2017 ఈ-క్లాస్ ఆటోమేటిక్ పార్కింగ్ పైలట్ యాప్ ను ప్రదర్శించిన మెర్సిడెస్ బెంజ్
జూలై 09, 2015 06:08 pm అభిజీత్ ద్వారా ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్: మెర్సెడెజ్-బెంజ్ తదుపరి తరం ఏ- క్లాస్ లో ఒక కొత్త రిమోట్ పార్కింగ్ పైలట్ వ్యవస్థ చూపించే ఒక వీడియో వెల్లడించింది. సంస్థ, ఈ కారు ను కొన్ని ఎంచుకున్న మార్కెట్లలో మాత్రమే వచ్చే ఏడాది ప్రారంభించడానికి సన్నాహాలు జరుపుతుంది.
పార్కింగ్ పైలట్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ, ఇది డోర్ టూ డోర్ పార్కింగ్ పరిస్థితి అసౌకర్యాన్ని నిర్మూలించేందుకు రూపొందించబడింది ఇది డోర్లను విస్తారంగా తెరవడాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి, రిమోట్ పార్కింగ్ పైలట్ వ్యవస్థ మీకు ఒక యాప్ ద్వారా మీ కారును పార్క్ చేసుకునేందుకు అనుమతిస్తుంది. మీరు బయట నిలబడి మీ స్మార్ట్ ఫోన్ ద్వారా దీనిని నిర్వహణ చేయవచ్చు. ఈ వ్యవస్థ రిమోట్ కంట్రోల్ సహాయంతో మీ కారు ముందుకి, వెనక్కి ఆటోమేటిక్ గా వెళ్లి పార్క్ చేసేలా ఈ యాప్ ఉపయోగపడుతుంది.
ఈ-క్లాస్ వాహనాలు అన్నియూ కూడా, కొత్త గా తయారుచేయబడిన ఇన్-లైన్ 6 సిలండలతో మరియు ప్రస్తుతం ఉన్న మోటార్ తో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాక, ఈ వాహనం 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ తో రాబోతుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 122 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది మరియు చాలా మితవ్యయంగా ఉండబోతుంది.
అయితే, పార్కింగ్ పైలట్ ఫీచర్ భారతదేశంలో ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము. కానీ, 2017 ఈ-క్లాస్ మాత్రం భారతదేశంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా తరువాత ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రవేశపెట్టబడుతుంది.