2016 రెనాల్ట్ డస్టర్ AMT - ఫస్ట్ డ్రైవ్ రివ్యూ
Published On మే 10, 2019 By arun for రెనాల్ట్ డస్టర్ 2016-2019
- 1 View
- Write a comment
భారత ఆటోమోటివ్ చరిత్ర పేజీలు తిప్పినట్లయితే మీరు ఎల్లప్పుడూ ఒక 'బ్రాండ్' మాత్రమే 'కారు’ ని పాపులర్ చేసింది అని తెలుసుకుంటారు. ఉదాహరణకు మారుతి సంస్థ ఆల్టో 800 ని, మహింద్రా సంస్థ బొలేరో కారు ఇప్పుడు ఈ స్థానంలో ఉండడానికి కారణం అయ్యింది, అలానే టొయోటా సంస్థ ఇన్నోవా ని అద్భుతంగా మలిచింది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే విషయం దీనికి పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇక్కడ ఒక ‘కారు’ వచ్చి 'బ్రాండ్' ని పాపులర్ చేస్తుంది. ఇండియన్ కార్ల పరంగా చూసుకుంటే ఒక కారు, బ్రాండ్ ని పాపులర్ చేస్తుంది.
మీరు ఎవరితో అయినా ‘రెనాల్ట్’ అని చెప్తే అవతలవారు ఏమిటది అని కాసేపు ఆలోచనలో పడతారు. అదే మీరు ‘డస్టర్’ అని చెప్తే మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అవతలవారికి అర్ధం అయిపోతుంది. రెనాల్ట్ సంస్థ యొక్క మెగా స్టార్, అమ్మకాలలో హీరో మరియు భారతీయ మార్కెట్ లో ఖ్యాతిని సంపాదించుకున్న డస్టర్ కారు ఇప్పుడు కొత్త రంగులతో నవీకరించబడి వస్తుంది. కాలానికి అనుగుణంగా ఉండేందుకు డస్టర్ ఇప్పుడు AMT ఆఫర్ తో కూడా వస్తుంది. ఈ నవీకరణ అనేది డస్టర్ ని పాతదాని కంటే మెరుగైన ప్యాకేజీలో అందిస్తుందా?? పదండి కనుక్కుందాము.
బయటభాగాలు:
రెనాల్ట్ డస్టర్ మొట్టమొదటిసారిగా ప్రారంభించినపుడు దాని యొక్క బచ్ ప్రపోషన్లు తో ప్రజలను వెంటనే ఆకర్షించుకుంది. చూడగానే నచ్చే విధంగా ఉండే ముఖ భాగం, రగిలించే విధంగా ఉండే 16 ఇంచ్ వీల్స్ మరియు SUV కి ఉండేటటువంటి లుక్ తో అరుదైన రకంగా నిలిచింది. మనం ఇక్కడ ఆనందించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఫేస్లిఫ్ట్ లో ముఖ్యమైన నిర్దేశాలు మార్చకుండా చిన్న చిన్న మార్పులు చేయడం జరిగింది.
ఈ డస్టర్ యొక్క భాగాలన్నీ కూడా అవుట్‌గోయింగ్ మోడల్ కి సమానంగానే ఉంటాయి. కానీ దీనిని వేరే దానితో పోల్చి చూడలేము. దీని ముందర భాగంలోనే చాలా నవీకరణలు స్పష్టంగా కనిపిస్తాయి. దీని ముందర గ్రిల్ లో రెనాల్ట్ సింబల్ పెద్దగా కనిపిస్తుంది మరియు దాని చుట్టూ క్రోం గ్రిల్ పెట్టడం జరిగింది. దీని బంపర్ కి ఒక మాటే సిల్వర్ ఫినిష్ తో ఉండే ఒక స్కిడ్ ప్లేట్ వస్తుంది, దాని వలన కాంపాక్ట్ SUV యొక్క దృఢమైన పొజిషినింగ్ లా కనిపిస్తుంది. ఇక్కడ మనకి నచ్చే అంశం ఏమిటంటే కొత్త హెడ్‌ల్యాంప్స్. దీనిలో తిరిగి డిజైన్ చేయబడిన క్లస్టర్ చాలా అద్భుతంగా ఉంటుంది మరియు దీనికి ఉన్న స్మోకెడ్ ఫినిషింగ్ చాలా గంభీరంగా కనిపిస్తుంది. క్రెటా కారుకి ఉండే విధంగా డే టైం రన్నింగ్ ల్యాంప్స్ తో ప్రొజక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఉండేటట్టు అయితే చాలా బాగుండేది.
