కొత్త సుజుకి ఎర్టిగా 2018 - మనకు నచ్చే ఐదు విషయాలు
మారుతి ఎర్టిగా 2015-2022 కోసం khan mohd. ద్వారా మే 15, 2019 09:55 am ప్రచురించబడింది
- 19 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఇండియా లో రాబోయే రెండవ తరం ఎర్టిగా, ఇండోనేషియా మోడల్ కన్నా ఎక్కువ ఫీచర్లతో రాబోతుందని మేము ఆశిస్తున్నాము, ఇప్పుడిప్పుడే అది మరింత మెరుగైనదిగా మారుతుంది.
రెండవ తరం మారుతి సుజుకి ఎర్టిగా 2018 పండుగ సీజన్లో భారత మార్కెట్ లో రాబోతుంది. ఐఐఎంఎస్ (ఇండోనేషియా ఇంటర్నేషనల్ మోటర్ షో) 2018 లో బహిర్గతం అవ్వగా, కొత్త ఎర్టిగా ఇండియన్ వెర్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. భారతీయ మార్కెట్ కి మరింత విస్తృతమైనదిగా ఉండే లక్షణ జాబితాలో కొన్ని మార్పులను మినహాయించి, భారతదేశంలో చాలా వరకు ముందుకు సాగుతామని మేము భావిస్తున్నాము. కొత్త మోడల్ ప్రారంభంతో, మేము దిగువ శ్రేణి వేరియంట్ యొక్క ధరలో ఎక్కువ పెరుగుదలను ఆశించటం లేదు కానీ అగ్ర శ్రేణి వేరియంట్లు మరిన్ని ఫీచర్లతో ఎక్కువ ధరను కలిగి ఉండవచ్చు. ప్రస్తుతం ఎర్టిగా ధర రూ 6.58 లక్షల నుంచి రూ 10.75 లక్షలు (రెండూ కూడా ఎక్స్- షోరూమ్ ఢిల్లీ ధరలు) గా ఉంది.
మేము కొత్త మోడల్ గురించి ఇష్టపడే కొన్ని విషయాలను ఇక్కడ అందించాము:
1. ప్రత్యేక గుర్తింపు: ఎర్టిగా ఎక్స్టీరియర్ డిజైన్, ముఖ్యంగా ముందు భాగం, చివరి తరం డిజైర్ లేదా స్విఫ్ట్ తో ఎప్పుడూ భాగస్వామ్యం పంచుకోలేదు. కానీ దాని అంతర్గత, ముఖ్యంగా డాష్బోర్డ్ లేఅవుట్, విబిన్న రంగు పథకం వంటి వాటిని కలిగి ఉన్నప్పటికీ, ఈ వాహనం- డిజైర్ మాదిరిగానే ఉంటుంది. మొట్టమొదటి తరం మోడల్ వలె, రెండవ తరం ఎర్టిగా పూర్తిగా వేర్వేరు భాగాలతో స్పోర్టీగా కనబడుతుంది, కానీ ఈ సమయంలో లొపలి భాగం మరియు డాష్బోర్డ్ డిజైన్ వంటివి ముందు వాటిల్లో వలే లేవు.
2. పుష్కలమైన క్యాబిన్ స్థలం: ఎర్టిగా యొక్క బారీ బలహీనతలు ఎమిటంటే, ఇరుకైన మూడవ వరుస సీటు మరియు తగినంత బూట్ స్థలం లేకపోవడమే ఈ వాహనం యొక్క రెండు బలహీనతలు. రెండవ తరం ఎర్టిగా యొక్క బూట్ స్థలం అన్ని సీట్లను ముందుకు మడిచినట్లైతే 153 లీటర్ల వద్ద పుష్కలంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న మొదటి తరం ఎర్టిగా, అన్ని సీట్లను మూసివేయగా 135 లీటర్ల బూట్ స్పేస్ ను అందిస్తుంది. రెండవ తరం ఎర్టిగా భారతదేశంలో మొదటి తరం మోడల్ కంటే (40 మీ మీ) వెడల్పైనది మరియు పొడవు పరంగా (99 మీ మీ పొడవైనది) కాబట్టి, ఈ రెండు అంశాలపై సుజుకి అద్భుతంగా పనిచేసినట్లు కనిపిస్తోంది.
3. మరింత శక్తివంతమైన పెట్రోల్ ఇంజిన్: ఇండోనేషియాలోని రెండవ తరం ఎర్టిగా 1.5 లీటర్, కె15బి పెట్రోల్ ఇంజిన్ను కలిగి ఉంది, ఇది 4400 ఆర్పిఎం వద్ద 104 పిఎస్ గరిష్ట శక్తిని మరియు 138 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఎర్టిగా యొక్క 1.4 లీటరు పెట్రోల్ ఇంజిన్ తో పోలిస్తే ఈ 1.5 లీటర్ ఇంజన్ 12 పిఎస్ పవర్ ను మరియు 8 ఎన్ ఎం గల టార్క్ పెరుగుదలను గమనించాము, ఈ 1.4 లీటర్ ఇంజన్, భారతదేశంలో అందుభాటులో ఉంది. అవుట్పుట్ పెరుగుదల గణనీయంగా లేనప్పటికీ, ముందు కంటే మెరుగైనదిగా కొనుగోలుదారుల ముందుకు తీసుకురావాలని యోచిస్తుంది. మారుతి సుజుకి 1.4 లీటర్ల యూనిట్కు బదులుగా 1.5 లీటర్ ఇంజిన్ను ఆఫర్ చేస్తామని మేము భావిస్తున్నాం.
4. తేలికపాటి ప్లాట్ఫారమ్: కొత్త తరం మారుతి ఎర్టిగా 'హార్టెక్ట్' ప్లాట్ఫారమ్ పై ఆధారపడింది, ఇది డిజైర్, స్విఫ్ట్, బాలెనో మరియు ఇగ్నిస్ వాహనాలపై కూడా ఆధారపడుతుంది. ఎర్టిగా యొక్క ప్రస్తుత ప్లాట్ఫారమ్ కంటే ఈ ప్లాట్ఫాం మరింత తేలికైనది. అలాగే ఇది రహదారిపై ఉత్తమ పనితీరును మరియు ఇంధన సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
5. కొత్త డిజైన్: 2018 ఎర్టిగా దాని ముందు భాగం రూపకల్పన పదునైనదిగా మరియు మరింత మస్కులర్ గా కనింపిస్తుంది దీనికి గానూ ధన్యవాదాలు. ముందు భాగంలో అందించబడిన డబుల్ బారెల్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్ యూనిట్ సొగసైనదిగా కనిపిస్తుంది. హోండా సి ఆర్- వి యొక్క టెయిల్ లాంప్ యూనిట్ ద్వారా విస్తృతంగా ప్రేరేపించబడి, ఎర్టిగా యొక్క వెనుక భాగంలో ఉన్న టైల్ లాంప్లు, గైడ్ లైట్స్ తో అందించబడతాయి.
ఇప్పటికే ఈ ఎర్టిగా ఒక మంచి కుటుంబ కారుగా ఉంది, అవుట్గోయింగ్ మారుతి ఎర్టిగా మంచి లక్షణాలలో ప్యాక్లు మరియు సరసమైన ధర వద్ద వస్తుంది. ఈ కొత్త మోడల్ భారతదేశంలో బడ్జెట్ ఎంపివి తో అందుబాటులో ఉంది, ప్రస్తుతం ఇది, చాలా ఎంపికలను కలిగి లేదు.
సిఫార్సు చేయబడినవి: కొత్త ఎర్టిగా 2018 అధికారిక చిత్రాలు, ఫీచర్స్ & నిర్దేశాలు బహిర్గతం
మరింత చదవండి: ఎర్టిగా డీజిల్