మారుతి విటారా బ్రెజ్జా - నిపుణుల సమీక్ష
Published On మే 20, 2019 By abhishek for మారుతి విటారా బ్రెజా 2016-2020
- 1 View
- Write a comment
దశలు అనేవి జీవితంలో ఒక భాగం మరియు అవి అన్నిటిలోనూ వర్తిస్తాయి, ఉదాహరణకు ఫ్యాషన్, టెక్నాలజీ లేదా ఈ సందర్భంలో అంటే కార్లు దీనిలో కూడా వర్తిస్తుంది. మీకు కావలసిందల్లా నిప్పు ని రగిలించడం, మిగిలినవి దానంతట అవే జరుగుతాయి. ఈ సందర్భంలో, ఫోర్డ్ ఎకోస్పోర్ట్ అంతా ప్రారంభించింది, ఇది భారతదేశంలోనే ప్రప్రధమంగా కాంపాక్ట్ SUV విభాగం అనే దానిని తెర తీసి మిగిలిన కారు తయారీదారులను కూడా ఆ విభాగంలో కారుని తయారు చేసి ఆధిపత్యం చెలాయించే విధంగా ప్రేరేపించింది. మారుతి సుజుకి కూడా ఈ పోటీ లోనికి దిగాలని నిర్ణయించుకుంది మరియు మనకి కొత్త విటారా బ్రెజ్జా ను చూపించింది. బ్రెజ్జాతో, భారతదేశం యొక్క అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ కి ఒక కాంపాక్ట్ SUV అందించేలా చేసింది. ఈ మోడల్ మారుతి యొక్క సమగ్రమైన లైనప్ లో మునుపు లేనటువంటి మోడల్ అని చెప్పవచ్చు.
బ్రెజ్జా అనేది వివిధ కారణాల వల్ల మారుతికి అతి ముఖ్యమైన కారుగా చెప్పవచ్చు. ముందుగా ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ మరియు మహీంద్రా TUV300 లతో నేరుగా పోరాడాల్సి వచ్చింది. రెండవది, మారుతి సుదీర్ఘ కృషి మరియు చాలా శ్రమ పడింది, దీని గురించి కొంచెం చర్చిద్దాము. విటారా బ్రెజ్జా భారతదేశంలో పూర్తిగా అభివృద్ధి చేయబడుతున్న మొట్టమొదటి మారుతి కారు. ఇది 98% స్థానికీకరణ యొక్క ప్రయోజనాన్ని ఇస్తుంది, ఇది కారు యొక్క ధర మరియు విడిభాగాల విషయానికి వస్తే భారీ ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీని తరువాత డిజైన్ ఏదైతే ఉందో దానిని మారుతి సరి చేయాల్సి ఉంది. ఈ కారుని ఎలా డిజైన్ చేయాలంటే అది కాంపాక్ట్ సైజ్ లో ఉంటూ SUV ని తలపించాలి. మేము ఈ కొత్త విటారా బ్రెజ్జా ఏమి ఇస్తుందో తెలుసుకోడానికి తిప్పడానికి తీసుకెళదాం అనుకున్నాము.
బాహ్య భాగాలు
ఒక సమపాళ్ళల్లో ఉండే సబ్ 4-మీటర్ SUV ను తయారుచేయడం అనేది ఒక పెద్ద పనిగా చెప్పుకోవచ్చు. ఈ కాంపాక్ట్ SUV కావడం వలన పొడవులో మనకి కాంక్షలు ఉండడం వలన వెడల్పు మరియు ఎత్తు నిష్పత్తిలను అడ్డదిడ్డంగా పెంచడం వలన కొంచెం ఎబెట్టుగా కనిపించే అవకాశం అయితే లేకపోలేదు. మారుతి దీనిని మనకు ఏమని నిరూపించింది అంటే ఇండియన్ రూల్స్ ని తనకు తెలిసినంతగా వేరే ఎవరికీ తెలియదు అని నిరూపించింది. బ్రెజ్జా కారు మార్కెట్ లో అత్యంత సమపాళ్ళల్లో ఉన్న కాంపాక్ట్ SUV లలో ఒకటిగా ఉంది.
ఇది బాగా రూపకల్పన చేయబడిందా? చెప్పుకోవాలంటే ఇది మనం చిత్రాలలో చూసిన దానికంటే బయట పెద్దదిగా కనిపిస్తోంది. ఎవరికైతే ఒక ప్రీమియం హ్యాచ్ వచ్చే ధరలో ఒక SUV కావాలనుకుంటారో వాళ్ళకి అతి ముఖ్యమైన అంశం ఏదైనాఉంది అంటే అది పరిమాణం, దానికి ఇది సమంగా ఉంటుందని మేము భావిస్తున్నాము. రంగులు, సరళ రేఖలు మరియు వక్రతలు ఉపయోగం బాగానే ఉన్నాయి, ఇవి బ్రజ్జా ని చక్కగా భిన్నంగా నిలబెడతాయి. అలాగే ఎంచుకోవడానికి మూడు వివిధ డ్యుయల్ టోన్ పెయింట్ సంబంధ మిశ్రమాలు ఉన్నాయి. ఒక వినియోగదారుడు ఎరుపు రంగు బ్రెజ్జా ని నలుపు రూఫ్ తో లేదా నీలం లేదా పసుపు రంగులతో బ్రెజ్జాలను తెల్లని రూఫ్ తో ఎంచుకోవచ్చు. మాకు బాగా నచ్చింది ఏమిటంటే నీలం మరియు తెలుపు రంగుల కలయిక, ఎందుకంటే ఇది చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది ఇలా చెప్పినప్పటికీ ఈ రెడ్ మరియు బ్లాక్ కలయిక కూడా బాగా అమ్ముడుపోతుందని మేము అనుకుంటున్నాము.
ఇవన్నీ ఇలా చెప్పినప్పటికీ బ్రెజ్జాలో ఉండే ఈ డిజైన్ మనం మారుతి లో మునుపెన్నడూ చూసి ఉండము. వాస్తవానికి, మొట్టమొదటిసారిగా మారుతి సంస్థ ఇంత భిన్నమైన స్టయిలింగ్ తో ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ముందు భాగంలో ఉండే పెద్ద గ్రిల్ మనకి బ్రెజ్జా యొక్క మునుపటి కార్లకు ఉండేటట్టు XA ఆల్ఫా కాన్సెప్ట్ ని వెంటనే గుర్తు చేస్తుంది. పళ్ళ ఆకారంలో ఉండే ఎలిమెంట్స్ క్రోం స్లాబ్ బ్వారా ముందు ఉండే రెండు ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్లను కనెక్ట్ చేస్తుంది. హెడ్ల్యాంప్ లలో ఉండే LED లైట్ గైడ్లు చాలా బాగా కనిపిస్తాయి, ప్రత్యేకంగా చీకటిలో ఇంకా బాగుంటాయి. బంపర్ అనేది గంభీరత్వాన్ని మరీ పెంచుతూ పెద్ద ఎయిర్‌డ్యాం మరియు మాట్టే సిల్వర్ తో ఫినిషింగ్ చేయబడిన ఫాక్స్ స్కిడ్ ప్లేట్ తో ఉండడం వలన ఈ బంపర్ మరింత గంభీరంగా కనిపిస్తుంది. చిన్న వివరాలు ఉదాహరణకు బంపర్ లో టర్న్ ఇండికేటర్లను ఒక ప్రత్యేక పాడ్ లో ఉంచడం మరియు ఆ ఫాగ్ ల్యాంప్ చుట్టూ బ్లాకెడ్ అవుట్ సరౌండింగ్ తో ఫ్రంట్ ప్రొఫైల్ పూర్తి చేయబడింది.
ముఖ్యంగా మారుతి యొక్క సేల్స్ మ్యాన్ అమ్మడానికి చెప్పే కారణం ఏమిటంటే 'ఫ్లోటింగ్ రూఫ్' ఈ కాన్సెప్ట్ అనేది స్విఫ్ట్ తో ప్రారంభించి మారుతి సంస్థ తన యొక్క మిగిలిన కార్లు అన్నిటిలోనీ దీనిని అందిస్తుంది. A-పిల్లర్ మరియు C-పిల్లర్ యొక్క కొంత భాగం ని నల్లగా చేసి ఆ రూఫ్ దాని మీదకి ప్రాకుతున్నట్టు ఒక భ్రమని మనకి కలిగిస్తాయి. ఇది తెలుపు రూఫ్ లో ముఖ్యంగా బాగా కనిపిస్తుంది.
ఈ సిల్హౌట్ రెండు ప్రముఖ పాత్రలను ప్రదర్శిస్తుంది: ఒకటి రెండు హెడ్ల్యాంప్స్ యొక్క కనెక్ట్ చేసేది మరియు రెండవది వీల్ బేస్ చుట్టూ ఉండేది. బ్రెజ్జా కారు కి స్క్వేర్డ్ వీల్ ఆర్చులు మరియు కస్టమరీ బ్లాక్ క్లాడింగ్ కారు పొడవునా వస్తాయి. 16-అంగుళాల అలాయ్స్ ఏవైతే ఉన్నాయో అవి వీల్స్ కి బాగా సరిపోయాయి. అయితే మాకు వీల్స్ మీద గన్ మెటల్ గ్రే షేడ్ ఉండి ఉంటే బాగా నచ్చేది, కానీ ఇంకా కొంచెం డిజైన్ బాగుంటే ఇంకా బాగుండేది. అలాగే ఇంకా సాధారణంగా వీల్ ఆర్చులని రౌండ్ చేసి కొంచెం జ్వలించే తత్వాన్ని జోడిస్తే బ్రెజ్జా మరింత గంభీరంగా కనిపిస్తుంది.
దాని యొక్క మిగిలిన కార్లలాగా బ్రెజ్జా కి ఒక స్పేర్ వీల్ దాని బూట్ లో ఇవ్వడం జరగలేదు. దాని బదులుగా ఒక సాధారణ పైకి తెరుచుకునే హాచ్ మాత్రమే వస్తుంది. TUV300 మరియు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ హ్యాచ్ లలో డోర్స్ ప్రక్క వైపు తెరుచుకుంటాయి, ఇవి పార్కింగ్ స్లాట్స్ లో ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది ఆలోచించడం మారుతికి కొంచెం అధనపు పాయింట్లు లభించాయి. టెయిల్ ల్యాంప్స్ L- ఆకారపు LED తో సరళమైన క్లస్టర్ ను పొందుతున్నాయి, మెయిన్ ల్యాంప్స్ ఆన్ అయ్యాక ఇవి కూడా ఆన్ అవుతాయి. కాంపాక్ట్ SUV బూట్ మీద క్రోమ్ యొక్క పెద్ద స్లాబ్ ని ‘విటారా బ్రజ్జా' గుర్తు తో ఉంటుంది.
బ్రెజ్జాలో డిజైన్ చాలా సమపాళ్ళల్లో ఉంది, ఒక వీల్స్ ని మినహాయిస్తే ఏదీ ఉండకూడదు అన్నట్టు ఉండదు. ఇక్కడ చూసే విభాగంలో లుక్స్ అనేది ప్రాధాన్యతగా ఉండడం వలన మారుతి దీనిని సరిగ్గా చేసింది అని చెప్పుకోవచ్చు. ఈ లుక్స్ బ్రెజ్జా యొక్క అమ్మకాలలో ఒక ముఖ్యమైన అంశంగా ఉండబోతున్నాయి.
లోపల భాగాలు
బ్రెజ్జా లోపలికి అడుగు పెడితే మీరు స్నేహపూర్వక అనుభవాన్ని పొందుతారు. నేను ఇక్కడ ముందు ఉన్నాను అన్న భావన కలుగుతుంది మరియు ఇక్కడ ఏదీ అంత ఎబెట్టుగా ఉంది అన్న భావన కలగదు. ఉదాహరణకు, ఎకోస్పోర్ట్ లో కూర్చున్న వాళ్ళు లోపల కూర్చోగానే ఆ సెంటర్ కన్సోల్ లో ఎక్కువ బటన్స్ చూసి తికమక పడవచ్చు. ఈ దృష్టిలో చూస్తే బ్రెజ్జా కొంచెం ఆహ్వానించే విధంగానే ఉంటుంది మరియు ఎవరినీ భయపెట్టదు. లేఅవుట్ శుభ్రంగా ఉంది మరియు ఏది ఏమిటో తెలుసుకోవడానికి మీకు చాలా సమయం పట్టదు.
కారు లోపల భాగాలు యొక్క మెటీరియల్ యొక్క నాణ్యత అంత ఉత్తమంగా ఏమీ ఉండదు. ఇది ఎకోస్పోర్ట్ లో ఉండే క్వాలిటీ కంటే కొంచెం తక్కువ మరియు TUV300 లో ఉండే దాని కంటే కొంచెం ఎక్కువ. డాష్ యొక్క దిగువ భాగంలో హార్డ్ ప్లాస్టిక్స్ పుష్కలంగా ఉన్నాయి, ప్యాకేజీని తగ్గించే చౌకైన మారుతీ నుండి చాలా భాగం షేర్ చేసుకోవడం వలన మొత్తంగా చూసుకుంటే కొంచెం నిరాశ కలుగుతుంది. ఉదాహరణకు పాత పది యేళ్ళ స్విఫ్ట్ లో ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి మరియు స్టీరింగ్ అనేది S-క్రాస్ లో ఏదైతే ఉందో అదే స్టీరింగ్ యూనిట్ మరియు బలేనో మరియు సియాజ్ లో ఉండేటటువంటి టచ్‌స్క్రీన్ సిష్టం దీనిలో ఉండడం జరిగింది. చిన్న చిన్న అంశాలు అయినటువంటి స్టార్ట్-స్టాప్ బటన్,ORVM అడ్జస్ట్మెంట్ బటన్లు మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్ లు కూడా వేరే మోడల్ లో ఉన్నట్టుగా ఉంటాయి. మొత్తం అన్నీ బాగా మనకి సహకరిస్తాయి, ఏవీ కూడా పిర్యాదు చేసే విధంగా ఉండవు. అన్నీ బాగున్నప్పుడు మళ్ళీ కొత్తగా చేయడం ఎందుకు??
బ్రెజ్జా యొక్క క్యాబిన్ నల్లని రంగులో అందించడం జరిగింది. మనకు బాగా నచ్చే అంశం ఏమిటంటే డాష్బోర్డ్ చుట్టూ ఉండే డల్ సిల్వర్ ఆక్సెంట్. ఇది డల్ బ్లాక్ యొక్క లుక్ ని మధ్య మధ్యలో బ్రేక్ చేసే విధంగా ఉంటుంది. ఈ లేఅవుట్ సరళమైనది మరియు స్వచ్ఛమైనది, 7 "టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో తో మధ్య కేంద్ర భాగంలో ఉంటుంది. ఈ స్క్రీన్ 4 స్పీకర్లు మరియు ట్వీట్ల జతతో ఉంటుంది. ఆడియో నాణ్యత చాలా చక్కగా ఉంటుంది మరియు చాలా వరకు దీనికి నవీకరణ అవసరం లేదు.
ఇంకొక ట్రిక్ ఏమిటంటే మూడ్ లైటింగ్ పొందిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఈ లక్షణం చూడగానే ఒక మ్యాజిక్ చేసే విధంగా ఉంటుంది మరియు మనలో ఉన్న చిన్న పిల్లాడిని బయటకి తెస్తుంది. మీరు టాకోమీటర్ మరియు స్పీడో డయల్స్ కోసం ఐదు రంగుల (ఎరుపు, నారింజ, నీలం, తెలుపు మరియు పసుపు) ప్రకాశాన్ని ఎంచుకోవచ్చు మరియు దాని యొక్క ప్రకాశాన్ని కూడా నియంత్రించవచ్చు. సమగ్ర MID రెండు మీటర్ల మధ్య ఉంచబడి, సమయం, ఉష్ణోగ్రత, ఇంధనం, పర్యటన దూరం మొదలైనవి వంటి సమాచారాన్ని చూసుకోవచ్చు. ఈ క్లస్టర్ ని TUV300 తో గనుక పోల్చినట్లయితే దానిలో ఉన్నట్టుగా బోరింగ్ మోనోక్రోం డిస్ప్లే ఉండకుండా ఇలా ఉండడం వలన ఇంకా కొంచెం బాగుంటుందని చెప్పవచ్చు.
