• English
  • Login / Register

హ్యుందాయ్ క్రెటా vs రెనాల్ట్ క్యాప్టర్ vs మారుతి S-క్రాస్: డీజిల్ మాన్యువల్ పోలిక సమీక్ష

Published On మే 11, 2019 By tushar for హ్యుందాయ్ క్రెటా 2015-2020

  • 1 View
  • Write a comment

ఫ్రాన్స్ కోరియా మరియు జపాన్ తో సూడో-SUV ప్రపంచ కప్ లో పోటీపడింది! ట్రోఫీతో ఏ కారు వెళుతుంది?

Creta vs Captur vs S Cross

కార్లు పరీక్షించబడినవి: హ్యుందాయ్ క్రెటా  SX (O) / రెనాల్ట్ క్యాప్చర్ ప్లాటినే / మారుతి సుజుకి S-క్రాస్ ఆల్ఫా

ఇంజిన్: క్రెటా - 1.6 లీటర్ 4 సిలిండర్ డీజిల్ |128PS / 260Nm  Vs క్యాప్టర్ - 1.5 లీటర్ 4 సిలిండర్ డీజిల్ | 110PS / 240Nm vs S- క్రాస్ - 1.3-లీటర్ 4-సిలిండర్ డీజిల్ | 90PS / 200Nm

క్రెటా  రోడ్ టెస్ట్ ఫ్యూయల్ ఎకానమీ: 13.99kmpl (సిటీ) / 21.84kmpl (హైవే)

కాప్టర్ రోడ్ టెస్ట్ ఫ్యూయల్ ఎకానమీ: 15.50kmpl (నగరం) / 20.37kmpl (హైవే)

S- క్రాస్ రోడ్ టెస్ట్ ఫ్యూయల్ ఎకానమీ: 19.16 (నగరం) / 20.65 కి.మీ. (హైవే)

పరీక్షించిన ధరలు: హ్యుందాయ్ క్రెటా: రూ. 15.03 లక్షలు | రెనాల్ట్ కాప్టర్: రూ. 14.05 లక్షలు | మారుతి S-క్రాస్: రూ 11.33 లక్షలు (అన్ని ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ప్రతికూలతలు

హ్యుందాయ్ క్రెటా

Creta vs Captur vs S Cross

  •  ఒక మంచి కారుని డ్రైవ్ చేస్తున్న అనుభూతి మరియు లైట్ క్లచ్,లైట్ స్టీరింగ్ మరియు ట్రాక్టబుల్ ఇంజన్  నగరంలో లేదా హైవేలో ఉపయోగించేందుకు సమర్ధవంతంగా చేస్తాయి.
  •  స్థిరమైన ఫిట్టింగ్, ఫినిషింగ్ మరియు బిల్డ్ క్వాలిటీ కలిగి ఉంటుంది.
  •  సౌకర్యవంతమైన రైడ్ క్వాలిటీ కలిగి ఉంటుంది.  

రెనాల్ట్ కాప్టర్

Creta vs Captur vs S Cross

  • బలమైన నిర్మాణ నాణ్యత. సరైన యూరో-కారు వంటి భావన కలిగిస్తుంది.
  • అత్యుత్తమ రైడ్ నాణ్యత కలిగి ఉంటుంది. చెడ్డ రహదారులు మరియు హై స్పీడ్ అంశాలతో ఇబ్బంది లేకుండా వ్యవహరిస్తుంది.
  • అద్భుతమైన స్టైలింగ్ తో నిలుస్తుంది మరియు భారతీయ రహదారులపై ఇటువంటి అద్భుతమైన కారుని చూడలేదు అన్న విధంగా ఉంటుంది.

నిండి ఉన్న లక్షణాలు: నావిగేషన్ తో టచ్‌స్క్రీన్, LED హెడ్లైట్లు మరియు ఫాగ్ లైట్స్, LED ఇంటీరియర్ లైటింగ్, డైమండ్-క్విల్టెడ్ లెథర్ థ్రెస్టెరీ, స్మార్ట్-కార్డు తదితర అంశాలను కలిగి ఉంది.

మారుతి సుజుకి S-క్రాస్

Creta vs Captur vs S Cross

  • విశాలమైన క్యాబిన్. ఈ పోటీలో ఉత్తమమైన 5-సీటర్.
  • రైడ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. తక్కువ స్పీడ్ లో కూడా సౌకర్యాన్ని అందిస్తుంది, చెడు రహదారి సామర్ధ్యం మరియు అధిక వేగ స్థిరత్వం అందిస్తుంది.
  • నగరం లో చాలా ఇంధన సమర్థవంతమైనది మరియు రోజువారీ ఉపయోగం కోసం చాలా బాగుంటుంది.
  • నిండి ఉన్న లక్షణాలు: ఆండ్రాయిడ్ ఆటో / ఆపిల్ కార్పిల్ తో టచ్‌స్క్రీన్,ఆటో A.C, లెథర్ అప్హోల్స్టరీ, రీచ్ అడ్జస్టబుల్ స్టీరింగ్,LED ప్రొజెక్టర్ హెడ్లైట్లు

ప్రతికూలతలు

హ్యుందాయ్ క్రెటా

  • ఖరీదైనది. పోటీ కంటే చాలా ఎక్కువ ఖరీదైనది.
  • కొన్ని ఉండాల్సిన లక్షణాల లేవు: ఆటో హెడ్ల్యాంప్స్, ఆటో వైపర్స్, SX ఆటోమేటిక్ వేరియంట్ తో మాత్రమే ISOFIX అందించబడుతుంది.

రెనాల్ట్ కాప్టర్

  • క్యాబిన్ స్థలం చాలా తక్కువ, ముఖ్యంగా వెలుపలి పరిమాణాలతో పరిశీలిస్తే లోపల క్యాబిన్ స్పేస్ తక్కువ.
  • భారీ స్టీరింగ్, భారీ మరియు పొడవైన ట్రావెల్ క్లచ్, టర్బో-లాగ్ మరియు చిన్న గేర్ నిష్పత్తులు రోజువారీ ట్రాఫిక్ లో ఉపయోగించడానికి ఇబ్బందికరంగా ఉంటుంది.
  •  ఎర్గనామిక్ లోపాలు:  డిఫాల్ట్ డ్రైవర్ సీట్-ఎత్తు చాలా పొడవుగా ఉంది. స్విచ్ గేర్ ప్లేస్ గందరగోళంగా ఉండవచ్చు. టచ్స్క్రీన్ ఎబెట్టుగా ఉండే కోణం లో పెట్టబడింది, దాని వలన సన్ లైట్ వేడి తగిలి పట్టుకోగానే వేడిగా ఉంటుంది.

మారుతి సుజుకి S-క్రాస్

  •  సైడ్ మరియు కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్ అనేవి లేవు. ఈ విభాగం కంటే క్రింద లేదా రెండు స్థానాలలో క్రింద ఉండే కార్లు కూడా ఈ లక్షణాలను అందిస్తున్నాయి.
  •  కొంచెం టర్బో లాగ్ ఏదైతే ఉందో దానికి మనం అలవాటు పడాలి.

ఆకర్షణీయమైన లక్షణాలు

హ్యుందాయ్ క్రెటా

Creta vs Captur vs S Cross

  • పవర్డ్-డ్రైవర్ సీటు
  • సన్రూఫ్
  • రివర్స్ కెమేరా కోసం గైడ్‌లైన్స్
  •  వైర్లెస్ ఫోన్ ఛార్జ్

రెనాల్ట్ క్యాప్టర్

Creta vs Captur vs S Cross

  • LED హెడ్లైట్లు మరియు ఫాగ్ లైట్లు
  • LED అంతర్గత లైట్లు
  • డైమండ్-క్విల్టెడ్ లెథర్ అప్హోల్స్టరీ

మారుతి సుజుకి S-క్రాస్

Creta vs Captur vs S Cross

  • రీచ్-అడ్జస్టబుల్ స్టీరింగ్
  • అడ్జస్టబుల్ వెనుక బ్యాకెస్ట్ యాంగిల్
  • LED ప్రొజెక్టర్ ఫాగ్ లైట్లు
  • రేర్ వీల్ డిస్క్ బ్రేక్లు  

బాహ్యభాగాలు

Creta vs Captur vs S-Cross

స్టైలింగ్ విషయానికి వచ్చినప్పుడు, ఈ విభాగంలో కొనుగోలుదారులు ఎంచుకోవడం కోసం చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. హ్యుందాయ్ క్రెటా దాని నమూనాతో మరింత సాంప్రదాయిక బాక్సీ-SUV విధానాన్ని తీసుకుంటుంది, మారుతి సుజుకి S- క్రాస్ మరియు రెనాల్ట్ క్యాప్యుర్ వంపు తిరిగే క్రాస్ ఓవర్ లు.

కొలతలు

క్రెటా

S-క్రాస్

కాప్టర్

పొడవు

4270mm

4300mm

4329mm

వెడల్పు

1780mm

1785mm

1813mm

ఎత్తు

1630mm

1595mm

1619mm

వీల్బేస్

2590mm

2600rpm

2673mm

Creta vs Captur vs S-Cross

వీటన్నిటిలోనీ సాధారణా ఉండే లక్షణం ఏమిటంటే ఇవన్నీ కూడా ముఖ్యమైన బచ్ అప్పీల్ ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. S- క్రాస్ దాని బోనట్ మరియు శరీర ప్యానెల్లు అంతటా ముస్క్యులర్ లైన్లు అందించి, విభాగంలో స్థిరంగా బ్లాక్ శరీరం క్లాడింగ్ ని ఇచ్చి బచ్ అపీల్ ని అందిస్తుంది. ఇది ప్రతి కోణంలో (దాని వీల్స్ తో సహా: S- క్రాస్ క్రెటా మరియు క్యాప్టర్ యొక్క 17-ఇంచ్ వీల్స్ తో పోలిస్తే 16-ఇంచ్ వీల్స్ ని కలిగి ఉంది) ఇక్కడ చిన్న కారుగా ఉన్నప్పటికీ కూడా, S- క్రాస్ బలమైన ఉనికిని కలిగి ఉంది. అలాగే ఇది మంచి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఉంది దాని వలన రోడ్డు మీద బాగా ఉనికిని చాటుకుంటుంది.

Creta vs Captur vs S-Cross

కానీ మీరు రోడ్డు ఉనికిని కోరుకుంటే, రెనాల్ట్ కెప్టూర్ మీ కోరికను నెరవేరుస్తుంది మరియు ఎలా! దీని యొక్క కర్వీ స్టైలింగ్ మరియు గుండ్రని హాంచస్ ఇది ఒక కాంపాక్ట్ SUV యేనా అని భ్రమ ఇస్తుంది అయితే, కాప్టర్ నిజానికి ఈ పోలిక లో పొడవైన మరియు విశాల సుడో- SUV గా ఉంది మరియు ఇది అన్నిటికంటే పొడవైన వీల్ బేస్ ని కూడా కలిగి ఉంది.  17 అంగుళాల వీల్స్ ఏవైతే ఉన్నాయో అది  ఒక కాన్ఫరెన్స్ కారు నుండి నేరుగా తీసుకున్నట్టు ఉంది. 210mm గ్రౌండ్ క్లియరెన్స్ వల్న రెనాల్ట్ కాప్టర్ మిమంలని గర్వడేలా పడేలా చేస్తుంది, హిందీ లో ఒక సామెత ఉంది అది  బడా హై తో బెహతర్ హై (పెద్దది చాలా ఉత్తమం!) అనే భావన మీకు దీనిలో కలుగుతుంది.  

గ్రౌండ్ క్లియరెన్స్

క్రెటా

S-క్రాస్

కాప్టర్

గణాంకాలు

190mm

180mm

210mm

 

S- క్రాస్ మరియు క్యాప్టర్ రెండింటి డిజైన్ లో కొన్ని అద్భుతమైన మూలకాలు ఉన్నాయి,అవి ఏమిటంటే  మారుతి యొక్క LED ప్రొజెక్టర్ హెడ్లైట్లు మరియు రెనాల్ట్ యొక్క LED ఫాగ్ లైట్లతో LED హెడ్లైట్లు. ఈ రెండిటితో పోల్చిచూస్తే, 2018 క్రెటా లో కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తుంది. క్రెటే ఫేస్లిఫ్ట్ ఒక నూతన ఫ్రంట్ గ్రిల్ ను కలిగి ఉంది, దీని వలన ముందు నుండి చూస్తే కొంచెం వెడల్పుగా కనిపిస్తుంది మరియు దీనిలో 17 అంగుళాల వీల్స్ స్పోర్టిగా కనిపిస్తాయి. అలాగే దీనికి కొత్త బంపర్-ఇంటిగ్రేటెడ్ DRL లను కలిగి ఉండడం వలన ఇది ఆఫ్టర్ మార్కెట్ ఆడ్-ఆన్స్ గా కనిపిస్తాయి. క్రెటా యొక్క్ అప్పీల్ ముఖ్యంగా దాని యొక్క స్క్వేర్డ్ ఆఫ్ అంచులలో ఉంది. మిగిలిన రెండు హ్యాచ్బ్యాక్-ఎస్క్ యొక్క టచ్ లు ఉండగా, క్రెటా స్టైలింగ్ మాత్రం SUV లా ఉంటుంది. ఇది ఇక్కడ అత్యంత ఎత్తైన పోటీదారు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ ఒక ఆరోగ్యకరమైన 190mm అందిస్తుంది.

అంతర్భాగాలు:

ఈ మూడు పోటీదారులు కూడా ఒక నిజమైన-నీలం SUV లను అనుకరిస్తున్నాయి. లోపలికి ప్రవేశించడానికి సులభంగా ఉండేది ఏమిటంటే మారుతి S-క్రాస్. ఇది కేవలం సరైన ఎత్తులో ఉంటుంది మరియు సీటు వరుసలలోనికి ప్రవేశించే మార్గం కూడా చాలా విస్తారమైనదిగా ఉంటుంది, దీనివలన పెద్ద వాళ్ళు కూడా చాలా సులభంగా లోనికి ప్రవేశించవచ్చు. హ్యుందాయి క్రెటా లో కూడా లోనికి ప్రవేశించడం బయటకి రావడం చాలా సులభంగా ఉంటుంది, కానీ దీని యొక్క పెద్ద సైడ్ సిల్ల్స్ వలన పెద్ద వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. క్యాప్టర్ లో ఇక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి. డిఫాల్ట్ డ్రైవర్ సీట్ కొంచెం ఎత్తుగా ఉంటుంది కాబట్టి పొట్టిగా ఉన్న డ్రైవర్స్ ఎక్కడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. అలాగే, వెనుక భాగం ఇరుకైనదిగా ఉంటుంది మరియు పెద్ద వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది.

మూడు కార్లలో ఏదైనా కూడా మీరు డ్రైవర్ యొక్క సీటులో కూర్చున్నప్పుడు, మీకు కావలసిన ఎత్తుగల డ్రైవింగ్ వైఖరిని అందిస్తాయి. మీరు ఎంచుకున్నది ఏంటనేది ఇక్కడ విషయం కాదు, దేనిని ఎంచుకున్నా సరే మీరు బోనెట్ పైన చూడగలుగుతారు మరియు రహదారిపై ఉన్న ఇతర కార్ల కంటే ఎత్తులో ఉన్నామని భావిస్తారు. గ్లాస్ ఏరియా కూడా బాగా వెడల్పుగా ఉండడం వలన క్యాబిన్ లోనికి మంచి గాలి అనేది వస్తుంది. కానీ క్యాప్టూర్ యొక్క డ్రైవర్ సీట్ల ఎత్తుకు, పొడవైన డ్రైవర్లకు (6 అడుగుల పొడవు లేదా అంతకంటే ఎక్కువ) ఖచ్చితంగా వారి యొక్క వ్యూ కి రూఫ్ లైన్ అనేది అడ్డు వస్తుంది. ఈ సందర్భంలో చెప్పుకోవచ్చు క్యాప్టర్ యొక్క ఎర్గనామిక్స్ లోపాలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి.

Creta vs Captur vs S-Cross

మీరు ముందుగా రెనాల్ట్ కొనుక్కొని ఉన్నట్లయితేనే మీకు ఈ కంట్రోల్స్ అనేవి సహజంగా తెలుస్తాయి, లేదంటే తెలియవు. ఉదాహరణకు క్రూయిజ్ నియంత్రణ, డ్రైవర్ యొక్క మోకాలికి సమీపంలో ఒక యాక్టివేషన్ స్విచ్ ఉంది, ఈ సెట్టింగ్లు స్టీరింగ్ నుండి నిర్వహించబడతాయి. ఆడియో ఫంక్షన్లను స్టీరింగ్ వీల్ వెనుక నుండి నియంత్రించబడతాయి, ఇది కొంచెం ఉపయోగించడానికి కష్టంగా ఉంటుంది. సెంట్రల్ కన్సోల్ లో క్రింద భాగంలో పుష్-బటన్ స్టార్ట్ ఉంటుంది, ఆటో AC నియంత్రణలు కూడా అలాగే ఉంటాయి. మీరు క్యాప్టూర్ యొక్క ఈ కంట్రోల్స్ ని అలవాటు పరచుకోగలరా? ఇది నిమిషాలలో అయితే జరగదు. దీని వలన చాలా మంది రెనాల్ట్ కొనడానికి ఇష్టబడరు.

Creta vs Captur vs S-Cross

భిన్నంగా, S- క్రాస్ మరియు క్రెటా రెండింటి యొక్క లేఅవుట్లు అర్థం చేసుకోవటానికి సులువుగా ఉంటాయి మరియు ఏ కంట్రోల్ ఎక్కడ ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. క్రెటా లో కొద్దిగా ఇబ్బంది కలిగించే అంశం ఏమిటంటే స్టీరింగ్ ఎందుకంటే క్యాప్టర్ లో ఉన్నట్టుగా దానిలో స్టీరింగ్ కి రీచ్ అడ్జస్ట్మెంట్ అయితే ఉండదు. S-క్రాస్ లో దీనిని అందించడం జరుగుతుంది.

Creta vs Captur vs S-Cross

S-క్రాస్ లో ఇంకొక ప్రకాశించే అంశం ఏమిటంటే క్యాబిన్ స్పేస్. వెలుపల నుండి ఇది చిన్న కారు వలే ఉన్నా కూడా మారుతి సుజుకి క్యాబిన్ స్థలాన్ని తెలివిగా వాడుకున్నారు. దీనిలో ఇద్దరు ఆరడుగల పొడవు ఉన్న మనుషులు ఒకరి తరువాత ఒకరు కూర్చోవచ్చు, వెనకాతల సీటులో షోల్డర్ రూం చాలా బాగుండి ముగ్గురు వ్యక్తులు కూర్చోడానికి చక్కగా మద్దతు ఇస్తుంది. దీనిలో ఫ్లోర్ హంప్ అనేది ఉండడం వలన మధ్యలో కూర్చున్న వ్యక్తికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. S-క్రాస్ లో వెనకతాల సీటులో మంచి హెడ్‌రూం గనుక ఇచ్చినట్లు అయితే బాగుండేది, ఇప్పుడు అది లేకపోవడం 6 అడుగుల పొడవు ఉన్న వ్యక్తులకు కొద్దిగా ఆ లోటు తెలుస్తుంది.

కొలతలు (వెనుకవైపు)

క్రెటా

S-క్రాస్

కాప్టర్

రేర్ షోల్డర్ రూం

1250mm

1350mm

1280mm

రేర్ హెడ్ రూం

980mm

925mm

945mm

రేర్ నీ(మోకాలు) రూం

615mm-920mm

675mm-910mm

640mm-850mm

రేర్ సీటు బేస్ వెడల్పు

1260mm

1265mm

1245mm

వెనుక సీట్ బేస్ పొడవు

450mm

470mm

460mm

వెనుక సీటు వెనుక ఎత్తు

640mm

590mm

590mm

కొలతలు (ఫ్రంట్)

క్రెటా

S-క్రాస్

కాప్టర్

లెగ్రూమ్ (మిని-మాక్స్)

925-1120mm

955-1850mm

945-1085

నీ(మోకాలు) రూం (మిని-మాక్స్)

610-840mm

565-778mm

540-730mm

సీట్ బేస్ పొడవు

595mm

490mm

490mm

సీట్ బేస్ వెడల్పు

505mm

480mm

505mm

సీటు వెనుక ఎత్తు

645mm

605mm

660mm

హెడ్ రూం (మిని-మాక్స్)

920-980mm

965-1010mm

940-990mm

క్యాబిన్ వెడల్పు

1400mm

1405mm

1355mm

Hyundai Creta

క్యాబిన్ ప్రదేశంలో, క్రెటా కారు 2 స్థానంలో ఉంది. ఇది 4 పెద్దలకు విశాలమైన మోకాలి(నీ) రూం మరియు హెడ్‌రూం ని అందిస్తుంది, కానీ వెనుక షోల్డర్ రూం హ్యుందాయ్ వెర్నా కంటే తక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది ఒక మంచి 5-సీటర్ అని చెప్పలేము. వీటన్నిటిలోనీ రెనాల్ట్ కాప్టర్ అనేది విరుద్ధంగా ఉంటుంది, ఇది బయట చాలా పెద్దగా ఉన్నా కూడా క్యాబిన్ స్పేస్ అనేది అంత మంచిదిగా ఉండదు. వెనకాతల నీ(మోకాలు) రూం  తక్కువగా ఉంది మరియు క్రెట్టా కంటే ఎక్కువ షోల్డర్ రూం ఉన్నా కూడా, ఇది ఇంకా మిగిలిన రెండు కార్ల కన్నా ఎక్కువ ఇబ్బందిగా ఉంటుంది.

అదృష్టవశాత్తూ, క్యాప్టర్ యొక్క క్యాబిన్ నాణ్యత చాలా బాగుంటుంది. టచ్ మరియు అనుభూతి పరంగా, ఇది బాగా నిర్మించబడింది మరియు ముఖ్యంగా లెథర్ ఎంపికలో బాగా ప్రీమియంగా అనిపిస్తుంది. కాబిన్ ప్రతిచోటా హార్డ్ ప్లాస్టిక్స్ ని కలిగి ఉంది, దృఢత్వంతో పాటు, కొన్ని మృదువైన టచ్ ఎలిమెంట్స్ కూడా దీనిలో ఉంటే చాలా బాగుండేది.

Maruti S-Cross

S- క్రాస్ కూడా బాగా తయారుచేయబడింది, లెదర్ యొక్క ఎంపిక మరియు మృదువైన టచ్ డాష్బోర్డ్ ఇన్సర్ట్ ఈ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తున్నాయి. ప్లాస్టిక్స్ చాలా బాగా ఫినిషింగ్ చేయబడినట్టు అనిపిస్తున్నాయి, కానీ సాధారణ మారుతి ఫ్యాషన్ లో అనువైనదిగా ఉంటాయి. అలాగే, పవర్ విండో స్విచ్లు వంటి కొన్ని అంశాలు ఇప్పటికీ తక్కువ ధర కలిగిన మారుతి కార్లతో పంచుకుంటాయి, ఇది కొద్దిగా దీని యొక్క మంచి అనుభూతిని తగ్గిస్తుంది.  

Hyundai Creta

దీనిలో క్రెటా అనేది మంచి మార్కులు కొడుతుందని చెప్పాలి. దీనిలో ప్లాస్టిక్స్ కఠినమైనవిగా ఉంటాయి, కానీ మృదువైన ఫినిషింగ్ ని కలిగి ఉంటాయి. ఈ క్యాబిన్ లో కఠినమైనదిగా ఏదీ ఉండదు మరియు  ఇక్కడ మరీ అద్భుతం అని చెప్పడానికి ఏమీ ఉండదు, కానీ మీరు ఇచ్చే డబ్బుకి అయితే ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని చెప్పవచ్చు. మీరు పెట్టిన డబ్బుకి ఏవైతే లక్షణాలు కావాలనుకుంటారో హ్యుందాయి అవి ఉంటాయని చెప్పవచ్చు.

టెక్నాలజీ

అయితే, ఈ ధరలో కొన్ని సెగ్మెంట్ స్టేపుల్స్ అనేవి ఖచ్చితంగా ఇవ్వడం జరగాలి. కాబట్టి ఇక్కడ అందరు పోటీదారులు స్మార్ట్ కీ లేదా పాసివ్ కీలెస్ ఎంట్రీ కోసం కార్డ్స్ మరియు పుష్ బటన్ స్టార్ట్, ఆటో AC, లెథర్ అప్హోల్స్టరీ మరియు హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్లుని పొందుతున్నారు. మీరు క్రూయిస్ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, వెనుక కెమెరాలు, స్టీరింగ్-మౌంట్ చేసిన ఆడియో మరియు ఫోన్ కంట్రోల్స్, అడ్జస్టబుల్ ఫ్రంట్ మరియు వెనుక హెడ్ రెస్ట్లు తో పాటూ ఈ లక్షణాలు అన్నీ కలిగి ఉంటారు.

