ఆన్లైన్ ఇన్నోవేషన్ ఆటో పరిశ్రమలో విజయానికి మార్గం అవుతుందని చెప్పిన కార్దెకో

జూలై 22, 2015 05:55 pm cardekho ద్వారా ప్రచురించబడింది

  • 11 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

గూగుల్ తో అనుబందంగా డిజిటల్ డిజిటల్ గారేజ్ ని నిర్వహించింది. 

జైపూర్: కార్దెకో.కామ్ ఇది భారతదేశంలోనే మొట్ట మొదటి స్థానంలో ఉన్నటువంటి కారు పోర్టల్. ఇది దాని యొక్క ఆటోమోటివ్ డీలర్స్ కోసం 'ది డిజిటల్ గారేజ్' అను ఒక ఈవెంట్ ను గూగుల్ సహకారంతో హోటల్ తాజ్ ప్యాలెస్, న్యూఢిల్లీ లో నిర్వహించింది. ఈ ఈవెంట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటనగా, డిజిటల్ ఆటోమోటివ్ డొమైన్ లో ఉన్నటువంటి ప్రపంచ ఉత్తమ విధానాలను మరియు ఆవిష్కరణలను ప్రదర్శింపజేయడం కోసం దీనిని నిర్వహించారు. ఈ యొక్క ఈవెంట్ కి 100 మంది కన్నా ఎక్కువగా డీలర్ ప్రిన్సిపల్స్ మరియు కారు ఇండస్ట్రీ యొక్క ముఖ్యమైన స్టాక్ హోల్డర్స్ దేశవ్యాప్తంగా హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి హాజరయిన కీలక వ్యక్తులు గూగుల్ యొక్క గ్లోబల్ ఛానల్ సేల్స్ కి మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి మిస్టర్. టాడ్ రోవే మరియు కార్దెకో సిఈఓ అయిన మిస్టర్ అమిత్ జైన్ మరియు కార్దేకో.కామ్ అధ్యక్షుడు & గాడీ .కామ్ యొక్క సి ఇ ఒ అయినటువంటి  మిస్టర్ ఉమంగ్ కుమార్ . 

ఈవెంట్ ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ యొక్క అపారమైన సామర్థ్యాన్ని తెలియజేయడానికి, వినియోగదారులు కారు కొనుగోలు చేయు ప్రక్రియలో ఇంటర్నెట్ యొక్క పాత్ర ఎంతవరకు పెరిగింది మరియు ఆటోమొబైల్ డీలర్స్ వారి యొక్క వినియోగదారులకు మెరుగైన & సమర్థవంతమైన కార్యకలాపాలు నిర్వహించేందుకు ఆన్ లైన్ ఎంత మేరకు ప్రభావితం చూపుతుంది అనే అంశం మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఆటో ఇండస్ట్రీ నిరంతరం కొత్త కొత్త విశ్లేషణలతో మన ముందుకి వస్తుంది. మనం ఇక్కడ ఈ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే మనకి డిజిటల్ ఉనికి అనివార్యమైనది అని చెప్పవచ్చు. స్వతంత్ర వినియోగదారుల పరిశోధనా అధ్యయనాల ప్రకారం, ఎవరయితే కారును కొనాలని భావిస్తారో వారిలో 75% కారు కొనుగోలుదారులు మొదట ఆన్ లైన్ లో అన్వేషిస్తారు మరియు దానిలో కూడా 66% కొనుగోలుదారులు వారి యొక్క స్మార్ట్ ఫోన్లను ఉపయోగించి అన్వేషణ సాగిస్తున్నారు 

4500 కంటే ఎక్కువ డీలర్ల భాగస్వామ్యంతో, వినూత్నమైన టెక్నాలజీ సొల్యూషన్స్ ను ఉపయోగించి ఆన్ లైన్ డీలర్స్ ను తీసుకువచ్చే ప్రయత్నంలో కార్దెకో ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరం ప్రకారం, కార్దెకో & గాడీ కలిసి 152 మిలియన్ సందర్శకులకు సేవలను అందించింది మరియు ప్రస్తుతం కార్దెకో వెబ్ సైట్ ను సందర్శించి మరియు పోర్టల్ లో కార్లను కొనుగోలు చేసే వినియోగదారులు నెలవారీగా 10 మిలయన్లకు పైగా ఉన్నారు. ఒక స్వతంత్ర పరిశోధన ప్రకారం, 59% కారు కొనుగోలుదారులు, కారును కొనేముందు ఆన్ లైన్ లో డీలర్ తో చాట్ చేస్తున్నారని వెల్లడైంది. ఒక్కమాటలో చెప్పాలంటే, కార్దెకో డీలర్ల వ్యాపారం మెరుగుపరచడం కోసం అనేక వినూత్నమైన ఉత్పత్తులను ప్రారంభించింది. అవి ఆన్ లైన్ బుకింగ్, క్లౌడ్ సొల్యూషన్స్, లైవ్ చాట్, వివిధ ఇతర ఉత్పత్తులను గురించిన సమాచారంతో మీడియా ప్రచారాలతో అందుబాటులో ఉంది. 

ఈ ధోరణి గురించి తన అభిప్రాయాలను పంచుకుంటూ కార్దెకో.కామ్ సిఈఓ మిస్టర్ అమిత్ జైన్ డిజిటల్ మీడియా యొక్క ఆవశ్యకత మరియు సామర్థ్యము గురించి ఈ విధంగా మాట్లాడారు. నిరంతరమైన ప్రింట్ మీడియా మరియు ఆన్లైన్ ఈవెంట్స్ ఉత్పత్తులతో పోలిస్తే, డిజిటల్ మీడియా ద్వారా ఉత్పత్తి చేసిన లీడ్ ల యొక్క ఖర్చు సుమారుగా 10 నుంచి 12 రెట్లు తక్కువగా ఉంది. ఆయన ఇంకా కార్దెకో ద్వారా సాధించిన భాగస్వామ్యపు డీలర్ల యొక్క విజయగాథలను వివరించారు. తమ యొక్క భాగస్వామ్య డీలరు కార్దెకో ద్వారా వచ్చిన లీడ్స్ తో డిజిటల్ సొల్యూషన్స్ ద్వారా దాదాపుగా 2000 లీడ్ లను తమ సొంత వెబ్ సైట్ల ద్వారా సొంతం చేసుకున్నట్లు చెప్పారని ఆయన వివరించారు. మరొక భాగస్వామ్య డీలర్ గురించి మాట్లాడుతూ, మేము అతనికి మార్కెటింగ్ మీడియం అందించడం ద్వారా 5 నెలలలో వారి ఆన్లైన్ బ్రాండింగ్ కి రూ. 25 లక్షల లాభం వచ్చిందని అన్నారు. ఇటువంటి ప్రభావవంతమైన మరియు స్థిరమైన వ్యాపారం ఒక గొప్ప ప్రణాళికతో, నాణ్యమైన ఉత్పత్తులతో, ఉత్పాదనా న్యాయకత్వాన్ని అందిచడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని ఆయన వాఖ్యానించారు.

ప్రపంచ నేపధ్యము అందించేందుకు గూగుల్ స్పీకర్లు అయిన మిస్టర్ టాడ్ రోవే మరియు మిస్టర్. సుదర్శన్ శర్మ ప్రపంచవ్యాప్తంగా ఆటోమోటివ్ డొమైన్ & డీలర్ల గురించి మాట్లాడుతూ , గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఆటో ఇండస్ట్రీ లో భాగమైన ప్రీమియర్ పార్ట్నర్ షిప్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు వివిధ మార్కెటింగ్ ఆవిష్కరణలో కూడా పాల్గొంటుందని తెలిపారు. 

కార్దెకో.కామ్, గూగుల్ యాడ్ వర్డ్స్ ప్రీమియర్ ఎస్ ఎంబి యొక్క భాగస్వామి. ఇది డీలర్లకి వారి డిజిటల్ మార్కెటింగ్ ప్రయాణం ప్రతి దశలో మద్దతు ఇస్తుంది. ఎపిఏసి ఛానల్ సేల్స్ యొక్క డైరెక్టర్ అయిన జేమ్స్ సాండర్స్ మాట్లాడుతూ" గూగుల్ యాడ్వర్డ్స్ ప్రీమియర్ ఎస్ ఎంబి భాగస్వామ్య ప్రోగ్రామ్ ఆన్లైన్ ప్రకటనలలో సహాయపడే కంపెనీల తో కనెక్ట్ అయి ఉండే చిన్న వ్యాపారాలకు గొప్ప మార్గం చూపెడుతుందని తెలిపారు". కార్దెకో.కామ్ వంటి విశ్వసనీయ భాగస్వాములు యొక్క నైపుణ్యం ద్వారా మార్గదర్శకత పొందుతూ చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలు విలువ మరియు పనితీరుని పెంచుకుంటున్నాయి. అత్యంత పోటీతత్వ ఆటోమొబైల్ పరిశ్రమలో, పెరుగుతున్న ధరలు, ఒత్తిడి, డిజిటల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా కంపెనీలకు మరియు డీలర్లకు లాభం చేకూరుస్తాయి.భవిష్యత్తులో డీలర్స్ తో ఉండబోయే డిజిటల్ భాగస్వామ్యాన్ని గురించికార్దెకో .కామ్ అధ్యక్షుడు & గాడి.కామ్ సిఈఓ ఉమంగ్ కుమార్ మాట్లాడుతూ " 44% వినియోగదారులు ఆఫ్ లైన్ డీలరును సంప్రదించక ముందే ఒకానొక సమయంలో వారికి కావలసిన వాటిని వారు ముందే నిర్ణయించుకుంటారు. ఇలాంటి వినియోగదారుల కోసం డీలర్లు ఆన్ లైన్ ఉనికిని విస్తరించవలసిన అవసరం ఉంది. దీనికోసమే కార్దెకో, డీలర్లకు సహాయం చేయడానికి తమ వెబ్ సైట్ ద్వారా ఈ డిజిటల్ వ్యవస్థను వినియోగదారులకి కావలసిన విధంగా వారి అవసరాలను తీర్చేందుకు డిజిటల్ లీడ్స్, ఆన్ లైన్ బ్రాండింగ్, వెబ్ సైట్స్ మరియు ఎస్ ఈ ఎం వంటి సేవలతో అందుబాటులో ఉంది".అని ఆయన వాఖ్యానించారు. 

హ్యుందాయి మోటర్స్ కి మాజీ గ్రూప్ హెడ్, ప్రస్తుత కార్దెకో కి సీఓఓ, నలిన్ కపూర్ మాట్లాడుతూ, ఆటో పరిశ్రమలో డిజిటల్ ప్రాముఖ్యత మరియు ఈ స్థలం లో ఓఈఎం లకు మరియు డీలర్స్ యొక్క ఉద్భవిస్తున్న అవసరాలను హైలైట్ చేశారు. దానితో పాటుగా, దేశం యొక్క అమ్మకాలలో ఎలెమెస్ ద్వారా ప్రముఖ పాత్ర వహిస్తున కార్దెకోఎన్నో అత్యుత్తమ సేవలను ఇంకా క్లౌడ్ సొల్యూషన్స్ ని డీలర్లకు మరియూ కస్టమర్లకు అందిస్తూ భారతదేశంలో భవిష్యత్తులో ఆన్లైన్ కార్ల అమ్మకం పద్దతికి కొత్త నిర్వచనం ఇవ్వబోతోంది అని తెలిపారు. 

కార్యక్రమానికి హాజరైన డీలర్ ప్రధానోపాధ్యాయులు అనేక అవగాహన విషయాలని నేర్చుకోవడమే కాకుండా కార్ల ఆన్లైన్ మార్కెటింగ్ యొక్క భవిష్య అభివృద్ధి లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించారు. డిజిటల్ గారేజ్ విజయం గురించి మాట్లాడుతూ, "కార్దెకో పెరుగుతున్న లీడ్స్ మరియూ మార్కెట్ కవరేజ్ పరంగా మాకు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది.మేము మా అన్ని బ్రాండ్లు అంతటా ఈ సంబంధం విస్తరించాలని ఎదురు చూస్తున్నాము "అని ముంబై, ఆటో హంగర్ కి చెందిన మోహన్ మరివల తెలిపారు.

"అమిత్ గారికి కార్దేఖో లో ఆయన చేసిన దానికి మరియూ ఇప్పుడు చేస్తున్న దానికి ఎంతో అభిరుచి కలిగి ఉంటారు. మేము ఎఫేడీఏ వద్ద, ఖచ్చితంగా అతనితో సంభాషించాలని ఎదురుచూస్తున్నాము. తన ఉత్పత్తులు అభివృద్ధి చేసేందుకు నిజ జీవితంలో పరిస్థితుల ద్వారా అతను ప్రభావితం అయిన విధానం నన్ను ఎంతగానో ఆకర్షించాయి. నేను డీలర్స్ అతను చేస్తున్న విధానాన్ని అనుసరించడానికి మక్కువ చూపిస్తారని అనుకుంటున్నాను", అని భారతదేశం లో ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ యొక్క ఫెడరేషన్ కి మాజీ ప్రెసిడెంట్ మరియూ ప్రస్తుత అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ అయిన నికుంజ్ సాంఘీ తెలిపారు.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience