మోడల్ X ని బహిర్గతం చేసి టెస్లా వారు ఆవిష్కారాలకి కొత్త నిర్వచనం తెలిపారు

అక్టోబర్ 01, 2015 02:05 pm cardekho ద్వారా ప్రచురించబడింది

జైపూర్: టెస్లా మోటర్స్ వారు 2012 లో బహిర్గతం చేసిన  మోడల్ X కాన్సెప్ట్ కారుని ఎట్టకేలకు కాలిఫోర్నియా లోని ఫ్రీమాంట్ సదుపాయంలో ఆవిష్కరించారు. సీఈఓ మరియూ సంస్థాపకుడు అయిన ఇలాన్ మస్క్ గారు కారు ఆవిష్కరించేప్పుడు ఇందులో ఉన్న వినూత్న లక్షణాల గురించి వివరించారు. వీటిలో, ట్రేడ్‌మార్క్ 'ఫాల్కన్ వింగ్' డోర్లు అల్ట్రా సానిక్ సెన్సార్లు, అనగా దగ్గరలో ఉన్న వస్తువులను గుర్తించేటువంటి టెక్నాలజీ ని కలిగి ఉంటుంది. మరొక వినూత్న లక్షణం, విండ్‌షీల్డ్ లోకి లీనం అయ్యేటువంటి పనరోమిక్ పై కప్పు.

అంతర్ఘతాల గురించి మాట్లాడుతూ, ఈ క్యాబిన్ S మొడలు ని పోలి ఉంది. టెస్లా కార్ల కి హాల్‌మార్క్ అయిన ఒక 17-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము కలిగి ఉంటుంది. మధ్య వరుస లో మూడు విడి విడి సీట్లు ఉంటాయి. చివరి వరుసలో రెండు సీట్లు ఫ్లాట్ మడత వెసులుబాటు కలిగి ఉంటాయి. ఈ S మోడలు లో రెండు డిక్కీలు ఉంటాయి. 

కంపెనీ వారు డ్యాష్‌బోర్డ్ కి HEPA ఫిల్టర్ సిస్టము అనుసంధానం అయ్యి ఉంటుంది అని పేర్కొన్నారు. ఇది లోపల వాతావరణం ఎలా ఉన్నా కానీ ఇది మెడికల్-గ్రేడ్ గాలిని సరఫరా చేస్తుంది. ఒక డ్యువల్-ఎలక్ట్రిక్ మోటరు విధానానికి ముందు మోటరు 255bhp మరియూ రేర్ వైపు 496bhp - మొత్తం 751bhp మరియూ 98.57Kgm యొక్క టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ వాహనం 0 నుండి 100 Kmph కేవలం 3.2 సెకనుల్లో మరియూ గరిష్టంగా 250 Kmph వేగాన్ని చేరుకుంటుంది. పూర్తిగా చార్జ్ అయిన తరువాత డ్రైవర్ దాదాపు 400 Kmps వరకు హాయిగా నడుపుకోవచ్చును. అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, సైడ్ కొలిజన్ డిటెక్షన్ సిస్టం, ఫార్వర్డ్-ఫేసింగ్ క్యామెరా, రేడార్ మరియూ సోనార్ సెన్సర్స్ అమర్చడంతో ఈ తయారీదారి 5-స్టార్ రేటింగ్ ని ఆశిస్తున్నారు.

ధర ఇంకా వెల్లడించనప్పటికీ, ఇది మోడల్ S ధర మాదిరిగానే, కనీసం ఉత్తర అమెరికాలో ఈ ధరలో ఉండవచ్చును.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience