మెర్సిడేజ్-బెంజ్ జీఎల్ఈ ఈరోజు విడుదల కానుంది

ప్రచురించబడుట పైన Oct 14, 2015 10:16 AM ద్వారా Manish for మెర్సిడెస్-బెంజ్ బెంజ్

  • 1 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మెర్సిడేజ్ వారు వారి జీఎల్ఈ ఎస్‌యూవీ ని ఈరోజు విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఎం-క్లాస్ కి ఇది పునరుద్దరణ అయినా కానీ ఈ జీఎల్ఈ-క్లాస్ ఎం-క్లాస్ ని భర్తీ చేయనుంది. ఈ అడుగు అన్ని మెర్సిడేజ్ వాహనాల పేర్లను 'జీ' తో మొదలవ్వాలి అనే ఉద్దేశం తో అయ్యి ఉండవచ్చు. ఈ కొత్త జీఎల్ఈ బీఎండబ్ల్యూ ఎక్స్3, ఆడీ క్యూ5 మరియూ కొత్తగా విడుదల అయిన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ కి పోటీగా నిలువనుంది.     

ఇంజిను విషయానికి వస్తే, కారుకి రెండు డీజిల్ ఆప్షన్లు వస్తాయి. ఇందులో 2.2-లీటర్ ఇన్-లైన్ 4 సిలిండర్ మరియూ 3.0-లీటర్ V6 మోటర్లు ఉంటాయి. ఈ ఇంజిన్లు మునుపటివే అయినా ఇంకాస్థ సమర్ధంగా తయారు అయ్యాయి. ఇది టర్బో చార్జర్ కి కొన్ని మార్పులు, కొత్త ECU ఇంకా ఆటోమాటిక్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్ల వలన సాధ్యం అయ్యింది. ఈ ఇంజిన్లు కి 9-స్పీడ్ ఆటోమాటిక్ ని జత చేయడం అయ్యింది. ఇది ప్రస్తుతం ఉన్న 7-స్పీడ్ యూనిట్ కంటే మెరుగైనది.

పొడుచుకొచ్చినటువంటి ముక్కు పక్కన హెడ్‌ల్యాంప్స్ కి కనుబొమ్మల వంటి డే లైట్ రన్నింగ్ ల్యాంప్స్ ఉంటాయి. పక్కలు మరియూ వెనుక భాగం మునుపటి లాగానే ఉన్నాయి. లోపల, కొత్త ఇంఫొటెయిన్‌మెంట్ స్క్రీన్ ఇంకా గుండ్రటి ఏసీ వెంట్లు మరియూ డ్యాష్ బోర్డు సెటప్ ఉంటాయి. కొత్త స్టీరింగ్ వీల్ కూడా ఉంటుంది.

ద్వారా ప్రచురించబడినది

Write your Comment పైన మెర్సిడెస్-బెంజ్ జిఎలీ Class

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

ఎక్స్-షోరూమ్ ధర కొత్త ధర
  • ట్రెండింగ్
  • ఇటీవల
×
మీ నగరం ఏది?
New
Cardekho Desktop App
Cardekho Desktop App

Get 2x faster experience with less data consumption. Access CarDekho directly through your desktop