ముందు చెప్పినట్టుగా స్టీరింగ్ వీల్ S- క్రాస్ 'పార్ట్స్-బిన్' నుండి నేరుగా తీసుకోవడం జరిగింది మరియు దీనికి రేక్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్టీరింగ్ పట్టుకోడానికి బాగుంటుంది మరియు ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఉపయోగించడానికి ఇంకా బాగుంటుంది. ఇది వాల్యూమ్ ను నియంత్రించడానికి, కాల్స్ అంగీకరించడం లేదా తిరస్కరించడానికి, అలాగే క్రూజ్ నియంత్రణకు కూడా నియంత్రణలు పొందుతుంది!
డ్రైవర్ సీటు కూడా బాగా ఎత్తుగా ఉండడం వలన రోడ్డు వ్యూ అనేది చాలా బాగుంటుంది. సీటు సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మంచి మద్దతు స్థాయిలు అందిస్తుంది. లాంగ్ డ్రైవ్ చేసాక దీనిలో పిర్యాదులు చేయడానికి మీకు ఏమీ కనిపించవు. సైడ్-బోల్స్టరింగ్ మరియు కుషనింగ్ సరైన మొత్తంలో ఉన్నాయి. ఎత్తు సర్దుబాటు కూడా ఒక ఆరోగ్యకరమైన ప్రయాణాన్ని కలిగి ఉంటుంది - చిన్న డ్రైవర్లు కుడా సౌకర్యవంతమైన డ్రైవింగ్ స్థితిని కనుగొనడంలో ఎటువంటి సమస్యలను కలిగి ఉండరు.
మేము అనుకోవడం ఏమిటంటే ఎర్గనామిక్స్ లో బ్రెజ్జా ఎక్కువ మార్కులు సంపాదిస్తుంది. మీరు వెళుతున్నప్పుడు మీరు చాలా త్వరగా తెలుసుకుంటారు ఏమిటంటే అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని. ఉదాహరణగా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంటర్ఫేస్ ని తీసుకుందాము. ఈ యూనిట్ లో అతిపెద్ద బటన్ 'ఆటో' - ఇదే బటన్ తో మనం ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ ని స్టార్ట్ చేయవచ్చు మరియు ఉష్ణోగ్రతని నియంత్రించవచ్చు. ఈ చిన్న చిన్న మార్పుల వలన కారులో ఉన్నా కూడా ఇంట్లో ఉన్న మాదిరిగానే అనిపిస్తుంది. అన్ని మారుతి కార్లలానే ఎయిర్‌కాన్ సంపూర్ణంగా చల్లగా ఉంటుంది. ఇది క్యాబిన్ ను 20 డిగ్రీల సెల్సియస్ వద్ద పూనే లో పగటి పూట ఎండగా ఉండే రోజుల్లో కూడా చల్లగా ఉంచుతుంది. బ్రజ్జా వెనుక A.C వెంట్లను పొందడంలేదనేది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే, ఇది చాలా ఇబ్బంది పడాల్సిన అంశం అయితే కాదని మేము నమ్ముతున్నాము. ఎయిర్‌కాన్ నిమిషాల్లో క్యాబిన్ వెనుక భాగాన్ని చల్లబరుస్తుంది.