దీని ప్రక్కభాగం మరియు వెనుక భాగం అస్సలు మారలేదు. దీనిలో మార్పులు అనేవి గమనించదగ్గ విధంగా ఉండవు మరియు మీరు తీక్షణంగా చూస్తే మార్పులు తెలుస్తాయి, లేదంటే తెలీవు. దీనిలో 16 ఇంచ్ వీల్స్ భిన్నమైన డిజైన్ కలిగి ఉంటుంది మరియు మెషిన్ సర్ఫేస్ తో బ్లాక్‌గన్ మెటల్ షేడ్ తో ఫినిష్ చేయబడి గంభీరంగా కనిపిస్తాయి. దీనిలో రూఫ్ రెయిల్స్ కూడా కొత్తవి మరియు డస్టర్ పేరు తో వస్తుంది. దీని వెనకాతల మార్పులు ఏమిటంటే LED టెయిల్‌ల్యాంప్స్ మరియు కస్టమరీ స్కిడ్ ప్లేట్.
రెనాల్ట్ సంస్థ ఈ కారుకి ఏవైతే నవీకరణలు కావాలో అవి మాత్రమే చేసిందని చెప్పవచ్చు. అయితే రెనాల్ట్ యొక్క డిజైన్ పాతబడి పోయిందని మేము అనుకోవడం లేదు, ఈ డిజైన్ చాలా కాలం వస్తుంది. కానీ ఈ నవీకరణతో కొత్త తరానికి ఉపయోగపడేలా ఉంది.
లోపల భాగాలు:
దీని అంతర్భాగాల గురించి మాట్లాడుకుంటే ఒకే ఒక్కటి దీనిలో మిస్ ఆయింది. దీని లోపల భాగాలు ఒక్క కొత్త కలర్ తో వచ్చాయి మరియు కొన్ని మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. కానీ దీని ధరకు ఇవి న్యాయం చేయవు.
డస్టర్ కి డాష్‌బోర్డ్ మార్చి ఉంటే బాగుండేది. ఈ ఫేస్‌లిఫ్ట్ పాత మోడల్ లో గత ఐదు సంవత్సరాలుగా ఏదైతే డాష్బోర్డ్ ని చూసామో అదే డాష్‌బోర్డ్ ని కలిగి ఉంది. దీనిలో పియానో బ్లాక్ సెంటర్ కన్సోల్ చాలా బాగుంటుంది మరియు అది ఫింగర్ ప్రింట్ మాగ్నెట్. దీనిలో పెద్ద మీడియా నావిగేషన్ టచ్‌స్క్రీన్ సిష్టం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ వ్యవస్థ ఉపయోగించడానికి కొంచెంమెరుగ్గా ఉంటుంది (చదవడానికి: ఇన్పుట్లను ల్యాగ్ మరియు నెమ్మదిగా కాదు) మరియు ఆడియో నాణ్యత కూడా చాలా బాగుంటుంది. అయితే దీనిలో నావిగేషన్ కొరకు ఉన్న ఇంటర్ఫేస్ అంత బాగుండదు. వారి ఫోన్లలో గూగుల్ మ్యాప్స్ తో ఉపయోగించిన అనుభవాన్ని మెరుగుపరచడం చాలా కష్టం.
ఈ ప్యాకేజ్ కి ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్ రావడమనేది స్వాగతించాల్సిన విషయం. ఈ యూనిట్ ని ఆపరేట్ చేయడం సులభం మరియు క్యాబిన్ ని చాలా బాగా చల్లబరుస్తుంది. దీనిలో ఎయిర్ కండిషనింగ్ పూనే లో మధ్యానం ఉండే 30 డిగ్రీల టెంపరేచర్ కంటే ఎక్కువ ఉన్న టెంపరేచర్ లో కూడా బాగా చల్లగా ఉంచుతుంది. అయితే, ఈ కంట్రోల్స్ ని ఉపయోగించడం కొంచెం కష్టం. ఈ కంట్రోల్స్ మనం అనుకొనే దాని కంటే చాలా దూరంగా ఉంటాయి.
ఈ ఫేస్లిఫ్ట్ తో రెనాల్ట్ సంస్థ వైపర్ మరియు హెడ్‌ల్యాంప్స్ యొక్క స్థానాలు మార్చి ఉంటే బాగుండేది. ఫోర్డ్ సంస్థ ఎకోస్పోర్ట్ ఫేస్లిఫ్ట్ కి అదే చేసింది(వైపర్ కంట్రోల్స్ ని స్టీరింగ్ ఎడమవైపు మరియు హెడ్‌ల్యాంప్ కంట్రోల్స్ ని కుడివైపు అమర్చింది). అయితే ఈ ఫేస్లిఫ్ట్ లో ఈ స్థానాలను అలవాటు చేసుకోడానికి పెద్ద సమయం పట్టదు. రెనాల్ట్ సంస్థ ఫేస్లిఫ్ట్ కి ఆడియో మరియు కాల్ కంట్రోల్స్ ని ప్రత్యేకంగా కాకుండా స్టీరింగ్ మీద జోడించాల్సింది, ఎందుకంటే ఎవరైనా సరే క్రూజ్ నియంత్రణతో పోల్చితే, తరచుగా ఆడియో మరియు ఫోన్ కోసం నియంత్రణలను ఉపయోగిస్తుంటారు.
ఈ మార్పులు తప్ప మిగతా క్యాబిన్ అంతా అలానే ఉంది. దీనిలో ముందర ఫుట్‌వెల్ కొంచెం ఇరుకుగా ఉంటుంది, డ్రైవర్ యొక్క కుడి మోకాలు పవర్ విండోస్ కి తగులుతూ ఉంటుంది మరియు మొత్తం ఫిట్టింగ్ మరియు ఫినిషింగ్ హిట్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు. అలాగే, ఎర్గోనామిక్స్ గురించి మాట్లాడుకుంటే ఆర్మ్రెస్ట్ చాలా సన్నగా మరియు తక్కువ డౌన్ గా ఉంటుంది. డ్రైవర్ కి మాత్రమే ఆర్మ్రెస్ట్ ఉంటుంది. దీనిలో ఒక పెద్ద సెంట్రలీ మౌంటెడ్ ఆర్మ్రెస్ట్ ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఆర్మ్రెస్ట్ డౌన్ లో ఉండడం వలన దీనిలో సీట్‌బెల్ట్ ని పెట్టుకోడం కష్టంగా ఉంటుంది.
మొత్తంగా చూసుకుంటే దీని ప్యాకేజ్ పాత వెర్షన్ లానే ఉంటుంది. దీనిలో స్థలం,కుషనింగ్ మరియు 410 లీటర్ బూట్ స్పేస్ అంతా కూడా పాత వెర్షన్ కి ఉన్నట్టుగనే ఉన్నాయి. ఈ ఫేస్లిఫ్ట్ ని రెనాల్ట్ సంస్థ పాత మోడల్ లో ఉన్నటుగానే ఉంచారు, అలా కాకుండా ఈ ఫేస్లిఫ్ట్ ని రెనాల్ట్ సంస్థ డిజైన్ పరంగా మరియు క్వాలిటీ పరంగా పెంచే విధంగా ఉంటే బాగుండేది.
ఇంజన్ మరియు పనితీరు
ఈ డస్టర్ కారు మునులానే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లలో అదే కాంఫిగరేషన్ తో వస్తుంది. దీనిలో ఒకేఒక్క మెకానికల్ మార్పు ఏమిటంటే కొత్త AMT గేర్బాక్స్ 110Ps శక్తితో 4X2 వెర్షన్ లో మాత్రమే వస్తుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇది భారతదేశంలో AMT లో 6 గేర్స్ అందిస్తున్న ఏకైక కారు. అలాగే హిల్ అసిస్ట్,ESP మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి లక్షణాలు అందిస్తున్న AMT కూడా ఇదే.
దీనిలో మాకు ఎక్కువ నచ్చిన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న ప్యాకేజ్ కి AMT రావడం. గేర్బాక్స్ డ్రైవింగ్ డైనమిక్స్ లో ఏమీ మారదు, కానీ బెటర్ చేస్తుంది. ఈ గేర్బాక్స్ ఒక AMT కి ఎలా అయితే పనితీరు ఉండాలో అలానే ఉంటుంది. AMT గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు కాకపోతే దీనిలో గేర్ పెంచినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఉదాహరణకు గేర్బాక్స్ షిఫ్ట్స్ 1 నుండి 2 కి మరియు 2 నుండి 3 కి పెంచినపుడు చిన్న జెర్క్ వస్తుంది. దీనివలన సిటీ లో వెళ్ళినపుడు కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. గేర్బాక్స్ డౌన్ షిఫ్ట్స్ లో కూడా తెలుస్తుంది. గేర్బాక్స్ కారు ని నెమ్మది చేయాల్సి వస్తే కిందకు వచ్చేస్తుంది, దీనికిగానూ ధన్యవాదాలు తెలుపుకోవాలి.
