అధికారిక! వోక్స్వ్యాగన్ ఇండియా ఢిల్లీ ఆటో ఎక్స్పో వద్ద పోలో GTi ని తీసుకురానున్నది
జనవరి 29, 2016 11:39 am raunak ద్వారా ప్రచురించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఒక హాట్ హ్యాచ్ నుండి ఏమి ఆశిస్తున్నారు? ఇది 3-డోర్ నమూనాలోని ఒక 1.8-లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ మోటార్ తో వస్తుంది మరియు మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంటుంది!
వోక్స్వ్యాగన్ ఇండియా మొదటిసారి అధికారికంగా హాటెస్ట్ పోలో అయిన పోలో జిటిఐ ని ప్రకటించింది. అయితే ఈ వాహనం నివేధికల ప్రకారం ఈ సంవత్సరం విడుదల కానుంది. ఈ వాహనం ఆటో ఎక్స్పోలో రెండవ మీడియా రోజున అనగా, ఫిబ్రవరి 4 వ తేదీ 2016 న ఆవిష్కరించబడనున్నది. హాట్ హ్యాచుల గురించి మాట్లాడుకుంటే ఫియాట్ ఇండియా ఈ సంవత్సరం అబార్త్ పుంటో రూపంలో మొట్టమొదటి తీవ్రమైన పోటీదారిని ప్రారంభించింది. ఇది స్థానికంగా తయారుచేయబడి 145Hp శక్తిని అందిస్తుంది. మరోవైపు వోక్స్వ్యాగన్ పోలో GTi, ప్రారంభంలో అయినా స్థానికంగా తయారుచేయబడడానికి బదులుగా CBU (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) మార్గంలో ఎక్కువగా వస్తుంది.
నిల్వా ఉన్న పొలో కి మరియు పోలో జిటిఐ కి తేడా GTi దేశంలో 3 డోర్ అవతార్ గా వస్తుందని వోక్స్వ్యాగన్ సంస్థ ధృవీకరించింది. ఇది LED పగటిపూట నడుస్తున్న లైట్లతో పాటూ LED హెడ్లైట్లతో మరియు ముందు భాగంలో స్పోర్టియర్ బంపర్ తో వస్తుంది. వాహనం వెనుక వైపున అది ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ మరియు ట్విన్ ఎగ్జాస్ట్ కేంద్రాలతో వస్తుంది. స్టాక్ పోలో యొక్క డాష్బోర్డ్, GTiకొరకు మరింత అభివృద్ధి చేయబడింది. ఇది స్పోర్ట్స్ సీట్లు అందిస్తుంది, అలానే జిటి ఐ దిగువన స్టీరింగ్ వీల్ మరియు 6.5-అంగుళాల టచ్ స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ ఆపిల్ CarPlay మరియు గూగుల్ ఆండ్రాయిడ్ ఆటో ని కలిగి ఉన్నాయి.
పోలో GTi యొక్క ముఖ్యాంశం వోక్స్వ్యాగన్ యొక్క 1.8 లీటర్ TSi టర్బోచార్జ్డ్ పెట్రోల్ మోటార్ కలిగి ఉండడం! ఈ ఇంజిన్ 192Ps శక్తిని మరియు 320Nm గరిష్ట టార్క్ ని అందిస్తుంది. ఇది 6-స్పీడ్ MT తో జత చేయబడి ఉంటుంది మరియు ఇది 7-స్పీడ్ DSG డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ తో జతచేయబడి ఉంటే గనుక 250Nm టార్క్ ని అందిస్తుంది. వోక్స్వ్యాగన్ ఇండియా జిటిఐ వాహనం 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ DSG రెండింటితో అందుబాటులో ఉంటుందని దృవీకరించింది!
ఇంకా చదవండి వోక్స్వ్యాగన్ ఏమియో కాంపాక్ట్ సెడాన్ అనధికారికంగా కనిపించింది