ఆటో ఎక్స్పో మోటార్ షో 2016 మోటార్ షో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్రారంభం
నవంబర్ 24, 2015 08:05 pm cardekho ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
భారతదేశంలోని అతిపెద్ద ఆటోమోటివ్ షో 2016 ఆటో ఎక్స్పో - మోటార్ షో కి గానూ టికెట్లు ఆన్‌లైన్ ద్వారా www.autoexpo-themotorshow.in మరియు www.bookmyshow.com
ద్వారా లభిస్తున్నాయి. ఈ టికెట్ ఖరీదు 650 రూపాయలు ( ఉదయం. 10 గంటల నుండి మధ్యాహ్నం .1 గంట వరకు) బిజినెస్ గంటలకు కి గానూ, వారపు దినములలో 300 రూపాయలు (1 .మ - 6 .సా వరకు), సాధారణ ప్రజలకు 400 రూపాయలు (ఉ.10 గంటలు - 7.సా).
ఈ ఈవెంట్ సాధారణ ప్రజలకు 5 నుండి 9 ఫిబ్రవరి 2016, ఇండియన్ ఎక్స్పో మార్ట్ లిమిటెడ్(IEML) గ్రేటర్ నోయిడా, డిల్లీ NCA నందు జరుగుతాయి. ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కారు తయారీదారులు తమ ఉన్నత కారు ఉత్పాదకాలను ఇంకా నవీకరించిన ఎన్నో వాహనాలను సందర్శకులకు ప్రదర్శించబోతున్నారు.
ఈ టికెట్లు 3 నుండి 10 టికెట్లు డిసెంబర్ 31, 2015 లోగా బుక్ చేసుకున్న వినియోగదారులకు టికెట్ హోం డెలివరీ ఉచితంగా అందించే సదుపాయం కలదు. లేనిచో ప్రతీ హోం డెలివరీ కి రూ.75 చార్జ్ చేసే అవకాశం ఉంది. ఈ బుకింగ్స్ జనవరి నెల 25,2016 వరకూ స్వాగతించడం జరుగుతుంది. సందర్శకులు హోం డెలివరీ ఎంచుకోని సమయంలో టికెట్లు నేరుగా ఎక్స్చేంజ్ కౌంటర్ల వద్ద పొందే అవకాశం ఉంది. ఇవి పార్కింగ్ సదుపాయం, గ్రేటర్ నొయిడా వద్ద అందుబాటులో ఉంటాయి.
ఆన్‌లైన్ ద్వారా 25,జనవరి 2016 నుండి సందర్శకుల ఈవెంట్ సందర్శనా దినం వరకూ బుక్ చేసిన టికెట్లకు హోం డెలివరీ సదుపాయం అందించబడదు. ఈ టికెట్లను వారు ఇంతకు ముందు చెప్పిన ఎక్స్చేంజ్ కౌంటర్ల దగ్గర మాత్రమే పొందగలరు.
టికెట్ల పంపిణీ 15 జనవరి 2016 నుండి ప్రారంభమవుతుంది.
ఈ షో యాజమాన్యం వారు ప్రత్యేకంగా తెలియజేసిన ప్రకటన ప్రకారం www.bookmyshow.com వారు ఈ షో టికెట్లకు అధికారిక భాగస్వామిగా తెలియజేశారు.
ఈ మోటార్ షో 2016 ఇంకా వారి యాజమాన్యం అనధికారికంగా కొనుగోలు చేయబడిన టికెట్లకు తము భాద్యులు కారని ఒక ప్రటనలో తెలియజేశారు.
* అధికారిక సందర్శనా సమయం 10ఉ-1సా. వారం రోజుల్లో, అయినప్పటికీ బిజినెస్ సమయాల టికెట్లు కలిగిన సందర్శకులను సాధారణ సందర్శనా సమయాలలో కూడా సా.6 వరకూ అనుమతిస్తారు.
ఇంకా చదవండి : మొత్తం ఆటో ఎక్స్పో - మోటార్ షో 2016 శాశ్వత హాల్స్ లో జరగనుంది