని కలిగి ఉంది అనే భావన కలిగి ఉంటుంది. 1.0 లీటర్ ఇంజన్ మనకి కొంచెం స్ట్రెస్ లేని డ్రైవింగ్ ని అందిస్తుంది, ఇంకా ఈ చిన్న వెర్షన్ అధిక స్పీడ్స్ లో ఇంజన్ అనేది విశ్రాంతిగా ఉంటుంది. 90-100Kmph వేగంతో ప్రయాణించేటప్పుడు, 1.0 లీటర్ ఇంజిన్ క్విడ్ కొంచెం మెరుగైన కారుగా అనిపిస్తుంది మరియు దూరాలు ప్రయాణించడానికి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ఈ ఇంజన్ దాని యొక్క దాని యొక్క చిన్న వెర్షన్ ఎంత అయితే స్మూత్ గా ఉంటుందో అంతే ఉంటుంది, కానీ ఎక్కువ రివల్యూషన్స్ లో ఆ గ్రంట్ అనేది వినిపిస్తుంది. దీని కారణం  పూర్తిగా మూడు సిలిండర్ కాంఫిగరేషన్. ఈ క్లచ్ అదే తేలికైన భావాన్ని కలిగి ఉంటుంది మరియు కొద్దిగా రబ్బర్ అనుభూతిని ఉన్నప్పటికీ గేర్లు స్లాట్ లు సులువుగా ఉంటాయి. బ్రేక్స్ కి కొంచెం ఎక్కువ పవర్ ఉండి ఉంటే బాగుండేది, ఎందుకంటే కొన్నిసార్లు అది కొంచెం సాఫ్ట్ గా ఉండడం వలన పెడల్ కొంచెం గట్టిగా నొక్కాలని అనిపిస్తుంది.  

Renault Kwid 1.0: First Drive Review

ఇంజిన్ వెలుపల కారుకు యాంత్రిక మార్పులు లేనందున, రైడ్ మరియు హ్యాండిలింగ్ పరంగా క్విడ్ 1.0 దాని 800cc వెర్షన్ తో సమానంగా నడుస్తుంది. సస్పెన్షన్ కూడా  చాలా ఉపరితలాలపై సౌకర్యవంతమైన రైడ్ ని అందిస్తుంది. ఇది చెబుతున్నప్పటికీ అధిక వేగంతో గతకలు ఉన్న రహదారులపై వెళితే మీకు లోపలికి తెలుస్తుందని చెప్పవచ్చు. క్విడ్ సరిగ్గా మృదువైన సస్పెన్షన్ సెటప్ కారణంగా మీరు కార్నర్స్ లో గనుక వెళ్ళినట్లయితే అంత సౌకర్యంగా ఉండదు, బాడీ రోల్ కూడా ఉండడం వలన సందులలో వెళ్ళేందుకు ఇబ్బంది పడతారు. టైర్లు ఇప్పటికీ సన్నగా ఉంటాయి మరియు మంచి పట్టును అందించి ఉంటే బాగుండేది. ప్రస్తుత వాటిని పోలిస్తే మేము కొద్దిగా మృదువైన సమ్మేళనాన్ని ఇష్టపడతాము.  

Renault Kwid 1.0: First Drive Review

మొత్తానికి, 1.0-లీటరు ఇంజిన్ క్విడ్ ని ఫన్ టు డ్రైవ్ అనే కాన్సెప్ట్ కి దగ్గరగా ఉంచుతుంది మరియు మీకు నిజంగా చాలా సందర్భాలలో ఇంతకంటే పవర్ అక్కరలేదు అనే భావన కలిగేలా చేస్తుంది. ఈ మెరుగైన పనితీరు క్విడ్ ని సిటీ లో గానీ హైవేలో గానీ మంచి కారుగా తీర్చిదిద్దుతుంది. ఈ యొక్క పెద్ద ఇంజన్ కూడా టాప్ 2 వేరియంట్స్ లో మాత్రమే రెనాల్ట్ అందిస్తుంది. ఈ వేరియంట్స్ ఏ కారు యొక్క సేల్స్ లో 80 శాతం వాటాను పొందుతున్నాయని చెప్పవచ్చు. అది తధ్యం ఎందుకంటే కారు యొక్క శక్తివంతమైన వెర్షన్ కొనుగోలు చేసినట్లయితే తక్కువ వాటి కంటే అధనపు లక్షణాలు ఉంటాయి కాబట్టి. కారు యొక్క ధరలు ఆగష్టు 22 న ప్రకటించబడుతున్నాయి మరియు 800cc వెర్షన్ కంటే 1.0- లీటర్ క్విడ్ సుమారు 40-50,000 రూపాయలు అధనంగా ఉంటాయని భావిస్తున్నాము. ఇది అంత పెద్ద అధనపు డబ్బు ఏమీ కాదు ఎందుకంటే దీని యొక్క పెద్ద 1.0-లీటరు ఇంజిన్ క్విడ్ యొక్క ఆకట్టుకునే రూపకల్పన మరియు విశేషమైన లక్షణ జాబితాకి ఇది డబ్బుకి తగ్గ విలువని అందిస్తుందని భావిస్తున్నాము.

 

తాజా హాచ్బ్యాక్ కార్లు

రాబోయే కార్లు

తాజా హాచ్బ్యాక్ కార్లు

×
We need your సిటీ to customize your experience