Hyundai Creta

క్రెటా దీనిలో ఒక సమపాళ్ళల్లో అవసరాలను మరియు కోరికలను బాలెన్స్ చేసుకుంటుంది. ఇక్కడ ప్రత్యేక లక్షణాలు పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఇది అవసరం కంటే కోరిక అని చెప్పాలి, అది ఏమిటంటే ఈ మూడిటిలోనీ ఇది మాత్రమే సన్రూఫ్ ని అందిస్తుంది.

Maruti S-Cross

దీని తరువాత వచ్చేది ఏమిటంటే S-క్రాస్, ఇది పైన చెప్పిన  LED ప్రొజెక్టర్లు మాత్రమే కాకుండా, స్టీరింగ్ కొరకు రీచ్ అడ్జస్ట్‌మెంట్ ని(ఇతరులు రేక్ మాత్రమే పొందుతున్నాయి) కూడా అందిస్తుంది. అంతేకాకుండా దీని వెనకాతల సీట్లు 60:40 కలిగి ఉండడం మాత్రమే కాకుండా, ప్రతి వైపు ఒక సర్దుబాటు బ్యాకెరెస్స్ట్ కూడా లభిస్తుంది, దీనితో విభిన్న శరీరతత్వం గల ప్రజలకు అది మరింత అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ S-క్రాస్ లో వెనుక A.C వెంట్స్ ని మాత్రమే కోల్పోతుంది, 40 డిగ్రీల కండిషింగ్ లో కూడా కూలింగ్ బాగానే ఉంటుంది ఏమాత్రం తగ్గదు.  

Renault Captur

ఈ క్యాప్టర్ యొక్క లక్షణాలను బాగా దగ్గర నుండి గనుక చూసినట్లయితే దాని ప్రతిపాదాన అర్ధం అవుతుంది, ఎందుకంటే ఇక్కడ దృష్టి అనేది అద్భుతమైన లక్షణాలను జోడించడంలోనే కాదు పనితీరుని పెంచే విధంగా కూడా ఉండాలి. ఉదాహరణకు, ఇంటీరియర్ ల్యాంప్స్ ని మరియు LED ఫాగ్ లైట్లని అందించే ఒకే ఒక్క కారు ఇది, కానీ క్రెటా యొక్క ఫాగ్ ల్యాంప్స్ కార్నరింగ్ ఫంక్షన్ ని కూడా అందిస్తుంది. అదనంగా, లెథర్ అప్హోల్స్టరీ అందరికి సాధారణంగా ఉన్నట్లయితే, నాణ్యత మరియు ఫినిషింగ్ క్యాప్టర్ లో ఉత్తమంగా ఉంటుంది.

Renault Captur

క్యాప్టర్ లో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే దాని యొక్క టచ్‌స్క్రీన్. స్టార్టర్స్ కోసం, ఇది క్విడ్ లో అందించే యూనిట్ కి చాలా దగ్గరగా పోలి ఉంటుంది, క్విడ్ అనేది ఒక బడ్జెట్ కారు, దానిలో ఎలా అయితే అందించబడుతుందో అలానే ఉంది. దీని యొక్క కలర్ అంత ఆకర్షణీయంగా ఉండదు మరియు డిస్ప్లే కూడా ఏదో మార్కెట్ లో ఉంది కాబట్టే పెట్టడం జరిగింది అన్నట్టుగా ఉంటుంది, అలాగే టచ్‌ రెస్పాన్స్ కూడా క్రెటా లేదా S- క్రాస్ లో ఉన్నట్టుగా అంత మంచి అనుభూతిని అందించదు. అలాగే ఇది ఆపిల్ కార్ప్లే లేదా ఆండ్రాయిడ్ ఆటో తో అందించబడడం లేదు.

Maruti S-Cross

S- క్రాస్ మరియు క్రెటా యొక్క 7-అంగుళాల టచ్ స్క్రీన్ లు స్ఫుటమైన డిస్ప్లేలు కలిగి ఉంటాయి మరియు సాధారణంగా ఉపయోగించడానికి చాలా బాగుంటాయి. మనం మంచి దానిని ఎంచుకోవాలనుకుంటే క్రెటా బాగుంటుందని చెప్పాలి. సెల్ఫోన్-వంటి UI ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది మరియు డైనమిక్ రివర్స్ గైడ్‌లైన్స్ వంటి చిన్న వివరాలు మరింత ఎక్కువ వినియోగాన్ని కలిగి ఉంటాయి.

Hyundai Creta

పనితీరు

Creta vs Captur vs S-Cross

మనం ఎక్కడైతే ఆగామో అక్కడి నుండే తీసుకుందామా మరియు ఒక స్పష్టమైన చాటింపు చేద్దాము. రెనాల్ట్ క్యాప్టర్ అనేది దానిని మీరు ఇష్టపడాలంటే ముందు దానికి అలవాటు పడాలి. ప్రస్తుతం మనకి ఉండే చర్చనీయాంశం ఏమిటంటే డ్రైవింగ్ అనుభూతి. సంఖ్యల విషయంలో పేపర్ లో పెట్టి గనుక చూస్తే అది మధ్య స్థానంలో ఉంటుంది మరియు డ్రైవింగ్ అనుభూతి విషయానికి వస్తే ఆ రెండిటి కంటే చాలా భిన్నంగా ఉంటుంది.

పవర్ట్రెయిన్

క్రెటా

S-క్రాస్

క్యాప్టర్

ఇంజిన్

1.6L/4cyl

1.3L/4cyl

1.5L/4cyl

పవర్

128PS @ 4000rpm

90PS @ 4000rpm

110PS @3850rpm

టార్క్

260Nm @ 1500-3000rpm

200Nm @ 1750rpm

240Nm @ 1750rpm

ట్రాన్స్మిషన్

6-స్పీడ్ MT

5-స్పీడ్ MT

6-స్పీడ్ MT

టైర్లు

215/60 R17

215/60 R16

215/60 R17

ఉదాహరణకు, టెస్ట్ డ్రైవ్ చేస్తున్నపుడు స్టీరింగ్ చాలా భారీగా ఉందని మీకు అనిపిస్తుంది. పార్కింగ్ స్పీడ్ లలో గనుక చూసినట్లయితే, ఉపయోగించడానికి కొంత ప్రయత్నం అనేది అవసరం అవుతుంది. క్లచ్ విషయానికి వస్తే అది కొంచెం భారీగా ఉండడం మాత్రమే కాదు, అర్ధం అవ్వడానికి సమయం పడుతుంది. అది ఒకవేళ అనుకోకుండా ఆగిపోయినా కూడా మీరేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ అతిపెద్ద సమస్య అయితే, పవర్ట్రెయిన్. 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ డస్టర్ మరియు లాడ్జీ లతో భాగస్వామ్యం చేయబడుతుంది మరియు ఇది 110PS శక్తిని / 240NM టార్క్ ని మాత్రమే అందిస్తుంది.

Creta vs Captur vs S-Cross

మేము ముందు చూసినట్లుగా, ఈ ఇంజిన్ లో టర్బో లాగ్ చాలా ఉంది, కొన్ని సార్లు బూష్ట్ వచ్చే ముందు ఆగిపోయినట్టే అనిపిస్తుంది. చిన్న ఎత్తు పల్లాలు ఉన్నా కూడా మోటార్ బాగా కష్టపడి ఆగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇవన్నీ చూసినట్లయితే, నగరం వినియోగం కోసం ఇది ఆదర్శంగా లేని క్రాస్ ఓవర్ అని అనిపిస్తుంది. రోజువారీ ట్రాఫిక్ లో డ్రైవింగ్ గజిబిజిగా అనిపిస్తుంది మరియు శక్తి లేకపోవడం వలన, మీరు ఓవర్టేక్స్ తీసుకోవాలి అనుకొనేటప్పుడు ముందు గా ప్లాన్ చేసుకోవాలి. ట్రాఫిక్ లో మీరు చిన్న చిన్న సందులలో వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు డౌన్ షిఫ్ట్స్ చేసుకొని 1800Rpm ని దాటించి మీరు ఓవర్‌టేక్ చేస్తే మీరు సులభంగా వెళ్ళవచ్చు. మీరు తరచూ గేర్లతో పని చేయకుండా ఉండడానికి తక్కువ గేర్లపై ఉండడానికి ఇష్టపడతారు.

కాప్టర్ ని మీరు హైవే మీద వెళ్ళినప్పుడు బాగా ఎంజాయి చేస్తారు. 2000Rpm దగ్గర ఇంజిన్ ని ఉంచినట్లయితే, సునాయాసంగా మీరు హై స్పీడ్ లో సులభంగా వెళ్ళవచ్చు. ఈ మిడ్ రేంజ్ పంచ్ ఎక్కువగా ఉండడం వలన 100kmph పై చిలుకు వేగంతో మీరు రోజంతా సంతోషంగా వెళ్ళవచ్చు. ఇక్కడ భారీ స్టీరింగ్ వలన ఇంకా ఎక్కువ నమ్మకాన్ని ఇచ్చి దారుల వెంట వేగంగా వెళ్ళడానికి దోహదపడుతుంది.

Creta vs Captur vs S-Cross

దీనికి భిన్నంగా మారుతి S-క్రాస్ హైవే మీద మంచి పనితీరుని అందిస్తుంది. హై స్పీడ్ ఓవర్‌టేక్స్ అప్పుడు కొన్ని ప్రణాళికలు అనేది అవసరం మరియు మీరు పనితీరుని తక్కువ అని భావించరు, అలాగే మరీ ఉత్తేజకరంగా కూడా ఏమీ అనిపించదు. దాని కోసం, మీకు 1.6 లీటర్ DDiS320 అవసరం అవుతుంది, కానీ  భాదాకరం ఏమిటంటే ఇది కొత్త ఫేస్లిఫ్ట్ తో నిలిపివేయబడింది. 1.3-లీటరు మోటార్ అయితే నగరంలో డ్రైవ్లకు ఒక డైమండ్ లాంటిది. అయితే మారుతి దాని యొక్క ఫేస్‌లిఫ్ట్ తో ఇంజన్ మార్చింది, ఆ టర్బో లాగ్ ఇంజన్ కి ఏదైతే ఉందో దానిని బాగా కంట్రోల్ చేసిందని చెప్పవచ్చు. ఈ మార్పు అనేది SHVS మైక్రో హైబ్రిడ్ టెక్ వలన వచ్చింది, ఇది ఇంజిన్ కు సాయపడటానికి, ఇంధన ఆర్ధిక వ్యవస్థను పెంచటానికి మరియు బలమైన త్రోటిల్ స్పందనను పంపిణీ చేసేందుకు దోహదపడుతుందని చెప్పవచ్చు. అందువలన నగరంలో డ్రైవింగ్ అనేది చాలా సౌకర్యవంతమైనది మరియు మీరు టర్బో చార్గర్ వచ్చే ముందు వరకు అంత కష్టపడరు. ఇది సడన్ గా పవర్ పెరిగినప్పటికీ అంత వింతగా ప్రవర్తించదు మరియు కొత్త డ్రైవర్ కి బాగా స్నేహపూర్వకంగా ఉంటుందని చెప్పవచ్చు.

RT

క్రెటా

S-క్రాస్

కాప్టర్

క్లెయిమ్ చేసిన FE

20.5kmpl

25.1kmpl

20.37kmpl

పరీక్షించబడిన సిటీ Fe

13.99kmpl

19.16kmpl

15.50kmpl

పరీక్షించిన హై Fe

21.84kmpl

20.65kmpl

21.1kmpl

 

నిజంగా S- క్రాస్ బాగా తిరిగే కారుగా ఎందుకు చెబుతాము అంటే దాని యొక్క ఇంధన సామర్ధ్యం వలన. నగరంలో ఇది దాని ప్రత్యర్థుల కంటే మరింత సమర్థవంతమైనదిగా ఉంటుంది మరియు 6వ గేర్ కూడా ఉండి ఉంటే హైవే మీద సమర్థవంతంగా ఉండేది.

Creta vs Captur vs S-Cross

అయితే ఈ మూడిటిలో సరైన బాలెన్స్ ని ఏది ఇస్తుందంటే క్రెటా అని చెప్పవచ్చు. క్రెంటా దాని కారు లాంటి డ్రైవింగ్ ప్రవర్తనకు ప్రజాదరణను పొందింది. క్రెటా లో మనకి ఒక లైట్ స్టీరింగ్ మరియు లైట్ క్లచ్ ఒక గేర్ లివర్ తో కలిసి ఉండడం వలన  S- క్రాస్ మరియు క్యాప్టూర్ రెండిటి కంటే కూడా వాడడానికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా టర్బో లాగ్ అస్సలు లేకపోవడం డ్రైవబిలిటీ ని మరింత సౌకరంగా మార్చింది. చిన్న చిన్న త్రోటిల్ ఇన్‌పుట్స్ ని అందిస్తే మనం సులభంగా ట్రాఫిక్ లోని వెళిపోవచ్చు. రహదారిలో, 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించడానికి కావలసినంత పవర్ ని ఖచ్చితంగా అందిస్తుంది.  హైవే సామర్థ్య పరీక్షలో క్రెటా అనేది చాలా ఇంధన సమర్థవంతమైన కాంపాక్ట్ SUV.

రైడ్ & హ్యాండ్లింగ్

Creta vs Captur vs S-Cross

ఒక్క విషయం మీరు బలంగా నమ్మాల్సింది ఏమిటంటే ఈ మూడు SUV లలో ఏది కూడా రైడ్ క్వాలిటీ ని తగ్గించవు. వీటన్నిటిలోనీ క్రెటా అనేది బాగా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పవచ్చు. తక్కువ వేగంలోని బంప్స్ ని సులభంగా దాటేస్తుంది మరియు ఒక పెద్ద పెద్ద గతకలు వచ్చినపుడు మాత్రమే లోపల ఉండే వారికి కొంచెం అసౌకర్యంగా అనిపిస్తుంది మరియు క్రెటా కూడా కొద్దిగా సౌకర్యాన్ని అందుకుంటుందని చెప్పవచ్చు. క్రెటా యొక్క హై స్పీడ్ రైడ్ కూడా స్థిరంగా ఉంటుంది, కానీ కొన్ని గతకలను క్యాబిన్ లోనికి తీసుకొని వస్తుందని చెప్పవచ్చు. అలాగే స్టీరింగ్ అనేది సిటీ కి వన్ ఫింగర్ లైట్ అని చెప్పవచ్చు, అలాగే హైవే మీద వెళుతున్నప్పుడు సమపాళ్ళలో బరువు మారుతూ ఉంటుంది మరియు కార్నర్స్ లో కూడా చాలా బాధ్యతగా ఉంటుంది.

Creta vs Captur vs S-Cross

ఈ విభాగంలో క్యాప్టర్ మంచి మార్కులను కొట్టేస్తుందని చెప్పాలి. ఈ హై స్పీడ్ రైడ్ అనేది దేనికి పోల్చుకోలేని విధంగా మరియు హైవే లో రోడ్డు గతకలు ఏమైనా ఉంటే సులభంగా ఏమీ లేనట్టే దూసుకొని వెళుతుంది. ఈ స్థిరత్వం అనేది మనకి అనుభవిస్తే గానీ తెలీయదు మరియు అది బాగా ఒక పెద్ద SUV కి ఖచ్చితంగా ఆకట్టుకొనే విధంగా ఉంటుంది. డస్టర్ లాగానే దీనిలో చెడు రహదారిపై కూడా నడిపే సామర్ధ్యం ప్రశంసనీయంగా ఉంటుంది. ఈ పోటీలో మిగిలిన రెండు కార్లు కూడా మీకు చెడ్డ రహదారులను ఎదుర్కోవటానికి విశ్వాసం కల్పించినా,క్యాప్టర్ విషయానికి వస్తే రోడ్డు నే శిక్షించే విధంగా దూసుకెళుతుంది. దీనిలో తక్కువ వేగంలో ఒక స్టిఫ్ ఎడ్జ్ కలిగి ఉండడం వలన డస్టర్ తో సరిగ్గా సరిపోదు, కానీ చాలా దగ్గరగా వస్తుంది.

Creta vs Captur vs S-Cross

ఇక్కడ S- క్రాస్ అనేది మంచి ఆరోగ్యకరమైన బాలెన్స్ ని అందిస్తుందని చెప్పవచ్చు. తక్కువ వేగవంతమైన రైడ్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు మీరు కఠినమైన అంచులు మరియు గుంతలుతో కూడా సౌకర్యవంతంగా వ్యవహరించవచ్చు. అలాగే హైవే మీద కూడా ఫ్లాట్ గా వెళుతూ మరియు ఒక బంప్ దాటిన తరువాత కూడా క్రెటా లో ఉన్నంత బౌన్సీ గా ఏమీ ఉండదు. మొత్తంగా చెప్పాలంటే ఇక్కడ S-క్రాస్ అనేది ఒక మంచి తక్కువ స్పీడ్ రైడ్ ని అందిస్తుంది మరియు అది హై స్పీడ్స్ లో క్యాప్టర్ అంత మంచిగా అయితే ఉండదు కానీ దగ్గరగా వస్తుందని అయితే చెప్పవచ్చు.

భద్రత

 

Creta vs Captur vs S-Cross

ఇక్కడ అన్ని కార్లు ప్రామాణికంగా డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు ABS ను పొందుతాయి. వారు వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు వెనుక కెమెరాలు కూడా కలిగి ఉంటుంది, అయితే క్రెటా డైనమిక్ గైడ్ లైన్స్ ని అందించే ఏకైక కారు. అయితే, హ్యుందాయ్ లో వింతగా ISOFIX అనేది లేదు. S-క్రాస్ మరియు క్యాప్టర్ లో ఇది ప్రామాణికంగా లభిస్తుంది. క్రెటా SX ఆటోమాటిక్ వేరియంట్ తో మాత్రమే ISOFIX ని అందిస్తుంది. క్రెట్టా ఆటో హెడ్ల్యాంప్స్ మరియు ఆటో వైపర్స్ ని కూడా మిస్ చేసుకుంది, ఇది మళ్లీ పోటీదారులైన రెండు కార్లలో ఉంటాయి.

క్రెటా మరియు క్యాప్చర్ మాత్రమే కార్నరింగ్ ఫాగ్ లైట్స్ ని కలిగి ఉంటాయి, అయితే వెనుక చక్రం డిస్క్ బ్రేక్లు ప్రత్యేకంగా S- క్రాస్ తో అందించబడుతున్నాయి. దురదృష్టవశాత్తు, S- క్రాస్ పూర్తిగా లోడ్ చేయబడిన ఆల్ఫా వేరియంట్ లో కూడా 2 ఎయిర్బాగ్లను కంటే ఎక్కువ అందించడంలేదు. క్యాప్టర్ సైడ్ ఎయిర్బాగ్స్ (మొత్తం 4 కు) అందిస్తుంది, అయితే క్రెటా సైడ్ + కర్టెన్ ఎయిర్బాగ్స్ (మొత్తం 6 కు) అందించబడుతున్నాయి

తీర్పు

Creta vs Captur vs S-Cross

మేము ఇక్కడ ఖచ్చితమైన అంశాన్ని పరిగణలోనికి తీసుకుంటున్నాము: హ్యుందాయి క్రెటా (రూ. 15.05 లక్షలు ఎక్స్ షోరూమ్-ఢిల్లీ) మరియు రెనాల్ట్ క్యాప్టర్ (రూ.14.04 లక్షలు ఎక్స్ షోరూం- ఢిల్లీ) దగ్గర దగ్గరగా ధరను కలిగి ఉన్నాయి,  మారుతి సుజుకి ఎస్-క్రాస్ (రూ.11.33 లక్షలు ఎక్స్ షోరూమ్-ఢిల్లీ) గణనీయంగా చౌకగా ఉంది. అయితే, ఇది ప్రీమియం సెగ్మెంట్ ఇక్కడ ధర మాత్రమే పరిగణనలోనికి తీసుకోబడదు. కాబట్టి మీరు దేనిని ఎంచుకోవాలి?

క్యాప్టర్ తో మనం ప్రారంభిద్దాము. ఈ యూరో క్రాస్ఓవర్ ముఖ్యంగా దాని యొక్క స్టయిలింగ్ మీద ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఈ విభాగంలో ఏ కారు కూడా ఎలా ఉండదు. ఇది బాగా అందంగా నిర్మించబడినది మరియు అది మంచి హైవే కారు కూడా, ఇది కేవలం అద్భుతమైన హై స్పీడ్ స్టెబిలిటీని కలిగి ఉండడం మాత్రమే కాదు ఆకట్టుకునే రైడ్ నాణ్యతను కూడా అందిస్తుంది. ఇది ఎక్కడ చిన్నబుచ్చుకుంటుంది అంటే చిన్న చిన్న అంశాలపై దృష్టి పెట్టకపోవడం వలన. పవర్ ట్రెయిన్ సిటీ లో వాడడానికి కష్టంగా ఉంటుంది, అలాగే దాని యొక్క సైజ్ ని పరిగణలోనికి తీసుకుంటే క్యాబిన్ స్పేస్ కూడా అంత పెద్దగా ఉండదు మరియు దాని ప్రత్యేకమైన లక్షణాలు కూడా పనితీరుకి మద్దతు ఇవ్వడానికి అంత భిన్నంగా ఉండవు. ఇది చూడగానే ఒక గొప్ప మొదటి అభిప్రాయాన్ని కలిగించే కారు అయితే కాదు కానీ దానితో కొంత సమయం గడుపుతూ ఉన్న కొలదీ మీకు ఖచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నాము. మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టి చూస్తే ఇది వాడుతున్నప్పుడు వచ్చే సమస్యలు అంత పట్టించుకోకుండా ఉండలేము. అందువలన క్యాప్టర్ ఇక్కడ విజేత అని మనం చెప్పలేము.

అయితే ఇక్కడ ఖచ్చితంగా మారుతి S- క్రాస్ విజేతా? ఇక్కడ డబ్బు విషయం గానీ మనం చూసుకుంటే ఇది ఖచ్చితంగా విలువని అందిస్తుంది మరియు మీ మొత్తం ఫ్యామిలీని దీనిలో సులభంగా బయటకి తీసుకెళ్ళవచ్చు. ఇది సిటీ లో తిరగడానికి మంచి ఇంధన సమర్ధవంతమైన కారని చెప్పవచ్చు మరియు దీని యొక్క రైడ్ సిటీ లోని మరియు హైవే లోని మంచి  డ్రైవ్ ని అందిస్తుందని చెప్పవచ్చు. కానీ దాని యొక్క లోపాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. హైవే మీద దీని పనితీరు మిగిలిన రెండు కార్లతో పోలిస్తే అంత బాగుండదు, ఎందుకంటే దాని యొక్క ఇంజన్ అనేది సిటీ ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడినది. ఇంకా చెప్పాలంటే భద్రత విషయంలో సైడ్ మరియు కర్టెయిన్ ఎయిర్‌బ్యాగ్స్ దీనిలో ఉండవు.  

Creta vs Captur vs S-Cross

కాబట్టి ఈ మూడిటిలో విజేత ఏది అంటే హ్యుందాయి క్రెటా అని చెప్పవచ్చు. వెర్నా వలే, ఇది ఏమీ అంత అద్భుతంగా ఏమీ చేయదు కానీ ఇది అవసరాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పవచ్చు. డ్రైవింగ్ అనుభవం సిటీ లో లేదా హైవే లో బాగుంటుంది మరియు దీనిలో ముఖ్యంగా దీనిలో మెచ్చుకోవాల్సిన విషయం దాని 1.6 లీటర్ ఇంజిన్ యొక్క శుద్ధీకరణ స్థాయిలు. క్యాబిన్ లోనికి మీరు వెళ్ళి చూస్తే అంత అద్భుతంగా అయితే ఏమీ ఉండదు, కానీ డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది మరియు మొత్తం నాణ్యత స్థిరమైనదిగా మరియు ప్రీమియంగా కూడా ఉంటుంది. ఇది కొన్ని అధనపు లక్షణాలను జోడించుకుంటూ కార్యాచరణను జోడించే అదనపు లక్షణాలతో కూడా అమర్చబడుతుంది.

దీనిలో లోపం ఏమిటంటే దాని ధర అని చెప్పవచ్చు. ఇది ఒక 50,000 తక్కువ ఉంటే మరియు దాని యొక్క లక్షణాలలో కొన్ని మిస్ అయినవి ఆటో హెడ్‌ల్యాంప్స్/వైపర్స్ మరియు ISOFIX లేకపోవడం అనేది కొంచెం లోపం. మొత్తంగా చూసుకుంటే ఇది ఒక ఖరీదైన ఎంపిక మరియు మీ డబ్బుకి ఖచ్చితంగా న్యాయం చేస్తుంది.

 

Published by
tushar

తాజా ఎస్యూవి కార్లు

రాబోయే కార్లు

తాజా ఎస్యూవి కార్లు

×
We need your సిటీ to customize your experience