• English
  • Login / Register

ఎస్ 500 కూపే, ఎస్ 63 ఏఎంజి కూపే మరియు జి 63 ఏఎంజి క్రేజీ కలర్ ఎడిషన్ లను ఇటీవల ప్రవేశపెట్టిన మెర్సిడెస్

మెర్సిడెస్ ఏఎంజి జిటి కోసం manish ద్వారా జూలై 30, 2015 02:50 pm సవరించబడింది

  • 17 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్:

మెర్సిడెస్, ఎల్లప్పుడూ లగ్జరీ యొక్క ఉదాహరణగా మరియు పర్యాయపదంగా మారింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఒక విలాసవంతమైన స్పోర్ట్స్ కారు ఆధిపత్యం సాధించే లక్ష్యంతో మూడు కార్ల ను ఇటీవల విడుదల చేసింది. ఈ కారు కంపెనీ, నేడు దేశంలో ఎస్ 500 కూపే ను, ఎస్ 63 ఏఎంజి మరియు జి63 ఏఎంజి వాహనాలను ప్రవేశపెట్టింది. ఈ నమూనాలను భారత మార్కెట్లో ఎస్- క్లాస్ లో ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్-క్లాస్ కూపేను రూ. ఈణృ 2.0 కోట్ల వద్ద,  మెర్సిడెస్ ఏఎంజి జి 63 క్రేజీ కలర్ ఎడిషన్ ను రూ. INR 2.17 కోట్ల వద్ద మరియు ఎస్63 ఏఎంజి కూపే ను రూ. INR 2.60 కోట్ల వద్ద, కంపెనీ ఎస్-క్లాస్ కూపే లో ఈ నమూనాలను టాగ్ చేసారు. 2015  మెర్సిడిస్ యొక్క 15 వ వాహన  ప్రారంభంలో ఒక భాగంగా ఈ మూడు వాహనాలను ప్రవేశ పెట్టడం జరిగింది. మెర్సిడెస్, ఒక కొత్త రంగు పథకం లో, జి63 ఏఎంజి ని ప్రారంభించింది మరియు "క్రేజీ రంగు" అను మారుపేరుతో కింద మనం గమనించవచ్చు. ప్రాథమికంగా ఈ ఎస్యువి, క్రింద చూపించిన విధంగా నియాన్ గ్రీన్ వంటి ప్రకాశవంతమైన రంగులో అందుబాటులో ఉంది. ఈ టెర్రైన్ ట్రైలర్స్ యొక్క యాంత్రిక భాగాలు, ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

ఎస్63 ఏఎంజి కూపే మరియు ఎస్500 కూపే వాహనాల లక్షణాలను గనుక గమనించినట్లైతే, పునఃరూపకల్పన చేసిన బంపర్స్ ను చూడవచ్చు. అలాగే, ఈ రెండు కార్లు కూడా బహుళ-స్పోక్ అల్లాయ్ వీల్స్ తో అందుబాటులో ఉన్నాయి.

ఎస్ 500 కూప్

ఎస్500 ఫోర్ డోర్ సెడాన్ యొక్క ఎస్ 500 కూపే, టూ డోర్ వెర్షన్. ఈ ఎస్500 కూపే, 4.7 లీటర్ల వి8 రెండు టర్బో ఇంజన్ తో ప్రారంభించబడుతుంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 453 బి హెచ్ పి పవర్ ను మరియు 700 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, నాలుగు డోర్ల వర్షన్ మాదిరిగానే ఉంది. ఈ ఎస్500 కూపే యొక్క వెనుక ప్రొఫైల్ మరింత ఏటవాలు కలిగి ఉంటుంది. అంతేకాకుండా, వెనుక భాగంలో ఒక ఎగ్జాస్ట్ వ్యవస్థ ను మరియు బిల్ట్ ఇన్ ఫ్లాప్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఫ్లాప్స్ అనేవి, ఒక ప్రత్యేకమైన ఎగ్సాస్ట్ శబ్దం అందించడానికి సహాయపడతాయి. ఈ ఎగ్సాస్ట్ శబ్దాన్ని, ఇంజిన్ వేగాన్ని తగ్గించడం ద్వారా నియంత్రించవచ్చు. ఎస్500 కూపే ఎరుపు బ్రేక్ కాలిపర్స్ తో అందుబాటులో ఉంది. కారు ఉదారంగా, కార్బన్ ఫైబర్ ను వినియోగించుకొని, బాహ్య భాగం మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది.

ఎస్ 63 ఏఎంజి

ఎస్ 500 వాహనం లో వలే ఈ ఎస్63 వాహనం లో కూడా అనేక స్టైలింగ్ అంశాలను పొందుపరిచారు. అంతేకాకుండా, ఆకర్షణీయమైన  బాడి కిట్స్, ఉబ్బిన బోనెట్ మరియు అంతర్గత భాగాలలో కార్బన్-ఫైబర్ ట్రింస్ ను గమనించవచ్చు. ఈ ఎస్63 ఏఎంజి, ఒక క్వాడ్-ఎగ్జాస్ట్ సముదాయాన్ని కలిగి ఉంది మరియు విస్తృతమైన ఏఎంజి బ్రాండింగ్ ను కూడా కలిగి వుంటుంది. ఈ ఎస్ 63 వాహనం, విస్తృత స్క్వాట్ వైఖరి కలిగి మరియు ఉబ్బన వీల్ ఆర్చెస్ సహాయంతో మరింత అథ్లెటిక్ లుక్ ను ప్రదర్శిస్తుంది. ఈ ఎస్63 వాహనం యొక్క కొలతలు వరుసగా, వీల్బేస్ 2945 మిల్లీ మీటర్లు, పొడవు 5027 మిల్లీ మీటర్లు, వెడల్పు 1899 మిల్లీమీటర్లు మరియు ఎత్తు 1411 మిల్లీ మీటర్లు. ఈ ఎస్ 63 ఏఎంజి, ఒక 5.5-లీటరు వి8 బై-టర్బో ఇంజిన్ తో జత చేయబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ ఇంజన్, ఒక 7-స్పీడ్ ఏఎంజి స్పీడ్ షిఫ్ట్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడుతుంది. ఈ ఇంజన్, అత్యధికంగా 585 బిహెచ్పి పవర్ ను మరియు 900 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఎస్ 63 కూప్, రేర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ లో 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరుకోవడానికి 4.2 సెకన్ల సమయం పడుతుంది. అదే విధంగా, ఈ వాహనం 4 మాటిక్ ఫోర్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ లో 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరుకోవడానికి 3.9 సెకన్ల సమయం పడుతుంది. ఈ కారు ఒక స్టీల్ అల్యూమినియం హైబ్రిడ్ బాడీ షెల్ తో ఉంటుంది మరియు ఈ కారు ఎస్ 63 సెడాన్ కంటే 90 కిలోలు తేలికైనది. మరోవైపు, ఈ వాహనం 250 kmph వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 


స్పెసిఫికేషన్స్

ఎస్ 500 కూప్:

  • ఇంజిన్: 4,663 సిసి  వి8, బై- టర్బో
  • హార్స్ పవర్: 455 బిహెచ్పి
  • టార్క్: 700 ఎన్ ఎం
  • గేర్బాక్స్: 7జి-ట్రానిక్ ప్లస్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్
  • ధర: రూ. 2 కోట్లు (న్యూఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)


ఎస్ 63 ఏఎంజి కూప్:

  • ఇంజిన్: 5,461 సిసి  వి8, బై టర్బో
  • హార్స్ పవర్: 585 బిహెచ్పి
  • టార్క్: 900 ఎన్ ఎం
  • గేర్బాక్స్: ఏఎంజి స్పీడ్ షిఫ్ట్ ఎంసిటీ 7-స్పీడ్ స్పోర్ట్స్ ట్రాన్స్మిషన్
  • ధర: రూ. 2.60 కోట్లు (న్యూఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)
was this article helpful ?

Write your Comment on Mercedes-Benz AMG జిటి

ట్రెండింగ్‌లో ఉంది కన్వర్టిబుల్ కార్స్

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • ఎంజి majestor
    ఎంజి majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • వోల్వో ఎక్స్సి90 2025
    వోల్వో ఎక్స్సి90 2025
    Rs.1.05 సి ఆర్అంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience