టాటా హారియర్ Vs హ్యుందాయ్ క్రెటా: వాస్తవిక ప్రపంచ పనితీరు & మైలేజ్ పోలిక
టాటా హారియర్ 2019-2023 కోసం dinesh ద్వారా ఏప్రిల్ 20, 2019 01:26 pm ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో, టాటా మిడ్-సైజ్ SUV సెగ్మెంట్ లో ఒక సుడిగాలి లాగా హారియర్ ని చాలా పోటీ ధరతో ప్రారంభించి తుఫాను లాగా తీసుకొచ్చింది. ఇది సహజంగా హ్యుందాయ్ టక్సన్ మరియు జీప్ వంటి వాటితో పోటీ పడుతుంది. దీని యొక్క ధర దేశంలోనే ఉత్తమంగా అమ్ముడైన కాంపాక్ట్ SUV లాగా చేస్తూ, క్రెటా తో కూడా పోటీపడేలా చేస్తుంది. కాబట్టి, మేము ఇప్పటికే పేపర్ పై రెండు SUV లను పోల్చి చూశాము, వాస్తవిక ప్రపంచంలో అవి ఎలా పడుతున్నాయో చూద్దాము.
రియల్-వరల్డ్ పనితీరు ఎలా ఉందో చూసే ముందు, బోనెట్ లో ఈ రెండు SUV లు ఏ విధంగా పనితీరు ప్రదర్శిస్తున్నాయో చూద్దాము.
టాటా హారియర్ |
హ్యుందాయ్ క్రెటా |
|
ఇంజిన్ |
2.0-లీటర్ డీజిల్ |
1.6-లీటర్ డీజిల్ |
పవర్ |
140PS |
128PS |
టార్క్ |
350Nm |
260Nm |
ట్రాన్స్మిషన్ |
6-స్పీడ్ MT |
6-స్పీడ్ MT |
పనితీరు పోలిక
ఆక్సిలరేషన్ మరియు రోల్ ఆన్ టెస్ట్:
0-100kmph |
20-80kmph |
40-100kmph |
|
టాటా హారియర్ |
12.11s |
7.20s |
11.38s |
హ్యుందాయి క్రెటా |
10.83s |
7.93s |
13.58s |
హ్యుందాయి క్రెటా స్థిరమైన స్థానం నుండి 100Kmph మార్క్ ని అందుకోవడానికి హారియర్ కంటే ఒక్క సెకెండ్ ముందే చేరుకుంటుంది. అయితే, గేర్ ఆక్సిలరేషన్ విషయానికి వస్తే, ఇక్కడ హారియర్ ముందు ఉంటుంది. ఇది 20-80Kmph స్పీడ్ అందుకోవడం లో 0.73 సెకెన్లు క్రెటా కంటే వేగంగా ఉంటుంది, అయితే ఇది మొత్తంమీద 2.2 సెకన్లు 40-100 కిలోమీటర్ల పరుగులో వేగంగా ఉంటుంది. ఇది నెమ్మది నెమ్మదిగా కదిలే ట్రాఫిక్ లో ఓవర్ టేక్ చాలా సులభంగా తీసుకుంటుంది.
బ్రేకింగ్ డిస్టెన్స్:
100-0kmph |
80-0kmph |
|
టాటా హారియర్ |
45.70m |
28.49m |
హ్యుందాయి క్రెటా |
43.43m |
26.75m |
బ్రేకింగ్ కి సంబంధించినంతవరకు, రెండు SUV లు ముందు భాగంలో డిస్క్ బ్రేక్లను మరియు వెనక భాగంలో డ్రమ్ బ్రేక్లను పొందుతున్నాయి. అయితే స్థిరమైన స్థానం కి రావడంలో క్రెటా ముందు ఉంటుంది. హారియర్ కారు అధిక దూరం సమయం తీసుకోవడానికి కారణం దాని యొక్క అధిక కెర్బ్ వెయిట్. ఇది మొత్తంగా 1398Kg బరువు ఉంది మరియు క్రెటా కంటే 277Kg ఎక్కువ.
ఇంధన ఆర్థిక వ్యవస్థ:
సిటీ |
హైవే |
|
టాటా హారియర్ |
11.29kmpl |
15.39kmpl |
హ్యుందాయి క్రెటా |
13.99kmpl(+2.7kmpl) |
21.84kmpl(+6.45kmpl) |
క్రెటా నగరంలో మరియు రహదారిలో రెండిటిలో కూడా పొదుపైన SUV గా ఉంటుంది. నగరంలో ఇది హారియర్ కంటే కూడా లీటరుకు అదనంగా 2.7 కి.మీ మైలేజ్ ని ఇస్తుంది, ఇది రహదారిపై 6.45 కిలోమీటర్ల ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.
ఇంధన సామర్ధ్య ఖర్చులు ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాము. ఇక్కడ మీరు మూడు వేర్వేరు డ్రైవింగ్ నమూనాలను (పైన జాబితా చేయబడిన వాస్తవ ప్రపంచ ఇంధన సామర్ధ్యపు గణాంకాలు ఆధారంగా) అలవరచుకుంటే ప్రతి నెల 1000Km సగటున ఎంత డబ్బులు ప్లాన్ చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకుందాము. లీటరు డీజిల్ ధర రూ.70 గా పరిగణనలోకి తీసుకున్నది.
మైలేజ్ |
25% సిటీ లో, 75% on హైవే లో |
50% సిటీ లో, 50% on హైవే లో |
75% సిటీ లో, 25% on హైవే లో |
టాటా హారియర్ |
Rs 4960.9 |
Rs 5373.9 |
Rs 5786.9 |
హ్యుందాయి క్రెటా |
Rs 3654.7 |
Rs 4104.1 |
Rs 4553.5 |
పైన పట్టికను గనుక మనం చూసింట్లయితే రెండు SUV లను నడపడానికి మనకి ప్రతీ 1000 కిలోమీటర్లకు 1305 అవుతుంది, అది కిలోమీటర్ కు ఒక రూపాయి కంటే ఎక్కువ అని స్పష్టంగా తెలుస్తుంది.
కాబట్టి, మీరు మీ కొత్త SUV తో తరచుగా సుదూర ప్రయాణాలు చేయాలని అనుకుంటే లేదా అధిక వినియోగం కలిగి ఉంటే, క్రెటా మీ ఎంపికగా ఉండాలి. 50,000 కి.మీ. పూర్తయిన తర్వాత కూడా, క్రెటాతో పోల్చితే హర్రియర్ లో మీరు ఇంధనపై రూ. 65000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
తీర్పు:
హారియర్ యొక్క గేర్-గేర్ ఆక్సిలరేషన్ పరిగణలోనికి తీసుకుంటే, ఇది క్రెటా కంటే చాలా బాగుంటుంది. అయితే, క్రెటా మొత్తంగా చూసుకుంటే పొదుపుగా ఉంటుంది. కాబట్టి మీరు రోజూ ఎక్కువగా ప్రయాణం చేసేటట్టు అయితే మరియు మీరు ఈ రెండు SUV లలో ఏదో ఒకటి తీసుకుందాము అనుకుంటే క్రెటా అనేది ఒక మంచి ఎంపిక.