మారుతి S- క్రాస్ vs హ్యుందాయ్ క్రీటా: రియల్ వరల్డ్ పనితీరు మరియు ఎఫిషియెన్సీ పోలిక
మారుతి ఎస్-క్రాస్ 2017-2020 కోసం dhruv attri ద్వారా మార్చి 19, 2019 11:28 am ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పట్టణ కాంపాక్ట్ SUV విభాగం చాలా ప్రజాదరణ పొందినది. ఈ విభాగంలో ముఖ్యమైనవి హుందాయ్ క్రీటా ఫేస్లిఫ్ట్ మరియు మారుతి సుజుకి S-క్రాస్. అయితే, మారుతి సంస్థ S-క్రాస్ లో 1.6 లీటరు డీజిల్ ఇంజిన్ ని వదిలేసింది. క్రెటా ఇప్పటికీ పెద్ద, శక్తివంతమైన శక్తివంతమైన 1.6 లీటర్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఎక్కువగా టార్క్ ఇచ్చేది మరియు మరింత శక్తివంతమైన యూనిట్ నిజ ప్రపంచంలో పనితీరు మరియు సామర్ధ్యాలలో ఎలాంటి తీవ్ర వ్యత్యాసాన్ని కలిగిస్తుంది? మేము కనుక్కుంటాము.
లక్షణాలు మరియు పరీక్షించిన ఇంధన సామర్ధ్యం:
హ్యుందాయి క్రెటా 2018 |
మారుతి S-క్రాస్ |
|
ఇంజిన్ |
1582cc, 4-సిలిండర్ |
1248cc, 4-సిలిండర్ |
పవర్ |
128PS@4000rpm |
90PS@3850rpm |
టార్క్ |
265Nm @ 1500-3000rpm |
265Nm @ 1500-3000rpm |
ట్రాన్స్మిషన్ |
6-స్పీడ్ మాన్యువల్ |
5-స్పీడ్ మాన్యువల్ |
ఇంధన సమర్థత పరీక్షించినట్లుగా (సిటీ / హైవే) |
13.99kmpl / 21.84kmpl |
19.16 kmpl / 20.65kmpl |
క్రెటా S- క్రాస్ మీద 300cc పై చెయ్యిని పొందుతుంది మరియు ఇది ఉన్నత శక్తి మరియు టార్క్ ని అందిస్తుంది. అయినప్పటికీ, S- క్రాస్ దాని యొక్క SHVS తేలికపాటి హైబ్రిడ్ వ్యవస్థ కారణంగా నగర పరిమితుల్లో ఇంధన సామర్ధ్యంలో ముందు ఉంటుంది. ఇదిలా ఉండగా హైవే మీద ఎక్కువగా వెళ్ళాల్సి వస్తే మాత్రం క్రెటా అనేది మంచి ఎంపిక మరియు ఇది S-క్రాస్ ని ఒక చిన్న మార్జిన్ తో ఓడిస్తుంది. ఇప్పుడు మనం ఇంధన సామర్ధ్య సంఖ్యలు చూసాము కదా, అలానే ఇప్పుడు పనితీరు సంఖ్యలు తనిఖీ చేద్దాం. మరి చెక్ చేద్దామా?
ఆక్సిలరేషన్ మరియు రోల్-ఆన్లు:
0-100kmph |
30-80kmph (3వ గేర్) |
40-100kmph (4 వ గేర్) |
|
హ్యుందాయి క్రెటా |
10.83s |
7.93s |
13.58s |
మారుతి S-క్రాస్ |
13.42s |
9.45s |
16.22s |
తేడా |
2.59s (S- క్రాస్ తక్కువ ఉంది) |
1.52s (S- క్రాస్ తక్కువ ఉంది) |
2.64s (S- క్రాస్ తక్కువ ఉంది) |
స్పెక్ షీట్ లో ఏవైతే నిజాలు వెల్లడించబడ్డాయో, వాస్తవ ప్రపంచంలో కూడా అవే గణాంకాలని నమోదు చేస్తున్నాయి. S-క్రాస్ అనేది పనితీరు పరంగా కొంచెం నెమ్మదిగా ఉంటుంది, ముఖ్యంగా హైవే మెద్ద వెళుతున్నపుడు కానీ ఓవర్ టేక్స్ చేసేటప్పుడు కొంచెం స్లో గా ఉంటుంది. అలా అని S-క్రాస్ నెమ్మది అని చెప్పలేము, కానీ క్రెటా పెద్ద మరియు భారీ ఇంజన్ తో క్రెటా దీని కంటే మెరుగైన ప్రదర్శన అందిస్తుంది.
బ్రేకింగ్:
100-0kmph |
80-0kmph |
|
హ్యుందాయి క్రెటా |
43.43m |
26.75m |
మారుతి S-క్రాస్ |
43m |
26.58m |
నిజ ప్రపంచంలో, స్పీడ్ ని చేరుకోవడం కంటే బ్రేకింగ్ కి చాలా ప్రాధన్యత ఉంది. దీనిలో స్-క్రాస్ క్రెటా కంటే బాగా పనితీరు చూపిస్తుంది. వ్యత్యాసం ఒక మీటర్ కన్నా తక్కువగా ఉన్నప్పటికీ, అత్యంత అవసరమైన పరిస్థితులలో బ్రేక్ వేయాల్సి వచ్చినప్పుడు బాగా తేడా తెలుస్తుంది.