జూలై నుండి ఎలైట్ ఐ20 లో టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ ను ప్రతిపాదించబోతున్న హ్యుందాయ్
హ్యుందాయ్ ఎలైట్ ఐ20 2017-2020 కోసం raunak ద్వారా జూన్ 12, 2015 03:33 pm ప్రచురించబడింది
- 13 Views
- 3 వ్యాఖ్యలు
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హోండా జాజ్ కు పోటాగా హ్యుందాయ్ ఎలైట్ ఐ20 లో వచ్చే నెల మొదటి నుండి టచ్ మరియు నావిగేషన్ వ్యవస్థ తో రాబోతుంది. ఇదే నావిగేషన్ వ్యవస్థ హ్యందాయ్ ఐ20 యాక్టివ్ లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జైపూర్:
హ్యుందాయ్ మోటార్స్ యొక్క నివేదిక ప్రకారం నావిగేషన్ వ్యవస్థ తో పాటు టచ్స్క్రీన్ సమాచార వ్యవస్థలు ఎలైట్ ఐ 20 యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో రాబోతున్నాయి. ఉద్దేశపూర్వకంగా లేదా యాదృచ్చికంగా, ఈ ఎలైట్ ఐ 20 యొక్క గట్టి పోటీధారుడైనటువంటి హోండా జాజ్ అదే నెలలో మార్కెట్లో తన పునఃప్రారంభానికి సిద్ధమౌతుంది.
అయితే, ఇదే సంవత్సరం ఫిబ్రవరి లో, హ్యుందాయ్ ఐ20 కూపే ను యుకె లో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా ఈ ఐ20 లో టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ తో పాటు సాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ తో జూలై లో భారతదేశంలో అడుగుపెట్టబోతుంది. అంతేకాకుండా ఈ విభాగంలో టచ్ స్క్రీన్ తో వచ్చే కార్లు ఎలైట్ ఐ20 మరియు హోండా జాజ్ మాత్రమే.
హ్యుందాయ్ యొక్క యుకె ఐ20 లో ఉండే మాదిరిగా, ఇక్కడ భారతదేశంలో ఉండే ఐ20, 7 అంగుళాల టచ్ స్క్రీన్ వ్యవస్థ, సాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ, రేడియో, సిడి మరియు బ్లూటూత్ కనెక్టవిటీ తో రాబోతుంది. హోండా జాజ్ లో 6.1 అంగుళాల యూనిట్ కు పోటీగా ఎలైట్ ఐ20, యుకె లో ఉన్న 7 అంగుళాల వ్యవస్థ తో రాబోతుంది. అంతేకాక, ఎలైట్ ఐ20 తో పాటు ఐ20 యాక్టివ్ లో కూడా టచ్ స్క్రీన్ సమాచార వ్యవస్థ అందించే అవకాశాలు ఉన్నాయి.