మారుతి సుజుకి విటారా బ్రెజ్జా AMT: సమీక్ష
Published On మే 20, 2019 By nabeel for మారుతి విటారా బ్రెజా 2016-2020
- 1 View
- Write a comment
విటారా బ్రెజ్జా ఒక పూర్తి ప్యాకేజీ. ఇది అన్ని లక్షణాలను, మంచి ధరను కలిగి ఉంది మరియు సమర్థవంతమైనదిగా ఉంది. దీనిలో ఒకప్పుడు ఉన్న చిన్న లోపం ఏమిటంటే ఆటోమెటిక్ తో లేకపోవడం, కానీ ఇప్పుడు అయితే ఆ సమస్య లేదు. అందువలన, ఈ అధనపు చేరిక ఒక పట్టణ SUV కోసం AMT విటారా బ్రెజ్జా ను మా డిఫాల్ట్ ఎంపికగా చేస్తుందా?
2018 నవీకరణతో, మారుతి సంస్థ విటారా బ్రెజ్జాలో AMT ని ప్రవేశపెట్టింది. 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగిన మారుతి కార్లు స్విఫ్ట్ మరియు డిజైర్ వంటి మోడళ్లలో ముందుగా AMT కలిగివున్నప్పటికీ, ఇదే మొదటిసారి మరింత శక్తివంతమైన DDiS200 ట్యూన్ తో జతచేయబడింది. AMT ని అధనంగా చేర్చడంతో పాటూ దీనిలో కొన్ని ఫీచర్ నవీకరణలు కూడా ఉన్నాయి. ఈ కలయిక మీరు ట్రాఫిక్ లో పడే బాదలకు వీడ్కోలు చెప్పడానికి బాగా సరిపోతుందా? దీనిలో ఏమిటి మారింది?
లుక్స్ :
- లుక్స్ ని పరిగణలోనికి తీసుకుంటే 2018 నవీకరణలో తేడా ఏమిటంటే బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఇవి ఇప్పుడు Z మరియు Z+ వేరియంట్స్ లో అందుబాటులో ఉన్నాయి. వారు పాత గ్రే కలర్ ని భర్తీ చేసారు, కానీ ఆకారం మరియు పరిమాణం అలాగే ఉంది. మా అభిప్రాయం ప్రకారం, నలుపు రంగువి బాగా కనిపిస్తాయి. అలాగే, పాత నీలం రంగు స్థానంలో ఒక కొత్త నారింజ రంగు అదనంగా ఉంది.
- అలాగే లైసెన్స్ ప్లేట్ పైన క్రోమ్ స్ట్రిప్ ఉంది, ఇది అంతకుముందు టాప్ ఎండ్ వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉండేది, కానీ ఇప్పుడు మొత్తం రేంజ్ అంతటా అందుబాటులో ఉంది.
- బాక్సీ SUV ఆకారం, LED లైట్ గైడ్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్ మరియు బ్రెజ్జా మొదటి స్థానంలో ఉండేందుకు కారణం అయిన పెద్ద గ్లాస్ ఏరియా వంటివి ఇంకా ఒకే విధంగా ఉన్నాయి.
లోపల భాగాలు
- కారు లోపల విషయాలు మళ్ళీ ఖచ్చితంగా ఉంటాయి. మీరు స్మార్ట్‌ప్లే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో చక్కగా కనిపించే డాష్ బోర్డ్ ను పొందుతారు. ఇది ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ లకు మద్దతు ఇస్తుంది. మీరు తరువాత బ్లూటూత్, AUX మరియు USB కనెక్టివిటీని కూడా పొందుతారు. ఈ టాప్ వేరియంట్ లో, మీరు 6 స్పీకర్లు మరియు ఆడియో నాణ్యత కూడా పొందుతారు, అయితే కొద్దిగా బాస్ ఎక్కువ ఉండి ఉంటే ఇంకా ఆకట్టుకొనేది.
- విటారా బ్రెజ్జాలో ఉన్న ప్రయోజనం ఏమిటంటే మీరు దీనిలో ఒక కమాండింగ్ స్థానం లో కూర్చోవచ్చు. దీనిలో లాభాలు ఉన్నట్టుగానే కొన్ని కొన్ని అప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ నాణ్యత మరియు టెక్స్చర్స్ చౌకగా అనిపిస్తాయి మరియు మొత్తం అంతర్గత నాణ్యత అంత ప్రీమియంగా ఏమీ అనిపించదు. AMT వేరియంట్ లో, మీరు క్రూయిజ్ నియంత్రణను కోల్పోతారు, ఇది మాన్యువల్ వేరియంట్ లో ఉంటుంది.
- 2018 నవీకరణలో భాగంగా, మారుతి దాని శ్రేణి నుంచి 'ఆప్ష్నల్’ వేరియంట్లను తొలగించింది. ఇప్పుడు మీరు డ్యుయల్ ఎయిర్ బాగ్స్, EBD తో ABS, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, వెనుక పార్కింగ్ సెన్సార్స్ ప్రీ టెన్ష్నర్స్ తో సీట్ బెల్ట్స్ మరియు లోడ్ లిమిటర్స్ వంటి అన్ని భద్రతా లక్షణాలను అన్ని వేరియంట్స్ లో ప్రామాణికంగా పొందవచ్చు.
- AMT వేరియంట్స్ లో అతిపెద్ద మార్పు AMT గేర్ షిఫ్టర్. ఇది ఉపయోగించడానికి సులభం మరియు మీరు ఎడమ లివర్ పుష్ చేయడం ద్వారా మాన్యువల్ మోడ్ లోకి వెళ్తారు.
Check out: Mahindra S201: Vitara Brezza, EcoSport, Nexon Rival Spied Inside Out
ఇంజిన్ మరియు పనితీరు
- 1.3-లీటర్ DDiS 200 డీజిల్ ఇంజిన్ కు ఏ మార్పులు చేయబడలేదు. ఇది ఇప్పటికీ గరిష్ట శక్తి 90Ps మరియు 200Nm గరిష్ట టార్క్లను అందిస్తుంది. ఇది 2,000rpm క్రింద టర్బో లాగ్ తో ఇప్పటికీ కొనసాగుతుంది మరియు 4500rpm వరకు మంచి పనితీరును అందిస్తుంది. AMT ట్రాన్స్మిషన్ టర్బో లాగ్ యొక్క ప్రభావం తగ్గించేందుకు ఏమి చేసింది.
- గేర్బాక్స్ లో గేర్ షిఫ్ట్స్ అనేవి అస్తమానూ పైకి క్రిందకి వెళ్ళడం జరగవు మరియు తక్కువ గేర్ లో ఉన్నప్పుడు రివల్యూషన్స్ ని కంట్రోల్ లో పెడుతుంది, దాని వలన ఆ కారు యొక్క పవర్‌బాండ్ లోనే ఎప్పుడూ ఉండేలా చేస్తుంది. తత్ఫలితంగా, మీరు రివర్లూషన్స్ గురించి మృదువైన రైడ్ ని పొందవచ్చు. ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు గేర్బాక్స్ డౌన్ షిఫ్ట్ ఎప్పుడు అవుతుంది అంటే, త్రోటిల్ మీద గట్టిగా కాలు వేసి తొక్కినప్పుడు మాత్రమే. లేదంటే అది అదే గేర్ లో ఉంచి ఓవర్ టేక్ ని పూర్తి చేస్తుంది. హైవే మీద 4 వ నుండి 5 వ గేర్ నుండి మార్పు అనేది మనం అనుభూతి చెందము మరియు స్పీడ్స్ సునాయాసంగా పెరుగుతూ మరిన్ని మైల్స్ ని ఆనందంగా అధిగమించవచ్చు.
- .త్రోటిల్ రెస్పాన్స్ కొంచెం తగ్గించడం జరిగింది, దాని వలన మంచి పనితీరు రాబట్టుకోవడం కోసం మనం ఎక్కువ ఇంపుట్ అనేది ఇవ్వాలి. త్రోటిల్ తో కొంచెం మృదువుగా ఉంటే గేర్ షిఫ్ట్స్ అనేవి కొంచెం మృదువుగా ఉంటాయి. ట్రాఫిక్ లో స్పీడ్ గా వెళ్ళాలి అనుకుంటే మాన్యువల్ లోకి పెట్టుకోవడం బెటర్ మరియు మీ అంతట మీరే గేర్ షిఫ్ట్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.
- ఈ రివల్యూషన్స్ గేర్బాక్స్ హోల్డ్ చేయడం వలన మనకి పనితీరు దెబ్బ తినే అవకాశం ఉంది. మాన్యువల్ మా టెస్ట్ లో నగరంలో 21 కిలోమీటర్ల మైలేజీని అందించగా, AMT 17.6Kmpl మైలేజ్ ని అందిస్తుంది. హైవే మీద, సామర్థ్యం 5kmpl తగ్గి 20.99Kmpl అందిస్తుంది, అయినా కూడా ఈ గణాంకాలు పోటీ లో ముందుకు సాగుతూనే ఉన్నాయి.
- మొత్తంమీద, AMT నగర అవసరాల కోసం ఎక్కువగా ట్యూన్ చెయ్యబడింది మరియు గేర్బాక్స్ ఎక్కువ సమయం వరకు పవర్ బాండ్ లో ఉంచడం వలన, AMT డ్రైవింగ్ మాన్యువల్ కంటే మెరుగ్గా ఉంటుంది!
రైడ్ మరియు నిర్వహణ
- విటారా బ్రజ్జా ఎప్పుడూ కూడా షిఫ్ట్ రైడ్ ని కలిగి ఉంటుంది. దృఢత్వం ఇప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపిస్తున్నప్పటికీ, ఇది ఇప్పటికీ విరిగిన రోడ్లు మరియు గుంతలు క్యాబ్ లోపలకి తెలిసేలా చేస్తుంది. ముఖ్యంగా మీరు నెమ్మదిగా వెళుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోడ్డు యొక్క గతకలు అవి క్యాబిన్ లోపలకి తెలుస్తాయి. బంప్స్ మీద కొంచెం స్పీడ్ గా వెళుతున్నట్లయితే ఆ ఇబ్బంది క్యాబిన్ లోపలకి తెలుస్తుంది.
- ఈ రైడ్ ముఖ్యంగా రహదారులపై వెళ్ళినట్లయితే బాడీ రోల్ లో మెరుగ్గా ఉంటుంది, ప్రత్యేకించి బాక్సీ ఆకారం వలన ఇది బాగా నియంత్రణలో ఉంది. రైడ్ 120kmph దగ్గరగా వేగంలో కూడా స్థిరంగా ఉంటుంది.
- స్టీరింగ్ తిరగడానికి తేలికగా ఉంటుంది మరియు ఇది నగరంలో ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. హైవే మీద ఇది కొంచెం బరువుగా అనిపిస్తుంది, కానీ అనుభూతి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. బ్రేకులు అనేవి సరిగ్గా ఉండడం వలన పనితీరు చాలా చక్కగా ఉంటుంది మరియు ఊహించే విధంగా ఉంటుంది.
Check out: Tata Nexon AMT: First Drive Review
తీర్పు
- విటారా బ్రెజ్జా అనేది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లో వచ్చిన చివరి కాంపాక్ట్ SUV లలో ఒకటి. అయితే మారుతి ఆలస్యం అయినప్పటికీ దానిని సరిగ్గా డిజైన్ చేసారని చెప్పవచ్చు. AMT నగర వాడుక కోసం అందంగా ట్యూన్ చేయబడింది. ఇది టర్బో లాగ్ నివారించడానికి పవర్‌బాండ్ లో మిమ్మల్ని ఉంచుతుంది మరియు తరచుగా గేర్లు అనేవి మార్చబడకుండా ఉండి మృదువైన రైడ్ అనుభవాన్ని అందిస్తాయి. ఇక్కడం మనం మర్చిపోలేనిది ఏమిటంటే కన్వెన్ష్నల్ SUV లుక్స్ మరియు సూపర్ సమర్థవంతమైన ఇంజన్, ఇది దేశంలోని అత్యుత్తమంగా అమ్ముడుపోయిన SUV గా చేసింది.
- అయితే విటారా బ్రజ్జాకు కొన్ని లోపాలు ఇప్పటికీ ఉన్నాయి. మారుతి ఈ సస్పెన్షన్ లో కొంచెం సాఫ్ట్ గా ఉండి ఉంటే అది మరింత మెరుగైన పట్టణ ప్యాకేజీగా ఉండేది. స్టిఫ్ గా ఉండే రైడ్, పనికిమాలిన ప్లాస్టిక్లు మరియు పెట్రోల్ వేరియంట్ లేకపోవటం ఇప్పటికీ ఇది కొంచెం వెనకపడి ఉంది అని చెప్పుకోవాలి.
- ఇప్పుడు, AMT అందించే సౌలభ్యంతో, బ్రెజ్జా ఒక మంచి శక్తివంతమైన పాయింటును దానంతట అదే తీసుకెళుతుంది. AMT పనితీరును నగరంలో మరింత ఉపయోగపడేలా చేస్తుంది, మేము మాన్యువల్ కంటే దీనినే సిఫార్సు చేస్తాము.
Check out: New Ford EcoSport S: First Drive Review