డౌన్ షిఫ్ట్స్ గురించి మాట్లాడుకుంటే, గేర్స్ క్రిందకు వస్తున్న కొలదీ గేర్బాక్స్ అంత సౌకర్వంతంగా ఉండదు. గేర్స్ డవున్ అవుతున్న కొలదీ ఆక్సిలరేషన్ శబ్ధం వస్తుంది. బాగా డ్రైవ్ చేయాలనుకుంటే మీరు మాన్యువల్ లో పెట్టుకొని గేర్స్ డౌన్ చేసుకోండి. మాన్యువల్ లో గేర్ పెంచాలి అనుకుంటే వెనక్కి లాగాలి మరియు తగ్గించాలి అంటే ముందుకు తొయ్యాలి. మాన్యువల్ మోడ్ లో కూడా గేర్ మారుస్తుంటే రెఫ్లెక్ట్ అవ్వడానికి కొంత సమయం అనేది తీసుకుంటుంది. ఈ గేర్బాక్స్ ఇచ్చే ఆక్సిలరేషన్ కి సరిపడేందుకు కొంత సమయం తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఎక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు గేర్ ను మార్చడానికి ప్రయత్నిస్తే గేర్బాక్స్ మీ ఆదేశాన్ని భర్తీ చేస్తుంది.
హైవే మీద AMT చాలా బాగుంటుంది. నిజానికి మీరు 6వ గేర్ కి వెళిపోయినా ఎటువంటి ఇబ్బంది కలిగించదు. దీని ఇంజన్ 100km/h స్పీడ్ లో వెళితే 2100Rpm లో రివల్యూషన్స్ ఉంటాయి. మీరు ఆక్సిలరేషన్ ఎక్కువ ఇస్తే గనుక డస్టర్ 6వ గేర్ లోకి సౌకర్యవంతంగా తీసుకెళుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే దీని యొక్క పవర్ డెలివరీ గేర్ పెంచుతున్న కొలదీ అలా విపరీతంగా పెరిగిపోకుండా సమానంగా ఉంటుంది. అయితే, మీరు సడన్ గా స్పీడ్ పెంచుదాము అనుకుంటే గేర్బాక్స్ 4 మీదకి వచ్చి మంచి ఆక్సిలరేషన్ ఇస్తుంది. దీనిబట్టి గేర్బాక్స్ ఇన్‌పుట్స్ ని బాగా తీసుకుంటుందని అర్ధం అవుతుంది.
రైడ్ మరియు హ్యాండ్లింగ్
దీని రైడ్ మరియు హ్యాండిలింగ్ విధానం డస్టర్ లో ఎలా ఉండాలో అలానే ఉంటుంది మరియు ఈ కొత్తదానిలో పెద్ద తేడా ఏమీ లేదు. దీని రైడ్ ఎటువంటి రోడ్డు మీద అయినా బాగానే ఉంటుంది. దీని సస్పెన్షన్ గట్టిగా మరియు మృదువుగా బాలెన్స్ చేసుకొని సౌకర్యంగా ఉంటుంది. ఇది ఎక్కువగా సిటీ లో ఉంటుంది, కావున ఈ సస్పెన్షన్ కాంపాక్ట్ SUV కి బాగా పనిచేస్తుంది.
అయితే దీని స్టీరింగ్ తక్కువ స్పీడ్ లో బరువుగా ఉంటుంది, అయితే అధిక స్పీడ్ లో దీని స్టీరింగ్ బరువు బాగుంటుంది. ఈ వాహనాన్ని కార్నర్స్ లో తీసేయాలని అనుకోకండి, కార్నర్స్ లో తిప్పాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా రైజ్ చేసుకోవాలి. దీని బ్రేకింగ్ శక్తి చాలా బాగుంటుంది. దీని బ్రేకులు కరెక్ట్ గా పనిచేస్తాయి మరియు సడన్ గా బ్రేక్ వేసినపుడు వెంటనే ఆగుతుంది. పెడల్ స్పందన చాలా అస్పష్టంగా ఉంటుంది, అది మీరు నిలిపివేయడానికి పెడల్ ఎప్పుడు గట్టిగా నొక్కాలి అనేది మీరు ఊహించేలా చేస్తుంది. అది పక్కన పెడితే మిగతా అంతా బాగుంటుంది.
తీర్పు
AMT ఈ పోర్ట్ఫోలియోకు చాలా విలువైనది. ఒకవేళ మీరు మానువల్ 110Ps వెర్షన్ కొనాలి అని అనుకుంటే, ఇంకొంచెం డబ్బులు పెట్టుకొని AMT కొనుక్కోమని మేము సలహా ఇస్తాము. దీని గేర్బాక్స్ సిటీ లోపల ట్రాఫిక్ కి చాలా బాగా పనిచేస్తుంది మరియు ఎడమ కాలు విశ్రాంతిగా ఉంటుంది కాబట్టి జెర్కీ షిఫ్ట్ లను మన్నించవచ్చు. మీ తదుపరి కాంపాక్ట్ SUV కోసం మీ ప్రధాన ప్రాధాన్యతల్లో సౌకర్యానికి చోటు ఉంటే మాత్రం డస్టర్ AMT మీకు సరైన వాహనం.