వెనకాతల భాగంలో కూడా సీట్లు సులభంగా కూర్చోనే విధంగా ఉంటుంది మరియు ముందరి సీట్లు కంటే ఎత్తుగా ఉండడం వలన కాళ్ళు ముందరి సీటు క్రిందకి పెట్టుకోవచ్చు. దీనిలో లెగ్‌రూం చాలా ఉదారంగా ఉటుంది, ఆరడుగుల మనుషులు ఇద్దరు వెనకాతల వెనకాతల కూర్చోవచ్చు. ముందర సీట్లు వెనకాతల దాని కంటే కొంచెం తక్కువగా ఉండడం వలన అదనపు లెగ్‌రూం అందిస్తుంది. మీరు ఆరడుగుల మనిషి అయ్యి వెనకాతల సీటులో కూర్చున్నట్లయితే రూఫ్ బాగా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది. బ్రెజ్జా కారు TUV300 వలె విస్తారంగా లేదు, దీని ఫలితంగా, మహీంద్రాతో పోల్చినప్పుడు వెనకాతల ముగ్గురు కూర్చోవడం అనేది కొంచెం సమస్యగా ఉంది.
చివరగా చెప్పాలంటే దీనిలో లగేజ్ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. మనకి రెండు గ్లోవ్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది, ప్రతీ డోర్ కి బాటిల్ హోల్డర్స్, ఫ్రంట్ ఆరంరెస్ట్ లో స్పేస్ మరియు సీటు క్రింద ట్రే అందించడం జరుగుతుంది. ఈ బూట్ 328 లీటర్ల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. చతురశ్రాకారంలో ఉండే వెనకాతల బూట్ బాగా తక్కువ హైట్ ఉండడం లగేజ్ పెట్టడం మరియు తీయడం సులభంగా ఉంటుంది. మీరు సామాను కోసం మరింత స్థలం కావాలనుకుంటే, వెనుక సీట్లకు 60:40 స్ప్లిట్ కూడా ఉంది.
బ్రెజ్జా యొక్క క్యాబిన్ మంచి భావాలతో చక్కగా పనితీరుని అందిస్తుంది. దీనిలో మరీ అద్భుతంగా ఏమీ ఉండవు, అలా అని పిర్యాదు చేసే విధంగా కూడా ఏమీ ఉండవు. ఇది ఒక సాధారణ లేఅవుట్ ఖచ్చితంగా బాగుంటుందని మనకి చెప్పుకోవచ్చు.
ఇంజిన్ మరియు పనితీరు
బ్రెజ్జా బాగా ప్రయత్నించి ప్రయత్నించి మరియు టెస్ట్ చేయబడి ఉన్న DDiS ఇంజన్ ని కలిగి ఉంది, ఇదే ఇంజన్ చాలా కార్లకి ఆ లెక్క కూడా చెప్పలేము అన్ని కార్లకు పవర్ ని అందిస్తుంది. DDiS 200 అని పిలవబడే, ఈ ఫియట్-ఆధారిత ఇంజన్ 4000rpm వద్ద 90ps మరియు 1750Rpm వద్ద 200Nm టార్క్ ని అందిస్తుంది. ఇప్పుడు మారుతి ఏమిటి ఉండేలా చూసుకుంది అంటే బ్రెజ్జా లో ఉండే ఆయిల్ బర్నర్ బాగా పనిచేసే విధంగా చూసుకుంది. సుమారు 1200 కిలోల ఉండడం వలన బ్రెజ్జా అంత బరువుగా ఉండదు. ఆక్సిలరేషన్ కూడా బలంగా ఉంటూ ఓవర్ టేకింగ్ అనేది సులభంగా అవుతుంది. మీరు 1500rpm దగ్గరకి గాని వచ్చినట్లయితే మీకు కొంచెం టర్బో లాగ్ ఉంటుంది. అది మినహాయిస్తే, కొన్ని సార్లు గేర్స్ మారుస్తున్నప్పుడు సౌండ్స్ లోపలికి రావడం జరుగుతుంది.
అయితే సుమారు 2100Rpm అందిస్తూ 100km / h వద్ద, ఇంజిన్ నిశ్శబ్దంగా ఉంటుంది. ఎక్కువ దూరం వెళ్ళడం బ్రెజ్జా లో సమస్యగా అయితే కనిపించడం లేదు, కానీ ఒక ఎంపికగా, మనకు 1.6 లీటర్ DDiS యూనిట్ మారుతి ఇచ్చి ఉంటే బాగుండేదా?
