Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

శక్తి విశేషాలు: 2016 ఆటో ఎక్స్పోలో ప్రదర్శించనున్న అత్యంత శక్తివంతమైన కార్లు

జనవరి 29, 2016 06:50 pm arun ద్వారా ప్రచురించబడింది

భారత ఆటో ఎక్స్పో 13 వ ఎడిషన్ మరి కొద్ది వారాలలో మీ ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ షో తయారీదారులు కొత్త ఉత్పత్తులు మరియు తాజా సమర్పణలు ప్రదర్శించేందుకు ఇది ఒక అందమైన వేదిక కానున్నది. దీనిలో ప్రదర్శితం కాబోయే వాహనాలలో చిన్న క్విడ్ నుండి భారీ మెర్సిడెస్ GLS వరకూ అనేక వాహనాల జాబితా ఉంది. అన్ని వాహనాలు ఒకే వేదిక క్రిందకి వస్తున్నాయి కనుక వాటిని పోల్చి చూసేందుకు POWER అనే అంశం తీసుకోవడం జరిగింది.

వాహన ప్రియులందరికీ ఖచ్చితంగా ఆనందపరిచే కార్ల జాబితాలో కొన్ని మీ ముందు ఉంచాము. చూద్దాం పదండి!

పొలో జిటిఐ

వోక్స్వ్యాగన్ సంస్థ పోలో పరిధిలో అద్భుతమైన పోలో జిటి ఐ ని ప్రదర్శించేందుకు సిద్ధంగా ఉంది. ఈ జిటి ఐ 1.8 లీటర్, టర్బోచార్జ్డ్ ఇంజిన్ ని కలిగి ఉంది. వోక్స్వ్యాగన్ జిటి ఐ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ రెండు ట్రాన్స్మిషన్ ఎంపికలు తో అందుబాటులో ఉంటుందని సంస్థ ధృవీకరించింది. ఇది 180bhp శక్తిని మరియు 320Nm టార్క్ ని అందిస్తుంది. జిటి ఐ కేవలం ఫియాట్ అబార్త్ పుంటో దెబ్బతినడం వలన పైకి వచ్చింది. ఈ జిటి ఐ వాహనం 3 డోర్ హ్యాచ్ మరియు LED హెడ్ల్యాంప్స్, భారీ 17 "చక్రాలు మరియు ప్రామాణిక పొలో లతో పోలిస్తే భిన్నమైన అంతర్భాగాలను కలిగి ఉంది.

BMW M2

ఈ బేబీ M ఈ సంవత్సరం భారత షోరూమ్ లో దాని తోటి శ్రేణి వాహనాలతో వచ్చేందుకు సిద్ధంగా ఉంది. బిఎండబ్లు గత సంవత్సరం బవేరియా నుండి అనేక మోడళ్ళను తీసుకు వచ్చింది. ఈ 3.0 లీటర్ టర్బో-చార్జ్డ్ మోటారు 370Ps శక్తిని మరియు 465Nm టార్క్ ని అందిస్తుంది. ఇది ఓవర్ బూస్ట్ ఫంక్షన్ ని కలిగి ఉండి 500Nm టార్క్ అందిస్తుంది. బిఎండబ్లు లైనప్ లో 1Mభర్తీ చేయబడి M2 RWD సెటప్ తో చాలా ఆకర్షణీయంగా ఉంది.

ఫోర్డ్ ముస్తాంగ్

ఈ కారు చూడడానికి అద్భుతమైన లుక్స్ లేదా జాబితాలో అత్యంత శక్తివంతమైన కారుగా లేకపోయినా కూడా కారు మొత్తం మీద ఆకర్షణీయంగా ఉంది. ఈ పోనీ విడుదల చేయబడలేదు మరియు 2016 ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్నారు. ఈ మస్టాంగ్ ఒకే ఇంజన్ తో లభ్యమవుతుంది, కానీ ఇది 5.0 నేచురల్లీ ఆస్పిరేటెడ్ V8 తో 435hp శక్తిని మరియు 524 Nm టార్క్ ని అందిస్తుంది. భయపెట్టునట్టి ఎగ్సాస్ట్ శబ్దం ప్రామాణిక వస్తుంది.

నిస్సాన్ GTR

గాడ్జిల్లా తన ఉనికిని 2016 ఆటో ఎక్స్పోలో అందించనున్నది. విస్తృతంగా 'సూపర్ స్లేయర్'ని పరిగణలోనికి తీసుకుంటే R35 GTR ఆటో ప్రియులకు విస్తృతంగా కనిపిస్తుంది. 3.8 లీటర్, ట్విన్ టర్బో V6 ఇంజిన్ 542bhp శక్తిని మరియు 612Nm టార్క్ ని అందిస్తుంది. ప్రపంచంలో వేగంగా నడిచే కార్లు మధ్య, GT-R 0 నుండి 100 కిలోమీటర్లు 2.7 సెకన్లలో చేరుకుంటుంది.

ఆడీ R8 V10

ఆడీ సంస్థ యొక్క రెండవ ప్రధాన మోడల్ R8 ని ఆటో ఎక్స్పో వద్ద ప్రదర్శించనున్నారు. కొత్త తరం వాహనం గత ఏడాది జెనీవా మోటార్ షోలో ఆవిష్కరించారు. R8 ఇప్పుడు ఒక ఉగ్రమైన ఆకృతి, లేసర్ హెడ్ల్యాంప్స్ మరియు ఒక 5.2 లీటర్ NA V10 మోటారు తో అందించబడుతుంది. ఈ 5.2 లీటర్ NA V10 మోటారు నిర్ధారించబడలేదు. లంబోర్ఘిని-ఉత్పన్న V10 తో 610hp శక్తిని మరియు V10 + స్పెక్ లో 560Nm టార్క్ ని అందిస్తుంది. ఈ 'ప్రామాణిక' వెర్షన్ సమానంగా 540hp / 540 ఎన్ఎమ్ల కాంబో పొంది ఉంటుంది.

రాబోయే వారం వాహన ప్రియులకు ఖచ్చితంగా ఎన్నో విశేషాలతో నిండి ఉంది! 2016 ఆటో ఎక్స్పో తాజా అంశాల సమాచారం కొరకు ప్రతీ నిమిషం వీక్షిస్తూ ఉండండి CarDekho

ఇంకా చదవండి ఆటో ఎక్స్పో ప్రారంభానికి ముందే 3 డోర్ పుంటో ని వెల్లడించిన ఫియట్

a
ద్వారా ప్రచురించబడినది

arun

  • 11 సమీక్షలు
  • 0 Comments

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర