జనవరి 6 వరకు ఢిల్లీలో డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ ని నిలిపివేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
డిసెంబర్ 14, 2015 06:15 pm sumit ద్వారా ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: రోజు రోజుకి పెరిగిపోతున్న కాలుష్యాన్ని నివారించడానికి ఢిల్లీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను పరిగణలోకి తీసుకొని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ శుక్రవారం నుండి, అంటే డిసెంబర్ 11,2015 నుండి జనవరి 6, 2016 వరకు డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్ లను నిలిపివేసింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని పర్యావరణవేత్తలు ప్రశంసించారు మరియు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే, ఆటోమొబైల్ పరిశ్రమ కు ఈ నిర్ణయం బాగా సహకరించకపోవచ్చు.
మహీంద్రా అండ్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పవన్ గోయెంకా ఈ నిషేధం పై మాట్లాడుతూ, " ఢిల్లీలో డీజిల్ వాహనాల నమోదు క్రమాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధించడం ఒక కఠినమైన అడుగుగా అభివర్ణించారు. ఆది గాలి నాణ్యత సమస్యను మార్చలేదని తెలిపారు. ఈ నిషేధం వలన డీజిల్ వాహనాలను క్లీన్ చేయడానికి గత 15 సంవత్సరాల నుండి జరుగుతున్న ఉద్యోగుల పరిశోధన మరియు వ్యర్ధాల అభివృద్ధి కార్యక్రమాలు అనవసరంగా మారిపోతాయని చింతించారు. ప్రభుత్వ సంస్థలు అటువంటి అనూహ్య నిర్ణయాలు తీసుకోవడం వలన రానున్న రోజుల్లో దీర్ఘకాలిక పెట్టుబడి ని బాధించే అవకాశం ఉందని మిస్టర్ గోయెంకా అన్నారు.
"ఆటో పరిశ్రమ అందరికీ మృదువైన లక్ష్యంగా ఉంది." గత కొన్ని సంవత్సరాలలో, కోర్ట్‌లు అడిగిన విధంగా వారు ఏది చేయమని చెప్పినా అది మేము చేసాము. ఒక సంపూర్ణ ప్రణాళిక తో రాకపోతే ఎలాంటి ఫలితాలు కూడా కనిపించే అవకాశం వుండదు "అని విష్ణు మాథుర్, భారత ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) డైరెక్టర్ జనరల్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ తో ఏకీభవిస్తూ అన్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధాజ్ఞను అనుసరించి ఈ ఆదేశం అమలులోకి వచ్చింది. ఈ ఆదేశం ప్రకారం 10 సంవత్సరాల కంటే పాత బడిన డీజిల్ కార్లపై మొత్తం నిషేధాన్ని విధించింది. ప్రస్తుత వాహన రిజిస్ట్రేషన్ నిలిపివేత మధ్యంతర ఉత్తర్వు అయినప్పటికీ, ఇది ఆటోమొబైల్ కంపెనీలు డీజిల్ ఇంజన్ లపై భారీగా పెట్టిన పెట్టుబడి ముందు మరియు డీజిల్ కార్ల భవిష్యత్తు ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. ఒకవేళ ఈ నిషేధం గనక దీర్ఘ కాలం పాటు అమలు అయితే హ్యుందాయ్, హోండా, టయోటా, రెనాల్ట్ మరియు ఫోర్డ్ వంటి కంపెనీలు తీవ్రంగా ప్రభావితం చెందుతాయి.
ఇది కూడా చదవండి: