నేడే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న మారుతి ఎర్టిగా ఫేస్లిఫ్ట్
మారుతి ఎర్టిగా 2015-2022 కోసం manish ద్వారా అక్టోబర్ 15, 2015 10:25 am ప్రచురించబడింది
- 15 Views
- 1 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మారుతి ఎర్టిగా ఫేస్లిఫ్ట్ నేడు ప్రారంభం అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇది ముందు అక్టోబర్ 10 వ తారీఖున ప్రారంభం కావల్సి వచ్చి కొన్ని అనివార్య కారణాల వలన ఈ రోజుకి వాయిదా వేయడమైనది. ఇది మొదటి ఇండోనేషియన్ ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడినప్పుడు గణనీయమైన ఆసక్తిని ఆకర్షించే విధంగా కనిపించింది. కారు పూర్తిగా పునఃరూపకల్పన చేయబడిన ముందరి భాగంతో మరియు అధిక మోతాదులో క్రోమ్ మరియు ఒక స్లిట్ క్రోమ్-గ్రిల్ ని కలిగియుండి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎర్టిగా ఫేస్లిఫ్ట్ పునఃరూపకల్పన చేసిన ముందరి బంపర్, కొత్త అలాయ్ వీల్స్ సమితి మరియు కొత్త వెనుక బంపర్ లేఅవుట్ తో వస్తుంది. అంతర్భాగాలు మారుతి స్మార్ట్ ప్లే సమాచార వ్యవస్థ, పుష్ / స్టాప్ బటన్ మరియు కొత్త అపొలిస్ట్రీ వంటి లక్షణాలను కలిగి ఉంది.
ఇంజిన్ విషయానికి వస్తే, ఎర్టిగా 1.3 లీటర్ డిడిఐఎస్200 డీజిల్ ఇంజిన్ మరియు 1.4 లీటర్ పెట్రోలు ఇంజిన్ తో అమర్చబడి వరుసగా 88.8bhp శక్తిని/200Nm టార్క్ ని మరియు 93.7bhp శక్తిని/130Nm టార్క్ ని అందిస్తుంది. దీనిలో డీజిల్ ఇంజిన్ ఎస్ హెచ్విఎస్ తేలికపాటి హైబ్రిడ్ వ్యవస్థతో అమర్చబడి కారు యొక్క ఇంధన సామర్ధ్యాన్ని మరింతగా పెంచేందుకు సహాయపడుతుంది. ఎర్టిగా ఫేస్లిఫ్ట్ ఒక కొత్త సివిటి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో కూడా వస్తుంది. ఎస్ హెచ్విఎస్ తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీ డీజిల్ ఇంజిన్ కి ప్రతేకమైనది , పెట్రోల్ ఇంజిన్ యొక్క మైలేజ్ గణాంకాలు 16.02kmpl అని భావిస్తున్నారు.
ఈ కారు టయోటా ఇన్నోవా, హోండా మొబిలియో మరియు రెనాల్ట్ లాడ్జీ వంటి కార్లకు పోటీగా రాబోతున్నది. ఎర్టిగా భారతదేశంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో వస్తున్న మొదటి ఎంపివి. ఈ ఒక్క అంశం ఇతర వాహనాలతో పోటీకి చాలా సహాయపడుతుంది.