రెనాల్ట్ క్విడ్ 1.0 AMT: మొదటి డ్రైవ్ సమీక్ష
Published On మే 13, 2019 By cardekho for రెనాల్ట్ క్విడ్ 2015-2019
- 1 View
- Write a comment
ఈ పదాలు బెంజమిన్ గ్రేసిస్| విక్రాంత్ డేట్ ఫోటోగ్రఫి
కారు పరీక్షించబడింది: రెనాల్ట్ క్విడ్ 1.0
వేరియంట్: 1.0 ఈసీ-R RXT (O)
ఇంజిన్: AMT ట్రాన్స్మిషన్ తో 1.0 పెట్రోల్ / 68PS / 91Nm / ARAI మైలేజ్: 24.04kmpl
ఆటోమేటిక్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశానికి ఒక అవసరంగా మారిపోయాయి. ఇక్కడ ప్రీమియం కారు కొనుగోలుదారులు లగ్జరీ కోసం ఎలా అయితే చూస్తున్నారో, ఈ బడ్జెట్ కారు కొనుగోలుదారులు ఎక్కువగా ఆటోమెటిక్స్ కి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దీని వలన వాళ్ళ రోజూవారి ప్రయాణం సులభంగా పట్టణ ప్రాంతాలలో తిరగడానికి బాగుంటుంది. AMT - లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనే టెక్నాలజీ ఈ కార్లకు ఒక సరళమైన, సమర్థవంతమైన మరియు సరసమైన పరిష్కారాన్ని అందించింది. రెనాల్ట్ క్విడ్ ఎంట్రీ లెవల్ హ్యాచ్బ్యాక్ మార్కెట్ లో భారీ స్పేస్ ని పొందింది మరియు AMT ఎక్విప్డు ఈసీ-R రావడం అనేది మరింత బలం చేకూరిందని చెప్పవచ్చు. ఈ AMT బాగా రద్దీ గా ఉండే కష్టాలని ఎలా పరిష్కరిస్తుందో చూద్దాము. దీని గురించి తెలుసుకొనేందుకు దీనిలో తిరిగి చూశాము.
ఫాస్ట్ సర్వ్
2016 ఆటో ఎక్స్పోలో మొదట చూపించబడిన క్విడ్ ఈసీ-R, ఈ సెగ్మెంట్ AMT ట్రాన్స్మిషన్ యొక్క ఆలోచనతో వేడెక్కినపుడు మరియు చాలా మంది కొనుగోలుదారులు దీనిని ఎంచుకుంటున్న సమయంలో ఇది వచ్చింది. ఈ క్విడ్ ని చాలా మంది దాని యొక్క SUV స్టయిలింగ్ వలన మరియు దాని యొక్క లక్షణాల వలన చాలా మంది కొనుగోలుదారులు దీనిని ఆరాధిస్తారు దాని వలన సంవత్సరానికి 90,000 పైగా అమ్ముడుపోతుంది. ఇప్పటివరకూ మరింత శక్తివంతమైన 1.0 లీటర్ మోటర్ తో అప్గ్రేడ్ చేయబడింది మరియు ఇప్పుడు AMT ఎంపికను కూడా పొందింది.
AMT మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాదిరిగా ఉంటుంది మరియు దీనిలో ఉండే ఒక్క తేడా ఏమిటంటే దీనిలో క్లచ్ పెడల్ అనేది ఉండదు. ఇది మొత్తం మీద క్లచ్ పెడల్ ని నొక్కడం గేర్ మార్పుకు దోహద పడడం అనేటటువంటి అంశం లేకుండా ఇది సెన్సార్స్ మీద ECU మరియు యేక్చువేటర్లపై ఆధారపడి గేర్ మార్పులు అనేవి చేస్తుంది. ఈ సింపిల్ టెక్నాలజీ వలనే ఈ ధర గ్యాప్ అనేది ఉంది.
ఇంజిన్ మరియు పనితీరు
1.0 లీటర్ మోటారు అనేది ఒక మంచి పనితీరు ని అందిస్తుంది, మృదువైన మరియు కొంచెం శబ్ధం తో కూడిన 999CC 3-పాట్ మోటార్ 5550rpm వద్ద 68Ps శక్తిని మరియు 4250Rpm వద్ద 91Nm టార్క్ ని అందిస్తుంది. ఇంకా తక్కువ రివల్యూషన్స్ లో కూడా మంచి టార్క్ ని అందించి సిటీ లో వెళ్ళడానికి బాగుంటుంది. దీని యొక్క AMT ఆప్షన్ వలన మంచి చర్చనీయాంశంగా మారింది.
5-స్పీడ్ AMT రెనాల్ట్ లోపలే బోస్చ్ సహాయంతో అభివృద్ధి చేయబడింది. ఈ వ్యవస్థ ఇప్పటికే ఉన్న ECU తో మరియు మరింత సులువైన సాఫ్ట్వేర్ అప్రోచ్ ద్వారా ఆదేశాలను తీసుకొని మరియు గేర్ షిఫ్ట్స్ ని చాలా త్వరగా చేస్తుంది. గుండ్రంగా ఉండే డయిల్స్ ద్వారా షిఫ్ట్ మెకానిజం లు అవుతాయి, న్యూట్రల్,రివర్స్ మరియు డ్రైవ్ మోడ్స్ దీనిలో ఉంటాయి. ఆశ్చర్యకరంగా, ఇతర AMT ల వలె దీనిలో మాన్యువల్ మోడ్ లేదు. ఇంకా దీనిలో క్రీప్ ఫంక్షన్ లేదా హిల్ అసిస్ట్ వంటి సరళమైన పద్ధతి దీనిలో లేదు. ఏదేమైనా ఇవన్నీ చెప్పినప్పటికీ గేర్బాక్స్ మరియు ఇంజిన్ రెండూ కలిసి పని చేసే విధంగా ఇది తయారయ్యిందని చాలా స్పష్టంగా తెలుస్తుంది!
ఈ సాంప్రదాయ AMT లతో ఉన్న సమస్య ఏమిటంటే గేర్ షిఫ్ట్స్ చేస్తున్నపుడు ఆ ఆలస్యం అనేది ట్రాఫిక్ లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. రెనాల్ట్ డస్టర్ AMT తో దీనికి ఒక పరిష్కారాన్ని కనుక్కుందని చెప్పవచ్చు, ఈ రెనాల్ట్ క్విడ్ AMT అదే తరహాలో అనుసరిస్తుంది, దాని యొక్క గేర్బాక్స్ అనేది గేర్ షిఫ్ట్స్ ని మిగిలిన AMT- ఎక్విప్డు కార్లలతో పోలిస్తే చాలా బాగుంటుందని చెప్పవచ్చు. ట్రాఫిక్ లో కూడా వెల్లడానికి ఈ గేర్స్ సరిగ్గా షిఫ్ట్ అవ్వడం వలన సులభంగా మనం వెళ్ళవచ్చు ఆలస్యంగా కూడా అనిపించదు. ఎక్కువ అడ్డంకులు ఏమైనా వచ్చినపుడే ఆ ల్యాగ్ అనేది మీకు కనిపిస్తుంది. హైవే లో వెళుతున్నప్పుడు ఏమీ అనిపించదు, ఎందుకంటే ఆ 1.0-లీటర్ మోటారు కి కావలసినంత పవర్ పెద్ద కార్లతో పోటీ పడినట్టుగానే ఉంటుంది.
డిజైన్ మరియు స్టైలింగ్
స్టైలింగ్ పరంగా, క్విడ్ AMT టెయిల్ గేట్ లో ఒక ఈజీ-R లోగో మినహాయిస్తే ఇంకా ఎటువంటి మార్పులు అయితే లేవు. ఇది 1.0 వేరియంట్ మాదిరిగానే ఉంది మరియు దానిలో ఎటువంటి లోపాలని కనుక్కోవడం జరగదు. క్విడ్ ఎల్లప్పుడూ కూడా SUV ని ప్రేరేపిత లుక్స్ తో ఉండడం వలన SUV ని ఎక్కువగా ప్రేమించే దేశం కాబట్టి క్విడ్ ఎల్లప్పుడూ ఫాలోవర్స్ ని కలిగి ఉంటుంది.
లోపల భాగాలు
కారు లోపల అన్నీ ఒకేలా ఉంటాయి మరియు ఒకేఒక్క తేడా ఏమిటంటే దీనిలో డాష్బోర్డ్ మీద గేర్ లివర్ మెరిసే రోటరీ డయల్ తో భర్తీ చేయబడుతుంది. ఇప్పుడు గేర్ లివర్ స్థానంలో క్యూబీ హోల్ తో వస్తుంది. క్విడ్ లో ఉండే ముఖ్యమైన అంశం ఏమిటంటే బ్లూటూత్ తో ఉండే టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ సిష్టం మరియు టాప్ వేరియంట్లలో నావిగేషన్ మరియు టాప్ స్పెక్ RXT(O) వేరియంట్ లో AMT కూడా లభిస్తుంది. అలాగే ఇది డ్రైవర్-సైడ్ ఎయిర్బాగ్స్, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ని కూడా కలిగి ఉంది.
దీనికి కాంపాక్ట్ కొలతలు ఉన్నప్పటికీ, ప్రతిదీ మరింత నిల్వ స్థలం కోసం చక్కగా రూపొందించబడింది. పొడవైన సీటింగ్ స్పేస్ అనేది ఎక్కువ స్పేస్ ని మంచి బూట్ స్పేస్ ని అందిస్తుంది. ఇది చూడడానికి ఎబెట్టుగా ఏమీ ఉండదు బాగుంటుంది.
తీర్పు
క్విడ్ ఒక సరసమైన సిటీ కారుగా ఉంటుంది మరియు దీని యొక్క ఆటోమెటిక్ గేర్బాక్స్ అనేది మరింత ఉత్తమంగా అందించడానికి సహాయపడుతుంది. ఇంధన సామర్థ్యానికి రాజీ లేకుండా ఒక ఆటోమేటిక్ యొక్క పూర్తి సౌలభ్యానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇది మాన్యువల్ కంటే కూడా బాగా సమర్ధవంతమైనది ఎందుకంటే 24.04Kmpl మైలేజ్ అందిస్తుందని చెప్పబడుతున్నది. క్విడ్ AMT షిఫ్ట్ నాణ్యత,డ్రైవబిలిటీ మరియు ఉన్న వాటిలో అన్నిటికంటే మేము చూసిన వాటి కంటే ఉత్తమమైన AMT గేర్బాక్సు ని కలిగి ఉంది. పనితీరు మరియు ఇంధన సామర్ధ్యపు సంఖ్యలు కూడా చాలా బలంగా ఉన్నాయని మేము భావిస్తున్నాము. ధరలు ఇంకా ప్రకటించాల్సినప్పటికీ, మాన్యువల్ వెర్షన్ మీద 20 నుండి 30 వేల రూపాయల వరకు పెరుగుతుంది అని మేము ఊహిస్తున్నాము, ఇది సౌలభ్యం మరియు మొత్తం వినియోగం అందించే మంచి విలువగా ఉంటుంది. AMT లు అనేవి రాబోయే కాలంలో వయస్సుతో పాటూ పెరిగే కారులు దీని వలన ఆటోమెటిక్ అనుభూతి ఖరీదైన కార్లతోనే కాదు చిన్న కార్లతో కూడా అందించవచ్చని క్విడ్ AMT మనకి చెబుతుంది.