రైడ్ మరియు హ్యాండిలింగ్
SUV విశిష్ట లక్షణాలతో ఉన్న ఏదైనా వాహనం సౌకర్యంగా ఉంటుందని భావిస్తాము, దీనిగానూ సుదీర్ఘ ప్రయాణ సస్పెన్షన్ కు కృతజ్ఞతలు మరియు కార్నర్స్ దగ్గర కొంచెం స్థిరంగా ఉండదు. బ్రెజ్జా ఇవన్నిటితో కలిసి ఉంటుంది. తక్కువ స్పీడ్ లో పట్టణాలలో 16 అంగుళాల చక్రాలు చాలా వరకూ రోడ్డు గతకలని అవి తీసుకుంటాయి, కానీ పెద్ద పెద్ద గొయ్యలు వస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇది కొంచెం స్టిఫ్ గా ఉంటూ మరియు ఆ జోల్ట్స్ పెద్దగా ఉన్నట్లయితే క్యాబిన్ లోపల ఇబ్బందిగా ఉంటుంది. అంత స్టిఫ్ గా ఉండే సెటప్ ఎందుకు అందించిందో మాకు కూడా అర్ధం కాదు.
అయితే ఈ స్టిఫ్‌నెస్ అధిక స్పీడ్ లో ఇది బాగా సహాయపడుతుంది. ఈ బ్రెజ్జా లో కార్నర్స్ లో వెళ్తున్నట్టు అయితే ఒక హ్యాచ్‌బ్యాక్ లో ఎలా తిరుగుతుందో అలానే తిరుగుతుంది బాగుంటుంది. ఈ స్టీరింగ్ తక్కువ స్పీడ్ లలో బరువుగా మారుతూ స్పీడ్ పెంచుతున్న కొలదీ తగ్గుతూ వస్తుంది. అలాగే, ఒక స్థిరమైన స్పీడ్ లో వెళుతున్నప్పుడు కొంచెం సమస్యగా ఉన్నప్పటికీ అంతగా ఏమీ పిర్యాదు చేసే విధంగా ఉండదు.
తీర్పు
విటారా బ్రెజ్జా అనేది మారుతి కి ఒక పెద్ద గట్టిగా చప్పట్ట్లు కొట్టే విధంగా ఉంటుంది. ఇది ఫోర్డ్ ఎకోస్పోర్ట్ లో ఉన్నంత నాణ్యమైన మెటీరియల్స్ తో లేకపోయినప్పటికీ దీని యొక్క విభిన్నమైన లుక్స్ వలన ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. దీనిలో అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే మీ రుచికి అనుగుణంగా దీనిని మార్చుకోవచ్చు. దీనిలో ఉండే చాలా లక్షణాలు సీటు అడ్జస్ట్మెంట్స్ వలన మంచి సౌకర్యం లభిస్తుంది. బాగా ప్రయత్నించిన మరియు పరీక్షించిన ఫియట్ ఇంజిన్ కి ధన్యవాదాలు, దీనివలన బ్రెజ్జా మంచి పనితీరును అందిస్తుంది మరియు చాలా మంచి సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది.
దీని యొక్క ప్రారంభ ధర రూ. 6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)కావడం వలన బేస్ LDi వేరియంట్ లో, ఇది ఎకోస్పోర్ట్ కంటే తక్కువ వ్యయం అవుతుంది. నిజానికి, ఇతర వేరియంట్ కూడా చూసుకున్నట్లయితే టాప్ ZDi + వేరియంట్ పెట్టిన డబ్బుకు మంచి విలువ అందిస్తుంది. ఈ కారుని మేము మా పూర్తి రివ్యూ లో టెస్ట్ కి పెట్టాము, మేము ఏమిటి భావిస్తున్నాము అంటే మారుతి కి ఇది మంచి అమ్మకాలను అందిస్తూ మరియు మంచి బ్రాండ్ న్యూ ఆఫరింగ్ ని ఇస్తుందని అనుకుంటున్నాము.